Analysis of TSPSC Group-2 | TSPSC గ్రూప్-2 2016 ప్రశ్నల విశ్లేషణ
1. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. ఆర్థిక ఉత్పత్తిలో కుటుంబం ఇప్పుడు ప్రధాన యూనిట్ కాదు
బి. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ చాలావరకు తన సాంప్రదాయక ప్రకార్యాలను కోల్పోయింది
1) ఎ, బి సరైనవి 2) ఎ సరైనది, బి సరైనది కాదు
3) ఎ సరైనది కాదు, బి సరైనది
4) ఎ, బి రెండూ సరైనవి కావు
సరైన సమాధానం: 1
విశ్లేషణ: ప్రపంచవ్యాప్తంగా అన్ని మానవ సమాజాల్లో అతి ప్రధానమైన ప్రాథమిక సమూహంగా, విశిష్టమైన సామాజిక సంస్థగా కొనసాగుతున్న కుటుంబ వ్యవస్థలో కాలానుగుణంగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. నిజానికి సమాజశాస్త్ర సహజ నియమాల ప్రకారం మార్పు అనివార్యం. అందువల్ల సమాజానికి పునాది అయిన కుటుంబ వ్యవస్థలో కూడా కాలానుగుణంగా అనేక మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు ఆర్థిక ఉత్పత్తిలో అంటే గ్రామీణ వ్యవసాయక సమాజాల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వ్యవసాయం, చేతివృత్తులు, కులవృత్తులు, కుటీర పరిశ్రమల్లో క్రియాశీలపాత్ర పోషించేది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పాశ్చాత్యీకరణ, ఆధునికీకరణ, ప్రపంచీకరణల ప్రభావంవల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమై కేంద్రక కుటుంబాలు ఏర్పడ్డాయి. అందువల్ల ఆర్థిక ఉత్పత్తిలో కుటుంబం పాత్ర కనుమరుగవుతున్నది. అదే సమయంలో కుటుంబం తన సాంప్రదాయక విధులను కోల్పోయింది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అనాథలకు, వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు, ఆదరణ కల్పించేది. ప్రస్తుతం ఈ విధిని ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి (పెన్షన్ల రూపంలో).
2. తెలంగాణలో జోగిని సాంప్రదాయం ఎక్కువగా పాటిస్తున్న జిల్లా?
1) మహబూబ్నగర్ 2) కరీంనగర్
3) వరంగల్ 4) ఖమ్మం
సరైన సమాధానం: 2
వివరణ: భూస్వామ్య వ్యవస్థ అవశేషంగాను, మతం ముసుగులో జరిగే వ్యభిచారంగాను జోగిని వ్యవస్థను సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు. జోగినీల్లో అత్యధిక శాతం మంది దళిత కులాలకు చెందినవారే ఉంటారు. తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎక్కువగా ఉన్న కరీంనగర్లో జోగినీల జనాభా కూడా ఎక్కువగానే ఉన్నది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో జోగినీలను శివసత్తులు అని పిలుస్తారు.
3. కింది వాక్యాలను పరిశీలించండి.
ఎ. స్త్రీలు బయటికంటే ఇంట్లోనే లైంగిక దాడులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది
బి. స్త్రీల వస్త్రధారణ విధానం లైంగిక దాడికి ప్రధాన కారణాల్లో ఒకటి
1) ఎ, బి రెండూ సరైనవి
2) ఎ సరైనది, బి సరైనది కాదు
3) ఎ సరైనది కాదు, బి సరైనది
4) ఎ, బి రెండూ సరైనవి కావు
సరైన సమాధానం: 2
వివరణ: మహిళలపై లైంగిక దాడులు ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నాయి. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస ప్రధాన సామాజిక సంక్షోభంగా కొనసాగుతున్నది. సమీప బంధువులు, తెలిసినవారు, పరిచయస్తుల వల్లనే మహిళలు ఎక్కువగా లైంగిక దాడులకు గురవుతున్నట్లు అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యింది. స్త్రీల వస్త్రధారణకు, లైంగిక దాడులకు ప్రత్యక్ష సంబంధం ఉండకపోవచ్చు. ఒకవేళ ఇది ప్రధాన కారణమైతే పశ్చిమ దేశాల్లో మహిళలపై లైంగిక దాడులు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?