‘భాషాభిరుచి’ లక్ష్యానికి సంబంధంలేని స్పష్టీకరణ?
గతవారం తరువాయి..
- వ్యవస్థాపక నిధి, అంశ విశ్లేషణ, సంబంధాల విశ్లేషణ, విధానాల విశ్లేషణ అనే స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి?
1) సంశ్లేషణ 2) విశ్లేషణ
3) వినియోగం 4) అవగాహన - అమూర్త సంబంధాల స్థాపన, ప్రణాళిక రూపకల్పన, విలక్షణ వ్యక్తీకరణను రూపొందించడం అనేవి ఏ లక్ష్యానికి చెందినవి?
1) సంశ్లేషణ 2) విశ్లేషణ
3) వినియోగం 4) అవగాహన - ఆంతరిక సాక్ష్యాల ఆధారంగా మూల్యాంకనం, బాహ్యకారణాల ఆధారంగా తీర్పును ఇవ్వడం అనేవి బ్లూమ్స్ జ్ఞానాత్మకరంగంలో ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణలు?
1) వినియోగం 2) విశ్లేషణ
3) సంశ్లేషణ 4) మూల్యాంకనం - క్రాత్హాల్, అండర్సన్ల మలి వర్గీకరణలో జ్ఞానాత్మకరంగంలోని ‘జ్ఞప్తి, గుర్తించడం’ అనేవి ఏ లక్ష్యానికి చెందినవి?
1) ధారణలో ఉండటం
2) అవగాహన చేసుకోవడం
3) సృష్టించడం 4) విలువకట్టడం - ఉదహరించడం, వర్గీకరించడం, పోల్చడం, అన్వయించడం, అనుమితి మొదలైనవి భాగమైన బోధన లక్ష్యం? (టీజీటీ 2018)
1) అవగాహన 2) వినియోగం
3) అభిరుచి 4) అనుభూతి - అవగాహనకు స్పష్టీకరణలు? (టీజీటీ 2017)
1) వివరించడం, విమర్శించడం
2) వివరించడం, అన్వయించడం
3) విమర్శించడం, పరిశీలించడం
4) విమర్శించడం, వేరుచేయడం - ‘సాధారణీకరించడం’ అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందినవి? (పీజీటీ 2017)
1) అభిరుచి 2) అవగాహన
3) వినియోగం 4) అనువాదం - ‘వినియోగించడం’నకు సంబంధించిన స్పష్టీకరణలు?
1) వేరుచేయడం, నిర్వహించడం
2) నిర్వహించడం, అమలుచేయడం
3) పరిశీలించడం, అమలుచేయడం
4) ఉత్పాదించడం, అమలుచేయడం - వేరుచేయడం, వ్యవస్థీకరించడం, కారణాలను చూపించడం, ఆరోపించడం మొదలైనవి భాగమైన బోధన లక్ష్యం?
1) సృజించడం 2) విలువకట్టడం 3) విశ్లేషించడం 4) వినియోగించడం - క్రాత్హాల్, అండర్సన్ల ప్రకారం ‘విలువకట్టడం’లోని స్పష్టీకరణలు?
1) ఉత్పాదించడం, విమర్శించడం
2) పరిశీలించడం, ఉత్పాదించడం
3) ఆరోపించడం, పరిశీలించడం
4) పరిశీలించడం, విమర్శించడం - ‘సృజించడం’ అనే బోధనాలక్ష్యంలోని స్పష్టీకరణలు?
1) ఉత్పాదించడం, ప్రణాళిక రూపకల్పన చేయడం
2) గ్రహించడం, ప్రతిస్పందిచండం
3) ఉత్పాదించడం, విమర్శించడం
4) ఆరోపించడం, పరిశీలించడం - ‘అనుకరణ-> అనువర్తన-> నియంత్రణ-> సమన్వయం-> సహజీకరణం’ అనే లక్ష్యాలక్రమం భాగమైన రంగం? (టీజీటీ 2018)
1) సృజనాత్మక రంగం
2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) కల్పనారంగం - యాంత్రిక (మెకానికల్), అనువర్తిత (మ్యానిపులేటివ్) నైపుణ్యాలకు సంబంధించిన రంగం? (డీఎస్సీ 2014)
1) భావావేశ రంగం 2) జ్ఞానాత్మక రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) సృజనాత్మక రంగం - ‘శ్రీకృష్ణ రాయబారం’ పాఠం చెబుతూ ఉపాధ్యాయుడు ఆ అంశానికి ముందు కథను (నేపథ్యం) విద్యార్థులకు వివరించడం? (పీజీటీ 2018)
1) సముచిత వైఖరి 2) సాహిత్య జ్ఞానం
3) భాషాజ్ఞానం 4) విషయజ్ఞానం - ‘బాల్యక్రీడలు’ అనే పాఠ్యబోధన ఆరంభించిన ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలు ఆడుకునే కొన్ని ఆటల గురించి వారికి వివరిస్తాడు. ఈ జ్ఞానం? (ఎస్జీటీ 2019)
1) విషయజ్ఞానం 2) భాషాజ్ఞానం
3) సాహిత్యజ్ఞానం 4) తత్వజ్ఞానం - ‘గజేంద్ర మోక్ష’ పాఠ్యభాగాన్ని బోధించేటప్పుడు విద్యార్థులకు శ్రీమదాంధ్ర మహాభాగవత గ్రంథాన్ని ఉపాధ్యాయుడు చూపించి ఆ ఘట్టాన్ని పరిచయం చేస్తే ఆ గ్రంథాన్ని ఏమని పిలుస్తారు? (పీజీటీ 2017)
1) విమర్శనా గ్రంథం 2) పురాణ గ్రంథం
3) మూలగ్రంథం 4) పరామర్శ గ్రంథం - ప్రస్తుత పాఠ్యభాగాన్ని బోధించడానికి ముందు, తత్పూర్వగాథను క్లుప్తంగా ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలియజేయడం ఏ జ్ఞాన లక్ష్య శాఖ పరిధిలోకి వస్తుంది? (పీజీటీ 2017)
1) భాషాజ్ఞానం 2) సాహిత్యజ్ఞానం
3) లోకజ్ఞానం 4) విషయ జ్ఞానం - రచనాశైలి, ఛందస్సు, అలంకారాలు, ప్రక్రియా పరిచయం మొదలైనవాటిని బోధించడం ఏ జ్ఞాన లక్ష్యశాఖకు చెందుతుంది? (పీజీటీ 2017)
1) సంగీత జ్ఞానం 2) సాహిత్య జ్ఞానం
3) విషయ జ్ఞానం 4) భాషాజ్ఞానం - పాఠ్యభాగంలోని ప్రకృతి, వికృతులు, వ్యుత్పత్త్యర్థాలు, జాతీయాలు, సామెతలు మొదలైనవాటిని బోధించడం జ్ఞాన లక్ష్యసాధనలో ఏ శాఖకు వర్తిస్తుంది? (పీజీటీ 2017)
1) విషయ జ్ఞానం 2) విశేషాంశ జ్ఞానం
3) సాహిత్య జ్ఞానం 4) భాషాజ్ఞానం - కవి జీవితాదులు, పూర్వ పర గాథలు ఏ బోధన లక్ష్యశాఖకు చెందుతాయి? (ఎస్ఏ 2018)
1) భాషాజ్ఞానం 2) విషయ జ్ఞానం
3) సాహిత్య జ్ఞానం 4) లోకజ్ఞానం - ‘పరిచిత/అపరిచిత పద్య, గద్య పాఠ్యభాగాలకు సరైన శీర్షికలను సూచించడం’ అనే స్పష్టీకరణ ఏ బోధన లక్ష్యానికి చెందినది? (పీజీటీ 2017)
1) అభిరుచి 2) జ్ఞానం
3) అవగాహన 4) రసానుభూతి - విద్యార్థులు సవర్ణదీర్ఘ సంధి, అత్వ సంధి మధ్యగల ‘పోలికలు, భేదాలను గ్రహించడం’ ఏ బోధనా లక్ష్యం? (పీజీటీ 2017)
1) జ్ఞానం 2) భాషాభిరుచి
3) అవగాహన 4) వైఖరులు - మూర్తిమత్వ లక్షణాలను అభివృద్ధి చేయడం ఏ రంగంలోని ముఖ్య విద్యాలక్ష్యం?
1) జ్ఞానాత్మక రంగం 2) భావావేశ రంగం
3) మానసిక చలనాత్మక రంగం
4) సృజనాత్మక రంగం - ‘అవగాహన’ లక్ష్యానికి సంబంధించి సరికాని స్పష్టీకరణ?
1) పదాలు, వాక్యాలకు అర్థాలు చెప్పగలుగుతారు
2) సారాంశాన్ని గ్రహిస్తారు, శీర్షికను సూచిస్తారు
3) ధ్వన్యర్థాలను గ్రహించడం, తన్మయత్వం పొందడం
4) దోషాలను గుర్తించి సరిచేస్తారు, సొంతంగా ఉదాహరణలు ఇస్తారు - ‘కవి/రచయిత అభిప్రాయాలను సంక్షిప్తంగా వివరిస్తారు’ అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినవి?
1) జ్ఞానం 2) అవగాహన
3) వాగ్రూపవ్యక్తీకరణ 4) వైఖరి - వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్యం లక్ష్యానికి సంబంధించిన సరికాని/సంబంధంలేని స్పష్టీకరణ?
1) విద్యార్థులు భావాలు, వాక్యాలను స్పష్టంగా ప్రకటిస్తారు
2) సరైన హావభావాలతో, నాటకీయంగా తమ భావాలను వ్యక్తం చేస్తారు
3) సభాకంపం లేకుండా, ఆకర్షణీయంగా, ఉచ్ఛారణ దోషరహితంగా మాట్లాడుతారు
4) పదాలను వివిధ భాషాభాగాలుగా విభజించగలుగుతారు - ‘సరైన వాక్య నిర్మాణం చేస్తారు’ అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది?
1) జ్ఞానం 2) భాషాభిరుచి
3) వాగ్రూప వ్యక్తీకరణ
4) లిఖితరూప వ్యక్తీకరణ - ‘లిఖితరూప వ్యక్తీకరణ నైపుణ్యం’ లక్ష్యానికి సంబంధించిన సరికాని/సంబంధంలేని స్పష్టీకరణను గుర్తించండి?
1) అప్రస్తుత విషయాలు ఉండేలా రాయడం
2) వ్యాకరణ దోషాలు లేకుండా రాయడం
3) వర్ణక్రమ దోషాలు లేకుండా రాయడం
4) చక్కని చేతిరాతతో, చదివినవారికి సులభంగా అర్థమయ్యేరీతిలో రాస్తారు - ‘విద్యార్థి సాహిత్య రచనల్లో విమర్శణాత్మక దృక్పథం కలిగి ఉంటాడు’ ఏ స్పష్టీకరణ లక్ష్యం? (ఎస్జీటీ 2019)
1) సముచిత మనోవైఖరులు
2) సృజనాత్మక శక్తి
3) లిఖితరూప వ్యక్తీకరణ
4) భాషాభిరుచి (భాషాభివృద్ధి) - ‘అవధానం కలిగించడానికి మనకు నిరంతరం తోడ్పడే మానసిక ప్రక్రియ అభిరుచి’ అన్నది? (టెట్ 2018)
1) రాస్ 2) బ్లూమ్స్
3) బీఎన్ ఝా 4) ఆర్హెచ్ దవే - ‘సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరిస్తారు’ అనేది ఏ బోధనా లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? (పీజీటీ 2017)
1) భాషాంతరీకరణ
2) సముచితమనోవైఖరులు
3) అభివ్యక్తీకరణ
4) భాషాసాహిత్యాభిరుచి - ‘మనసును ఒకదానివైపు ఆకర్షించేది అభిరుచి’ అని అన్నవారు?
1) డేవిడ్ ఆర్ క్రాత్హాల్
2) ఆర్హెచ్ దవే
3) బీఎన్ ఝా 4) రాస్ - ‘భాషాభిరుచి’ లక్ష్యానికి సంబంధంలేని స్పష్టీకరణను గుర్తించండి?
1) వక్తృత్వ, రచనల పోటీల్లో పాల్గొంటారు
2) కవి సమ్మేళనాల్లో పాల్గొంటారు
3) సందర్భోచితంగా గ్రంథకర్తల రచనలను ప్రమాణంగా ఉదహరిస్తారు
4) సాహిత్య రచలను విమర్శనాత్మక దృష్టితో చదవరు - ‘భాషాభిరుచి’ అనే లక్ష్యానికి సంబంధంలేని స్పష్టీకరణను గుర్తించండి?
