‘ఆర్మ్డ్’ మహిళా డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం ప్రకటన విడుదలైంది.
కోర్సులు: బీఎస్సీ (ఎంపీసీ), బీఏ (హెచ్ఈపీ). ఈ కోర్సులు ఇంగ్లిష్ మీడియంలో నిర్వహిస్తారు.
సీట్ల సంఖ్య: 240. ఒక్కో కోర్సుకు 120. ప్రతి కోర్సుకు మూడు సెక్షన్లు ఉన్నాయి. ఒక్కో సెక్షన్లో 40 సీట్లు.
ప్రత్యేకతలు: డిగ్రీ కోర్సుతోపాటు మిలిటరీ సంబంధిత అంశాలను ప్రధానంగా బోధిస్తారు.
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్ మీడియంలో చదివినవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు: 2021, జూలై 1 నాటికి 16 ఏండ్ల్లు నిండి ఉండాలి. ఎత్తు కనీసం 152 సెం.మీ ఉండాలి. కుటుంబ వార్షికాదాయం నగరాల్లో రూ.2,00,000, పట్టణాల్లో రూ.1,50,000 లోపు ఉండాలి.
ఎంపిక విధానం: ఎంట్రన్స్ టెస్టు, ఫిజికల్ అండ్ మెడికల్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఎంట్రన్స్ టెస్టు: ఈ పరీక్షలో 100 ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నలన్నీ ఇంటర్ స్థాయిలోనే ఉంటాయి.
ఒక్కో ప్రశ్నకు 1 మార్కు చొప్పున మొత్తం మార్కులు 100.
మల్టిపుల్ చాయిస్, ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు ఇస్తారు.
ఫిజికల్ టెస్టు: దీనిలో 100 మీటర్ల స్ప్రింట్, 400 మీటర్ల పరుగు, సిటప్స్, షటిల్ రేస్, అబ్స్టాకిల్ టెస్టు ఉంటాయి.
సైకో అనలిటికల్ టెస్టులు: దీనిలో టీఏటీ, డబ్ల్యూఏటీ, ఎస్ఆర్టీ ఉంటాయి.
మెడికల్ టెస్టు: దీనిలో నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్నాయా లేవా అని పరీక్షస్తారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.100
చివరితేదీ: మే 31
వెబ్సైట్: www.tswreis.in
ఆర్జేసీ&ఆర్డీసీ సెట్-2021
హైదరాబాద్‌లోని మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలో మొత్తం 134 రెసిడెన్షియల్ కాలేజీలున్నాయి.వీటిలో బాలురకు 66, బాలికలకు 68 కాలేజీలు ఉన్నాయి.
గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
డిగ్రీ కోర్సులు
కోర్సులు: బీఎస్సీ (ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్, బీజడ్సీ, బీబీసీ, డేటా సైన్స్), బీఏ (హెచ్ఈపీ, హెచ్‌పీఈ), బీకాం (జనరల్, కంప్యూటర్స్, బిజినెస్ అనలిటిక్స్)
అర్హతలు: ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయనున్న బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: ఆర్జేసీ&ఆర్డీసీ సెట్ – 2021లో సాధించిన స్కోరు, రిజర్వేషన్ నియమాల ప్రకారం అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ప్రవేశ పరీక్షలో ఇంటర్ ప్రవేశానికి పదోతరగతి స్థాయిలో, డిగ్రీ ప్రవేశానికి ఇంటర్ స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.
దరఖాస్తు: ఆన్లైన్లో n దరఖాస్తు ఫీజు: రూ.200
చివరితేదీ: మే 31
ఆర్జేసీ & ఆర్డీసీ సెట్ తేదీ: జూన్ 13
వెబ్సైట్: http://mjptbcwreis.telangana.gov.in
ఢిల్లీ ఎన్ఎల్యూలో
న్యూఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ కింది లా కోర్సుల్లో ప్రవేశాల కోసం ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు: డిగ్రీ (ఆనర్స్), పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్స్
ఎంపిక: ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా
పరీక్ష విధానం
పరీక్షలో 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
మొత్తం మార్కులు 150.
పరీక్ష సమయం గంటన్నర. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) కోర్సుకు నిర్వహించే టెస్ట్‌లో ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్ (కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్), లీగల్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాల నుంచి ఒక్కోదానిలో 35 ప్రశ్నలు, ఎలిమెంటరీ మ్యాథ్స్ (న్యూమరికల్ ఎబిలిటీ) నుంచి 10 ప్రశ్నలు ఇస్తారు.
ఎల్ఎల్ఎం కోర్సుకు క్రిమినల్ లా, కాన్స్టిట్యూషనల్ లా, లా ఆఫ్ కాంటాక్ట్, జ్యూరిస్ప్రుడెన్స్, లా ఆఫ్ టార్ట్, ఇంటర్నేషనల్ లా తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
పీహెచ్డీ కోర్సుకు సంబందించిన టెస్ట్‌లో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు.
సీట్ల వివరాలు
బీఏ, ఎల్ఎల్బీ (ఆనర్స్)
సీట్లు: 120
కోర్సు వ్యవధి: ఐదేండ్లు
అర్హతలు: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ / పన్నెండో తరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ సెకండియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీహెచ్డీ సీట్లు: 15
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎల్ఎల్ఎం/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
ఎల్ఎల్ఎం సీట్లు: 80
కోర్సు వ్యవధి: ఏడాది
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఎల్ఎల్బీ / తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులు అర్హులు. చివరి సంవత్సర పరీక్షలు రాసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 30
ఎంట్రన్స్ టెస్ట్ తేదీ: జూన్ 20
వెబ్సైట్: nludelhi.ac.in
- Tags
- Education News
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు