Global warming | భూతాపం పరిణామాలు
గ్లోబల్ వార్మింగ్ (భూమి వేడెక్కడం)
-సూర్యకిరణాలు భూమిపై పడి పరావర్తనం (Reflection) చెందుతాయి. వీటిని వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న CO2, CH4, N2O, SF6, HFC, CFC, నీటి ఆవిరి తదితరాలు గ్రహించి భూమిపైన వాతావరణాన్ని వేడెక్కింపజేసే ప్రక్రియను గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఇందుకు ప్రధాన కారణం చెట్లను నరికివేయడం.
-పై అన్ని వాయువులను గ్రీన్హౌస్ గ్యాసెస్ (జీహెచ్జీ) లేదా హీట్ ట్రాపింగ్ గ్యాసెస్ అంటారు.
-గ్లోబల్ వార్మింగ్‌కు ప్రధాన కారణమయ్యే వాయువు కార్బన్ డై ఆక్సైడ్ (CO2)
-ప్రపంచ గ్రీన్ హౌస్ వాయువుల్లో అమెరికా నుంచి విడుదలయ్యేవి 25 శాతం
-CH4 (మీథేన్)- తడి భూములు, వరి పంటపొలాలు, జంతు వ్యర్థ పదార్థాల్లో ఉంటుంది. కావున దీన్ని మార్ష్ గ్యాస్ అంటారు.
-N2O- సముద్రాలు, మృత్తిక, ఎరువులలో ఉంటుంది.
-SF6, HFC (Hexa Fluoro Corbons)- రిఫ్రిజిరేటర్స్ నుంచి వెలువడుతాయి.
-ఒక వ్యక్తి లేదా పరిశ్రమ లేదా గృహం నుంచి విడుదలయ్యే CO2 ఇతర గ్రీన్హౌస్ వాయువుల మోతాదును కార్బన్ ఫూట్ ప్రింట్ అంటారు.
-కార్బన్ ట్యాక్స్ ప్రవేశపెట్టిన మొదటి దేశం: న్యూజిలాండ్
ప్రభావాలు
-ధృవాలలోని మంచు కరిగి సముద్రమట్టం పెరుగడం వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
-వర్షపు చినుకులు మధ్యలోనే ఆవిరి కావడం వల్ల సరస్సులు, నదులు ఎండిపోతాయి. ఒక్కసారి మాత్రమే వర్షం పడుతుంది.
-వేసవి ఉష్ణోగ్రతలు పెరిగి, వడదెబ్బకు మరణిస్తారు.
-ఉష్ణమండల ప్రాంతాల్లో వ్యవసాయ దిగుబడి తగ్గి సమశీతోష్ణ ప్రాంతాలలో పెరుగుతుంది.
ఆమ్ల వర్షాలు లేదా ఆమ్ల అవక్షేపం
-ఐపీసీసీ ప్రకారం PH5.6 కంటే తక్కువ కలిగిన వర్షపునీటిని ఆమ్లవర్షం అంటారు.
-నిజానికి ఈ వర్షం మంచు, పొగమంచు రూపంలో పడుతుంది. దీంతో దీనిని ఆమ్ల వర్షం అనడం కంటే ఆమ్ల అవక్షేపం అనడం సబబని శాస్త్రవేత్తల భావన.
ఆమ్లవర్షాలు- కారణాలు
-పారిశ్రామిక విప్లవంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో జరిగిన, జరుగుతున్న పారిశ్రామికీకరణ.
-వాతావరణంలో CO2 నీటి ఆవిరితో కలిసి బైకార్బోనెట్స్గా మారడం వల్ల PH విలువ తగ్గడం.
-పరిశ్రమల నుంచి ముఖ్యంగా నూనె శుద్ధి కర్మాగారాల నుంచి విడుదలయ్యే సల్ఫర్‌డైఆక్సైడ్, న్రైట్రోజన్ ఆక్సైడ్స్.
ప్రభావాలు
-ఆమ్లవర్షాలు నేలపై పడినప్పుడు నేల రసాయనిక స్వభావం మారుతుంది.
-నేలలోని అనేక భారాలోహ మూలకాలు వాటి పూర్వస్వభావాన్ని కోల్పోయి విషతుల్యంగా మారి ఉపయోగకరమైన సుక్ష్మజీవులపై మొక్కలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.
-ఆమ్లవర్షాలు మొక్కల పత్రాలపై పడితే వాటి పత్రహరితం క్షీణించి ఫలితంగా ఉత్పాదకత తగ్గుతుంది.
-మానవుడు వంటి ఉన్నత జీవులలో సల్ఫ్యూరిక్ ఆమ్లం వల్ల కంటి సమస్య, శ్వాస ఇబ్బందులు తలెత్తుతాయి.
-మానవుడు వంటి క్షీరదాలలో ఆమ్ల వర్షాల వల్ల చర్మంలో జాంథోప్రొటీన్ ఉత్పత్తి చేయబడి పసుపు రంగులోకి మారుతుంది.
ఓజోన్ క్షీణత(O3)
-ఓజోన్ అనేది లేతనీలం రంగులో ఉండే వాయు పదార్థం. ఇది ఆక్సిజన్‌కు సంబంధించిన ఒక రూపం.
-భూమి నుంచి పైన ఉండే రెండో పొర అయిన స్ట్రాటోస్పియర్లో 20-35 కిలోమీటర్ల మధ్య ఓజోన్ పొర ఉండి అత్యంత శక్తిమంత కిరణాలైన అతినీలలోహిత కిరణాల (UV-కిరణాలు) నుంచి ట్రోపోస్పియర్లో ఉండే జీవకోటిని రక్షిస్తుంది.
-ఓజోన్ పొర కొనుగొన్న శాస్త్రవేత్తలు చార్లెస్ ఫాబ్రి, హెన్నీ బుయ్నన్ కాగా, ఈ పొర ధర్మాలను జీఎంబీ డాబ్సన్ అనే శాస్త్రవేత్త వివరించారు.
ఓజోన్ క్షీణతకు కారణాలు
-ఓజోన్ పొర క్షీణతకు ప్రధాన కారణం- క్లోరోఫ్లోరోకార్బన్స్(CFCs). ఇవి రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కండీషనర్స్, కంప్యూటర్స్ నుంచి విడుదల చేయబడి వాతావరణంలో ఏ మార్పు చెందకుండా, ఎక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. ఈ CFCsను UV-కిరణాలు శోషించి విశ్లేషణ చెంది క్లోరిన్ పరమాణువులను విడుదల చేసి ఓజోన్ను క్షీణింపజేస్తాయి.
-పరిశ్రమలు, ఎరువుల కర్మాగారాల నుంచి విడుదల చేయబడే నైట్రోజన్ ఆక్సైడ్ కూడా ఓజోన్ను క్షీణింపజేస్తుంది.
-మంటలు ఆర్పడానికి ఉపయోగించే బ్రోమిన్ క్లోరిన్ కంటే మరింత సమర్థవంతంగా ఓజోన్ పొరను విచ్ఛిన్నం చేస్తుంది.
-బట్టలను, లోహాలను శుభ్రపరుచడానికి ఉపయోగించే టెట్రాక్లోరైడ్ కూడా ఓజోన్ను క్షీణింపజేస్తుంది.
-ధృవ స్ట్రాటోస్పిరిక్ మేఘాలు కూడా ఓజోన్ క్షీణతకు మరో కారణం.
ప్రభావాలు
-కిరణాలకు ప్రభావితమైన వారికి కార్సినోమా, మెలనోమా అనే క్యాన్సర్ వస్తుంది.
-రక్తనాళాలలో రక్తప్రవాహ రేటు పెరిగి చర్మం ఎర్రగా మారి బొబ్బలు ఏర్పడతాయి.
-ల్యుకేమియా, స్త్రీలకు రొమ్ముక్యాన్సర్ వస్తుంది.
-కాటరాక్ట్ అనే కంటి సంబంధిత వ్యాధులు వస్తాయి.
-UV-కిరణాల వల్ల DNA ప్రభావితమై రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
-కిరణజన్య సంయోగక్రియ తగ్గి ఫలితంగా ఆహారోత్పత్తి తగ్గుతుంది.
-పత్రాలు నిర్వర్తితం కావడం, పత్రాలు తెగిపోవడం వల్ల వృక్షసంపదకు తీవ్రహాని కలుగుతుంది.
-ఓజోన్ పొర పలుచబడడం వల్ల ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా ధృవాలలో మంచుకరిగి సముద్రమట్టం పెరుగుతుంది.
-జీవ ఎరువులుగా ఉపయోగపడే సయనోబ్యాక్టీరియా UV-కిరణాలను తట్టుకోలేవు. కావునా పంట దిగుబడి తగ్గుతుంది.
COP-21పారిస్ సదస్సు
-వాతావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు ఫ్రేమ్‌వర్క్(UNFCCC ) ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP-21) శిఖరాగ్ర సదస్సు 2015 నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 12 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని లీ బౌర్గెట్లో జరిగింది. అందుకే ఈ సదస్సును పారిస్ సదస్సు లేదా ఒప్పందం అని కూడా పిలుస్తారు.
-ఈ సదస్సును అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ప్రారంభించారు.
-హాజరైన దేశాల సంఖ్య: 150
-2014 నివేదిక ప్రకారం కర్బన ఉద్గారాలను గరిష్ఠ సంఖ్యలో విడుదల చేస్తున్న దేశాలు
-1. చైనా (25.3శాతం) 2. అమెరికా (14.1 శాతం) 3. యురోపియన్ యూనియన్ (10.2 శాతం) 4. భారత్ (6.9 శాతం) 5. రష్యా (5.7శాతం) 6. జపాన్ (3.1 శాతం)
-COP-21 చారిత్రాత్మక ఒప్పందం- ఈ సదస్సులో వాతావరణ నియంత్రణపై డిసెంబర్ 12, 2015న భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పరిమితం చేయాలని 195 దేశాల ప్రతినిధులు పర్యావరణాన్ని పరిరక్షించే 31 పేజీల ఒప్పందానికి ఆమోదం తెలిపారు.
-నోట్: పారిస్ ఒప్పందం(cop-21) నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు.
-COP-22 మొరాకోలోని మారకేశ్ దగ్గరగల బాబ్ ఇగ్లిలో జరిగింది. (7-18 నవంబర్, 2016). దీనినే CMP-12 లేదా CMA1
భారత్ చర్యలు
నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ ైక్లెమెట్ ఛేంజ్ ఇది శీతోష్ణస్థితి మార్పుపై భారతదేశ మొదటి కార్యాచరణ ప్రణాళిక.
దీనిని 2008, జూన్ 30న అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ విడుదల చేశారు.
ముఖ్య ఉద్దేశం: భారతదేశంలో 8 రకాల మిషన్స్ చేపట్టి గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించి సుస్థిరాభివృద్ధిలో భాగం కావడం.
బచత్ ల్యాంప్ యోజన: 2009 ఫిబ్రవరిలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రారంభించారు.
ముఖ్య ఉద్దేశం: సంప్రదాయ బల్బుల స్థానంలో అదే ధరకు సీఎఫ్ఎల్ (కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్) బల్బులను అందించడం.
సీఎఫ్ఎల్ బల్బులు తక్కువ వాట్ల సామర్థ్యాన్ని ఉపయోగించుకొని ఎక్కువ కాంతిని ఇవ్వడంతోపాటు ఎక్కువ గంటలు (8000గంటలు) పనిచేస్తాయి. తక్కువ సీఎఫ్‌సీ (క్లోరో ఫ్లోరో కార్బన్స్) వాయువులను విడుదల చేస్తాయి.
ప్రకాశ్ పథ్ దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజల కోసం ప్రారంభించారు.
ఉద్దేశం: ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేయడం.
ఎల్ఈడీ బల్బులు ఎక్కువ గంటలు (50,000 గంటలు) పనిచేస్తాయి. తక్కువ విద్యుత్‌ను వాడుకొంటాయి. గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేయవు.
గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఇది 2001లో ఏర్పడింది.
ముఖ్య ఉద్దేశం: భారతదేశాన్ని 2025 నాటికి ప్రపంచంలోకి ఒక సుస్థిర పర్యావరణ నిర్మితి గల దేశంగా చేయడం.
ఓజోన్ పరిరక్షణకు UNO చర్యలు
-ఓజోన్‌పొరను సంరక్షించే ప్రయత్నాలలో భాగంగా UN-Environmental Programme (UNEP) 1976లో చేపట్టి 1977లో పరిరక్షణ ఉద్యమానికి పిలుపుఇచ్చింది.
-ఓజోన్ పొరను పరరిక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని తెలిపేందుకు 1994లో UNOశాఖ అయిన ప్రపంచ వాతావారణ సంస్థ (WMO) సెప్టెబంర్ 16న మాంట్రియల్ ప్రోటోకాల్ గుర్తుగా ఓజోన్ దినంగా ప్రకటించినది.
UNFCCC (United Nations Framework Convention Climate Change)
-బ్రెజిల్‌లోని రియోలో జరిగిన ఒప్పందాలలో ఇదీ ఒకటి (1992).
-అమల్లోకి వచ్చింది: 21 మార్చి, 1994.
-ఈ ఒప్పందంపై సంతాకాలు చేసిన సభ్యదేశాలను 3 రకాలుగా విభజించారు.
-Anex-1 Countries – పారిశ్రామిక, పరివర్తన చెందే దశలో ఉన్న దేశాలు.
-Anex-2 – అభివృద్ధి చెందిన దేశాలు
-Anex-3- అభివృద్ధి చెందుతున్న దేశాలు
-UNFCCC ప్రతీ ఏటా నిర్వహించే సదస్సును కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP) అంటారు.
-ఈ ఒప్పందం ప్రకారం Anex-1 దేశాలన్నీ 2012 నాటికల్లా గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాలను 1990లో ఉన్న స్థాయిలో 5.2 శాతం మేరకు తగ్గించాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?