Alchemy in Telangana | తెలంగాణలో రసవాదం
అర్వచీన ఆర్వా(ప్రా)చీన, సంప్రదాయాల్లోనూ మన తెలంగాణలో రసవాద ప్రక్రియ ఉంది. మనకు చరిత్ర ఆధారాలు కూడా ఉన్నాయి. 12, 13వ శతబ్దాంలో రెండో ప్రతాపరుద్రుడు పరుస(శ)వేది చేయించాడని చెబుతున్నప్పటికినీ ఆ మహారాజు కంటే ముందరే 9, 10, 11వ శతాబ్దాల్లో సిద్దులు, వైద్య (రసవాద) విద్వానులు ఋషీశ్వరులు సైతం రసవాద ప్రక్రియను చేపట్టి ప్రాణాంతకమైన ఎన్నో రోగాలను నయం చేసినట్టుగా తెలంగాణలో చరిత్ర దాఖలాలు ఎన్నో ఉన్నాయి. నేటి రామేశ్వరం బండ-పుల్లూరుబండ, వేల్పుకొండ, దేవరకొండ, నల్లగొండ, రాచకొండ సంగెం(గం)కొండలాంటి సారవంతమైన ప్రాంతాల్లో ఆయుర్వేదంతో పాటుగా రసవాద ప్రక్రియలను చేపట్టారు. ప్రాకృత (బ్రాహ్మీ) సంస్కృతాయుర్వేదంలో ఉత్తమోరసవైద్యస్తూ మధ్యమో ముళికాదిభి: అని స్పష్టంగా పేర్కొన్నారు. రసౌషదాలచే చికిత్స చేసే వైద్యులను ఉత్తమ వైద్యులుగా, మూళికలతో చికిత్స చేసే వైద్యులను మధ్యములుగా వర్ణించారు. పూర్వకాలంలో, రసవాద ప్రక్రియలో, సిద్ధ నాగార్జుడి కంటే పూర్వం, ప్రాకృత (బ్రాహ్మీ)ల్లో అగ్నివేశుడే మూలం అని కాశీ వైద్య విధ్వానులు చెబుతున్నారు. ఇది వాస్తవమే అని గ్రహించాలి. చరకుడు సంస్కరించాడు, పరిష్కరించాడు కాబట్టి చరక సంహిత అయిందని చరిత్ర సత్యం.
ఆత్రేయుడు, భద్రకావ్య, పూర్ణ మౌద్గల్యుడు, శౌనకేయుడు, హిరణాక్షకౌశికుడు, దార్యవిదరాజు, కుమార శిర భరద్వాజుడు, విదేహరాజ గునిమి, బాహ్లీక దేశంలోని ప్రధాన వైద్య శ్రేష్టుడైన శాంఖాయన బాహ్లీకుడు మొదలైనవారు ఆయుర్వేద రసవాద ప్రక్రియను చేపట్టారు. వీరిలో రెండు మూడోవారు తెలంగాణలో రసవాద ప్రక్రియను చేశారని చరిత్ర చెబుతున్నది. రసేంద్ర మంగళమ్, ప్రాకృత (బ్రాహ్మీ)లో ఉన్నదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇప్పటికినీ తెలంగాణలో స్వర్ణభస్మం, అభ్రక భస్మం తాళకభస్మ తామ్ర (రాగి) భస్మ కుండల లభ్యమవుతూనే ఉన్నాయి. సంస్కృత వేద చాందోగ్యోపనిషత్తు వాక్యం అనుసరించి టంకం పొండితో టంకణక్షారం బంగారం అతకడానికి ఉపయోగిస్తారని, లవణేన సువర్ణం సందధ్యాత అనే శ్లోకంలో స్పష్టంగా చెప్పబడి ఉంది. మన తెలంగాణలో రసవాద ప్రక్రియ ప్రాంతాలు ఎన్నో ఉన్నప్పటికినీ ఝరాసంగం వర్ధమానుకోట ప్రాంతాలు చెప్పుకోతగ్గవి.
-జారణే, మారణే చైవ, రస రాజన్యరంజనే పాదరసమునుచంపుటకు దానికి వర్ణము చేయుటకు యంత్రమేవవరంకర్మ యంత్రమే ప్రభల సాధినము అని చెప్పబడినది. అంతేకాక శుక్రనీతి నేను సేకరించి పరిష్కరిస్తున్న రహస్య ఆయుర్వేద శాస్త్రం-ప్రాచీన తాళపత్రగ్రంథం, అనుభవ సిద్ధాయుర్వేదం అనే మహాగ్రంథంలో పాషాణధాత్వాది దృతిస్తద్ భస్మీకణంకలా అని చెప్పటమే కాక ధాతుసాంకర్యపార్థక్యకరణంభకలాస్మృతా అని కూడా రాసి ఉంది. అంటే ధాతువులు, ధృతులు తీయుట
-అయితే చరిత్రకారులు, సిద్ద నాగార్జునుడు, ఆచార్య(బౌద్ద) నాగార్జునుడు ఒక్కరే అని చెబుతున్నారు. ముందుముందు చారిత్రాక పరిశోధకులు మరింత చరిత్ర లోతులోకి వెళ్లి పరిశోధించాల్సిన విషయం ఇది.
-భస్మీకరణ మందు మరియు లోహములను ఇతర ద్రవ్యములనుంచి విడదీయడం ఇతర ధాతు పదార్థములలో కలిపి మిశ్ర ద్రవ్యము చేయుట మన తెలుగు తెలంగాణ వారే సాటి అని వర్ణింపబడింది.
-చరిత్రపరంగా, సిద్ద నాగార్జునుడు, భైరవ తాంత్రిక నాగార్జునుడు, ఆచార్య (బౌద్ధ) నాగార్జునుడు ఉన్నారని చెబుతున్నారు. భైరవ తాంత్రిక నాగార్జునుడు మాత్రం హిమలయాల్లోని మానస సరోవరంలోనే సిద్ది పొందాడు. రసరత్న సముచ్ఛయం, వజ్ర ద్రావక సముచ్ఛయం, రససిద్ద మహిమానుక్రమణిక అనే గ్రంథాల్లో కూడా లోహాల గురించి స్పష్టంగా పొందుపర్చారు. తెలంగాణలో ఇలాంటి ప్రాచీన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. సంస్కృత రుద్రనమకం-చమకంలో అనేక లోహాల ప్రాచీన (వేద) కాలంలోనే తెలుసుకొని చెప్పబడి ఉన్నది.
-హిరణ్యంచమే, అయశ్చమే – శ్యామంచమే, లోహంచమే, సీసంచమే, త్రిషచమే, యజ్ఞేన కల్పన్తాం (3-13) అని ఉంది. తస్మాత్ యంత్ర బలం చై(వ)కంనవి లఘ్యం విజానతా కావున ఎవరైనా చేసిన వారు యంత్ర బలాన్ని నిరాకరింపజాలరు. మన ప్రాచీన తెలంగాణలో అతి రహస్య నిగూఢ రస (వైద్య)వాద పక్రియలు కూడా ఉన్నాయి.
అహో విచిత్రం రసనాగ గంథకం
అరణ్యననీలో/త్ఫల పారిజాత పుష్పేన
ద్విపుటేన కాంచనమ్ అని అంటే దీంట్లో ఎన్నో అర్థాలున్నాయి. రెండు పుటముల ద్వారా ఒకటొస్తుందని చెప్పటం మరొకటి కూడా అతి రహస్యంగా చెప్పబడింది. అందుకే పతంజలి యోగశాస్త్రంలో యోగ ప్రాప్తేన లభ్యతాం సులభ్యతాం అని చెప్పుట వల్ల అందరికినీ సాధ్యంకాదని మహర్షి పేర్కొన్నారు.
-1. సురేకారం 2. నవాసాగరం 3. వెలిగారం 4. అన్నభేది 5 పటిక మొదలగు మహాద్రావక రసం ద్వారా గాజు మూషలో పెట్టి బట్టీలు పెట్టి ఎన్నో ద్రావకములు చేయు విధములను గంథక ధృతి ద్వారా మరియు నత్రిక దృతి ద్వారా తయారు చేయుటలో మన తెలంగాణ (తెలుగు)వారు ప్రసిద్ధి ఇది యాదార్థం. ప్రాణతోషణమ్ భేషజ కల్పస్థాన రసవాద సర్వాంగ సంజీవినీ మహా వజ్ర కల్ప-రసవాద శతార్ణవ రసకల్ప మొదలగు ఆయుర్వేద రస తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. వటకాంతం వేరు రసం-నల్లవాయులు, నల్ల ఉత్తరేణి వేర్ల రసాల గురించి వైద్య సంపూర్ణ గ్రంథాలు ఈనాటికి మన తెలంగాణలో లేకపోలేదు. రస సూత్రము కంటే రస వైవేషికం అనే 2000 పేజీల మహాగ్రంథంలో ఎన్నో రస వైద్యాల గురించి ధాతువుల గురించి వ్యాఖ్యాయన సహితంతో పాటుగా వర్ణింపబడి ఉన్నాయి. పంచలోహాలే కొందరికి తెలుసు అవి 1. బంగారు 2. వెండి 3. రాగి 4. ఇత్తడి 5. కంచు ఇత్తడి, కంచు బదులు వురే లోహాలతో ఉండేది. అయితే పంచమహాధాతువులు వేరు. అవి 1. ప్లాటీనం 2. బంగారం 3. మహాతామ్రం (రాగి ప్రాచీన నల్ల రాగి – ఇరిడియం) 4. టైటానియం 5. రసవృచ్చినం (యురేనియం) మొదలైనవి అని ప్రాచీన రసవాద కవిరాజులు (వైద్య శిఖామనులు) చెప్పారు.
విళింగ కాలాయసచూర్ణ
తైల కులుత్థ గుగ్గుల్వ సనాలాని
శిలారి పథ్యాయవ యావశుకక్షా
ద్రాణ్యతి స్థౌల్యని బర్హాణాని!!!
-వాయు విడంగం, లోహభస్మం, నూనె, ఉలువలు, గుగ్గిలం, వేగిచెట్టు, చిత్రమూలం, పాషాణభేధి, కరక, యావక్షార, సర్జాక్షారములు తేనే ఇవి మిక్కిలి లావుగా బలిసి ఉండు బలుపును పొగొట్టును. రసవైద్య శతశ్లోక శాస్త్రంలో, వజ్ర వేపన-నల్లవావిలి, బ్రహ్మదండి, బ్రహ్మజెముడు, అడవి విషముష్టి, అటిక మామిడి-పెన్నేరుగడ్డ – మర్రి పాపట ఉన్న బావి, చెరువు, సముద్రం (కొంతభాగం)లో చేపలు సైతం, బంగారమై సంచరించునని రసవాద శాస్త్రం బోధిస్తుంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో పుల్లూరుబండ కోనేరులో, కరీంనగర్ కోటి లింగాల, జలాశయంలో రామసముద్రంలో, ఝరాసంగం కోనేరులో ఉండేవి. పటాన్చెర్వులోని ఇంద్రేశం-రామేశం బండసొరంగ జలశాయ కోనేరులో ఇప్పటికినీ ఎరుపు, పసుపు, నలుపు రంగులలో పౌర్ణమి, పంచమి ఏకాదశి, అమవాస్యతిధుల్లో మారుతుందని చరిత్ర అంతటి గొప్ప రసవాద ప్రాంత చరిత్ర మన తెలంగాణ ఆదరించండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?