బీసీ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాలు
హైదరాబాద్: రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ జూనియర్ కాలేజీలు, డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించిన ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్జేసీ, ఆర్డీసీ సెట్-2021 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 31 వరకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులైయ్యేవారు అర్హులని వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం 134 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉండగా, ఒక డిగ్రీ కాలేజీ ఉన్నది. ఇందులో 66 బాలుల జూనియర్ కాలేజీలు, 68 బాలికల జూనియర్ కాలేజీలు, మహిళా డిగ్రీ కాలేజీ ఉంది. ఇవన్నీ ఇంగ్లిష్ మీడియం కాలేజీలే.
కోర్సులు: జూనియర్ కళాశాలల్లో.. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ, ఇతర వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
డిగ్రీలో.. బీఎస్సీ ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంపీసీఎస్, బీజెడ్సీ, బీబీసీ, డాటా సైన్స్, బీఏలో.. హెచ్ఈపీ, హెచ్‌పీఈ, బీకామ్ (జనరల్, కంప్యూటర్స్, బిజినెస్ అనలిటిక్స్) కోర్సులు ఉన్నాయి.
అర్హత: ప్రస్తుత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్నవారు
పరీక్ష ఫీజు: రూ.200
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 23
దరఖాస్తులకు చివరితేదీ: మే 31
హాల్‌టికెట్లు డౌన్లోడ్: జూన్ 4 నుంచి
పరీక్ష తేదీ: జూన్ 13
వెబ్సైట్: http://mjptbcwreis.telangana.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆశకు పోయారు.. కటకటాలపాలయ్యారు
అక్కడ కూడా 18 ఏండ్లకు పైబడిన అందరికీ ఉచిత టీకాలు..!
రామయ్య నీ దర్శన భాగ్యం ఎప్పుడయ్యా ?
బాలీవుడ్ వీడియో పోస్ట్ చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్.. ఆడుకున్న నెటిజన్లు
కరోనా కట్టడిలో కేంద్రం విఫలం : ప్రియాంక గాంధీ
కరోనా మరణాలను దాస్తున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం?
ఛీ కొట్టిన ఫ్యాన్స్.. ఈఎస్ఎల్ నుంచి తప్పుకున్న ఆరు ఇంగ్లిష్ క్లబ్‌లు
కరోనాతో హాస్పిటల్లో చేరిన ధోనీ తల్లిదండ్రులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు