Group I Special | భారతదేశ వ్యవసాయ లక్షణాలు-రైతు కూలీల స్థితిగతులు
భారతదేశంలోని వలసలు
1. భారతదేశంలో వ్యవసాయ కూలీల స్థితిగతులను తెలియజేయండి? భారతదేశ వ్యవసాయ లక్షణాలను గురించి రాయండి? వ్యవసాయ కూలీలు
1) భారతదేశంలోని అత్యధిక శ్రామికులు అసంఘటిత రంగంలోనే జీవిస్తున్నారు. వీరికి వేతనాన్ని డిమాండ్ చేయడం లేదు.
2) కనీస వేతన చట్టం-1948 కూడా వేతనం కోసం వచ్చింది.
3) కౌలు రైతులు ప్రైవేటుగానే వ్యవసాయం చేస్తున్నారు. కూలీలను సంఘటిత రంగంలోని కార్మికులుగా చూడటం లేదు. పని తక్కువ, అప్పులు ఉండటం వల్ల అధిక వేతనం డిమాండ్ చేయలేకపోతున్నారు.
4) గ్రామీణ ప్రాంతంలోని వారికి మెరుగైన జీవనోపాధి అందించడం అనేది పంచవర్ష ప్రణాళిక ప్రాథమిక లక్ష్యాల్లో ఒకటి. వ్యవసాయ కార్మికులు, సాగుదారులు పెరగడం అనేది భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అత్యంత విశిష్ట లక్ష్యాల్లో ఒకటి.
5) నిరుద్యోగం, మిగులు జనాభా అనేవి వ్యవసాయంలో కనిపిస్తున్నాయి. వారికి నైపుణ్యం/ శిక్షణ లేదు. కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు లేవు.
6) అభివృద్ధి ప్రారంభ దశలో భూమి పుష్కలంగా అందుబాటులో ఉన్నందున కూలీల సరఫరాలో కూడా పెరుగుదల కనిపించడం వల్ల సాగుభూమి ఎక్కువగా వినియోగించారు.
7) వ్యవసాయ కూలీల కుటుంబాలు చరిత్రాత్మకంగా అణగారిన సామాజిక సమూహాలు, స్థానభ్రంశం చెందిన హస్తకళాకారులు, నిర్వాసితులైన రైతులుగా ఉన్నారు.
8) వారి పెరుగుదల అభివృద్ధిలో వలసవాద వారసత్వాన్ని నియంత్రించలేకపోయాం.
9) ఆస్తుల లేమి, పోషకాహార లోపం, నిరక్షరాస్యత, సామాజిక వెనుకబాటుతనం పేదరికాన్ని ఇంకా పెంచాయి.
భారతీయ వ్యవసాయ లక్షణాలు
1) స్వభావరీత్యా జీవనాధారంగా ఉంది. రైతులు ప్రధానంగా కుటుంబ అవసరాల కోసం పంటలను పండిస్తారు. దేశంలోని పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, కావేరి డెల్టా వంటి నియంత్రిత నీటి పారుదల ప్రాంతాల్లో వ్యాపారంగా లేదా ఒక మార్కెట్‌గా మారింది.
2) మిశ్రమ పంటలు: జూమింగ్ వ్యవసాయం చేసే ప్రాంతాల్లో 10-16 పంటలను అదే పొలంలో విత్తుతారు. రైతులు ఖరీఫ్ సీజన్లో మినుములు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, రబీ సీజన్లో గోధుమలు, శనగలు, బార్లీ వేస్తారు.
3) 70% పైగా భూకమతాలు చిన్నవి (ఒక హెక్టార్ కంటే తక్కువ). వారసత్వం ద్వారా, ఆర్థిక అంశాల కారణంగా చిన్నవిగా ఉన్నాయి.
4) ఆహార ధాన్యాలు ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తున్నారు.
5) అధిక జనాభా ఒత్తిడితో కూడుకుని ఉంది. మొత్తం జనాభాలో 70% మంది ప్రత్యక్షంగా/ పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.
2. వ్యవసాయ కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం అనుసరించిన చర్యలు, నియమించిన కమిటీలు ఏమిటి? వ్యవసాయ కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి సూచనలు చేయండి?
కమిటీలు
1) మొదటి వ్యవసాయ కార్మిక విచారణ కమిటీ 1950-51: కార్మికులను వ్యవసాయ కార్మికులుగా పరిగణించింది. వారికి చెల్లించే వేతనానికి అదనంగా 50 శాతం ఎక్కువ రోజులు వారు పనిచేస్తున్నారు.
2) రెండో వ్యవసాయ కార్మిక విచారణ కమిటీ 1956-57: వ్యవసాయ అనుబంధ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న కార్మికులందరినీ వ్యవసాయ కూలీలుగా చేర్చింది. 1950-51లో ఈ కుటుంబాల తలసరి వార్షిక ఆదాయం రూ.104గా ఉంది. కుటుంబ సగటు ఆదాయం రూ.447. మెరుగైన వ్యవసాయ పద్ధతులు, యంత్రీకరణ వల్ల మధ్య, ధనిక రైతుల ఆదాయ స్థానం పెరిగింది. ఇదే సమయంలో కార్మికుల డిమాండ్ తగ్గడం వల్ల నిజమైన వేతనాలు తగ్గాయి.
3) ఎన్ఎస్ఎస్ఓ 32వ రౌండ్ ప్రకారం దాదాపు 3.5 లక్షల మంది నిర్బంధ/ బంధిత కార్మికులు ఇప్పటికీ భారతదేశంలో ఉన్నారు.
ప్రభుత్వ చట్టాలు
1) నిర్బంధ కార్మికుల నిషేధిత చట్టం-1976 ద్వారా 2.51 లక్షల మంది నిర్బంధ కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించారు.
2) 1948 కనీస వేతనాల చట్టం.
3) భూ గరిష్ఠ పరిమితి చట్టం ద్వారా 74 లక్షల ఎకరాల భూమిని సేకరించారు. దీనిలో 45 లక్షల ఎకరాలను 41.5 లక్షల మంది భూమిలేని వారికి పంపిణీ చేశారు.
4) 20 సూత్రాల పథకం కింద వ్యవసాయ కార్మికులకు ఇళ్ల స్థలాలు, ఇంటి నిర్మాణం చేపట్టారు (1957).
5) వివిధ ఉపాధి పథకాలు
ఎ. ఆర్డబ్ల్యూపీ- రూరల్ వర్క్ ప్రోగ్రామ్
బి. ఉపాధి హామీ పథకం
సి. పనికి ఆహార పథకం (ఎఫ్డబ్ల్యూపీ)
డి. ఆర్ఎల్ఈజీపీ- గ్రామీణ భూమిలేని వారికి ఉపాధి హామీ
ఇ. జేఆర్‌వై- జవహర్ రోజ్‌గార్ యోజన
6) ప్రత్యేక ఏజెన్సీలు: 4వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఎస్ఎఫ్డీఏ చిన్నరైతుల అభివృద్ధి సంస్థ
7) ఎంఎఫ్ఏఎల్ఏ- ఉపాంత రైతులు, వ్యవసాయ కార్మికుల అభివృద్ధి సంస్థ
8) ఆర్కేవీవై- రాష్ట్రీయ కృషి వికాస్ యోజన
9) భూసార కార్డులు
10) ఆర్కేఎస్వై- కృషి సించయి యోజన
11) సబ్సిడీ ఎరువులు
12) తెలంగాణ రాష్ట్రం రైతుబంధు లాంటి పెట్టుబడి సహాయ పథకాలు.
వ్యవసాయ కార్మికుల స్థితిగతులను మెరుగుపరచడానికి సూచనలు
1) కనీస వేతన చట్టాన్ని సీరియస్‌గా అమలు చేయాలి.
2) వారి బేరసారాల శక్తిని మెరుగుపరచాలి.
3) గ్రామీణ ప్రాంతాల్లో కుటీర, చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
4) సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.
5) వ్యవసాయ కూలీలకు పనిలో నైపుణ్యం, శిక్షణ ఇవ్వాలి.
6) నిర్బంధ బీమాను ప్రవేశపెట్టాలి.
7) కార్మికులకు బీమా, సామాజిక భద్రత చర్యలను, వృద్ధాప్య పింఛన్ పథకాలను ఏర్పాటు చేయాలి.
3. పీఎం ఆశా (AASHA) అనే పథకం ఉద్దేశం ఏమిటి?
- పీఎం ఆశా (ఏఏఎస్హెచ్ఏ) పథకం అంటే ప్రధాన మంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్. ఇది రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)ను నిర్ధారించడానికి తీసుకువచ్చిన పథకం. ఒక్కొక్క ప్రాంతంలో పీఎస్ఎస్ (ప్రైస్ సపోర్ట్ స్కీం)ను ఒక్కొక్క పంటకు అమలు చేస్తారు. ప్రైవేటు స్టాకిస్టుల భాగస్వామ్యంతో రాష్ర్టాలు అమలు చేసుకోవచ్చు.
1) నూనె గింజలు, గోధుమ, వరి, ముతక ధాన్యాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ (ఫుడ్ అండ్ పీడీఎస్) ద్వారా
2) పత్తిని జౌళి మంత్రిత్వ శాఖ కింద సేకరిస్తారు.
3) ఈ పథకం ద్వారా ఉత్పత్తి వ్యయం కంటే అధిక
రాబడిని అందించడానికి రైతులకు సహాయం చేస్తుంది. వరి, జొన్న, బజ్రా, మొక్క జొన్న, రాగి, అర్హర్, మూంగ్, ఉరద్, వేరుశనగ, సోయాబీన్, పొద్దు తిరుగుడు, నువ్వులు, నైగర్సీడ పత్తి, గోధుమలు, బార్లీ, కందులు, మసూర్ పప్పు వంటి 22 పంటలకు తప్పనిసరిగా ఎంఎస్పీని నిర్ణయించింది.
4) పీడీపీఎస్ (ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం): అన్ని నూనె గింజల పంటలకు ఎంఎస్పీ కంటే తక్కువ ధరకు అమ్మినప్పుడు ఎంత తక్కువకు అమ్మారో, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా వారి అకౌంట్లోకి జమ చేస్తుంది.
5) పీపీపీఎస్ఎస్ (పైలెట్ ఆఫ్ ప్రైవేట్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాకిస్ట్ స్కీం): ఆయిల్ సీడ్ పంటల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రైవేటు కంపెనీలతో రాష్ర్టాలు భాగస్వామ్యంకావచ్చు. ఈ విధంగా మధ్యప్రదేశ్ వంటి రాష్ర్టాలు నగదు చెల్లింపును రైతులకు నేరుగా అందిస్తున్నాయి.
నాఫెడ్ (ఎన్ఏఎఫ్ఈడీ)- 1958
1) నేషనల్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
2) ఇది బహుళ రాష్ర్టాల సహకార సంఘాల చట్టం కింద ఏర్పాటు చేశారు.
3) ఎఫ్‌సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)- 1964 చట్టం: ఇది మద్దతు ధర చర్యలు, ప్రజా పంపిణీ కోసం ఆహార ధాన్యాల పంపిణీ, ఆహార భద్రతకు అనుగుణంగా ఆహార ధాన్యాల నిర్వహణ, బఫర్ నిల్వలు ఉంచేలా చూడటం చేస్తుంది.
ముగింపు: పర్యావరణహితమైన సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించాలి. భూగర్భ జలాలను రక్షించుకుంటూ, వివిధ అనుబంధ రంగాల ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని అందించాలి. రుణ సౌకర్యాలు కల్పించాలి. శీతలీకరణ గిడ్డంగులను నిర్మిస్తూ ధాన్యాలు, ఆహార పదార్థాలు పాడవకుండా చర్యలు తీసుకోవాలి. - భారతదేశం రష్యాతో 25 సమీకృత వ్యవసాయ కేంద్రాలను నెలకొల్పడానికి సంతకం చేసింది.
- ఈ విధంగా ఎస్డీజీ-2030 లక్ష్యాలైన 1వ పేదరికం, 2వ ఆకలి, 8వ మంచిపని, ఆర్థిక అభివృద్ధిని సృష్టించవచ్చు.
4. రైతుల ఆదాయాన్ని పెంచడానికి వివిధ రాష్ర్టాల్లో అమలు చేస్తున్న కార్యమ్రాల గురించి చర్చించండి?
1) అస్సాంలోని డఫోడిల్ కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్‌లో 18 లక్షల విభిన్న ఉద్యాన మొక్కలను పెంచుతున్నారు. వీటిలో కొన్ని మొక్కల ధర ఒక్కదానికి రూ.6 లక్షలు ఉంది. దీన్ని డాక్టర్ ధ్రువజ్యోతి శర్మ నిర్వహిస్తున్నారు. ఇందులో వందలాది రైతు కార్మికులు నర్సరీ నిర్వహణ కోసం పనిచేస్తున్నారు.
2) రైతులకు తక్కువ ఆదాయం ఉన్న బిహార్, జార్ఖండ్, ఒడిశా లాంటి రాష్ర్టాలతో పోలిస్తే ఎక్కువ ఆదాయమున్న కేరళ, పంజాబ్, హర్యానా లాంటి రాష్ర్టాల్లో వారి ఆదాయాన్ని పెంచడం అంత సులువు కాదు.
3) 2015-16లో బిహార్ రైతులు 65 లక్షల టన్నుల వరిధాన్యాన్ని ఉత్పత్తి చేస్తే అందులో 12.24 లక్షల టన్నులను, జార్ఖండ్‌లో 29 లక్షల టన్నులకు 2.06 లక్షల టన్నులను ప్రభుత్వం కనీస మద్దతు ధర చెల్లించి సేకరించింది. కానీ పంజాబ్ ప్రభుత్వం 93.5 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది.
4) చెరుకును పండించే ప్రతి కుటుంబం సగటున రూ.89, 430 విలువైన చెరుకును ఉత్పత్తి చేస్తుంది
(ఎన్ఎస్ఎస్వో రికార్డ్).
5) అదే మొక్కజొన్న రైతులు రూ.9391 విలువైన పంటను మాత్రమే పండిస్తున్నారు. కాబట్టి మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల రైతులకు కనీస మద్దతు ధర, ప్రోత్సాహకాల ద్వారా ఆదాయాన్ని పెంచాలి.
6) బిహార్, జార్ఖండ్ రాష్ర్టాల్లో రైతుబజార్ల పథకం లేదు. కాబట్టి మధ్యవర్తుల పైనా ఆధారపడాల్సి వస్తుంది.
7) ఏపీఎంసీ- అగ్రి ప్రొడక్ట్స్ మార్కెటింగ్ కమిటీల ద్వారా కొనుగోళ్లను పెంచాలి. కానీ బిహార్‌లో గోధుమలను దూరంగా వెళ్లి ఎక్కడో అమ్మాల్సి వస్తుంది.
8) ఉపాంత రైతుల ఆదాయం రెట్టింపు చేయాలంటే
ప్రత్యామ్నాయ ఉపాధి పైన ఆధారపడాల్సి వస్తుంది.
9) నిర్మాణ రంగ అభివృద్ధి మందగించడంతో రైతు కార్మికులకు ఉపాధి కరువయ్యింది.
10) శాంతకుమార్ కమిటీ: గోధుమలు, వరి, బియ్యం వంటివి సేకరించే బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని ఎఫ్‌సీఐని కోరింది. నాణ్యత తనిఖీలు ఉండాలి.
11) రైతులకు నేరుగా నగదు రాయితీ హెక్టారుకు రూ.7000 ఇవ్వాలని, ఎరువుల రంగం నియంత్రణను తొలగించాలని సూచించింది.
12) ఎఫ్‌సీఐ తన స్టాకింగ్ కార్యకలాపాలను 1. సీడబ్ల్యూసీ (సెంట్రల్ వేర్‌హౌస్ కార్పొరేషన్), 2. ఎస్‌డబ్ల్యూసీ (స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్), 3. పీఈజీ (ప్రైవేటు ఎంట్రప్రెన్యూర్ గ్యారెంటీ పథకం) కింద ప్రైవేటు వారికి అవుట్ సోర్స్ చేయాలని నివేదికలు తెలిపాయి.
13) వోఈసీడీ (ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్) ప్రకారం గోధుమ, వరి దిగుబడి అనేది ప్రపంచ దిగుబడుల కంటే దాదాపు ‘3’ రెట్లు తక్కువగా ఉంది. మామిడి, అరటి, ఉల్లి, బంగాళదుంపలు కూడా ప్రపంచ దిగుబడితో పోలిస్తే 2 నుంచి 7 రెట్లు తక్కువగా ఉంది.
14) వోఈసీడీ డేటా ప్రకారం 85 శాతం వ్యవసాయ భూమి 2 హెక్టార్ల కంటే తక్కువగా ఉంది. పంట విస్తీర్ణం మొత్తంగా చూస్తే 45 శాతం వాటా కలిగి ఉంది.
15) వ్యవసాయ జనాభా లెక్కలు-2016 డేటా ప్రకారం 5 శాతం మంది రైతులు మాత్రమే 4 హెక్టార్ల కంటే ఎక్కువ భూమిపై పనిచేస్తున్నారు.
5. రైతుల దుస్థితి సూచికలో పరిగణనలోకి తీసుకున్న అంశాలు ఏమిటి? - ఈ సూచిక భారతదేశం అంతటా స్థిరంగా ఉండదు. ప్రభుత్వాలు, ఆర్థిక పరిశ్రమ, బీమా సంస్థలు ఈ సూచిక ద్వారా ప్రయోజనం పొందుతాయి. దీన్ని సాధారణంగా వారి ఉత్పత్తులు లాభ నష్టాలకు సంబంధించినదిగా భావిస్తాం. కానీ నాబార్డ్ అధ్యయనం ప్రకారం కింది అంశాలు పరిగణనలోకి తీసుకుంటాం.
1) రుతుపవన వ్యత్యాసాలు, జిల్లాలోని ప్రధాన పంటల ఉత్పత్తి, అధిక వర్షపాతం, కరువు, సీజన్, ఉష్ణోగ్రత, నేలలోని తేమ వంటి పరిమితులను గురించి పొందుపరచవచ్చు. నీటి పారుదల వ్యవసాయం కింద ఉన్న ప్రాంతం, భూగర్భ జలాల లోతు, ఊహించని మంచు రైతుల ఆర్థిక స్థితిని నిర్దేశిస్తాయి.
2) రిమోట్ సెన్సింగ్ వ్యవసాయ వాతావరణ కేంద్రాలు, మొబైల్ ఫోన్లు, కృత్రిమ మేధ ద్వారా లబ్ధిదారుల జాబితాను రూపొందించవచ్చు.
బి.పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ
ఏమర్స్ విల్
9030925817
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?