గోళాలుగా మారే నీటి బిందువులు.. ఎగబాకే ద్రవ పదార్థాలు
ద్రవ పదార్థాలు
ద్రవ పదార్థాల్లో అణువుల మధ్య బంధ దూరం ఎక్కువగా ఉండటం వల్ల అవి స్వేచ్ఛగా చలిస్తాయి.
ద్రవ పదార్థాల ధర్మాలు అవి.. 1. తలతన్యత 2. కేశనాళికీయత 3. స్నిగ్ధత 4. పీడనం
ద్రవ అణువులు పరస్పరం ఒకదానికొకటి దగ్గరగా వచ్చి, తమను తాము చిన్న చిన్న ద్రవ గోళాల వలె అమర్చుకుంటాయి. ఈ ధర్మాన్ని తలతన్యత అంటారు.
ప్రమాణాలు: న్యూటన్/మీటర్ (SI ప్రమాణం), డైను/సెం.మీ (CGS ప్రమాణం)
అనువర్తనాలు
వర్షం చినుకులు, నూనె చుక్కలు, తుషార బిందువులు గోళాకారంగా ఉండటం.
గ్రీజు పూసిన సన్నని సూది నీటి ఉపరితలంపై తేలడం.
దోమలు, కీటకాలు నీటిపై తలతన్యత వల్ల నడవగలుగుతాయి/ ఈదగలుగుతాయి. అదే నీటిపై కిరోసిన్ చల్లితే తలతన్యత తగ్గి కీటకాలు ఈదలేక నీటిలో మునిగి చనిపోతాయి.
పచ్చ కామెర్ల వ్యాధి నిర్ధారణలో మూత్రం తలతన్యతను లెక్కిస్తారు.
పెయింట్ బ్రష్ (కుంచె)ను నీటిలో ముంచిన వెంటనే దాని వెంట్రుకలు అన్ని దిశల్లో విడిపోయి, బయటకు తీసిన వెంటనే దగ్గరకు రావడానికి కారణం తలతన్యత.
నీరు సబ్బు కలిపిన నీటి తలతన్యత తగ్గుతుంది.
స్పర్శ కోణం: ఒక ద్రవ పదార్థం, ఘన పదార్థంతో ద్రవం లోపల చేసే కోణాన్ని స్పర్శ కోణం అంటారు. స్పర్శ కోణం విలువ ఆ ఘన పదార్థాలు, ద్రవ పదార్థాల స్వభావాన్ని బట్టి వేర్వేరుగా ఉంటుంది.
ఒక ద్రవం స్పర్శకోణం 900 కంటే తక్కువగా ఉంటే అది పాత్ర గోడలకు అంటుకొని ఉంటుంది.
ఉదా: నీరు
ద్రవాల స్పర్శకోణం 900 కంటే ఎక్కువగా ఉంటే అది పాత్ర గోడలకు అంటుకోదు.
ఉదా: పాదరసం (దీన్ని థర్మామీటర్లు, భారమితిలో ఉపయోగిస్తారు)
స్పర్శకోణం 900కు సమానంగా ఉంటే పాత్ర గోడలకు లంబంగా తాకుతుంది.
ఉదా: ద్రవ వెండి
సన్నని మందం ఉన్న గొట్టాన్ని కేశనాళం అంటారు. కేశనాళాన్ని ద్రవంలో ముంచితే దానిలో ద్రవం ఎగబాకడం లేదా ద్రవమట్టం పడిపోయే ధర్మాన్ని కేశనాళికీయత అంటారు.
ఉదాహరణలు
కిరోసిన్ స్టవ్లోని వత్తుల్లో ఉన్న కేశనాళాల వల్ల కిరోసిన్, సన్నని రంధ్రాల గుండా పైకెక్కుతుంది.
చెట్లలోని పోషక లవణాలతో ఉన్న ద్రవాలు వేళ్ల నుంచి కొమ్మలు, ఆకులకు కేశనాళాల ద్వారా చేరతాయి.
భూమిలో ఉన్న నీరు తనంతటా తానుగా చెట్టు సూక్ష్మ వేళ్ల గుండా ప్రయాణించి కాండం ద్వారా కొమ్మలకు చేరుతుంది.
మండుతున్న కొవ్వొత్తిలో వేడెక్కిన మైనం కరిగి కొవ్వొత్తి ద్వారా పైకి చేరడానికి కారణం కేశనాళికీయతే.
సిరా పెన్నులోని పాళిలో ఉన్న చీలిక నుంచి కేశనాళికీయత వల్ల సిరా ప్రవహిస్తుంది.
ఒయాసిస్ ఏర్పడటానికి కూడా కేశనాళికీయత మాత్రమే ప్రధాన కారణం.
ఇది చలనంలో ఉన్న ద్రవ, వాయువుల ధర్మం.
ప్రవాహి పొరల మధ్య సాపేక్ష చలనాన్ని ఈ బలం వ్యతిరేకిస్తుంది.
ప్రవాహి వేర్వేరు పొరల మధ్య ఉన్న సాపేక్ష వేగాన్ని నిరోధించే ప్రవాహి ధర్మాన్నే స్నిగ్ధత అంటారు.
స్నిగ్ధత కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది.
1. ప్రవాహినుల స్వభావం
2. వస్తువుల ఉపరితల వైశాల్యం
ఉపరితల వైశాల్యం పెరిగితే స్నిగ్ధత బలాలు కూడా పెరిగి ప్రవాహినుల వేగం తగ్గుతుంది.
స్నిగ్ధత ప్రమాణాలు: పాస్కల్ సెకండ్ లేదా పాయిస్. ఇది అంతర్జాతీయ ప్రమాణం.
గాలి స్నిగ్ధతా బలాలను ఉపయోగించుకొని ప్యారాచూట్ పనిచేస్తుంది. ప్యారాచూట్ కిందికి దిగే సమయంలో వేగం తగ్గడంలో ఈ సూత్రమే ఇమిడి ఉంది.
మనకు లభిస్తున్న ద్రవ పదార్థాల్లో గ్రీజుకు గరిష్ఠమైన స్నిగ్ధత ఉంటుంది. ఆ తర్వాత తేనెకు ఎక్కువ స్నిగ్ధత బలం ఉంటుంది.
వస్తువు ప్రమాణ ఉపరితల వైశాల్యంపై, వైశాల్యానికి లంబంగా పనిచేసే బలాన్ని పీడనం అంటారు.
పీడనం (P)= బలం (F) వైశాల్యం (A)
ప్రమాణాలు: డైను/సెం.మీ…2, న్యూటన్/సెం.మీ..2
l SI పద్ధతిలో ప్రమాణం పాస్కల్ ( ఇది అంతర్జాతీయ ప్రమాణం)
వాతావరణ పీడనం
వాయు భారం భూమిపైన కలుగజేసే పీడనాన్ని వాతావరణ పీడనం అంటారు.
అల్టీమీటర్: విమానం ఎగిరే ఎత్తును అక్కడి వాతావరణ పీడనాన్ని లెక్కించి తెలుసుకుంటారు. ఈ సూత్రం ఆధారంగా పనిచేసే పరికరాన్ని అల్టీమీటర్ అంటారు.
బారోగ్రాఫ్: వాతావరణ పీడనాన్ని నిరంతరం గుర్తించే పరికరాన్ని బారోగ్రాఫ్ అంటారు.
ఐసోబార్స్: ఒకే వాతావరణ పీడనం ఉండే ప్రదేశాలను కలిపే రేఖలను ఐసోబార్స్ అంటారు.
మానోమీటర్: సిలిండర్లలో బంధించి
ఉండే వాయు పీడనాన్ని కొలిచే పరికరమే మానోమీటర్.
స్పిగ్మోమానోమీటర్: ఆరోగ్యవంతుడైన మానవుడి రక్త పీడనం 120/80 mmHg. ఈ రెండు పీడన విలువలను వైద్య పరిభాషలో సిస్టోలిక్, డయాస్టోలిక్ అంటారు. రక్త పీడనాన్ని స్పిగ్మోమానోమీటర్తో కొలుస్తారు.
వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరాన్ని భారమితి అంటారు. టారిసెల్లీ అనే శాస్త్రవేత్త 1643లో భారమితిని
తయారుచేశాడు.
సముద్ర మట్టం వద్ద వాతావరణ పీడనం 76 సెంటీమీటర్లు. పాదరస స్తంభ ఎత్తునకు సమానం.
బారోమీటర్ అకస్మాత్తుగా పడిపోవడం తుపాను రాకను, నెమ్మదిగా తగ్గడం వాన రాకను సూచిస్తుంది.
బారోమీటర్ రీడింగ్ క్రమంగా పెరగడం సాధారణ పరిస్థితులు ఏర్పడటాన్ని సూచిస్తుంది.
అనార్థ్ర భారమితి: ఈ భారమితిలోని అన్ని భాగాలను ఘన పదార్థాలతో నిర్మిస్తారు. కాబట్టి దీనిలో ఎటువంటి ద్రవ్య పదార్థాలు లేకపోవడం వల్ల అనార్థ్ర భారమితి అంటారు.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం National disaster Response Force (NDRF)
భారత పారా మిలిటరీ దళాలు ముఖ్యంగా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), ఇండస్ట్రియల్ సెక్యూరిటీస్ ఫోర్స్ (ISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) నుంచి తీసుకున్న ప్రత్యేక సిబ్బందితో ఈ దళాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 విపత్తు స్పందన బెటాలియన్లు ఉన్నాయి. ఈ మధ్యనే ప్రత్యేక మహిళా దళాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో ఈ బెటాలియన్ను ఏర్పాటు చేశారు.
పౌర రక్షణ డైరెక్టర్ జనరల్ (Director General of Civil Defence): దీన్ని 1962లో హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పాటు చేశారు. పౌర రక్షణ కార్యకలాపాల్లో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.
జాతీయ పౌర రక్షణ కళాశాల (National Civil Defence College): దీన్ని 1957లో నాగపూర్లో ఏర్పాటు చేశారు. విపత్తు నిర్వహణలో బాధ్యత వహించే భాగస్వామ్యులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
Minister of Earth Sciences: ఈ మంత్రిత్వ శాఖను 2006లో ఏర్పాటు చేశారు. దేశంలోని రుతు పవనాలు, శీతోష్ణస్థితి, భూకంపాలు, తుపానులు, సునామీలు మొదలైన వాటిని గుర్తించి ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ మంత్రిత్వ శాఖ పరిధిలో కింది విభాగాలు పనిచేస్తాయి.
1. భారత వాతావరణ విభాగం- ఢిల్లీ
2. నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్ కాస్టింగ్, నోయిడా- ఉత్తరప్రదేశ్
3. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ- పుణె
4. వాతావరణ శాస్త్రం, భూచలన విభాగం- భూకంప రిస్క్ అంచనా కేంద్రం
5. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ- చెన్నై
6. నేషనల్ సెంటర్ ఫర్ అంటార్కిటిక్ ఓషన్ రిసెర్చ్- గోవా
7. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్- హైదరాబాద్
8. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ అండ్ మెరైన్ ఏరియా మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టరేట్- చెన్నై
9. సెంటర్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ-కొచ్చి
కొన్ని జన్యు సంబంధ వ్యాధులు
మానవుడిలో జన్యువులు సాధారణంగా DNA పై ఉండి ఒక్కొక్క లక్షణాన్ని ప్రభావితం చేస్తాయి. జన్యువులో వచ్చే మార్పుల కారణంగా వివిధ రకాల వ్యాధులు వస్తాయి. వీటిని సాధారణంగా నయం చేయడానికి వీలుకాదు. జన్యు సంబంధ వ్యాధులు ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తాయి. కొన్ని ఉత్పరివర్తనల వల్ల సంభవిస్తుంటాయి.
హీమోఫీలియా: దీన్ని బ్లీడర్స్ డిసీజ్ లేదా రాయల్ డిసీస్ అంటారు. రక్తం గడ్డకట్టకుండా రక్తస్రావం నిరంతరం కలుగుతుంది. X క్రోమోజోమ్ సహలగ్నత వల్ల ఇది కలుగుతుంది.
వర్ణ అంధత్వం: ఈ వ్యాధి ఉన్నవారు ప్రాథమిక వర్ణాలైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు. ఈ వ్యాధి లైంగిక క్రోమోజోమ్లోని జన్యువుల వల్ల సంభవిస్తుంది. అందుకే దీన్ని లింగ సహలగ్న (సెక్స్ లింక్డ్ డిసీస్) అంటారు. లేదా అనువంశిక వ్యాధి అంటారు. హీమోఫీలియా కూడా దీని మాదిరిగానే సంక్రమిస్తుంది.
తలసేమియా: రక్తంలో హీమోగ్లోబిన్ ఉప ప్రమాణాలు ఏర్పడకపోవడం వల్ల రక్త హీనత కలుగుతుంది.
అల్బునిజం: చర్మంలో మెలనిన్ అనే వర్ణకం ఉంటుంది. ఇది శరీరానికి రంగును కలగజేస్తుంది. మెలనిన్ పదార్థం లోపించడం వల్ల చర్మం తెలుపు రంగులో ఉంటుంది. వీరిని అల్బినోలు అంటారు. మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి అయిన వారి శరీరం నల్లగా ఉంటుంది. వీరిని నీగ్రోలు అంటారు.
హైపర్ ట్రైకాసిస్: శరీర భాగాలపై ఎక్కువగా వెంట్రుకలు ఏర్పడతాయి. ఈ అపస్థితి కలిగిన స్త్రీ పురుషుల్లో అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. హైపర్ ట్రైకాసిస్ కలిగిన స్త్రీలకు గడ్డాలు, మీసాలు వస్తాయి.
సికిల్ సెల్ ఎనీమియా: రక్తంలోని ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారుతాయి. దీని వల్ల రక్త కణాలు నాశనం అవుతాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?