1) రచనల్లోని రస భేదాలను గ్రహిస్తారు
2) విస్తార గ్రంథపఠనం చేస్తారు
3) సాహిత్య ప్రసంగాల్లో పాల్గొంటారు
4) ఉత్తమ పద్యాలను ధారణ చేసి పఠిస్తారు - ‘సాహిత్య రచనలు చేయడం, సాహిత్య రచనలను విమర్శణాత్మక దృష్టితో చదవడం’ అనే స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి?
1) జ్ఞానం 2) రసానుభూతి 3) భాషాభిరుచి 4) ప్రశంస - ‘రసానుభూతి’ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ కానిది గుర్తించండి?
1) విస్తార గ్రంథ పఠనం చేస్తారు
2) ధ్వన్యర్థాలను గ్రహిస్తారు
3) అలంకారాల విశిష్టతను తెలుసుకొంటారు
4) రచనల్లోని రసభేదాలను గ్రహిస్తారు - శైలీ భేదాలను పరికించడం, పాత్రౌచిత్యాన్ని తెలుసుకోవడం, కావ్యాల్లోని రసవద్ఘట్టాలను చదివి ఆనందించడం’ అనే స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందినవి?
1) ప్రశంస 2) రసానుభూతి 3) సృజనాత్మకత 4 వైఖరి - ‘విద్యార్థి ధ్వన్యర్థం గ్రహిస్తాడు’ ఏ స్పష్టీకరణ లక్ష్యం? (పీజీటీ 2018)
1) సృజనాత్మక శక్తి
2) భాషాభివృద్ధి
3) సముచితమనోవైఖరి 4) రసానుభూతి - ‘విద్యార్థి రచనల్లోని శైలీ భేదాల్ని పరికిస్తాడు’ ఈ స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? (టెట్ 2018)
1) సృజనాత్మకత 2) శీలస్థాపనం
3) సముచితవైఖరి 4) రసానుభూతి - ‘రచయితల ఆత్మీయతను సూచించే సన్నివేశాలను గుర్తించడం, శైలీ భేదాలు, ధ్వన్యర్థాన్ని తెలుసుకోవడం’ అనే స్పష్టీకరణలు ఏ బోధనా లక్ష్య సంబంధితాలు? (పీజీటీ 2017)
1) రసానుభూతి 2) వైఖరులు
3) సంస్కృతి, సంప్రదాయాలు 4) జ్ఞానం - ‘విద్యార్థులు తన్మయులై కవిని, కవిత్వాన్ని ప్రశంసించి, పాత్రౌచిత్యాన్ని తెలుసుకోవడం’ అనే స్పష్టీకరణలు ఏ బోధనా లక్ష్యానికి చెందినవి? (పీజీటీ 2017)
1) మనోవైఖరులు 2) భాషాభిరుచి
3) రసానుభూతి 4) అభివ్యక్తీకరణ - ‘రచనల్లోని కాలభేద ప్రభావాన్ని తెలుపగల్గుట’ అనే స్పష్టీకరణ ఏ బోధనా లక్ష్యానికి చెందినది? (పీజీటీ 2017)
1) అభివ్యక్తీకరణ 2) సృజనాత్మకత
3) సంస్కృతి, సంప్రదాయాలు
4) మనోవైఖరులు - ‘వివిధ సాహితీప్రక్రియలు చదవడం ద్వారా ఆచార వ్యవహారాలను తెలుసుకొంటారు’ అనే స్పష్టీకరణ…?
1) జ్ఞాన లక్ష్యానికి చెందినది
2) అవగాహనా లక్ష్యానికి చెందినది
3) సంస్కృతి, సాంప్రదాయాలకు చెందినవి
4) రసానుభూతికి చెందినది - ‘సంస్కృతి, సాంప్రదాయాలు’ లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణ గుర్తించండి?
1) రచనల్లోని కాలభేద ప్రభావాన్ని తెలుపుతారు
2) ప్రాచీన సాహిత్యంలోని విశేషాలనుతెలుపుతారు
3) రచనల్లోని నీతిని గ్రహిస్తారు
4) సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనరు
లోక్నాథ్ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
- Tags
- Education News
Previous article
తెలంగాణలో రూసా గడ్డి ఎక్కువగా పండే జిల్లా?
Next article
కష్టపడితే బ్యాంక్ కొలువు మీదే!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు