Central schemes | కేంద్ర పథకాలు
ప్రధానమంత్రి ఫసల్ బీమా
-లక్ష్యం: అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడం.
-రైతులకు సామాజిక భద్రత కల్పించడం.
ప్రయోజనాలు:
-నామమాత్రపు ప్రీమియంతో రైతులకు పంటల బీమా.
-ఖరీఫ్ సీజనలో ఆహార ధాన్యాలు, నూనెగింజల పంటలకు 1.5 శాతం ప్రీమియం.
-ఖరీఫ్, రబీ సీజనలలో ఉద్యాన పంటలకు 5 శాతం ప్రీమియం
ప్రధానమంత్రి జీవన్జ్యోతి బీమా
-లక్ష్యం: జీవిత బీమాతో భరోసా కల్పించడం
ప్రయోజనాలు
-18 నుంచి 50 ఏండ్ల వారికోసమే ఈ పథకం.
-రూ. 2 లక్షల జీవిత బీమా సదుపాయం.
-ఏడాదికి రూ. 330 ప్రీమియం అంటే రోజుకు రూ. 1 కంటే తక్కువ.
-బ్యాంకు ఖాతా తప్పనిసరి.
-ఈ పథకంలోని సభ్యులు ఏదైనా కారణంతో మృతిచెందితే వారి సంబంధీకులకు రూ. 2 లక్షల బీమా.
-ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాలి.
ప్రధానమంత్రి సురక్ష బీమా
-లక్ష్యం: ప్రమాద బీమాతో భరోసా కల్పించడం.
ప్రయోజనాలు
-ఏడాదికి కేవలం రూ. 12 ప్రీమియంతో ప్రమాద బీమా.
-18 నుంచి 70 ఏండ్ల వయస్సు గల వారికి వర్తింపు.
-సేవింగ్స్ ఖాతాతో బీమా.
-ఆటో డెబిట్ సౌకర్యం.
-ప్రమాదంలో మరణించినా, శాశ్వతంగా అంగవైకల్యాలుగా మారినా రూ. 2 లక్షల బీమా అందుతుంది.
-పాక్షిక వైకల్యం చెందితే రూ. లక్ష.
అటల్ పెన్షన్ యోజన
-లక్ష్యం: వృద్ధాప్యంలో ఆదాయ భద్రత.
-అసంఘటిత రంగంలోని 87 శాతం కార్మికులకు పింఛను.
ప్రయోజనాలు
-60 ఏండ్ల తర్వాత ప్రతి నెలా రూ. 1000 నుంచి రూ. 5000 వరకు పింఛను.
-వయస్సును బట్టి ప్రీమియం.
-ఎస్పీఎస్ తరహాలో ఏపీవైని 18 నుంచి 40 ఏండ్ల వయస్సు గల వారికి వర్తింపు.
-పింఛను రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000గా వర్తింపు.
-కనీసం 20 ఏండ్లు జమ చేయాలి.
-ప్రభుత్వ ఉద్యోగులు, సీపీఎస్, ఇతర పథకంలో లేనివారు మాత్రమే అర్హులు.
-సభ్యుడి కాంట్రిబ్యూషన్లో 50 శాతం ప్రభుత్వం ఇస్తుంది.
-ప్రీమియం నెలకు కనిష్ఠంగా రూ. 42 నుంచి గరిష్ఠంగా రూ. 210.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?