Ancient Buddhist Manuscripts | ప్రాచీన బౌద్ధ ప్రాణపత్రాలు
-నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స
-తెలంగాణలో బౌద్ధం అశోకుడి కంటే ముందే ఉన్నదని, ఎన్నో చరిత్ర ఆధారాలు లభించినప్పటికినీ, ఇటీవల గౌతమ బుద్ధుని చివరి శిష్యుడు (బిక్కు-భిక్షువు) కొండన్న శిష్యుల్లో ఒకరైన శరభంగ (భాంకజాతి) పాలుడు రచించిన, బౌద్ధ థేరవాదం సూక్తావళి బౌద్ధ రత్నాకర నిదానం (విధానం) తాళపత్ర గ్రంథం లభించింది.
-ఇందులో బౌద్ధరామ విధి విధానం, బౌద్ధయాన, వరుసక్రమం, బౌద్ధుని అహింసా విధానం వివరణలు స్పష్టంగా పొందుపర్చి ఉన్నాయి. ఈ తాళపత్ర గ్రంథంలో ఆరు లైన్లు వరుసగా పాళీ భాషలో రాశారు. అక్కడక్కడా సంస్కృత భాషతో మొదలైనప్పటికినీ లిపి మాత్రం తెలుగులోనే రాసి ఉంది.
-తెలంగాణలో బౌద్ధం ఉందనడానికి ఆధారాలు ఉన్నప్పటికినీ ఈ గ్రంథం పూర్తి బౌద్ధానికి సంబంధించినదిగా మనకు కనిపిస్తుంది. 32X29 సైజు ఉన్న ఈ గ్రంథంలో దినాంకం (తేదీ) సరిగా పేర్కొనలేదు. అక్షరాలు కూడా స్పష్టంగా లేవు. దాదాపు 280 ఏండ్ల కాలం నాటిదని చెప్పవచ్చు.
-శరభంగ (బాంక) పాలుని తర్వాత లేఖకులు ఈ తాళపత్ర గ్రంథంపై మళ్లీ రాసినట్టుగా చరిత్ర. చివరి దశలో బావరి శిష్య పరంపరలో తెలంగాణలో బౌద్ధం ఆనవాళ్లు నాటి జహీరాబాద్, గొట్టంకోట-కోహీర్, పైడి గుమ్మ(ల్)ల బోధన్కుర్తి, నేలకొండపల్లి, కొండాపూర్, ఫణిగిరి, నాగార్జునసాగర్, వర్ధమానుకోట వంటి వివిధ ప్రాంతాల్లో కొంత మాత్రమే విస్తరించిన శిష్య పరంపర.. సారనాథ్, నేపాల్ వెళ్లినట్టుగా చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు.
-బౌద్ధ జైనమతాల ఆనవాళ్లు మనకు మెదక్ జిల్లా (నేటి సంగారెడ్డి జిల్లా) పటాన్చెర్వు-అల్లాదుర్గం-కోహీర్, గొట్టంకోట అల్లాదుర్గం తదితర ప్రాంతాల్లో బాగా విస్తరించి ఉన్నాయనడానికి ఈ బౌద్ధ ప్రాచీన తాళపత్ర గ్రంథాలే ఆధారం. ఇందులో థేరవాద సుత్తావళి (సూక్తావళి) సన్మార్గగామి ధమ్మస్థ వర్గ వివరణ ప్రకిర్ణక మార్గ వర్గ నీతి బోధనలు బిక్కువర్గ అస్రవాలు 1. కామ 2. భావ 3. దృష్టి. 4. అవిద్య అనే మలినాలు కలిగిన పరంపరను ఇందులో స్పష్టంగా పొందుపర్చారు.
-ఒకచోట సంస్కృత పాళీనందు ఇలా ఉంది..
సదాచారి, సాధూమూర్తి, దేరండు
పుణ్యాత్ముడు, పునీతుడు దొరక
అడ్డంకులన్నింటి నధిగమించి నీవు
సరించతనిన సహవాస మందు..
ఈ సూక్తి అష్టాంగ మార్గంలోనూ ధమ్మ (ధర్మ) పదంలోనూ స్పష్టంగా ఉంది. త్రిపీటకాలు 1. వినయ పీటకం 2. సుత్త పీటకం 3. అభిధమ్మ పీటకం అనే ఈ మూడు గొప్పవని కూడా ఇందులో సమాన జీవన ప్రస్థానం కలిగి ఉన్నట్టుగానూ ఉంది.
-శరభంగ (బాంక)పాలుడు ప్రవచించిన ఈ గాథల (శ్లోకాల) తాళపత్ర గ్రంథ సంకలనం అశేష బౌద్ధ ప్రజానీకానికి ఎంతగానో ఉపయోగపడుతుందని నమ్మకం. హీనయానం-మహాయానం, థేరవాదం, బౌద్ధ సూత్తపీఠావళి ఒకచోట ధమ్మపదంలో చెప్పినట్టుగా
బ్రాహ్మణు నెవ్వరు హింసించరాదు
అహింసకారిని ద్వేషించరాదు
బ్రాహ్మణ హింసను ఖండింతు నేను
ప్రతిగ హింసించుట నధికముగా ఖండింతు… గోతమ (గౌతమ)
-బుద్ధుని శిష్యుల్లో బావరి, పింగేయుడు, ఆచార్య నాగార్జునుడు, కొండన్నల తర్వాత అంత గొప్పగా చెప్పుకోదగ్గ మహావ్యక్తి బౌద్ధాచార్యుడు-భిక్షువు (శిష్యాణువు) శరభంగ (బాంక-జోతి) పాలుడు. బౌద్ధం ఇతనితో కూడా తెలంగాణలో అత్యంత ప్రచారంలో ఉందనడానికి ఈ గ్రంథాలే ఆధారం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?