TET GRAND TEST PAPER-I ( పోటీ పరీక్షల ప్రత్యేకం-4

ఈవీఎస్
121. ద్రవాలను ఏ ప్రమాణాల్లో కొలుస్తారు?
1) మీటర్లు 2) గ్రాము
3) చదరపు మీటర్లు 4) లీటర్లు
122. అతిపెద్ద పుష్పం?
1) రఫ్లీషియా 2) సఫ్లవర్
3) తామర 4) పాస్సిఫ్లోరా
123. గాలిలో ఉండే ధూళి, పొగ రేణువుల వల్ల మానవుల్లో కలిగే వ్యాధి?
1) ఆర్థరైటిస్ 2) ఎనిమియా
3) గాస్ట్రెటిస్ 4) బ్రాంఖైటిస్
124. కింది వాటిలో పప్పు ధాన్యాల పంట కాదు?
1) వేరుశనగ 2) రాగులు (తైదలు)
3) మినుములు 4) బఠాణీ
125. కింది వాటిలో ప్రొటీన్లు అధికంగా ఉండేవి?
1) కందులు 2) మొక్కజొన్నలు
3) గోధుమలు 4) బియ్యం
126. సాధారణ మానవుని నోటిలో గల అగ్రచర్వణకాల (నమిలే దంతాలు) సంఖ్య?
1) 4 2) 6 3) 8 4) 2
127. వైశాల్యపరంగా భారత్ కంటే చిన్న దేశం?
1) ఆస్ట్రేలియా 2) అర్టెంటీనా
3) కెనడా 4) బ్రెజిల్
128. కింది వాటిలో బాలలు పొందలేని హక్కు?
1) గౌరవాన్ని పొందే హక్కు
2) ఉపాధి పొందే హక్కు
3) యుద్ధం నుంచి రక్షణ పొందే హక్కు
4) జీవించే హక్కు
129. భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షుడు?
1) బీఆర్ అంబేద్కర్ 2) కేఎం మున్షి
3) నెహ్రూ
4) డాక్టర్ రాజేంద్రప్రసాద్
130. భూమికి అతిదగ్గరగా ఉన్న పొర?
1) స్ట్రాటో ఆవరణం
2) మెసో ఆవరణం
3) ఎక్సో ఆవరణం
4) ట్రోపో ఆవరణం
131. కింది వాటిలో ఎప్పటికీ తగ్గిపోని వనరులు?
1) బొగ్గు, సూర్యకాంతి, గాలి
2) సహజ వాయువు, నీరు
3) గాలి, సూర్యకాంతి
4) కిరోసిన్, గాలి, నీరు
132. ఫలక్‌నుమా ప్యాలెస్ నిర్మించినది ఎవరు?
1) మీర్ ఉస్మాన్ అలీఖాన్
2) సర్ వికార్ ఉల్- ఉమ్రా
3) మూడవ సాలార్జంగ్
4) కులీ కుతుబ్ షా
133. మానవునిలో స్కర్వి వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది?
1) కాల్సి ఫెరాల్ 2) ఆస్కార్బికామ్లం
3) ఫోలికామ్లం 4) రిబోఫ్లావిన్
134. మానవుని శరీర భాగాల నుంచి హృదయం (గుండె)లోని ఈ గదిలోకి ఆమ్లజని రహిత రక్తం చేరుతుంది?
1) కుడి కర్ణిక 2) ఎడమ జఠరిక
3) కుడి జఠరిక 4) ఎడమ కర్ణిక
135. కిరణజన్య సంయోగక్రియకు ఆవశ్యకమైన కారకాలు?
1) CO2, O2 పత్రహరితం, సూర్యకాంతి
2) గ్లూకోజ్ CO2, పత్రహరితం, సూర్యకాంతి
3) CO2, పిండి పదార్థం, పత్రహరితం, సూర్యకాంతి
4) CO2, H2O, పత్రహరితం, సూర్యకాంతి

136. మానవుని పరిధీయ నాడీవ్యవస్థలో ఉండేవి?
1) వెన్నుపాము, వెన్నునాడులు
2) మెదడు, వెన్నుపాము
3) కపాలనాడులు, వెన్నునాడులు
4) మెదడు, కపాలనాడులు
137. ‘ఫలదళం’ పుష్పం ఏ భాగానికి చెందినది?
1) ఆకర్షక పత్రావళి 2) కేసరావళి
3) అండకోశం 4) రక్షక పత్రావళి
138. ఏ గ్రంథి జీర్ణ ఎంజైమ్‌లను స్రవించదు?
1) జఠర గ్రంథులు 2) కాలేయం
3) క్లోమం 4) లాలాజల గ్రంథులు
139.భ్రమరాంబికా సంవాదం గ్రంథకర్త?
1) పావురం రంగాచార్యులు
2) బహిరి గోపాలరావు
3) కడుకుంట్ల పాపశాస్త్రి
4) అనుముల వేంకట సబ్రమణ్యశాస్త్రి
140. గండిపేట చెరువును ఏమని పిలుస్తారు?
1) అలీసాగర్ 2) ఉదయ సముద్రం
3) ఉస్మాన్‌సాగర్ 4) స్సేన్‌సాగర్
141. కింది వాటిలో తెలంగాణలో ప్రవహించని నది?
1) తుంగభద్ర 2) కిన్నెరసాని
3) పెన్నా 4) ప్రాణహిత
142. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఎల్లోరా గుహలు ఎవరి కాలానికి చెందినవి?
1) మౌర్యులు 2) విజయనగర
3) కాకతీయులు 4) గుప్తులు
143. ప్రస్తుతం పోస్టాఫీసులు ఏ సేవలను అందించడం లేదు?
1) జీవిత బీమా
2) ఉత్తరాలను చేరవేయడం
3) టెలిగ్రామ్ పంపడం
4) డబ్బు దాచుకోవడం
144. మండల ప్రజాపరిషత్ జనరల్ బాడీ సమావేశాన్ని ఎవరు నిర్వహిస్తారు?
1) మండల విద్యాధికారి
2) మండల పరిషత్ అభివృద్ధి అధికారి
3) వ్యవసాయ అధికారి
4) తహసీల్దార్
145. కింది వాటిలో సరైనది గుర్తించండి?
1) భావావేశ రంగంలో కింది స్థాయి-శీలస్థాపనం
2) మానసిక చలనాత్మకరంగంలో 2వ అత్యున్నత స్థాయి- సమన్వయం
3) జ్ఞానాత్మకరంగం ఆధిపత్యశ్రేణిలో 2వ స్థానం-సంశ్లేషణ 4) పైవన్నీ సరైనవి
146. కింది వాటిలో ఒక కృత్యం విజ్ఞానశాస్త్రం, సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు ఉమ్మడిగా చేయలేరు?
1) నేలలు, పంటల పరిశీలన
2) ఒక నెలలో వాతావరణ నమోదు
3) నీటి వనరులకు క్షేత్రపర్యటన
4) పోస్టాఫీసు సందర్శన
147. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో అగ్రభాగం నుంచి ఆధార భాగానికి జరిగే చర్యల్లో సరైనవి?
ఎ. మూర్తం పెరుగుదల, అమూర్తం తగ్గుదల
బి.అనుభవాల నివృత్తి పెరుగుతుంది
సి. మూర్తం తగ్గుదల, అమూర్తం పెరుగుదల
డి. అనుభవాల విస్తృతి తగ్గుతుంది
1) ఎ, బి సరైనవి 2) బి, సి సరైనవి
3) సి, డి సరైనవి 4) డి, ఎ సరైనవి
148. ‘మొక్కలు-జంతువులు’ పాఠ్యాంశాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయుడు మౌఖిక ప్రశ్నల ద్వారా విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని ఏ దశలో పరీక్షిస్తాడు (హెర్బర్ట్ సోపానాలను అనుసరించి)?
1) సన్నాహం 2) సమర్పణ
3) సంసర్గం 4) అన్వయం
149. ‘తెలంగాణ అభివృద్ధికి కొత్త జిల్లాల ఏర్పాటు అవసరం’ అనే అంశాన్ని ఉత్తమంగా ఏ పద్ధతిలో బోధించవచ్చు?
1) ఉపన్యాస పద్ధతి
2) సమస్యా పరిష్కార పద్ధతి
3) ప్రాజెక్టు పద్ధతి
4) వాద-సంవాద పద్ధ్దతి
150. కింది వాటిలో వ్యాసరూప ప్రశ్న గుర్తించండి?
1) మూడు రాజధానుల గొప్ప దనాన్ని సోదాహరణంగా వివరించండి
2) మూడు రాజధానుల్లో పరిపాలనా రాజధానిగా ప్రకటించిన నగరమేది?
3) మూడు రాజధానుల పట్టణాలను ఆనుకొని ప్రవహిస్తున్న నదులేవి?
4) ప్రపంచంలో మూడు రాజధానులు కలిగిన దేశమేది?
సమాధానాలు
1-1 2-4 3-2 4-4 5-3 6-1 7-3 8-2 9-3 10-1 11-2 12-2 13-2 14-4 15-3 16-1 17-3 18-4 19-2 20-2
21-4 22-2 23-4 24-4 25-1 26-3 27-3 28-2 29-2 30-3 31-1 32-1 33-2 34-3 35-4 36-2
37-3 38-2 39-1 40-3 41-3 42-1 43-4 44-1 45-2 46-3 47-1 48-3 49-4 50-3 51-3 52-4
53-4 54-3 55-4 56-3 57-3 58-1 59-4 60-1 61-3 62-2 63-2 64-3 65-3 66-1 67-2 68-2
69-2 70-1 71-3 72-3 73-3 74-3 75-2 76-1 77-2 78-2 79-1 80-2 81-4 82-2 83-3 84-2
85-4 86-2 87-2 88-2 89-1 90-2 91-1 92-4 93-1 94-4 95-2 96-2 97-3 98-4 99-4 100-2
101-4 102-3 103-2 104-2 105-1 106-2 107-4 108-4 109-3 110-3 111-1 112-2
113-4 114-4 115-3 116-2 117-4 118-4 119-2 120-2 121-4 122-1 123-4 124-2
125-1 126-3 127-2 128-2 129-1 130-4 131-3 132-2 133-2 134-1 135-4 136-3
137-3 138-2 139-3 140-3 141-3 142-4 143-3 144-2 145-2 146-4 147-1 148-1 149-4 150-1
ఏకేఆర్స్టడీసర్కిల్, వికారాబాద్
అధ్యాపక బృందం: శివపల్లి (సైకాలజీ), రాజేంద్రచారి (ఇంగ్లిష్), శివశంకర్ (తెలుగు), బీ.వీ.రమణ(మ్యాథ్స్) సత్యనారాయణ, ఢిల్లీబాబు,శ్రీకాంత్(ఈవీఎస్) ఈ ప్రశ్న పత్రాన్ని రూపొందిచారు.
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
-
Group 2,3 Special | ‘హ్యూమన్ రైట్స్ వాచ్’ సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
-
Group I Special | భారతదేశ వ్యవసాయ లక్షణాలు-రైతు కూలీల స్థితిగతులు
-
Group I Special – General Essay | కచ్ఛదీవు వివాదం.. భారత్, శ్రీలంక మధ్య వాగ్వాదం
-
Group I Special | జనాభా మార్పునకు తోడ్పడే ముఖ్య కారకాలు?
-
TSPSC Groups Special | జాతీయ మహిళా సాధికారత సంవత్సరం ఏది?
-
Economy – Group I Special | సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రైతుల ఆదాయం పెంచే అంశాలు
Latest Updates
General Studies | బ్రిటిషర్లు ‘కైజర్-ఇ-హింద్’ అనే బిరుదు ఎవరికి ఇచ్చారు?
Biology – JL / DL Special | ఆశ్రయం పొందుతాయి.. హాని తలపెడతాయి
Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
Indian festivals and culture | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
Women’s Reservation Bill | చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు
Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
Current Affairs | కెంటకీ నగరం ఏ రోజు ‘సనాతన ధర్మ’ రోజుగా ప్రకటించింది?
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో ఐడీబీఐలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా జరుగుతుంది?