రెమిషన్ అంటే ఏమిటి?
రాష్ట్రపతి-అధికారాలు
– రాష్ట్రపతి భారతదేశ ప్రథమ పౌరునిగా, రాజ్యాంగాధినేతగా, సర్వోన్నత కార్యనిర్వాహణాధికారిగా, త్రివిధ దళాధిపతిగా చాలా విశిష్టమైన స్థానం కలిగి ఉన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 53 ప్రకారం కేంద్ర కార్యనిర్వహణాధికారం మొత్తం రాష్ట్రపతి ద్వారా సాగుతుంది. ఈ అధికారం స్వయంగా గాని లేదా తనకు విధేయులైన అధికార యంత్రాంగం ద్వారా గాని నిర్వహిస్తారు.
– రాష్ట్రపతి అధికారాలను రాజ్యాంగంలో ఎక్కడా విభజించనప్పటికీ మన సౌకర్యం కోసం కింది విధాలుగా వర్గీకరించవచ్చు.
1) సాధారణ అధికారాలు
2) అత్యవసర అధికారాలు
సాధారణ అధికారాలు
ఎ) కార్యనిర్వహణాధికారాలు
– రాజ్యాంగంలోని ప్రకరణం 53 ప్రకారం రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారాలన్నీ నిర్వహిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యనిర్వాహక నిర్ణయాలు, చర్యలు రాష్ట్రపతి పేరుమీదుగానే అమల్లోకి వస్తాయి. కార్యనిర్వహణాధికారంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైన పదవులు, కమిటీలు, కమిషన్ల నియామక అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అవి..
1) ప్రధాని – ప్రకరణ 75(1)
2) కేంద్రమంత్రి మండలి సభ్యులు – ప్రకరణ 75
3) అటార్నీ జనరల్ – ప్రకరణ 76(1)
4) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ – ప్రకరణ 148
5) సుప్రీంకోర్టు న్యాయమూర్తులు – ప్రకరణ 124(2)
6) హైకోర్టు న్యాయమూర్తులు – ప్రకరణ 217
7) రాష్ట్రాల గవర్నర్లు – ప్రకరణ 155
8) కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, పరిపాలకులు – ప్రకరణ 239
9) ప్రధాన ఎన్నికల కమిషన్లు – ప్రకరణ 324(2)
10) కేంద్ర జలవనరుల సంఘం – ప్రకరణ 262
11) అంతరాష్ట్ర కౌన్సిళ్లు – ప్రకరణ 263
12) కేంద్ర ఆర్థిక సంఘం – ప్రకరణ 280
13) జాతీయ వాణిజ్య వ్యాపార మండలి – ప్రకరణ 307
14) యూపీఎస్సీ చైర్మన్, సభ్యులు – ప్రకరణ 316
15) కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ – ప్రకరణ 323(ఎ)
16) ఢిల్లీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి – ప్రకరణ 239(ఎఎ)
17) పుదుచ్చేరి ముఖ్యమంత్రి, మంత్రిమండలి – ప్రకరణ 239(ఎ)
18) జాతీయ ఎస్సీ కమిషన్ – ప్రకరణ 338
19) జాతీయ ఎస్టీ కమిషన్ – ప్రకరణ 338(ఎ)
20) జాతీయ బీసీ కమిషన్ – ప్రకరణ 340
21) అధికార భాషాసంఘాలు – ప్రకరణ 350
అదేవిధంగా రాష్ట్రపతి కింద పేర్కొన్న రాజ్యాంగేతర సంస్థల అధిపతులను నియమిస్తారు.
-జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యులు
– సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లు
– కేంద్ర సమాచార కమిషనర్లు
-పరిపాలన ట్రిబ్యునల్ చైర్మన్, సభ్యులు
-ప్రసారభారతి చైర్మన్
– ట్రాయ్ చైర్మన్
– ఇస్రో చైర్మన్
-ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్
– రిసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) చైర్మన్
– రైల్వే బోర్డ్ చైర్మన్
-స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్
-లోక్‌పాల్
నోట్: రామ్జవాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు- 1955, షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు- 1974లో రాష్ట్రపతి కేవలం రాజ్యాధినేత (Head of the State)గానే ఉంటారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
బి) శాసనాధికారాలు
-ప్రకరణ 90 – రాష్ట్రపతి పార్లమెంట్లో అంతర్భాగం
-ప్రకరణ 80(3) – రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది నిష్ణాతులను నామినేట్ చేస్తారు
-ప్రకరణ 331 – రాష్ట్రపతి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేస్తారు
– ప్రకరణ 85(1) – పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరుస్తారు
-ప్రకరణ 85(2) – పార్లమెంట్ ఉభయసభలను ప్రోరోగ్ చేస్తారు
-ప్రకరణ 85(2)బి – లోక్‌సభను రద్దుచేస్తారు
– ప్రకరణ 86, 87 – ఉభయ సభలకు విడివిడిగా ప్రత్యేకంగా సందేశాలను పంపుతారు
– ప్రకరణ 86 – సార్వత్రిక ఎన్నికల తరువాత జరిగే లోక్‌సభ మొదటి సమావేశంలో ప్రారంభ సందేశం ఇస్తారు
-ప్రకరణ 87 – ప్రతి సంవత్సరం పార్లమెంట్ మొదటి సమావేశాల (బడ్జెట్ సమావేశాలు)ను ఉద్దేశించి ప్రారంభ సందేశం ఇస్తారు
– ప్రకరణ 91(1) – రాజ్యసభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షుడు లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షుడిని నియమిస్తారు
– ప్రకరణ 95(1) – లోక్‌సభ సమావేశాలు నిర్వహించడానికి సభాధ్యక్షుడు లేనప్పుడు తాత్కాలిక సభాధ్యక్షుడిని నియమిస్తారు
-ప్రకరణ 103 – పార్లమెంట్ సభ్యుల అనర్హతలను నిర్ణయిస్తారు
-ప్రకరణ 108 – పార్లమెంట్ ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు
-ప్రకరణ 110 – ద్రవ్యబిల్లులకు రాష్ట్రపతి తన పూర్వానుమతిని తెలియజేస్తారు
– ప్రకరణ 117 – ఆర్థిక బిల్లులకు రాష్ట్రపతి తన పూర్వానుమతిని తెలియజేస్తారు
– ప్రకరణ 111 – పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలియజేస్తారు
-ప్రకరణ 123 – పార్లమెంట్ ఉభయసభలు సమావేశాల్లో లేనప్పుడు జాతి ప్రయోజనాల దృష్ట్యా ఆర్డినెన్స్‌లు జారీచేస్తారు
-ప్రకరణ 151(1) – కాగ్ నివేదికను పార్లమెంట్ పరిశీలనకు పంపుతారు
– ప్రకరణ 281 – కేంద్ర ఆర్థిక సంఘం నివేదికను పరిశీలనకు పంపుతారు
– ప్రకరణ 323 – యూపీఎస్సీ వార్షిక నివేదికను పరిశీలనకు పంపుతారు
-ప్రకరణ 201 – గవర్నర్ తనకు పంపిన బిల్లులను ఆమోదించడమో లేదా తిరస్కరించడమో చేస్తారు
– ప్రకరణ 368 – రాజ్యాంగ సవరణ బిల్లులకు రాష్ట్రపతి తన ఆమోదాన్ని తెలియజేస్తారు
సి) న్యాయాధికారాలు
– సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను కొలీజియం సిఫారసుల ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు.
– హైకోర్టు న్యాయమూర్తులను ఇతర రాష్ట్రాలకు బదిలీచేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రకరణ 72 ప్రకారం ఉన్నత న్యాయస్థానం విధించిన శిక్షలను మార్పుచేసే అధికారం కూడా రాష్ట్రపతికి ఉంటుంది.
ప్రకరణ 72 – న్యాయాధికారాలు
పార్డన్: ఉన్నత న్యాయస్థానం విధించిన శిక్షను పూర్తిగా రద్దుచేసి క్షమాభిక్ష ప్రసాదించడం. ఉదా: ఉరిశిక్ష రద్దు
కముటేషన్: న్యాయస్థానం విధించిన శిక్షను మరొకరకమైన తక్కువ స్థాయి శిక్షగా మార్చడం. ఉదా: ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చడం (నళిని- రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితురాలు)
రెమిషన్: న్యాయస్థానం విధించిన శిక్ష కాలాన్ని తగ్గించడం. ఉదా: పదేండ్ల జైలుశిక్షను ఐదేండ్లకు తగ్గించడం
రిస్పైట్: ప్రత్యేక కారణాల దృష్ట్యా శిక్షను తగ్గించడం/మార్పు చేయడం (దీర్ఘకాలిక వ్యాధులు, గర్భం దాల్చినప్పుడు, మతిస్థిమితం కోల్పోయినప్పుడు, తీవ్ర అస్వస్థతకు గురైనప్పుడు)
రిప్రైవ్: న్యాయస్థానం విధించిన శిక్షను అమలు కాకుండా కొద్ది రోజులపాటు వాయిదా వేయడం.
నోట్: రాష్ట్రపతి తన న్యాయాధికారాలను కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు నిర్వహిస్తారు. రాష్ట్రపతి సైనిక న్యాయస్థానాలు విధించే సైనిక శిక్షలను కూడా రద్దు చేయగలరు, క్షమాభిక్ష ప్రసాదించగలరు.
డి) ఆర్థిక అధికారాలు
– ప్రకరణ 31(ఎ)- ఆస్తుల జాతీయీకరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి
– ప్రకరణ 110- ద్రవ్యబిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి రాష్ట్రపతి ముందస్తు అనుమతి అవసరం
– ప్రకరణ 112- కేంద్ర వార్షిక బడ్జెట్, సప్లమెంటరీ బడ్జెట్లను రాష్ట్రపతి పూర్వానుమతి తప్పనిసరి
-ప్రకరణ 117(1)- మొదటి తరగతి ఆర్థిక బిల్లులకు సైతం రాష్ట్రపతి ముందస్తు అనుమతి తప్పనిసరి
– ప్రకరణ 267- భారత అగుంతకనిధి రాష్ట్రపతి ఆధీనంలో ఉంటుంది
-ప్రకరణ 280- ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. విదేశీ రుణాలను స్వీకరించేటప్పుడు రాష్ట్రపతి అనుమతి తప్పనిసరి
ఇ) దౌత్యాధికారాలు
-అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ప్రాతినిథ్యం వహిస్తారు
-అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికలు రాష్ట్రపతి పేరుమీదుగా జరుగుతాయి. అయితే వాటన్నింటికీ పార్లమెంట్ ఆమోదం అవసరం
– విదేశాల్లో భారత రాయబారులను (కామన్వెల్త్ దేశాల్లో), దౌత్యవేత్తలను రాష్ట్రపతి నియమిస్తారు
– దేశంలో నియమితులైన విదేశీ రాయబారుల నియామక పత్రాలను స్వీకరిస్తారు
-ఐక్యరాజ్యసమితికి దేశం తరఫున ప్రతినిధులను నియమిస్తారు
-విదేశాంగ సర్వీసులను క్రమబద్ధం చేస్తారు
ఎఫ్) సైనికాధికారాలు
– భారత సైనిక దళాల సర్వసైన్యాధిపతి (ఆర్టికల్ 53(2))
– ఈ హోదాలో పదాతి, నావిక, వాయు సేనాధిపతులను నియమిస్తారు
– యుద్ధం ప్రకటించడం, విరమించడం, శాంతి ఒప్పందాలు చేసుకోవడం వంటివి పార్లమెంట్ ఆమోదంతో చేస్తారు
– విదేశాలతో శాంతి ఒప్పందాలు రాష్ట్రపతి పేరుమీదుగానే జరుగుతాయి
– రక్షణ శాఖ మంత్రి, ఆ శాఖలోని అధికారులపై నియంత్రణ కలిగి ఉంటారు
జి) విచక్షణాధికారాలు
– ప్రధానమంత్రి నియామకంలో స్వతంత్రంగా వ్యవహరిస్తారు
-ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని సందర్భంలో ప్రధానమంత్రిని తన విచక్షణాధికారం ప్రకారం నియమిస్తారు
-ఆపద్ధర్మ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రాష్ట్రపతి నియంత్రిస్తారు
– జాతీయ స్థాయిలో రాజకీయ అస్థిరత్వం ఏర్పడి ప్రభుత్వాలు తరచూ మారుతున్నప్పుడు, ఆ సందర్భంలో ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అనే రాష్ట్రపతి విచక్షణపై ఆధారపడి ఉంటుంది.
ఆర్డినెన్స్
– సంబంధిత ప్రకరణ – ప్రకరణ 123
-జారీచేసే వారు – రాష్ట్రపతి (ప్రధాని, మంత్రి మండలి సలహా మేరకు)
– జారీచేసే సందర్భం – పార్లమెంట్ ఉభయసభలు సమావేశంలో లేనప్పుడు
-కనిష్ఠ కాల పరిమితి- లేదు
-రిష్ఠ కాల పరిమితి- ఏడున్నర నెలలు
-చట్టబద్ధత- పార్లమెంట్ ఆమోదం ద్వారా
-రద్దు- పార్లమెంట్ ఏడున్నర నెలల లోపల ఆమోదించకపోతే
– ప్రత్యేకత- పార్లమెంట్ రూపొందించే చట్టానికి సమాన శాసనాధికారం కలిగి ఉంటుంది. ఆర్డినెన్స్ పార్లమెంట్ ఆమోదించే చట్టానికి ప్రత్యామ్నాయం కాదు, సమాంతరం కాదు. ఇది పార్లమెంట్ చట్టానికి సహ సంబంధం మాత్రమే.
నోట్: సాధారణంగా పార్లమెంట్ 6 నెలల కాలవ్యవధిలో సమావేశమవుతుంది (రాజ్యాం గం ప్రకారం) అలా సమావేశమైన 6 వారాల్లోపు పార్లమెంట్ ఆర్డినెన్స్‌ను ఆమోదించాలి. లేదంటే రద్దయిపోతుంది. అప్పటికి ఆర్డినెన్స్ గరిష్ఠంగా ఏడున్నర నెలల కాలపరిమితిని కలిగి ఉంటుంది.
l అత్యధిక ఆర్డినెన్స్‌లు జారీ చేసిన రాష్ట్రపతి- ఫకృద్దీన్ అలీ అహ్మద్
ఆర్డినెన్స్-సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలు
1) షంషేర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు-1974
l తీర్పు: రాష్ట్రపతి ఆర్డినెన్స్‌లు జారీచేయడం రాజ్యాంగ విరుద్ధం.
2) కూపర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు- 1970
తీర్పు: దురుద్దేశ కారణాలతో ఆర్డినెన్స్‌లు జారీచేస్తే అవి న్యాయ సమీక్షకు గురవుతాయి.
3) డీసీ వాద్వా వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసు- 1987
-తీర్పు: ఒక ఆర్డినెన్స్‌ను జారీచేసిన తరువాత అందులో మార్పులు, చేర్పులు చేయకుండా యథాతథంగా దానిని కొనసాగిస్తూ మరొక ఆర్డినెన్స్‌ను జారీచేయరాదు.
వీటో అధికారాలు
– వీటో అనే పదం లాటిన్ భాష నుంచి స్వీకరించారు. దీని అర్థం ఫర్ బిడ్.
-వీటో అంటే తిరస్కరించడం, నిరోధించడం లేదా నిలుపుదల చేయడం
-రాష్ట్రపతికి 3 రకాల వీటో అధికారాలున్నాయి. అవి.. 1) అబ్సల్యూట్ వీటో అధికారం 2) సస్పెన్సివ్ వీటో అధికారం 3) పాకెట్ వీటో అధికారం
-పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన బిల్లులను రాజ్యాంగంలోని అధికరణ 111 ప్రకారం రాష్ట్రపతి ఆమోదిస్తేనే అవి చట్టాలుగా మారుతాయి. అయితే ఈ క్రమంలో రాష్ట్రపతి నాలుగు ప్రత్యామ్నాయాలు కలిగి ఉంటారు.
1) బిల్లు యథాతథంగా ఆమోదించడం
2) బిల్లును తిరస్కరించడం
3) బిల్లును పునఃపరిశీలనకు తిరిగి పార్లమెంట్‌కు పంపడం
4) బిల్లుపై మౌనం వహించడం
నోట్: వీటో గురించి రాజ్యాంగంలో ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు.
1) అబ్సల్యూట్ వీటో అధికారం
-కేంద్ర మంత్రి మండలి లేదా పార్లమెంట్ ఆమోదించి పంపిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదించకుండా ఏదైనా కారణంతో గాని, కారణం లేకుండా గాని తిరస్కరించడాన్ని అబ్సల్యూట్ వీటో పవర్ అని అంటారు.
ఉపయోగించే సందర్భాలు
-ప్రైవేట్ బిల్లుల విషయంలో
– పాత క్యాబినెట్ ఆమోదించిన బిల్లులను ఆమోదించవద్దని కొత్తగా ఏర్పడిన క్యాబినెట్ రాష్ట్రపతికి చెప్పినప్పుడు
– రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసిన రాష్ట్ర బిల్లులు
నోట్: రాష్ట్రపతి అబ్సల్యూట్ వీటో ద్వారా తిరస్కరించిన బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సవరణలతో గాని, సవరణలు లేకుండా గాని రెండోసారి ఆమోదించి పంపిస్తే రాష్ట్రపతి తప్పక ఆమోదించాలి.
పల్లెం శ్రీరామ్‌చంద్ర
గ్రూప్ -1ఆఫీసర్
8008356825
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?