Home
Competitive Exams
Economy – Group I Special | సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రైతుల ఆదాయం పెంచే అంశాలు
Economy – Group I Special | సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు రైతుల ఆదాయం పెంచే అంశాలు
1.శ్రామిక వయస్సు గల జనాభాలో అక్షరాస్యత స్థాయిలను వివరించండి? విద్యారంగ నాణ్యతను మెరుగుపర్చడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వివరించండి?
- ఆర్టికల్ 45 పిల్లలకు 14 సంవత్సరాల వరకు రాజ్యాంగం అమలు నుంచి 10 సంవత్సరాల వ్యవధిలో ఉచిత, నిర్బంధ విద్యను అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని నిర్దేశిస్తుంది. మానవ వనరుల అభివృద్ధిలో విద్య ప్రాముఖ్యత పోషిస్తుంది. అక్షరాస్యత, విద్య, శిక్షణ ఇవి మూడు కూడా మానవ మూలధన అభివృద్ధికి సాధనాలు. పనిలో పాల్గొనే రేటు, మనుషుల ఉత్పాదక రేటును పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
శ్రామిక వయస్సు గల జనాభాలో అక్షరాస్యత స్థాయిలు
1) 1961లో తెలంగాణలో అక్షరాస్యత శాతం 17.3 % మాత్రమే. ప్రస్తుతం అది 166.5 శాతానికి పెరిగింది.
2) కానీ, రాష్ట్రంలో పనిచేసే జానాభా సుమారుగా 2.39 కోట్లు ఉంటే అందులో 34 % శాతం మంది నిరక్షరాస్యులు. ఇది ఆందోళనకరమైంది.
3) విద్యావంతులైన పని చేసే వారి జనాభాలో 7 % మంది ప్రైమరీ లెవల్ వరకు, సుమారు 29 మంది సెకండరీ స్థాయి వరకు, 10 శాతం మంది ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు.
4) తెలంగాణలో విద్యాస్థాయిలు ఈ విధంగా ఉన్నాయి.
a. ప్రాథమిక విద్య 7% b. సెకండరీ విద్య 29%
c. మాధ్యమిక విద్య 10% d. డిగ్రీ స్థాయి 14%
e. పోస్టు గ్రాడ్యుయేషన్, అంతకంటే ఎక్కువ 4%
f. డిప్లొమా/ పాలిటెక్నిక్ / ఐఐటీ 2%
5) పని చేసే జనాభాలో చదివిన వారు లేదా చదువును ఇంకా కొనసాగించే వారు సుమారుగా 20 % ఉన్నారు.
6) రాష్ట్రంలో పని చేసే వయస్సు గల జనాభాలో కేవలం 1 శాతానికి మాత్రమే పాలిటెక్నిక్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిప్లొమా ఉంది. - విద్యా ఫలితాలను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు
1) ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రధాన పథకమైన ‘మన ఊరు మన బడి/ మన బస్తీ మన బడి’ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
2) విద్యార్థులకు క్లాస్‌రూంలోనే కాకుండా ది స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ (ఎస్ఐఈటీ) డిజిటల్ పాఠాలను టీ-శాట్, డీడీ యాదాద్రి చానళ్లలో ప్రసారం చేస్తుంది. ఈ పాఠాలు 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడతాయి. 85% విద్యార్థులు ఈ డిజిటల్ పాఠాలను చూశారు.
3) బడుగుబలహీన వర్గాల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు. ఉదా: టీఆర్ఈఐఎస్, టీఎస్‌డబ్ల్యూ, ఆర్ఈఐఎస్, కేజీబీవీ.
4) అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థులకు చేయూతనివ్వడం. ఉదా: ప్రీ, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్
5) వయోజన విద్య కోసం పఢ్నా లిఖ్నా అభియాన్
6) టాస్క్ (తెలంగాణ అకడమిక్ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్) - యువ జనాభాలో నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వ సంస్థలు, ఇండస్ట్రీస్, విద్యా సంస్థల మధ్య సమన్వయాన్ని సృష్టించడం కోసం తెలంగాణ ప్రభుత్వం 2014లో టీఏఎస్కే (టాస్క్)ను స్థాపించింది. ప్రజలకు నైపుణ్యాభివృద్ధి సంస్థలను అందుబాటులోకి తీసుకురావడానికి, ప్రభుత్వం వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, సిరిసిల్లలో ఐదు ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పై చర్యలు ప్రస్తుత తరాన్ని నైపుణ్యం కలిగిన, సమర్థమైన భవిష్యత్ శ్రామికశక్తిగా మార్చడంలో, వారి సంపాదన సామర్థ్యాలను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విద్యలో పెట్టుబడి పెట్టడం ద్వారా తరతరాల నుంచి వస్తున్న పేదరికాన్ని తగ్గించవచ్చు.
2. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్న ప్రాధాన్య అంశాలు ఏమిటి?
- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ‘4పి’ సిద్ధాంతాన్ని తీసుకురావాలని మార్గ నిర్దేశం చేశారు.
- 4పి అంటే P = Political Leaders, P = Parliam ent, P = Policies, P = Press అనే నాలుగు అంశాలను సకారాత్మకంగా ముందుకు తీసుకురావాలి. ముఖ్యంగా ఇటీవల యువకులు, వ్యాపారులు వ్యవసాయ రంగం వైపు దృష్టి సారిస్తున్నారు.
- Mohan Kanda రచించిన ‘Agriculture in India Contemporary Challenges in the context of Doubling Farmers Income’ అనే పుస్తకం ఇటీవల వచ్చింది. దీనిలో సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. India’s Farmer Agriculture Coop Dept Secretaryగా సేవలందించారు.
ప్రాధాన్య అంశాలు: 1) విద్యావంతులైన గ్రామీణ యువకులను సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన వ్యవసాయ రంగం వైపు మళ్లించాలి.
2) ప్రజలను ఆకర్షించే ఆహార పదార్థాలు, పంటలు తీసుకురావాలి.
3) Land to Lab Scheme: ఈ పథకం ద్వారా దేశంలోని 636 కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు యూనివర్సిటీల్లో పరిశోధనలు చేస్తున్నారు. వీటిని రైతుల వద్దకు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. డీడీ కిసాన్ లాంటి టెలివిజన్ చానల్ ద్వారా కూడా అవగాహన కల్పించాలి.
4) ఉత్పాదకతను పెంచడానికి నూతన వంగడాలను పరిశోధనల ద్వారా సృష్టించాలి. ఫసల్ బీమా యోజన ద్వారా వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చిన నష్టాలను అధిగమించవచ్చు. ఎగుమతులు చేసే విధంగా ప్రపంచ దేశాల అవసరాలకు అనుగుణంగా వారి అవసరాలకు తగినట్లు పంటలు పండించాలి.
5) వ్యవసాయ వ్యాపారవేత్తలుగా రైతులు మారాలి.
6) అశోక్ దల్వాయ్ వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. NSSO అధ్యయనం ప్రకారం 2002-03, 2012-13 మధ్య కాలంలో ఆదాయం 11.8 % పెరిగింది. ఆదాయం రెట్టింపయ్యింది. కానీ కనీస ఆదాయం పెరుగుదల కంటే, వాస్తవిక ఆదాయం పెరగాలి. అందుకు ప్రణాళికలు రూపొందించాలి.
7) రంగారెడ్డి జిల్లాలో మామిడిపండ్ల తోటల పెంపకం, దేశంలో పప్పుధాన్యాలు (కందుల) పండించడంలో స్వయం సమృద్ధి సా ధించాం. కాబట్టి ఇలాంటివి ప్రతి జిల్లాలో కూడా కేంద్రం సూచించిన విధంగా ఒక జిల్లా – ఒక ఉత్పత్తి‘ One District One Product Scheme పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలి.
8) ఉద్యాన తోటలు లాంటి అనుబంధ రంగాలను అభివృద్ధి చేయాలి.
9) E-NAM వంటి అంతర్జాల వ్యాపార కొనుగోలు కేంద్రాల ద్వారా MSP కనీస మద్దతు ధరతో రైతులు ధాన్యాలను ఎక్కువ ధరలకు అమ్ముకోవచ్చు.
3. జస్ట్ ట్రాన్షిషన్ ఇనీషియేటివ్ అంటే ఏమిటి?
- ఇంటర్నేషనల్ ఇంటర్ గవర్నమెంటల్ ఇనీషియేటివ్ కమిటీ అనేది UNO పర్యావరణ అభివృద్ధి పథకంలో భాగంగా ఉంటుంది. కెన్యా జస్ట్ ట్రాన్షిషన్ ఇనీషియేటివ్’ను పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ పొల్యూషన్ సమగ్రంగా నిర్మూలించడానికి ముందడుగు వేస్తూ ప్రారంభించినది. ఇందుకు కెన్యాతో పాటు దక్షిణాఫ్రికా, అంతర్జాతీయ వ్యర్థాల సేకరణ సంఘం (Pickers సంఘం) సమన్వయంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు.
- ఈ సమావేశంలో కింది విషయాలు చర్చించారు.
1) ప్రతి సంవత్సరం 460 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను ప్రజలు వినియోగిస్తున్నారు.
2) దీన్ని నియంత్రించకపోతే 2060 నాటికల్లా 3 రెట్లు (460X3) పెరిగే అవకాశం ఉంది.
3) UNEP అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం 14 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ పర్యావరణంలో ప్రవేశించి ఆక్వాటిక్ వ్యవస్థను కలుషితం చేస్తుంది.
4) గ్రీన్హౌస్ వాయువులుగా ప్లాస్టిక్ వల్ల 15% ఉద్గారాలను వెలువరిస్తే 2050 నాటికల్లా గ్లోబల్ వార్మింగ్ 1.50C వద్ద నిలకడగా ఉంటుంది.
సవాళ్లు: 1) ప్రజలందరూ భాగస్వామ్యం కాకపోవడం
2) ప్లాస్టిక్ నుంచి హరితం – పర్యావరణ హితంగా మార్పు తేవడానికి గల ఉద్యోగాలు సృష్టించలేకవడం.
3) ఆర్థిక వనరులు కొరవడటం.
4) సరైన చట్టాలు లేకపోవడం, వాటిని అమలు చేయకపోవడం.
ప్రాముఖ్యం: 1) ప్లాస్టిక్ చెయిన్ ఉద్యోగాల్లో సంఘటిత, అసంఘటితంగా ఉన్న వారు వారి ప్రాథమిక హక్కుగా తీసుకొని కలిసికట్టుగా కృషిచేయాలి.
2) ఇంకా మంచి, విలువైన పనులు/ఉద్యోగాలు ప్రత్యామ్నాయంగా సృష్టించుకోవచ్చ. వీరికి ఇతర నైపుణ్య శిక్షణలు అందించాలి.
3) 2022 ఫిబ్రవరిలో UNEA (United Nations Enviroment Assembly) చారిత్రక నిర్ణయం ద్వారా, చట్ట పరంగా 2024 వరకు ప్లాస్టిక్‌ను నిషేధించడానికి కట్టుబడి ఉండాలని ప్రపంచ దేశాలను ఆదేశించింది.
4. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల వల్ల పర్యావరణ స్థిరత్వం ఎలా సాధించబడుతుంది? లేదా సుస్థిరాభివృద్ధిలో పర్యావరణంతో పాటు ఆర్థిక, సామాజిక స్థిరత్వం కూడా అవసరం. వివరించండి?
- ప్రస్తుతం చేస్తున్న ఆర్థిక కార్యకలాపాల వల్ల భవిష్యత్తు తరాల వారికి నష్టం వాటిల్లకుండా ఉండటమే
సుస్థిరాభివృద్ధి. - పర్యావరణ స్థిరత్వం కోసం తీసుకున్న చర్యలు
1) ఇసుక తవ్వకాల నిషేధం చేపట్టడం
2) పారిస్ కాప్-20 సదస్సులో హరిత వాయు ఉద్గారాలను (GHG) తగ్గించాలని లక్ష్యం
3) 1992 Kyoto Protocol లో కూడా హరితవాయు ఉద్గారాలను తగ్గించాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు.
4) Earth Summit 1992 ‘UNFCC’ Framework on Climate Change వాతావరణ మార్పులపై ఒక నియమావళి రూపొందించింది. బ్రంట్‌ల్యాండ్ కమిషన్
5) Rio+10 = 2002 జొహాన్నెస్‌బర్గ్ సౌతాఫ్రికాలో జరిగిన సదస్సులో లక్ష్యాల గురించి చర్చించుకున్నారు.
6) 1971, ఫిబ్రవరి 2న ఇరాన్‌లోని Ramsarలో నిర్వహించిన సమావేశంలో చిత్తడి నేలల సంరక్షణ గురించి చర్చించారు.
7) జాతీయ ఉద్యానాలు పెంచుతున్నారు.
8) బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్‌లను గుర్తించి జీవ వైవిధ్య పరిరక్షణ చేస్తున్నారు.
ఆర్థిక – సామాజిక స్థిరత్వం: 1) సామాజిక స్థిరత్వం కోసం గిరిజనులకు అటవీ హక్కులు కల్పించడం, అటవీ హక్కుల చట్టం- 2006 ద్వారా గిరిజనులకు అడవులపై వారి ఆవాసాల్లో ఆర్థిక స్థిరత్వం కల్పించినట్లయింది.
2) పెరుగుతున్న జనాభా వల్ల వనరుల తలసరి వినియోగం కూడా పెరుగుతుంది.
3) స్థిరమైన నగరాలను రూపొందించడానికి UN Habitat Agenda ఆవాసాల ప్రణాళిక రూపొందించింది.
4) శిలాజ ఇంధన వనరులపై ఆధారపడటం తగ్గించారు.
ఉదా: పెట్రోలియంలో 10% ఇథనాల్‌ను కలుపుతున్నారు. భవిష్యత్తులో 20% కలపాలని లక్ష్యం పెట్టుకున్నారు.
5) తెలంగాణలో ఎలక్ట్రానిక్ వెహికల్ పాలసీ (EV Policy)ని రూపొందించి అనేక రాయితీలను ప్రకటించారు. 2020 ద్వారా అనేక రాయితీలు ఇచ్చి ప్రజలను ప్రోత్సహించారు.
6) గ్రీన్ హైడ్రోజన్ ఇంధనాలను తయారు చేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు. - 2070 వరకు Net Zero Emissions సౌర ఆధారిత ఇంధనాలు మాత్రమే వినియోగించాలని నిర్దేశించారు.
7) తెలంగాణ-ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రా (కె) గ్రామ పంచాయతీ కార్యాలయంలో ‘సోలార్ ఫలకలు’ ఏర్పాటు చేశారు.
8) ఆర్థిక స్థిరత్వం, అసమానతలను తగ్గించడానికి, ఉపాధి హామీ పథకాల ద్వారా కనీస ఉపాధిని అందించి అసమానతలను తగ్గిస్తున్నారు. - వ్యర్థాల నుంచి శక్తి వనరులను ఉత్పత్తి చేసి ఆర్థిక ఉపాధిని పెంచుతున్నారు.
5. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్-ఎస్డీజీ)ను సాధించడానికి, సమర్థవంతంగా స్థానికీకరించడానికి ఒక యంత్రాంగం అవసరం వివరించండి?
- స్థానికీకరించడం: ఎస్డీజీ లక్ష్యాలను అమలు చేయడానికి రచించడం, అమలు చేయడం పర్యవేక్షించడం అనే ప్రక్రియను ఎస్డీజీ లక్ష్యాల స్థానికీకరణ అంటారు.
- Bottom Up Approach కింది స్థాయి ప్రాంతం నుంచి – రాష్ర్టాలు – దేశం – ప్రపంచం. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ లక్ష్యాలను సాధించవచ్చు. దీనికోసం వాతావరణ మార్పులపై చర్యలు తీసుకున్నారు.
చర్యలు: 1) కాప్-21 పారిస్ ఒప్పందంలో భాగంగా GHG ఉద్గారాలను తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
2) Kyoto Protocol 1997, 11వ నదస్సులో కూడా పర్యావరణ పరిరక్షణ గురించి చర్చించారు.
3) ఉష్ణోగ్రతలను పారిశ్రామిక పూర్వ స్థాయి 20C కంటే తక్కువగా ఉంచడం ఉష్ణోగ్రత పెరుగుదలను 1.50C వరకు మాత్రమే పరిమితం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
4) పారిస్ ఒప్పందం ప్రకారం ‘ఉద్దేశించిన, జాతీయంగా నిర్ణయించిన విరాళాల ద్వారా రాబోయే సంవత్సరాల్లో పర్యావరణాన్ని పరిరక్షించాలి.
5) భారతదేశం – ఉద్గారాల తీవ్రతను 33-35 శాతానికి తగ్గించాలని లక్ష్యం పెట్టుకున్నారు (2030 నాటికి).
6) Green Climate Fund ద్వారా 2030/- నాటికి శిలాజ రహిత ఇంధనాల ద్వారా 40% విద్యుత్ శక్తి స్థాపిత సామర్థ్యాన్ని పెంచడం కోసం పునరుత్పాదక ఇంధనాలు వాడుతున్నారు. ఉదా: TS REDCO ద్వారా సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.
7) 2030 నాటికి అడవులు, చెట్లను పెంచడం ద్వారా 2.5 నుంచి 3 బిలియన్ టన్నుల CO2ను స్థిరీకరించడం లక్ష్యంగా పెట్టుకున్నాం.
8. 2020-21లో నీతి ఆయోగ్-ఎస్డీజీ రిపోర్ట్ ప్రకారం లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాం.
సవాళ్లు: 1) పరిమిత వనరుల సవాళ్లు: గ్రామాల స్థాయిలో స్వయం సహాయక బృందాలను సమ్మిళితం చేయడంలో, పరిపాలనా నిర్వహణలో లోపాలు కనిపిస్తున్నాయి.
2) పంచాయతీ రాజ్ సంస్థలు, స్వయం సహాయక బృందాలను సమన్వయం చేస్తూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.
3) గ్రామీణ బ్యాంకింగ్ సౌకర్యాల కొరత వల్ల ఆర్థిక సమ్మిళితత్వం సాధించలేకపోతున్నాం.
4) దేశంలో 3.1 మిలియన్ల మహిళలు సర్పంచ్‌లుగా ఎన్నికయ్యారు. వీరికి శిక్షణ ఇవ్వవలసి ఉంది. ఎస్డీజీ స్థానికీకరణం కోసం వీరిని గ్రామాలస్థాయిలో అనుభవం నుంచి నేర్చుకోవడం, తమిళనాడు, కేరళ, కర్ణాటక, AP, TSలలో పేదరికాన్ని తగ్గించడంలో మిగితా రాష్ర్టాల కంటే మెరుగ్గా ఉన్నాం. క్షేత్రస్థాయి పర్యటనలకు అధికారులను కూడా పంపాలి. ఈ విధంగా సమర్థవంతంగా వీటిని అమలు చేయడం వల్ల ఎస్డీజీ లక్ష్యాలను పరోక్షంగా సాధించవచ్చు.
బి. పురుషోత్తం రెడ్డి
ఫ్యాకల్టీ,
లా ఎక్సలెన్స్
ఐఏఎస్ అకాడమీ
9030925817
Previous article
English Grammar | What have you been doing there?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?