సర్వదా శతథా సిద్ధం
విపత్తులు- నిర్వహణ
# ప్రపంచ భూభౌతిక పరిస్థితులు, అధిక జనాభా వల్ల ప్రపంచంలో విపత్తులకు ఎక్కువగా గురయ్యే దేశాల్లో భారత్ ఒకటి.
# తుఫానులు, భూకంపాలు, కరువు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో, వివిధ తీవ్రతలతో సంభవిస్తుంటాయి.
# పీఠభూమిలో, హిమాలయాల్లో భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. గంగా, బ్రహ్మపుత్ర మైదానంలో వరదలు తరచూ సంభవిస్తూ ఉంటాయి. పశ్చిమాన రాజస్థాన్, దక్షిణ భారతదేశంలో రాయలసీమ ప్రాంతాలు తీవ్ర కరువుకు గురవుతుంటాయి.
# అనేకరకాల ప్రమాదాలకు మనం ఎంతో కొంత ప్రభావితమయ్యే ముప్పు ఉంది. ఒక ప్రాంతంలో ఉంటున్న ప్రజలు ఒక్కటికంటే ఎక్కువ ప్రమాదాలకు గురికావచ్చు.
# భారతదేశంలో తూర్పు, ఆగ్నేయ ప్రాంతాలు తరచూ తుఫానులకు గురవుతూ ఉంటుంది.
ఉదా: కోస్తా ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తరచూ వరదలు, తుఫానులకు గురికావచ్చు. ఇలాంటి ప్రాంతాలను బళ ప్రమాదాల ప్రాంతం అంటారు.
# ఈ విపత్తులను ఎదుర్కోవడానికి ప్రజలు సంసిద్ధంగా లేనప్పుడు దానివల్ల జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఉదా: వరద సంభవించినప్పుడు అది ప్రమాదమవుతుంది. దాన్ని ఎదుర్కోవడానికి ప్రజలు సిద్ధంగా లేకపోతే ఇండ్లు, పశువులు, మనుషులు కొట్టుకుపోతారు. అప్పుడు వరద విపత్తు అవుతుంది.
విపత్తులు- రకాలు
# విపత్తులు ఏర్పడటానికి కారణాలను బట్టి, సంభవించే వేగాన్ని బట్టి వాటిని అనేక రకాలుగా విభజించవచ్చు.
# సంభవించే వేగాన్ని బట్టి నిధానంగా వచ్చే, వేగంగా వచ్చే విపత్తులని రెండు రకాలుగా విభజించవచ్చు.
ఎ. నిదానంగా సంభవించే విపత్తులు: అనేక రోజులు, నెలలు, ఒక్కొక్కసారి సంవత్సరాల పాటు సంభవించే కరువు, పర్యావరణ క్షీణత, చీడపురుగుల తాకిడి,కీటకం వంటివి నిదానంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.
బి. వేగంగా సంభవించే విపత్తులు: తృటికాలంలో సంభవించే విపత్తు దిగ్భ్రాంతికి గురుచేస్తుంది. ఇలాంటి విపత్తుల ప్రభావం కొద్దికాలం ఉండవచ్చు. లేదా ఎక్కువ రోజులు ఉండవచ్చు. భూకంపాలు, తుఫాను, ఆకస్మిక వరదలు, అగ్నిపర్వతాలు బద్దలవడం వంటి వేగంగా సంభవించే విపత్తులకు ఉదాహరణలు.
# కారణాలను బట్టి ప్రకృతి/సహజ, మానవ నిర్మిత విపత్తులను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి..
i. ప్రకృతి విపత్తులు: ప్రకృతిసిద్ధ కారణాల వల్ల ఇలాంటి విపత్తులు ఏర్పడి మానవ, భౌతిక, ఆర్థిక, పర్యావరణ నష్టాలకు దారితీస్తాయి.
ఉదా: విపత్తులలో రకాలు- భూకంపాలు, తుఫానులు, వరదలు, కరువు, సునామీ, కొండచరియలు విరిగిపడటం, అగ్నిపర్వతాలు మొదలైనవి.
ii. మానవ నిర్మిత విపత్తులు: మానవ తప్పిదాల కారణంగా సంభవించే విపత్తుల వల్ల సాధారణ జీవితం అస్తవ్యస్తమవుతుంది.
ఉదా: 1984 భోపాల్ గ్యాస్ విషాదం, 1997లో ఢిల్లీలో ఉపహార్ సినిమా హాలులో అగ్నిప్రమాదం, 2002లో రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన ఘటన, 2003 కుంభకోణం (తమిళనాడు)లో పాఠశాల అగ్నిప్రమాదం, 2008 జైపూర్‌లో వరుస పేలుళ్లు ఇలా చాలావరకు ఉన్నాయి.
# విపత్తుల నిర్వహణ: విపత్తులపై (అత్యవసర పరిస్థితులు) నియంత్రణ సాధించడం, విపత్తుల ప్రభావాన్ని నివారించడానికి, తగ్గించడానికి లేదా వాటినుంచి కోలుకోవడానికి దోహదం చేసే విధానాలను అందించే దానిని విపత్తుల నిర్వహణ అంటారు.
# ఈ కార్యక్రమాలు సంసిద్ధతకు, తీవ్రతను తగ్గించడానికి, అత్యవసర స్పందనకు, సహాయానికి, కోలుకోవడానికి (పునర్నిర్మాణం, పునరావాసం) సంబంధించినవి కావచ్చు.
# తల్లిదండ్రులు, ఇతర ప్రజలకు అవగాహన కల్పించడంలో విద్యార్థుల ముఖ్యపాత్ర పోషించవచ్చు. ఈ విషయంలో విద్యార్థులకు మార్గదర్శనం చేయడానికి ఉపాధ్యాయులకు గురుతరమైన బాధ్యత ఉంది.
విపత్తుల నిర్వహణ దశలు
# వైపరీత్యం: 1977 నవంబర్ 15న ఆంధ్రప్రదేశ్‌ను పెనుతుఫాన్ తాకింది. 200 కి.మీ. మించిన వేగంతో గాలులు వీచాయి. పదివేలకు పైగా ప్రజలు చనిపోయారు. 50వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. పెద్దసంఖ్యలో ప్రజలు, ప్రత్యేకించి చేపలు పట్టేవాళ్లు తమ ఉపాధి కోల్పోయారు. మొత్తంగా భారీ నష్టం సంభవించింది. ఈ తుఫానువల్ల 90,37,400 మంది ప్రభావితమయ్యారు.
# అత్యవసర స్పందన, సహాయం: తుఫాను సంభవించిన వెంటనే ప్రభావితమైన ప్రజలకు ప్రభుత్వం, సామాన్య ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తున్నాయి. ప్రమాదంలో ఉన్న వాళ్లను కాపాడటం, ఆహారం, వసతి, బట్టలు, మందులు అందించడం అత్యవసర సహాయం.
# పునరావాసం పునర్నిర్మాణం: తక్షణ సహాయం తర్వాత ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల వంటివి ఇండ్ల నిర్మాణం, రోడ్లు, వంతెనల నిర్మాణం, విద్యుత్, ప్రసార సాధనాల పునరుద్ధరణ వంటివి పునర్నిర్మాణం, పునరావాస పనులను చేపట్టడం. జీవనోపాధిలో మద్దతు వంటి ఆర్థిక సహాయం కూడా ఇందులో భాగమే.
# సంసిద్ధత: విపత్తు సంభవించిన తర్వాత ఇటువంటి సందర్భాలలో ప్రజలను సంసిద్ధులను చేయడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ప్రాధాన్యం ఇస్తాయి. గ్రామవైపరీత్య యాజమాన్య బృందాలను ఏర్పాటుచేసి వాటికి శిక్షణ ఇస్తారు.
# నష్టనివారణ: నష్టనివారణ చర్యలను సమర్థ్ధంగా అమలు చేయడం, తగిన సంసిద్ధతల వల్ల వైపరీత్యాల ప్రతికూల ప్రభావాలను గణనీయంగా తగ్గించవచ్చు.
# 1990లో ఆంధ్రప్రదేశ్‌ను మరో పెను తుఫాను తాకింది. దీని తీవ్రత 1977 తుఫాన్ కంటే ఎక్కువగా ఉన్నా, ఎక్కువ జనాభా ఉన్నా నివారణ, సంసిద్ధత చర్యలు సమర్థంగా చేపట్టడంతో ప్రభావిత ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉంది.
# కరువు: ఇది వర్షపాత లోపంవల్ల ఏర్పడే ప్రకృతి వైపరీత్యం.
# ఒక ప్రాంతంలో సాధారణంగా పడవలసినంతగా వర్షం పడకపోతే దాన్ని ‘వాతావరణ కరువు’ అంటారు.
# ఒక సంవత్సరంలో వర్షం సాధారణంగానే ఉండవచ్చు. కానీ రెండు వానల మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండి, వర్షాధార పంటలు దెబ్బతినవచ్చు. దీన్ని ‘వ్యవసాయ కరువు’ అంటారు.
# ఎంత వర్షం అన్నదే కాకుండా, ఎప్పుడెప్పుడు పడిందన్నది కూడా ముఖ్యమవుతుంది. అధిక లేదా తక్కువ వర్షపాతం అనేది (70-100 ఏండ్లు) సగటు సాధారణ వర్షపాతంలో పోల్చి చెబుతారు.
# అధిక: సగటు వర్షపాతం కంటే ఎక్కువ లేదా 20 శాతం
# సాధారణ: సగటు వర్షపాతం కంటే 19 శాతం ఎక్కువ నుంచి 19 శాతం తక్కువ వరకు.
# తక్కువ: సగటు వర్షపాతం కంటే 20 శాతం-59 శాతం తక్కువ వరకు.
# బాగా తక్కువ: సగటు వర్షపాతం కంటే 60 శాతం తక్కువ.
# కొన్ని ప్రాంతాల్లో అవి ఉన్న భౌగోళిక స్థితుల వల్ల తక్కువ వర్షపాతం పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వీటిని ‘కరువు పీడిత’ ప్రాంతాలు అంటారు.
# ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఐదేండ్లలో రెండేండ్లు కరువు చోటుచేసుకునే అవకాశం ఉంది.
# కరువు ప్రభావం: కరువు ప్రభావం క్రమేణా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది.
# భూగర్భజల నీటిమట్టం పడిపోవడం, తాగునీటి కొరత, పంటల విస్తీర్ణం తగ్గడం, వ్యవసాయం కుంటుపడటంతో వ్యవసాయ రంగంలో ఉపాధి తగ్గిపోవడం.
# వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ప్రజల కొనుగోలుశక్తి పడిపోవడం.
ఆహార ధాన్యాల కొరత
# పశుగ్రాస కొరత, పశువులు చనిపోవడం.
# పోషకాహారలోపం, ప్రత్యేకించి చిన్నపిల్లల్లో అతిసారం, విరోచనాలు, కలరా వంటి రోగాలు, అనారోగ్యం విస్తరించ డం, ఆకలికి గురికావడంతో కంటిచూపులోపం ఏర్పడటం.
# భూమి, నగలు, ఆస్తుల వంటివి తప్పనిసరై తాకట్టు పెట్టడం లేదా అమ్మడం. పనికోసం వెతుక్కుంటూ ప్రజలు వలస వెళ్లడం
#వర్షపునీటి నిల్వ: పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పుపై పడే వర్షపునీటినంతా జాగ్రత్తగా నిలువచేయాలి. వాటిని ఇంకుడు గుంతల్లోకి మళ్లించడం అన్నిటికంటే తేలికైనపని. ప్రత్యేకించి కట్టిన ట్యాంకులు, సంపులలోకి వాననీటిని మళ్లించి రోజువారీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
# కొన్ని ప్రాంతాల్లో తేలికైన వడపోత విధానాలతో తాగడానికి అత్యంత శుద్ధమైన నీటిని పొందవచ్చు.
# వాటర్‌షెడ్ అభివృద్ధి: కరువు ప్రభావాలను తగ్గించడానికి ప్రభుత్వం కరువు పీడిత ప్రాంతాల్లో సమగ్ర వాటర్‌షెడ్ యాజమాన్య పథకాలను అమలుచేస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం ప్రజల్లో నైపుణ్యాలను పంపొందించి ప్రకృతి వనరులను సరిగా ఉపయోగించుకునేలా చేయడం, సామర్థ్యాన్ని బట్టి నేలను ఉపయోగించుకోవడం ద్వారా నేల, నీటి వనరులను అభిలషణీయంగా వినియోగించుకోవచ్చు. వాటి దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.
#కరువు తీవ్రతను అధికం చేసే పరిస్థితులు: ఒక ప్రదేశంలో మృత్తికల నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం తగ్గడం
# సరైన నీటి నిర్వహణా విధానం, వ్యవసాయ సౌకర్యాలు లేకపోవడం
# నేలక్రమక్షయం, భూగర్భజలాల్ని ఎక్కువగా వినియోగించడం
# పారిశ్రామికీకరణ వల్ల కాలుష్యకాలు జలవనరులలో చేరడం, గ్లోబల్ వార్మింగ్
# పట్టణీకరణ వల్ల వర్షపునీరు
కరువును ఎదుర్కోవడం
# ఒక్కసారిగా సంభవించే ప్రమాదంలా కాకుండా కరువు మెల్లగా సంభవిస్తుంది. కాబట్టి మనం దానికి సంసిద్ధంగా ఉండటానికి, ప్రతిస్పందించడానికి, దాని ప్రభావాన్ని తగ్గించడానికి తగినంత సమయం ఉంటుంది.
# పర్యవేక్షణ, ముందుజారీచేసే హెచ్చరికలతో అన్ని స్థాయిల్లో నిర్ణయాత్మక బాధ్యతలు ఉన్నవాళ్లు సకాలంలో స్పదించవచ్చు.
# కరువుకు గురయ్యే ప్రాంతాల్లో నీటి సంరక్షణ విధానాల వంటి అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక అధికారులు కృషి చేస్తున్నారు.
వాటర్‌షెడ్‌లో చేపట్టే పనులు
పొలాల్లో వాననీటి సంరక్షణ, అడవుల పెంపకం, తక్కువనీళ్లు అవసరమయ్యే చెట్లు, పంటలను ప్రోత్సహించడం, ప్రత్యామ్నాయ జీవనోపాధులు మొదలైనవి.
దేశంలోతరచూ దుర్భిక్షానికి గురయ్యే ప్రాంతాలు
రాజస్థాన్, దక్షిణ హర్యానా, దక్షిణ పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, బ్రోచ్ జిల్లా (గుజరాత్), మారట్వాడా,
విదర్భ జిల్లాలు (మహారాష్ట్ర), పురూలిమా జిల్లా (పశ్చిమబెంగాల్), కలహండి, బొలంగిరి జిల్లాలు
(ఒడిశా), రాయచూరు, బెల్గాం జిల్లాలు (కర్ణాటక), సేలం, తిరువవ్వేలి జిల్లాలు (తమిళనాడు)
జీఎన్ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
99663 30068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?