Group-1 Prelims | నేటి నుంచి గ్రూప్-1 హాల్‌టికెట్లు.. పాతవి చెల్లవు.. మళ్లీ ఫ్రెష్‌గా డౌన్లోడ్ చేయాల్సిందే !
Group-1 Prelims | హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లను ఆదివారం నుంచి https://www. tspsc.gov. in వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని టీఎస్పీఎస్సీ ( TSPSC ) సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. గతంలో రద్దయిన పరీక్ష హాల్‌టికెట్లు చెల్లవని స్పష్టం చేశారు. వెబ్సైట్లో నమూనా ఓఎంఆర్ షీట్ అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలని సూచించారు.
పరీక్షకు మరో వారం గడు వు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణ, ఏర్పాట్లపై టీఎస్పీఎస్సీ ము మ్మర కసరత్తును ప్రారంభించింది. ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతోపాటు ఎగ్జామ్ సూపరింటెండెంట్లతో కమిషన్ అధికారులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్, హైదరాబాద్‌తోపాటు ప్రధాన నగరాల్లో ట్రాఫి క్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతఅక్టోబర్ 16న ప్రిలిమినరీ నిర్వహించగా, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం తో కమిషన్ పరీక్షను రద్దు చేసింది. తిరిగి జూన్ 11న ఉదయం 10.30 గంటల నుంచి మ ధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష నిర్వహిస్తామని పకటించింది. కాగా, 503 గ్రూప్1 పోస్టులకు మొత్తం 3,80,202 దరఖాస్తు లొచ్చాయి.
పరీక్షాకేంద్రాల ర్యాండమైజేషన్
గత అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను 1,040 సెంటర్లలో నిర్వహించారు. ఈ సారి ఆ సెంటర్లలోని అభ్యర్థులను ర్యాండమైజేషన్ చేయాలని భావిస్తున్నది. గతంలో కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో కొన్నింటిని మార్చాలని యోచిస్తున్నది. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించే విషయంలో పకడ్బందీగా ఉండాలని నిర్ణయించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?