నేను చేయగలను !

ఇదే విజయానికి నాంది..
చక్కని ప్రదేశం ఎంచుకోవాలి. మీరు నిరాటకంగా మీ ఊహను కొనసాగించడానికి అనువైన ప్రదేశాన్ని ఎంచుకోవాలి. అక్కడ మీకు శబ్దాలు, మీ ఏకాంతాన్ని భంగ పరిచే అవరోధాలు ఉండకూడదు. ప్రశాంతమైన మనస్సుతో ఆ ప్రదేశంలో కూర్చోవాలి. శ్వాసక్రియ వ్యాయామంలో భాగంగా 10 సార్లు గాఢంగా ఊపిరి పీల్చి వదలాలి.
మంచి సంఘటనలు గుర్తుకుతెచ్చుకోండి
మీ గతానుభవాలను గుర్తుకుతెచ్చుకోవాలి. ఈ సంఘటనల్లో మీరు అద్భుతంగా ఒక పనిని పూర్తిచేసిన సంఘటనను ఎంచుకోవాలి. ఈ సంఘటన ఏదైనా కావచ్చు. మీలో అత్యంత ప్రతిభా సామర్థ్యాలను పదునుపెట్టి మీరు పనిలో చూపించిన సంఘటన అయి ఉండాలి. అది తలుచుకొన్నప్పుడల్లా అబ్బా! భలే చేశానే మీకు అనిపించి ఒళ్లంతా పులకరించిపోవాలి. అటువంటి సంఘటన అయి ఉండాలి. మీరు అద్భుతంగా రాసి నూటికి నూరు మార్కులు తెచ్చుకున్న ఫిజిక్స్ టెస్ట్ కావచ్చు. లేదా మీ కాలేజ్ ఫుట్‌బాల్ టీమ్‌కు మీరు కెప్టెన్‌గా ఉండి మీ జట్టును గెలిపించిన సంఘటన కావచ్చు. ఏదైనా సరే మీరు ఇప్పుడు దాన్ని గుర్తుకుతెచ్చుకోండి. ఈ థియేటర్లో మీరు ఒక్కరే కూర్చున్నారు. మీ ఎదురుగా వెండి తెర, ఆ తెరమీది ఆ దృశ్యం, ఆ అనుభవం మొదలైనప్పటినుంచి ప్రతి ఫ్రేమ్‌ను శ్రద్ధగా తిలకించండి. మీరు బర్త్‌డే పార్టీకి వెళ్లడం, అక్కడ జనం కోలాహలం, విద్యుద్దీపాల అలంకరణ, స్టీరియో మోత, స్నేహితుల అభినందనలు, మీ లవర్ మీకోసం వేయికళ్లతో చూడటం, మీరు కన్పించగానే మెరుపులు చిందించే కళ్లతో, అంతకన్నా ఎక్కువ మెరుపులు చిందిస్తూ పెదవులతో నవ్వుతూ మిమ్మల్ని ఆహ్వానించడం, మీరిచ్చిన కానుకలు చూసి అమితానందానికి గురవ్వడం……. వరుసగా తెరమీద వేసుకొని చూడండి. ఈ సంఘటనను మీరు నమ్ముతున్నారా ? ఇది ఎవరిదో కాదు మీదే, మీ అనుభవం లోనిదే.
ఈ మహత్తరమైన అనుభవానికి మీరు యోగ్యులైన వ్యక్తులే కదా.. ! అలా అనుకున్నప్పుడు మీకు విపరీతమైన బలం వచ్చినట్లు అన్పించ లేదా…? ఈ సంఘటన మీలో ఉత్సాహాన్ని నింపడం లేదా..? మీరు ఇంతకన్నా ఎక్కువ చేయగల సామర్థ్యాలున్న భావాన్ని కల్గించడం లేదా .. ? మళ్లీ మళ్లీ చూడండి. ఈ దృశ్యాన్ని చివరిదాకా శ్రద్ధగా చూడండి. మళ్లీ రివైండ్ చేయండి. అలా పదేపదే ఆ దృశ్యాన్ని చూడాలి. అలా చూస్తున్నప్పుడల్లా మీ హృదయంలో ఏర్పడే స్పందనలను మళ్లీ మళ్లీ ఎగ్జయిటింగ్‌గా ఫీలవ్వాలి. ఇలా చేస్తున్నప్పుడల్లా ప్రతిసారీ మీరు మీ మెదడులో ఒక రకమైన రసాయన స్రావాన్ని ఉత్తేజపరుస్తారు. అది మీ శరీరమంతటా వ్యాపిస్తుంది. మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా శక్తివంతుల్ని చేస్తుంది. ఈ టెక్నిక్‌ను స్టడీ చేస్తున్న ప్రతిసారీ అనుసరించడం మీలోని పాజిటివ్ స్వభావాలను ఈ టెక్నిక్ ద్విగుణీకృతం చేస్తుంది. మీరు మాత్రమే ఇలా చేయగలరు. మీరు మాత్రమే ఏదైనా చేయగలరు అనే భావాన్ని మీకు కలిగిస్తుంది. అవే ప్రతిభాసామర్థ్యాలు మీలో ప్రతిక్షణం అదే స్థాయిలో పనిచేస్తున్నట్లు ఊహించుకోవాలి.
Latest Updates
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు 4కు పెంపు
జోధ్‌పూర్ ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్ల పోస్టులు
పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో 32 ఖాళీ పోస్టుల భర్తీ
బీబీనగర్ ఎయిమ్స్‌లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Let’s play a game of cricket with numbers…
The Independence struggle
ఆర్టికల్ 39(f)ను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
పుట్టుకతోనే గుడ్డి, చెవిటి జీవులు ఏవి? ( బయాలజీ )
తనను తాను దున్నుకునే నేలలు?
జిలాబంది విధానాన్ని ప్రవేశ పెట్టినది ఎవరు