సైన్స్ విద్యార్థులకు వరం.. సీఏ
సీఏ లాంటి కామర్స్ కోర్సులకు రోజురోజుకు ఆదరణ పెరుగుతున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణలు, నోట్ల రద్దు, జీఎస్టీవల్ల సీఏలకు పెరిగిన ఉపాధి అవకాశాలు, సీఏ కోర్సు గురించి సమాజంలో, విద్యార్థుల్లో వచ్చిన అవగాహన దీనికి ప్రధాన కారణాలు. ఒకప్పటితో పోలిస్తే కామర్స్ ప్రొఫెషనల్స్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడటంతో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు కూడా ఈ కోర్సువైపు ఆకర్షితులవుతున్నారు. కోర్సుకు సంబంధించిన విషయాలు తెలుసుకుందాం..
-ఒకప్పుడు చాలామంది విద్యార్థులు సీఏ గురించి అవగాహన లేక 10వ తరగతి పూర్తవగానే ఎంపీసీ, బైపీసీ కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గుచూపేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ఎక్కువమంది విద్యార్థులు సీఏ కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. సీఏ చదవాలనుకునే విద్యార్థులు 10వ తరగతి తర్వాత ఇంటర్లో ఎం.ఈ.సీ తీసుకుంటే మంచిది. కొంతమంది ఇంటర్లో ఎంపీసీ చదివినా.. తర్వాత సీఏ కోర్సుల్లో చేరి విజయం సాధిస్తున్నారు. సీఏలో చేరితే నాలుగున్నర ఏండ్లలో కోర్సు పూర్తిచేసి.. చిన్న వయసులోనే మంచి ఉద్యోగాలు సాధించి సమాజంలో హోదా, గుర్తింపు పొందవచ్చు.
సీఏ కోర్సు గురించిన పూర్తి సమాచారం
-కోర్సు పేరు: చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ)
-నిర్వహణ సంస్థ: ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా- న్యూఢిల్లీ.
-కోర్సు వ్యవధి: నాలుగున్నరేండ్లు
-కోర్సులో దశలు-వ్యవధి: సీఏ ఫౌండేషన్ 6 నెలలు, సీఏ ఇంటర్ 8 నెలలు, సీఏ ఫైనల్ 3 ఏండ్లు (ప్రాక్టికల్ ట్రెయినింగ్తో కలిపి) ఉంటాయి.
-ఐసీఐటీఎస్ఎస్ (ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ స్కిల్స్): 180 గంటలు (ఓరియంటేషన్ + టెక్నాలజీ)
-రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు: సీఏ ఫౌండేషన్ రూ. 9,200, సీఏ ఇంటర్ రూ. 18,000, ప్రాక్టికల్ ట్రెయినింగ్ రూ. 1,000, సీఏ ఫైనల్ రూ. 22,000
-పరీక్షలు: ప్రతి ఏడాది మే, నవంబర్ నెలల్లో జరుగుతాయి.
-పరీక్ష తీరు: సీఏ ఫౌండేషన్ ఆబ్జెక్టివ్-డిస్క్రిప్టివ్ విధానం లో, ఇంటర్, సీఏ ఫైనల్ పరీక్షలు డిస్క్రిప్టివ్ విధానం లో ఉంటాయి.
ఉద్యోగ అవకాశాలు
-సొంతంగా ప్రాక్టీస్ పెట్టవచ్చు. అంతర్జాతీయ సంస్థల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో, ఐటీ కంపెనీల్లో మంచిమంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు.
సీఏలో మొదటి దశ: సీఏ ఫౌండేషన్
-ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు సీఏ ఫౌండేషన్ కోర్సులో పేరు నమోదు చేసుకోవాలి. ప్రిన్సిపుల్స్ & ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్, బిజినెస్ లాస్, బిజినెస్ కరస్పాండెన్స్ & రిపోర్టింగ్ అనే మొదటి రెండు పేపర్లకు డిస్క్రిప్టివ్ పద్ధతిలో, బిజినెస్ మ్యాథమెటిక్స్ లాజికల్ రీజినింగ్, స్టాటిస్టిక్స్, బిజినెస్ ఎకనామిక్స్, బిజినెస్ & కమర్షియల్ నాలెడ్జ్ పేపర్లకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు సాధిస్తూ నాలుగు సబ్జెక్టులు కలిపి 50 శాతానికిపైగా అంటే 200 మార్కులు సాధించాలి. సీఏ ఫౌండేషన్ పూర్తిచేసిన విద్యార్థులు 8 నెలల తర్వాత సీఏ ఇంటర్ పరీక్ష రాయాలి. డిగ్రీ, పీజీ పూర్తిచేసినవారు సీఏ ఫౌండేషన్ చదవాల్సిన అవసరం లేదు. వీరు నేరుగా సీఏ ఇంటర్లో ప్రవేశం పొందడానికి ICAI అవకాశం కల్పిస్తున్నది. విద్యార్థులు ఏ గ్రూప్ వారైనా ఇంటర్ తర్వాత తొమ్మది నెలల లోపు సీఏ ఫౌండేషన్ పరీక్ష రాస్తారు.
రెండో దశ: సీఏ ఇంటర్
-సీఏ ఇంటర్ రెండు గ్రూపులుగా ఉంటుంది. గ్రూప్-1, 2లోని ఒక్కో సబ్జెక్టులో 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. ఒక్కో గ్రూప్ సబ్జెక్టుల మొత్తం మార్కుల్లో 50 శాతం మార్కులు సాధించాలి. విద్యార్థి వీలునుబట్టి రెండు గ్రూపు లు ఒకేసారి లేదా విడివిడిగా ఒక్కో గ్రూపు ఆరు నెలల వ్యత్యాసంతో రాయవచ్చు. ఆ తర్వాత సీఏ ఇన్స్టిట్యూట్ నిర్వహించే ఐసీఐటీఎస్ఎస్ 180 గంటల కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి.
ఆర్టికల్‌షిప్ (ప్రాక్టికల్ ట్రెయినింగ్)
-సీఏ ఇంటర్ పూర్తిచేసినవారు ఒక ప్రాక్టీసింగ్ సీఏ వద్దగానీ, ఆడిట్ సంస్థలోగానీ మూడేండ్లపాటు ఆర్టికల్‌షిప్ చేయాలి.
-పాత విధానం ప్రకారం సీఏ-ఐపీసీసీ రెండు గ్రూపులుగా పూర్తిచేసినవారికి లేదా సీఏ-ఐపీసీసీలోని మొదటి గ్రూపు పూర్తిచేసినవారికి ప్రాక్టికల్ ట్రెయినింగ్ (ఆర్టికల్‌షిప్) చేయడానికి అర్హత లభించేది కాదు. కానీ నూతన విధానం ప్రకారం సీఏ ఇంటర్లో రెండు గ్రూపులు లేదా ఏదైనా ఒక గ్రూపు పూర్తిచేసిన వారికి ఆర్టికల్‌షిప్ పొందడానికి అర్హత కల్పించారు. ఇది సీఏ విద్యార్థులకు కలిసొచ్చే అంశం.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ సమయంలోనే ఒక ఏడాది ఆర్టికల్షి ప్ ముగిశాక సీఏ ఫైనల్ పరీక్ష రాసేలోగా సీఏ ఇన్స్టిట్యూట్ వారి నాలుగు వారాల ఏఐసీఐటీఎస్‌ఎస్ (అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & సాఫ్ట్ స్కిల్స్) శిక్షణ తీసుకోవాలి.
-ప్రాక్టికల్ ట్రెయినింగ్ పొందుతున్న ప్రాంతాన్నిబట్టి 2000 నుంచి 7000 వరకు స్టయిఫండ్ లభించే అవకాశం ఉంది.
-రెండున్నరేండ్ల ప్రాక్టికల్ ట్రెయినింగ్ పూర్తిచేసినవారు సీఏ ఫైనల్ పరీక్ష రాయడానికి అర్హులు.
మూడో దశ: సీఏ ఫైనల్
-సీఏ ఫైనల్ సబ్జెక్టులు కూడా రెండు గ్రూపులుగా (గ్రూప్-1, 2) విభజించబడి ఉంటాయి. ప్రతి ఏడాది మే, నవంబర్ నెలల్లో సీఏ ఫైనల్ పరీక్షలు జరుగుతాయి. రెండు గ్రూపుల్లోని ఒక్కో సబ్జెక్టులో 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 మార్కులు సాధించాలి. రెండు గ్రూపుల్లోని అన్ని సబ్జెక్టుల మొత్తం మార్కుల్లో 50 శాతం మార్కులు రావాలి.
ఎంబైపీసీతోనూ సీఏ సీపీటీ టాపర్
సీఏ-సీపీటీ ఫలితాల్లో 195 మార్కులతో ఆలిండియా టాపర్‌గా నిలిచా డు తంగుడు హేమంత్‌కుమార్. ఇంటర్లో ఎంబైసీసీ చదివినప్పటికీ సీఏ కావాలన్న లక్ష్యంతో సీఏ కోర్సులో చేరాడు. పట్టుదలతో చదివి విజేత అయ్యాడు. హేమంత్‌కుమార్ విజయ రహస్యా లు ఆయన మాటల్లోనే…
-మాది ఒడిశాలోని రామగఢ్ జిల్లా బుడారి గ్రామం. నాన్న నీలకంఠరావు, అమ్మ శ్రీలక్ష్మి. నాన్నకు కిరణాషాపు ఉన్నది. ఇంటర్లో ఎంబైపీసీ కోర్సు చేశాను. ఆ తర్వాత సీఏ చదివితే జీవితంలో త్వరగా స్థిరపడొచ్చని సీనియర్స్ ద్వారా తెలుసుకున్నా. కానీ నేను సీఏ చదవడం ఇంట్లో వాళ్లకు ఇష్టంలేదు. అయితే వారిని ఒప్పిం చి సీఏ కోర్సులో చేరాను.
-అకౌంట్స్, ఎకనమిక్స్ తెలియని సబ్జెక్టులు. మొద ట్లో కొంచెం కష్టంగా అనిపించింది. రోజులు గడిచేకొద్ది నాపై నాకు ఆత్మవిశ్వాసం పెరిగింది. ఒక్కొక్క పరీక్ష రాసేకొద్ది కచ్చితంగా సీఏ కాగలనన్న నమ్మకం వచ్చిం ది.
ప్రణాళికాబద్దంగా సాధన
-ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదలకాగానే సీపీటీ కోచింగ్‌కు చేరాను. దీంతో నాకు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమ యం దొరికింది.
-సీపీటీలో చేరిన మొదటి రోజు నుంచి లెక్చరర్స్ చెప్పే కాన్సెప్ట్‌లను శ్రద్ధగా వినేవాడిని. వారు చెప్పే సబ్జెక్టు మెళకువలు, ఉదాహరణలు నోట్ చేసుకునే వాడిని. ఇవి రివిజన్లో బాగా ఉపయోగపడ్డాయి.
-మా ఇన్స్టిట్యూట్ వారు అందించిన మెటీరియల్‌తోపాటు ICAI వారి మెటీరియల్ కూడా చదివేవాడిని.
-ICAI వారి టెస్టు పేపర్లు, మా కళాశాల వారు అందిం చే రివిజన్ టెస్టు పేపర్లు బాగా ప్రాక్టీస్ చేసేవాడిని.
-దాదాపు 10 మాక్ టెస్టులు రాశాను. దీనివల్ల సమయపాలనతోపాటు పరీక్ష భయాన్ని జయించాను.
సీఏ ఫౌండేషన్ సన్నద్ధతకు సలహాలు, సూచనలు
-10వ తరగతి పూర్తికాగానే ఇంటర్ ఎంఈసీతోపాటు సీఏ ఫౌండేషన్‌కు సన్నద్దమవడం మంచిది. దీనివల్ల సమయం కలిసి రావడమే కాకుండా అకౌంట్స్, ఎకనమిక్స్, కామర్స్ లాంటి సబ్జెక్టులపై మరింత పట్టు సాధించవచ్చు.
-ఒక ప్రణాళిక ప్రకారం చదివితే సీపీటీ పరీక్ష పాస్ కావడం పెద్ద కష్టమేమీ కాదు.
-ప్రాబ్లమాటిక్ పేపర్లలో ఏదైనా ముఖ్యమైనదని అనిపిస్తే మీ మెటీరియల్‌లో లేదా నోట్‌బుక్‌లో హైలైట్ చేసుకోండి. MCQలకు సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నను ఒకటికి రెండుసార్లు చదవడం మంచిది.
-ఒక డౌట్స్ బుక్ పెట్టుకోండి. మీకు వచ్చిన డౌట్స్ అన్నింటిని ఆ పుస్తకంలో రాయండి. ఏదైనా ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉంటే అక్కడి ఫ్యాకల్టీని అడిగి డౌట్స్‌ను క్లారిఫై చేసుకోండి లేదా మీరు సొంతంగా ప్రిపేర్ అవుతుంటే.. చదివిన టెస్టుబుక్స్ లేదా స్టడీ మెటీరియల్ చూసుకుని డౌట్స్‌ను క్లారిఫై చేసుకోండి.
సీఏ ఫౌండేషన్- సబ్జెక్టులు, మార్కులు
-పేపర్-1- ప్రిన్సిపుల్స్ & ప్రాక్టీస్ ఆఫ్ అకౌంటింగ్
-పేపర్-2- బిజినెస్ లాస్ (60 మా.), బిజినెస్ కరస్పాండెన్స్ & రిపోర్టింగ్ (40 మా.)
-పేపర్-3- బిజినెస్ మ్యాథమెటిక్స్ (40 మా.), లాజికల్ రీజనింగ్ (20 మా.), స్టాటిస్టిక్స్ (40 మా.)
-పేపర్-4- బిజినెస్ ఎకనమిక్స్ (60 మా.), బిజినెస్ అండ్ కమర్షియల్ నాలెడ్జ్ (40 మా.)
-ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పరీక్షను 3 గంటల్లో రాయాలి.
సీఏ ఇంటర్ – సబ్జెక్టులు, మార్కులు
గ్రూప్-1
-పేపర్-1- అకౌంటింగ్
-పేపర్-2- కార్పొరేట్ లాస్ (60 మా.), అదర్ లాస్ (40 మా.)
-పేపర్-3- కాస్ట్ & మేనేజ్మెంట్ అకౌంటింగ్
-పేపర్-4- టాక్సేషన్ – ఇన్‌కం టాక్స్ (60 మా.), ఇన్‌డైరెక్ట్ టాక్స్ (40 మా.)
గ్రూప్-2
-పేపర్-5- అడ్వాన్స్డ్ అకౌంటింగ్
-పేపర్-6- ఆడిటింగ్ & ఎస్యురెన్స్
-పేపర్-7- ఎంటర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (50 మా.), స్ట్రాటెజిక్ మేనేజ్మెంట్ (50 మా.)
-పేపర్-8- ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ (60 మా.), ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ (40 మా.)
-ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పరీక్షను 3 గంటల్లో పూర్తిచేయాలి.
సీఏ ఫైనల్ – సబ్జెక్టులు, మార్కులు
గ్రూప్-1
-పేపర్-1- ఫైనాన్షియల్ రిపోర్టింగ్
-పేపర్-2- స్ట్రాటెజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్
-పేపర్-3- అడ్వాన్స్డ్ ఆడిటింగ్ & ప్రొఫెషనల్ ఎథిక్స్
-పేపర్-4- కార్పొరేట్ లాస్, ఎకనామిక్ లాస్
గ్రూప్-2
-పేపర్-5- స్ట్రాటెజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ & పర్ఫార్మెన్స్ ఎవల్యూషన్
-పేపర్-6- ఎలక్టీవ్ పేపర్ (100 మా.). ఇందులో రిస్క్ మేనేజ్మెంట్, ఎకనామిక్ లాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్ & క్యాపిటల్ మార్కెట్స్, గ్లోబల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్, మల్టీ డిసిప్లీనరీ కేస్ స్టడీ
-పేపర్-7- డైరెక్ట్ టాక్స్ లాస్ (70 మా.), ఇంటర్నేషనల్ టాక్సేషన్ (30 మా.)
-పేపర్-8- ఇన్‌డైరెక్ట్ టాక్స్ లాస్- గూడ్స్ & సర్వీస్ టాక్స్ (75 మా.), కస్టమ్స్ & ఎఫ్టీపీ (25 మా.)
-ప్రతి పేపర్ 100 మార్కులకు ఉంటుంది. పరీక్షను 3 గంటల్లో రాయాలి.
- Tags
- nipuna special
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?