పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలకు ఏర్పాట్లు
-హైదరాబాద్‌తో పాటు మరో 20 పట్టణాల్లో ఎస్సై పరీక్షలు
-40 పట్టణాల్లో కానిస్టేబుల్ పరీక్షలు
యూనిఫాం సర్వీసెస్ పోస్టుల భర్తీలో మొదటి ప్రక్రియ అయిన ప్రాథమిక రాత పరీక్షకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) ఏర్పాట్లు చేస్తున్నది. ఆగస్టు 7న ఎస్సై ప్రిలిమ్స్, ఆగస్టు 21న కానిస్టేబుల్, తత్సమాన పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్సై ప్రిలిమ్స్‌కు 2,45,000 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. వీరికి హైదరాబాద్, నగర పరిసర ప్రాంతాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు.
గత రిక్రూట్మెంట్ (2018)లో 1.80 లక్షల మంది ప్రిలిమ్స్‌కు హాజరయ్యారు. అప్పట్లో దాదాపు అభ్యర్థులందరికీ హైదరాబాద్ నగర పరిధిలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ సారి ప్రిలిమ్స్‌కు దాదాపు 70 వేల మంది అదనంగా హాజరవుతున్న నేపథ్యంలో మరో 20 పట్టణాల్లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు బెంచీలు, కుర్చీలు, బల్లలు సహా అన్ని మౌలిక వసతులు ఉన్న కళాశాలలను ఎంపిక చేస్తున్నారు. మొత్తం 15,644 కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల భర్తీకి ఆగస్టు 21న నిర్వహించనున్న ప్రిలిమ్స్‌కు 6,50,000 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.
2018 రిక్రూట్మెంట్ కంటే అభ్యర్థుల సంఖ్య 1.70 లక్షల మేర పెరిగింది. దీంతో హైదరాబాద్‌తో పాటు మరో 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తమ దరఖాస్తుల్లో ఆప్షన్ ఇచ్చిన ప్రకారం వీలైనంత మేరకు పరీక్ష కేంద్రాలను కేటాయించేలా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి ఎస్సై అభ్యర్థులకు తమ హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకొనే అవకాశం కల్పిస్తారు. ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలోనూ హాజరు తీసుకోనున్నారు. ఇందుకు అవసరమైనన్ని బయోమెట్రిక్ డివైజ్‌లను సేకరిస్తున్నట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?