భవిష్యత్తును ‘మేనేజ్’ చేసుకుందామిలా!
మేనేజ్మెంట్ అంటే ఒక ప్రణాళికను రూపుదిద్దడం, నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వం నిర్వహిస్తూ, ఉద్యోగులకు మార్గదర్శకత్వం వహిస్తూ హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్సియల్, ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్‌కి సంబంధించిన లక్ష్యాలను సాధిస్తూ ఒక సంస్థలో బాధ్యతలు నిర్వహించడం. చిన్నతరహా పరిశ్రమలు లేదా నేటి ప్రపంచీకరణలోని మల్టీనేషనల్ కంపెనీలు ఎక్కడైనా మేనేజర్ల అవసరం ఉంది. ప్రతి వ్యాపారవేత్తకు ఎప్పటికప్పుడు పెరుగుతున్న సంస్థలు నడపటానికి వందలాది నిర్వాహకులు కావాలి. కాబట్టి ఆపరేషన్స్/ ప్రాసెస్ టీమ్స్ & లీడర్షిప్ మధ్య వారధిగా పని చేయడానికి సరైన వ్యాపార పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు కలిగి ఉండటం చాలా అవసరం. ఈ అవసరం నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేటర్స్, మేనేజ్మెంట్ ఏరియా లో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి.
ఉద్యోగ రంగాలు
బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ)/ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) డిగ్రీ పూర్తిచేసిన వారికి బ్యాంకింగ్ & ఇన్సూరెన్స్, ఎయిర్ ట్రావెల్ మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఫైనాన్స్, ఫారిన్ ట్రేడ్ మార్కెటింగ్, అకౌంటింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, రిటైల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెల్త్‌కేర్ వంటి విభిన్న రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
ఉద్యోగావకాశాలు
మార్కెటింగ్ లేదా సేల్స్: మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. మార్కెట్ విశ్లేషణ, పరిశోధన లేదా మార్కెటింగ్ ప్రణాళిక వేయడం, మార్కెట్లో అస్థిరతను, క్లయింట్ లేదా కొనుగోలుదారుల అవసరాన్ని అర్థం చేసుకోగలగడం ఈ ఉద్యోగానికి అవసరం.
అడ్వర్టైజింగ్ & పీఆర్: ప్రతి వ్యాపారానికి ప్రకటనలు, పీఆర్ నిర్వహణ అవశ్యం. మార్కెటింగ్ టీమ్స్‌తో కలిసి పని చేయాలి, వారికి అనుగుణంగా అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ రచించాలి. కస్టమర్ రిలేషన్ మేనేజర్లు, పబ్లిక్ రిలేషన్స్ సిబ్బంది, పీఆర్ రచయితలు, కాపీ రైటర్లుగా ఉద్యోగాలు పొందవచ్చు.
హ్యూమన్ రిసోర్సెస్/ మానవ వనరులు: ప్రతి సంస్థకు పనిచేసే ఉద్యోగులు కావాలి. తమ సంస్థకు సరైన వ్యక్తులను ఎంచడం హెచ్ఆర్ పాత్ర. పీపుల్ స్కిల్స్ ఉన్నవారు ఈ పదవిలో రాణించగలరు.
ఆర్థిక విశ్లేషకుడు: ఒక సంస్థకు కొత్త అవకాశాలను గుర్తించడానికి, వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి క్లిష్టమైన విశ్లేషణ నైపుణ్యాలను ఉపయోగించి వీరు యాజమాన్యానికి సలహాలు ఇస్తారు. ఫైనాన్షియల్ అనలిస్ట్ కావడానికి, సాధారణ బీబీఏ డిగ్రీ లేదా ఫైనాన్స్ స్పెషలైజేషన్‌తో ఉన్న బీబీఏ డిగ్రీని ఎంచుకోవచ్చు. గణిత లేదా ఫైనాన్స్-సంబంధిత డిగ్రీ, ఎంబీఏ డిగ్రీ కూడా సహాయపడుతుంది.
ఆపరేషన్స్ నిర్వహణ: మంచి ఫలితాల కోసం వ్యాపారంలోని అన్ని కార్యకలాపాలను సమన్వయం చేయడం వీరి పని. ఆపరేషన్స్ మేనేజర్, బిజినెస్ కన్సల్టెంట్, బిజినెస్ అనలిస్ట్ వంటి అవకాశాలు ఉంటాయి.
ఇతర అవకాశాలు: సొంత వ్యాపారం లేదా కుటుంబ వ్యాపారం నిర్వహించవచ్చు. విద్యారంగంలో బాధ్యతలు నిర్వహించవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ చేయవచ్చు. సివిల్ సర్వీసెస్ వైపు ప్రయత్నించవచ్చు.
ఇంటర్ తరువాత రాసే పరీక్షలు
మేనేజ్మెంట్ కెరీర్ కావాలంటే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఎంబీఏ పరీక్షలు కూడా రాయవచ్చు. కానీ ఈ కెరీర్ పట్ల అభిరుచి ఉన్నవారు ముందునుంచే దీనికి సన్నద్ధం కావచ్చు. 12వ తరగతి తరువాత బీబీఏ ఎంట్రన్స్ పరీక్షలు రాసి ఈ రంగంలో రాణించడానికి మీ పయనం మొదలు పెట్టవచ్చు.
ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (ఐపీఎం)
బీబీఏ సాధారణంగా 3 సంవత్సరాల కోర్సు. కానీ ఐపీఎం 5 సంవత్సరాల ప్రోగ్రాం. ఐపీఎం చదవడం పూర్తయిన విద్యార్థులకు బ్యాచిలర్స్ పట్టాతో పాటు మాస్టర్స్ పట్టా కూడా ఇస్తారు. కొన్ని ఐపీఎం ప్రోగ్రాంలలో 3 సంవత్సరాల తర్వాత ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. అప్పుడు వారికి కేవలం బీబీఏ పట్టా మాత్రమే వస్తుంది.
ఐపీఎం- ఐఐఎం ఇండోర్ (మధ్యప్రదేశ్)
ఐపీఎం ప్రోగ్రాం ప్రారంభించిన ఐఐఎంలలో ఇండోర్ మొదటిది. అభ్యర్థుల ఎంపిక ఆప్టిట్యూడ్ టెస్ట్ (ఏటీ), పర్సనల్ అసెస్మెంట్ (పీఏ) ఆధారంగా ఉంటుంది. పీఏ అంటే వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా వీడియో బేస్డ్ అసెస్మెంట్ (వీబీఏ) ఉండవచ్చు. ఆప్టిట్యూడ్ టెస్ట్ 2 గంటల పరీక్ష. ఈ పరీక్షలో మూడు భాగాలు ఉన్నాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ. ఒక క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో జవాబు టైపు చేయాల్సి వస్తుంది. మిగిలిన సెక్షన్లలో మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ప్రతి విభాగానికి 40 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ ఉంది. అన్ని సెక్షన్లలో మార్కులు తెచ్చుకోవాలి. సెక్షన్ కటాఫ్ పరీక్ష తర్వాత నిర్ణయించబడుతుంది.
సుమారు 17,000కు పైగా విద్యార్థులు ఐపీఎం ఇండోర్ పరీక్ష రాస్తారు. 2020లో పరీక్ష రాసినవారిలో ప్రతి సెక్షన్ పాజిటివ్ మార్క్ వచ్చినవారు 8105, అందులో ప్రతి సెక్షన్లో మినిమం కటాఫ్ దాటిన వారు 982.
ఐపీఎం ప్రోగ్రాంలో ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మేనేజ్మెంట్ విభాగాల్లో గేమ్ థియరీ, మ్యాథమెటికల్ మోడలింగ్, ఎకనోమెట్రిక్స్ వంటి ఆసక్తికరమైన కోర్సులతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.
ఐపీఎం- ఐఐఎం రోహతక్ (హర్యానా)
ఐపీఎంలో మొదటి మూడేండ్లు ఫౌండేషన్ సబ్జెక్ట్స్ (మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, హ్యుమానిటీస్, స్టాటిస్టిక్స్) పై బోధన జరుగుతుంది. తర్వాత 2 సంవత్సరాలు మేనేజ్మెంట్ ప్రోగ్రాం మీద బోధన ఉంటుంది. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ ఆధారంగా 2 గంటల సమయంలో పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 3 సెక్షన్లు. ప్రతి సెక్షన్లో 40 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్ 40 నిమిషాల సమయంలో పూర్తిచేయాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
ఫైనల్ సెలక్షన్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూలో వచ్చిన స్కోర్, 10వ తరగతి, 12వ తరగతి మార్కులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయిస్తారు.
ఐపీఎం- ఐఐఎం రాంచీ (ఝార్ఖండ్): ఐఐఎం రాంచి 2021లో ఐపీఎం ప్రోగ్రాంని ప్రారంభిస్తుంది.
అడ్మిషన్ సెలక్షన్ ప్రాసెస్ రౌండ్-1: ఎస్ఏటీ (SAT ) / ఐసీఎంఏటీ 2021 (ఐఐఎం ఇండోర్)లో మార్కులను బట్టి ఉంటుంది. తగిన మార్కులు వచ్చినవారిని రౌండ్-2 పర్సనల్ ఇంటర్వ్యూ, రైటింగ్ అసెస్మెంట్కి పిలుస్తారు. 10వ తరగతి, 12వ తరగతి మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఐపీఎం- ఐఐఎం బోధ్‌గయ (బీహార్), ఐఐఎం జమ్ము: 2021లో ఐపీఎం ప్రోగ్రాంని ప్రారంభిస్తున్నాయి. అడ్మిషన్ సెలక్షన్ ప్రాసెస్ జిప్‌మ్యాట్ (JIPMAT) ఆధారంగా చేస్తారు. జిప్మ్యాట్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహిస్తుంది.
ఈ పరీక్ష 2 గంటల 30 నిమిషాల సమయంలో నిర్వహిస్తారు. ఇందులో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ అండ్ లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలుంటాయి. 10, 12వ తరగతి మార్కులు కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
l సింబయాసిస్ యూనివర్సిటీ- సెట్ జనరల్ పరీక్ష, నార్సిముంజి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ వారు ఎన్పీఏటీ (npat), ఢిల్లీ యూనివర్సిటీ బీబీఏ, బీఎంఎస్ అడ్మిషన్ కోసం డీయూజేఏటీ (DUJAT) పరీక్ష నిర్వహిస్తారు. క్రైస్ట్ యూనివర్సిటీ, మణిపాల్ యూనివర్సిటీ, ఐసీఎఫ్ఏఐ ఇలా ఇంకా ఎన్నో కళాశాలల్లో బీబీఏ కోర్సు ఉంది. ఇంటర్ లో వచ్చిన మార్కులను బట్టి కూడా కొన్ని కళాశాలలు అభ్యర్థులను ఎంచుకుంటాయి.
పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి?
వెర్బల్ ఎబిలిటీ విభాగంలో వొకాబులరీ, గ్రామర్, ప్యాసేజ్ బేస్డ్ జంబుల్డ్ సెంటెన్స్, పేరా కంప్లీషన్ వంటి ప్రశ్నలు ఉండవచ్చు. రోజు కొన్ని పదాలు నేర్చుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకుని, గ్రామర్ రూల్స్ అర్థం చేసుకుని, ఆంగ్ల భాషను రాసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఉపయోగించండి. పుస్తక పఠనం అలవర్చుకోవడం వల్ల పేరాగ్రాఫ్ బేస్డ్ ప్రశ్నలు బాగా చేయగలరు. అంతేకాదు మీరు చదివిన ఒక మంచి పుస్తకం గురించి చెప్పమని ఇంటర్వ్యూలో అడగవచ్చు.
క్వాంటిటేటివ్ సెక్షన్లో బాగా సాధన చేయాలి. 10వ తరగతి స్థాయి ప్రశ్నలు వచ్చినా, ఐఐఎం ఇండోర్ పరీక్షలో ప్రశ్నలు ఇంటర్లో నేర్చుకున్న మ్యాథమెటిక్స్ మీద కూడా ఆధారపడి ఉంటాయి.
లాజికల్ రీజనింగ్ సెక్షన్లో రాణించాలంటే క్రిటికల్ థింకింగ్‌ని అలవర్చుకోవాలి. అనలిటికల్ రీజనింగ్ ప్రశ్నలు, పజిల్స్ చేయాలి.
రైటింగ్ స్కిల్స్ మెరుగుపరుచుకోవాలి. కరెంట్ అఫైర్స్ పట్ల అవగాహన ఉంటే కొన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంటర్వ్యూలో ఏదైనా విషయం పై మీ అభిప్రాయం అడిగితే మీరు జవాబు చెప్పవచ్చు. ఉదాహరణకు గత సంవత్సరం ఒక ఐఐఎం ఇంటర్వ్యూలో కొవిడ్ వల్ల నష్టపోయిన ఏదైనా ఒక బిజినెస్‌ని పునరుద్ధరించడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? అని అడిగారు. ఇంటర్వ్యూలో రాణించాలంటే మీ రెజ్యూమే (బయోడేటా) పట్ల మీకు పూర్తి పట్టు ఉండాలి.
మాక్ ఎగ్జామ్స్: మాక్ ఎగ్జామ్స్ రాసి, మీ మార్కులు అనాలిసిస్ చేసుకోవాలి. మాక్ ఎగ్జామ్స్‌లో మీకు వచ్చిన మార్కులను బట్టి మీరు తగిన కళాశాలలో అడ్మిషన్ కోసం ప్రయత్నించవచ్చు.
ఈ పరీక్షల ఎలిజిబిలిటీ క్రైటేరియాలో ఇంటర్ పూర్తిచేయడం, ఉత్తీర్ణత శాతం గురించిన విషయాలు ఉన్నాయి. దేశంలోని కొన్ని కళాశాలలకు మాత్రమే మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ కామర్స్ అవసరం ఉండవచ్చు. ఎప్పుడైనా సరే ఎలిజిబిలిటీ చూసుకొనే పరీక్షకు అప్లయ్ చేయడం మంచిది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే బీబీఏ చదివేటప్పుడు మ్యాథమెటిక్స్ కామర్స్ నాలెడ్జ్ అవసరం. కాబట్టి ఇంటర్లో ఆయా సబ్జెక్ట్స్ తీసుకుంటే ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంది.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు