Telangana History Group 4 Special | కుబానీ కా మీఠా తయారీలో ఉపయోగించే పండ్లు?
గతవారం తరువాయి..
273. ముస్లింలు చనిపోయిన వారి ఆత్మలు భూమ్మీదికి వస్తాయని విశ్వసిస్తూ ధార్మికంగా గడిపే రోజు ఏది?
a) ఈదుల్ జుహా b) షబ్ ఎ బరాత్
c) లైలత్ అల్ ఖదర్
d) ఈద్ మిలాద్ ఎ అలీ
జవాబు: (b)
వివరణ: షబ్ ఎ బరాత్ ఇస్లామిక్ కాలమానం ప్రకారం 8వ నెల అయిన షాబాన్ మాసంలో 15వ రోజున వస్తుంది.
274. ప్రవక్త ఇబ్రహీం త్యాగానికి గుర్తుగా జరుపుకొనే పండుగ ఏది?
a) ఈద్ ఉల్ జుహా b) షబ్ ఎ బరాత్
c) ఈద్ ఉల్ ఫిత్ d) లైలత్ ఉల్ ఖదర్
జవాబు: (a)
వివరణ: ఈద్ ఉల్ జుహానే బక్రీద్ అని కూడా పిలుస్తారు.
275. ఏడుపాయల వనదుర్గా భవానీ జాతర ఏ పండుగ సమయంలో జరుగుతుంది?
a) దసరా b) దీపావళి
c) మహాశివరాత్రి d) ఉగాది
జవాబు: (c)
వివరణ: వనదుర్గా దేవి ఆలయం మంజీర నదీ తీరంలో మెదక్ జిల్లా నాగసాన్పల్లి సమీపంలో ఉంది. ఇక్కడ మహాశివరాత్రి రోజున జాతర ప్రారంభమవుతుంది.
276. వేలాల జాతర ఏ దేవుడికి సంబంధించింది?
a) నరసింహ స్వామి b) రాముడు
c) వీరభద్రుడు d) శివుడు
జవాబు: (d)
వివరణ: వేలాల మంచిర్యాల జిల్లా చెన్నూరు తాలూకాలో ఉంది. ఇక్కడ మహాశివరాత్రికి జాతర మొదలవుతుంది.
277. కింది దేవాలయాలు, దేవుళ్లను పరిశీలించండి.
1. గంగాపురం: వేంకటేశ్వరస్వామి
2. కురుమూర్తి: వీరభద్రస్వామి
3. మన్యంకొండ: వేంకటేశ్వరస్వామి
4. కొమ్మాల: లక్ష్మీనరసింహస్వామి
పై జతల్లో సరైనవి ఎన్ని?
a) 1 b) 3, 4 c) 1, 2, 3
d) నాలుగూ సరైనవే జవాబు: (b)
వివరణ: గంగాపురంలో లక్ష్మీచెన్నకేశవస్వామి దేవాలయం ఉంది. ఇది కల్యాణి చాళుక్యుల కాలం నాటిది. ఇక్కడ జనవరి, ఫిబ్రవరి నెలల్లో జాతర జరుగుతుంది. కురుమూర్తి స్వామి అంటే వేంకటేశ్వరస్వామి. కాబట్టి మొదటి రెండు జతలు తప్పు.
278. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిచెందిన లింగమంతుల స్వామి జాతర ఎక్కడ జరుగుతుంది?
a) పిల్లలమర్రి b) దురాజ్‌పల్లి
c) నేరేడుచర్ల d) కొమురవెల్లి
జవాబు: (b)
వివరణ: లింగమంతుల స్వామి జాతర సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో జరుగుతుంది. తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధిచెందిన ఈ జాతర రెండేండ్లకోసారి జరుగుతుంది. తమ గండాలు తొలగిపోవాలని భక్తులు ఇక్కడ ‘గండదీపం’ వెలిగించే ఆచారం ఉంది. ఇది మాఘమాసంలో వస్తుంది.
279. సమ్మక్క- సారలమ్మ జాతరకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి? (గ్రూప్ 1 ప్రిలిమ్స్, 2022)
A. సమ్మక్క-సారలమ్మ జాతర మేడారంలో ప్రారంభమవుతుంది
B. ఇది సమ్మక్క, సారలక్క ఇద్దరు సోదరీమణుల పోరాటాన్ని స్మరించుకుంటుంది
C. జంపన్న సమ్మక్క సోదరుడు
D. అసలు పండుగ మాఘ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు మొదలవుతుంది.
సరైన జవాబును ఎంచుకోండి
1) A, B, C 2) B, C, D
3) A, D 4) B, C
జవాబు: (3)
వివరణ: సమ్మక్క భర్త పేరు పగిడిద్దరాజు. వీరి కూతురు సారలమ్మ, కొడుకు జంపన్న. సారలమ్మ భర్త గోవిందరాజు. కాకతీయ సేనలతో పోరాడుతూ వీరు చేసిన ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ మేడారం జాతర నిర్వహిస్తున్నారని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇచ్చిన ప్రశ్నలో A, D రెండు ఐచ్ఛికాలు మాత్రమే సరైనవి. కాబట్టి, జవాబు (3) అవుతుంది.
280. హైదరాబాదీ ప్రత్యేక వంటకం ‘హలీమ్’కు భౌగోళిక గుర్తింపు (జీఐ) ఏ సంవత్సరంలో వచ్చింది?
a) 2011 b) 2010
c) 2013 d) 2009
జవాబు: (b)
వివరణ: రంజాన్ మాసంలో ఇఫ్తార్ సందర్భంగా తినడం ఆనవాయితీగా వస్తున్నది.
281. కుబానీ కా మీఠా తయారీలో ఉపయోగించే పండ్లు?
a) ఎండు ద్రాక్ష b) ఖర్జూర
c) ఆప్రికాట్ d) అల్బుఖారా
జవాబు: (c)
282. కింది దేవాలయాలు, అవి నెలకొన్న ప్రదేశాలను సరిగ్గా జోడించండి?
A. లక్ష్మీనారాయణ మందిరం 1. మల్లూరు
B. హేమాచల నరసింహుడు 2. ఝరాసంగం
C. కేతకీ సంగమేశ్వరుడు 3. మల్దకల్లు
D. తిమ్మప్ప దేవుడు 4. జైనథ్
a) A-4, B-1, C-2, D-3
b) A-3, B-1, C-2, D-4
c) A-4, B-2, C-3, D-1
d) A-2, B-1, C-2, D-4
జవాబు: (a)
వివరణ: మల్దకల్లు జోగులాంబ గద్వాల జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం వేంకటేశ్వర స్వామి. ఆయనను తిమ్మప్ప అని పిలుస్తారు.
283. కింది దేన్ని తెలంగాణలో తొలి దర్గాగా పేర్కొంటారు?
a) షారాజు కట్టాల్ దర్గా
b) బాబా యూసఫీన్ దర్గా
c) జాన్‌పహాడ్ దర్గా
d) పహాడీషరీఫ్ దర్గా జవాబు: (d)
వివరణ: పహాడీ షరీఫ్ దర్గా హైదరాబాద్ శివార్లలో ఒక గుట్టమీద నెలకొంది. దీన్ని హజ్రత్ సైద్నా బాబా షర్ఫుద్దీన్ సుహ్రవర్దీ జ్ఞాపకార్థం నిర్మించారు. బహమనీ వంశ స్థాపకుడు అల్లావుద్దీన్ హసన్ గంగూ కాలంలో నిర్మించినట్లు తెలుస్తున్నది. బాబా షర్ఫుద్దీన్ ఉర్సు బాలాపూర్ నుంచి మొదలై పహాడీ షరీఫ్‌కు చేరుకుంటుంది.
284. హజ్రత్ అఫ్జల్ బియాబానీ దర్గా ఎక్కడ ఉంది?
a) మిశ్రిగంజ్ b) ఖాజీపేట
c) నాంపల్లి d) మౌలాలి
జవాబు: (b)
285. బీరప్ప, కాటమరాజును ఎవరు ఆరాధిస్తారు?
a) రైతులు b) సంతానం కోరుకునే వాళ్లు
c) పశువుల కాపర్లు
d) తోటలు అభివృద్ధి చెందాలనుకునే వాళ్లు
జవాబు: (c)
వివరణ: పచ్చిక బయళ్లలో పశువులను కాసే హక్కుల కోసం కాటమరాజు నెల్లూరు పాలకుడితో యుద్ధం చేశాడు.
286. తెలంగాణ సంస్కృతికి సంబంధించి ‘మిర్గం’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) మృగశిర కార్తె సందర్భంగా చేపలను ఆహారంగా తీసుకోవడం
b) మృగశిర కార్తె సందర్భంగా పొలంలో నాట్లు వేయడం
c) మృగశిర కార్తె సందర్భంగా శివుడికి ప్రత్యేక పూజలు చేయడం
d) మృగశిర కార్తె సందర్భంగా వర్షాల కోసం గంగను ఆరాధించడం జవాబు: (a)
వివరణ: మిర్గం అంటే మృగశిర కార్తె అని అర్థం. ఈ రోజున చేపల కూర తినడం ఆనవాయితీ.
287. కుంభమేళా తర్వాత అంతపెద్ద సాంస్కృతిక సమారోహంగా ప్రసిద్ధిచెందిన మేడారం జాతర ఏ రోజున మొదలవుతుంది?
a) పుష్య పౌర్ణమి b) మాఘ పౌర్ణమి
c) శివరాత్రి d) మాఘ దశమి
జవాబు: (b)
వివరణ: మేడారం జాతరనే సమ్మక్క-సారలమ్మ జాతర అని పిలుస్తారు. రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ జాతర మాఘ పౌర్ణమినాడు మొదలవుతుంది. నాలుగు రోజులపాటు సాగుతుంది.
288. సమ్మక్క, సారలమ్మ చారిత్రకంగా ఎవరికి సమకాలీనులని కథలు ప్రచారంలో ఉన్నాయి?
a) వేములవాడ చాళుక్యులు
b) కాకతీయులు c) రాష్ట్రకూటులు
d) కందూరు చోళులు జవాబు: (b)
వివరణ: ఏ కాకతీయ పాలకుడికి సమకాలీనులు అనే విషయంలో మాత్రం చరిత్రకారులు, పరిశోధకుల్లో ఏకాభిప్రాయం లేదు. కొన్ని పుస్తకాల్లో మొదటి ప్రతాపరుద్రుడు అని ఉంటే, కొన్ని చోట్ల రెండో ప్రతాపరుద్రుడు అని ఉంది.
289. మేడారం జాతరలో భాగంగా సారలమ్మను గద్దె మీదికి ఎప్పుడు తీసుకువస్తారు?
a) మొదటి రోజు b) రెండో రోజు
c) మూడో రోజు d) నాలుగో రోజు
జవాబు: (a)
వివరణ: సారలమ్మను కన్నెపల్లి నుంచి జాతర మొదటిరోజున గద్దె మీదికి తీసుకువస్తారు.
290. మేడారం జాతర ప్రధాన దైవం సమ్మక్కను ఎన్నో రోజు గద్దె మీదికి తీసుకువస్తారు?
a) మొదటి రోజు b) రెండో రోజు
c) మూడో రోజు d) నాలుగో రోజు
జవాబు: (b)
291. సమ్మక్క, సారలమ్మ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు ప్రకటించింది?
a) 2003 b) 2001
c) 1999 d) 1996
జవాబు: (d)
292. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ప్రధానంగా ఏ ఆదివాసీ తెగకు సంబంధించింది?
a) గోండులు b) కోయలు
c) నాయకపోడ్లు d) కొండ రెడ్లు
జవాబు: (b)
వివరణ: ప్రధానంగా కోయలు జరుపుకొనేదే అయినప్పటికీ మేడారం జాతరకు ఇప్పుడు ప్రధాన స్రవంతికి చెందిన అన్ని ప్రాంతాల ప్రజలు (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి) పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు.
293. కాకతీయ మొదటి ప్రతాపరుద్రుడి సైన్యాలకు, పగిడిద్ద రాజు నాయకత్వంలోని కోయ సైన్యాలకు మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది?
a) గోదావరి నదీ తీరంలో
b) దయ్యాల మడుగు
c) ములుగు సమీపంలో
d) ఏటూరు నాగారం దగ్గర్లో
జవాబు: (b)
వివరణ: మేడారంలో ఉన్న దయ్యాల మడుగు దగ్గర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సమ్మక్క, పగిడిద్దరాజు కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడి మరణించారు. ఆయన మరణించింది సంపెంగ వాగు దగ్గర. ఆయన రక్తంతో ఎరుపెక్కింది కాబట్టి సంపెంగ వాగును జంపన్న వాగు అని కూడా పిలుస్తారని కథ.
294. ఏ ఉత్సవంతో మేడారం జాతర ముగిసిపోతుంది?
a) చిలుకల గుట్ట నుంచి కుంకుమ భరిణ తేవడం
b) సమ్మక్క, సారక్క గద్దెలను జంపన్న వాగు నీళ్లతో అభిషేకించడం
c) దేవతలను వనప్రవేశం చేయించడం
d) సమ్మక్క, సారలమ్మకు పసుపు, కుంకుమలు ఇవ్వడంతో జవాబు: (c)
295. కింది వారిలో బయ్యారం చెరువును నిర్మించింది ఎవరు?
a) గణపతిదేవుడు
b) రెండో ప్రతాపరుద్రుడు
c) కుందమాంబ d) మైలాంబ
జవాబు: (d)
వివరణ: మైలాంబ గణపతిదేవుడి సోదరి. ఆయన మరో సోదరి కుందమాంబ మంచిర్యాల జిల్లా చెన్నూరు సమీపంలోని కుందవరంలో కుంద సముద్రం చెరువును నిర్మింపజేసింది.
296. ముసునూరు వంశ పాలన స్థాపకుడు ఎవరు?
a) కాపయ నాయకుడు
b) ప్రోలయ నాయకుడు
c) పోతి నాయకుడు
d) వినాయకదేవుడు జవాబు: (b)
297. ముసునూరి నాయకుల తొలి రాజధాని ఏది?
a) వరంగల్లు b) భద్రాచలం
c) రేకపల్లి d) ముదిగొండ
జవాబు: (c)
వివరణ: తర్వాత కాలంలో కాపయ నాయకుడు రాజధానిని ఓరుగల్లుకు మార్చాడు.
298. నల్లగొండ పట్టణం సమీపంలో పానగల్లులో ఉన్న పచ్చల సోమేశ్వర, ఛాయా సోమేశ్వర ఆలయాలు ఎవరి పాలనా కాలానికి చెందినవి?
a) కాకతీయులు
b) వేములవాడ చాళుక్యులు
c) కందూరు చోళులు
d) వెలనాటి చోళులు జవాబు: (c)
299. గణపతిదేవుడు వేయించిన ఏ శాసనంలో విద్యా మండపాల ప్రస్తావన కనిపిస్తుంది?
a) ద్రాక్షారామం శాసనం
b) మోటుపల్లి అభయ శాసనం
c) త్రిపురాంతక శాసనం
d) మల్కాపురం శాసనం జవాబు: (d)
వివరణ: ఈ శాసనం 1261 నాటిది.
300. కందూరు చోళుల్లో మొదటి రాజు ఎవరు?
a) ఏరువ భీమ చోడుడు 1
b) ఏరువ తొండయ చోడుడు 1
c) ఉదయన చోడుడు
d) ఉదయాదిత్య దేవచోడుడు
జవాబు: (a)
301. కందూరు చోళుల్లో అతి ప్రసిద్ధుడైన పాలకుడు ఎవరు?
a) ఉదయన చోడుడు
b) ఉదయాదిత్య చోడుడు
c)ఏరువ భీమ చోడుడు 1
d) ఏరువ భీమ చోడుడు 2 జవాబు: (a)
302. పానగల్లులోని ఉదయ సముద్రం చెరువు ఎవరి కాలానికి చెందినది?
a) కాకతీయులు
b) వేములవాడ చాళుక్యులు
c) కందూరు చోళులు
d) రాచకొండ పద్మనాయకులు
జవాబు: (c)
303. కాకతీయుల మూలపురుషుడు కాకర్త్య గుండన ప్రస్తావన ఉన్న మాగల్లు శాసనాన్ని వేయించింది ఎవరు?
a) కాకర్త్య గుండన b) దానార్ణవుడు
c) రుద్రదేవుడు d) గణపతిదేవుడు
జవాబు: (b)
వివరణ: ఈ శాసనం క్రీ.శ. 956 నాటిది. వేయించింది తూర్పు చాళుక్య రాజు దానార్ణవుడు.
304. కింది శాసనాలు, వాటిని వేయించిన వారిని జతపరచండి.
A. వేయిస్తంభాల గుడి శాసనం 1. గణపతిదేవుడు
B. బయ్యారం శాసనం 2. మైలాంబ
C. మోటుపల్లి అభయ శాసనం 3. పువ్వుల ముమ్మడి
D. చందుపట్ల శాసనం 4. రుద్రదేవుడు- 1
a) A-2, B-3, C-4, D-1
b) A-3, B-1, C-2, D-4
c) A-4, B-2, C-1, D-3
d) A-4, B-3, C-1, D-2
జవాబు: (c)
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?