సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు
స్వాతంత్య్రానంతర విద్యా విధానం
- విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ (1948-49)
- స్వాతంత్య్రానంతరం మొదటిసారి 1948లో మన దేశానికి అవసరమైన విశ్వవిద్యాలయాల విద్యను మెరుగుపరచడానికి, ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించే సూచనలను ఇవ్వడానికి CABE ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి కమిషన్
- ఈ కమిషన్‌లోని ముఖ్య సభ్యులు జాకీర్ హుస్సేన్, మొదలియార్
- ఈ కమిషన్ మొదటి సమావేశం 1948, డిసెంబర్ 8న భారత ప్రభుత్వ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆధ్వర్యంలో జరిగింది. ఈయన గుర్తుగా జాతీయ ఉర్దూ విశ్వ విద్యాలయం హైదరాబాద్‌లో స్థాపించారు.
- 1937-47 దశాబ్ద కాలాన్ని decade of provincial autonomy
- ఈ కమిషన్‌ను ఏర్పరిచే నాటికి భారతదేశంలో విశ్వవిద్యాలయాలు
- 1857 – కలకత్తా, బొంబాయి, మద్రాస్
- 1882- పంజాబ్ యూనివర్సిటీ
- 1916- బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)
- పండిట్ మదన్మోహన్ మాలవీయ కృషితో బీహెచ్‌యూ ఏర్పాటు చేశారు.
- 1918లో ఉస్మానియా యూనివర్సిటీ, 1920లో అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు
- 1815లో మహ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలగా ప్రారంభం కాగా 1920 నుంచి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా పిలుస్తున్నారు.
- 1922- ఢిల్లీ యూనివర్సిటీ
- 1923- నాగపూర్ యూనివర్సిటీ
- 1926- ఆంధ్రా యూనివర్సిటీ
- 1927- ఆగ్రా యూనివర్సిటీ
- 1929- అన్నామలై యూనివర్సిటీ
- విశ్వవిద్యాలయాలు మన సంస్కృతికి, నాగరికతకు చిహ్నాలు
- విశ్వ విద్యాలయాలు సమాజ మేధో కేంద్రాలు
- ఉపాధ్యాయులు మూడు స్థాయిలు. అవి.. ప్రొఫెసర్, రీడర్, లెక్చరర్
- ప్రతిభ ఆధారంగా ప్రమోషన్స్
- మాతృభాషలో బోధన
- పరిశోధనలు చేసేవారికి ఆర్థిక సాయం
- యూనివర్సిటీ ప్రమాణాలు బాగుండాలంటే మాధ్యమిక విద్యా ప్రమాణాలు బాగుండాలి
- మహిళలు దేశ అభివృద్ధిలో సగ భాగం. అందువల్ల అధికంగా మహిళా కళాశాలల ఏర్పాటు
- ఉన్నత విద్యలో నైతిక బోధన
- యూనివర్సిటీ విద్య ఉమ్మడి జాబితా, యూజీసీ ఏర్పాటు చేయాలి
- 1953లో వీరి సిఫారసుతో యూజీసీ స్థాపన, 1956లో పార్లమెంటు చట్టం ద్వారా గుర్తింపు.
- పీజీ, పీహెచ్డీ కోర్సులో విద్యార్థులను అఖిల భారత ప్రాతిపదికన చేర్చుకోవాలి.
- యూనివర్సిటీలో చేరే విద్యార్థులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
- వ్యవసాయ విద్యకు ప్రాధాన్యత, గ్రామీణ విశ్వ విద్యాలయాలు
- యూనివర్సిటీ స్థాయిలో పని దినాలు- 180 రోజులు (పరీక్షలు మినహా)
- ఇవి 3-టర్మ్స్గా ఉండాలి. ఒక్కొక్క టర్మ్ 11 వారాలు ఉండాలి.
- ట్యుటోరియల్ క్లాసెస్ నిర్వహించాలి. ఇవి గ్రంథాలయాలు నిర్వహిస్తే బాగుంటుంది.
- 1:6 నిష్పత్తిలో విద్యార్థులు ఉండాలి
- బెనారస్ హిందూ యూనివర్సిటీ, అలీఘర్ ముస్లిం, ఢిల్లీ మొదలైన యూనివర్సిటీల్లోని సమస్యలను మనమే పరిష్కరించుకోవాలి.
మూల్యాంకనం
- ఆబ్జెక్టివ్ ప్రశ్నలు విద్యార్థులపై ఎక్కువ ఒత్తిడి తెస్తుంది.
- దీని కోసం సాంకేతిక సహాయాన్ని వినియోగించుకోవాలి.
- 70 శాతానికి పైగా మార్కులు వస్తే మొదటి ర్యాంకు
- 55 శాతం నుంచి 69 శాతం పై మార్కులు రెండో ర్యాంకు
- 40 శాతం పై మార్కులు మూడో ర్యాంకు
- గ్రేస్ మార్కుల విధానం రద్దు (పరీక్ష రాయకుండా పాస్ అవ్వడం)
- పీజీ కోర్సుకు మినహా మిగిలిన వాటికి Viva కోర్సు అవసరం లేదు.
యూనివర్సిటీ పరిపాలన యంత్రాంగం
1. చాన్స్‌లర్ (గవర్నర్): వీరికి కింది సిబ్బందిని నియమించే అధికారం ఉంటుంది.
- వైస్ చాన్స్‌లర్, సెనెట్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్, అకడమిక్ కౌన్సిలర్, స్టాఫ్, బోర్డ్ ఆఫ్ స్టడీస్, ఫైనాన్స్ కమిటీ, సెలక్షన్ కమిటీ
వృత్తి విద్యా కోర్సులు ఐదు భాగాలు
- వాణిజ్యం, ఇంజినీరింగ్, న్యాయశాస్త్రం, వ్యవసాయం, వైద్యం
- ప్రాథమిక విద్య- 1-10 వరకు
- మాధ్యమిక విద్య- ఇంటర్
- ఉన్నత విద్య- డిగ్రీ
- సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రకారం మాధ్యమిక విద్య బాగుంటే విశ్వవిద్యాలయాల విద్య బాగుంటుంది.
మాధ్యమిక విద్యా కమిషన్ (1950-53)
- మన విద్యా యంత్రాంగంలో మాధ్యమిక విద్య బలహీనంగా ఉంది, దీన్ని సంస్కరించడం ఆవశ్యకం అని డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సిఫారసు చేయడంతో లక్ష్మణస్వామి మొదలియార్ మద్రాస్ యూనివర్సిటీ వీసీ అధ్యక్షుడిగా CABE ఏర్పాటు చేసిన రెండో కమిషన్.
- 1952, సెప్టెంబర్ 23న ఈ కమిషన్ నియమించగా 1954, ఆగస్టు 27న నివేదికను సమర్పించారు.
- మాధ్యమిక విద్యపై సమాచారం కోసం వీరు TOUR పర్యటన పద్ధతి, ప్రశ్నావళి పద్ధతులను వినియోగించారు.
- ప్రాథమిక విద్యను, విశ్వవిద్యాలయాల విద్యను అనుసంధానపరిచే మాధ్యమిక విద్య.
- సాటి మనిషితో హుందాతో కలిసి జీవించడానికి తగిన లక్షణాలను అలవాటు చేయని విద్య విద్యే కాదు.
- పుస్తక జ్ఞానం కంటే వృత్తి విద్యల్లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించాలి.
- విద్యా విధానం 5+3+4+3 గా ఉండాలి.
- 5- 1-5 తరగతులు- Jr. Basic
- 3-6-8 తరగతులు- Sr.Basic/Jr.Secondary
- 4- 9-12 తరగతులు- హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్
- 3- డిగ్రీ విద్య
- హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ – 7 గ్రూప్స్. భాష, సైన్స్, సాంఘికశాస్త్రం, క్రాఫ్ట్ (చేతి పనులు) మొదలైన ప్రధాన సబ్జెక్టులతో పాటు వీరు కింది 7 గ్రూప్స్‌ను ప్రతిపాదించారు.
- మానవీయ శాస్త్రం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక విద్య, వాణిజ్య విద్య, వ్యవసాయం, లలిత కళలు, గృహ శాస్త్రం. ఈ ఏడు గ్రూప్స్ నుంచి తప్పనిసరిగా 3 గ్రూప్స్ ఎంపిక చేసుకోవాలి.
- మొదలియార్ దృష్ట్యా మాధ్యమిక విద్య అంటే 11 నుంచి 17 సం.ల వయస్సు గలవారికి అందించే 7 సం.ల విద్య.
- HSE స్థాయిలో బహుళార్థ సాధక పాఠశాలలు ఉండాలి.
- సాంకేతిక విద్య కోసం పరిశ్రమలపై సాంకేతిక విద్య పన్ను విధించాలి.
- తగిన కోర్సులను ఎంపిక చేసుకోవడానికి మార్గదర్శక కేంద్రాలు ఉండాలి.
- విద్యను వృత్తిపరం చేయాలి
- ఆధునిక, శాస్త్రీయ, ప్రాజెక్ట్, యాక్టివిటీ (కృత్యాధార), విరామ సమయ సద్వినియోగం వంటి పద్ధతులతో బోధించాలి.
- బాలికలకు గృహశాస్త్రం సదుపాయం ఉండాలి.
- HCE వరకు మాతృభాష, కేంద్ర ఉద్యోగాల కోసం హిందీ తప్పనిసరి సబ్జెక్టు.
- నాయకత్వ లక్షణాల కోసం NCC, SCOUT, Jr.Redcross వంటి కార్యక్రమాలు ఉంటాయి.
- పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు, స్కూల్ ఆఫ్ మెడికల్ సర్వీస్ ఉండాలి.
- జాతీయ స్థాయిలో వ్యాయామ విద్య శిక్షణా సంస్థలు ఉండాలి.
- కంపార్ట్మెంటల్ పరీక్షలు ఉండాలి.
- ఒక సబ్జెక్టుకు ఒకటి కంటే ఎక్కువ పాఠ్యపుస్తకాలు ఉండాలి.
- పాఠశాలల్లో గ్రంథాలయాలు, శిక్షణ పొందిన లైబ్రేరియన్, గ్రంథాలయాలు, మేధావి ప్రయోగశాలలు ఉండాలి
- మెట్రిక్ ఆపై అర్హత కలవారిని 2 సం.లు, డిగ్రీ అర్హత కలవారికి సం. ఉపాధ్యాయ శిక్షణ.
- మెట్రిక్- 2 సం.లు DED
- డిగ్రీ- 1 సం. BED
- శిక్షణ సమయంలో టీచింగ్ ప్రాక్టీస్, వర్క్‌షాప్ నిమిత్తం ఫీజు ఉండాలి.
- ఉపాధ్యాయ నియామకాలు దేశవ్యాప్తంగా ఏకరీతిగా ఉండాలి.
- సర్వీసులోని ‘ఉపాధ్యాయులకు ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్’ అంటే ప్రమోషన్, పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ (బీమా సౌకర్యం)
- వీరి పిల్లలకు ఉచిత విద్య, హోదా పెంపునకు సన్మానాలు ఉండాలి.
- పదవీ విరమణ- 60 స.లు
- ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రైవేటు బోధన చేయకూడదు.
మహిళా విద్యపై జాతీయ స్థాయి కమిటీ (1957-59)
- 1958లో ఈ కమిటీకి అధ్యక్షురాలిగా దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ను నియమించారు.
- 1981లో 14 సం.లోపు బాలికలను పాఠశాలల్లో నమోదుకు కృషి చేయడం
- స్త్రీ విద్య ఆవశ్యకతపై డాక్యుమెంటేషన్ రూపొందించారు.
- అందుబాటులో పాఠశాల, వసతులు
- మహిళా వయోజన విద్య
- కో ఎడ్యుకేషన్‌లో బాలబాలికల నమోదులోని వ్యత్యాసం క్రమంగా తగ్గించాలి.
- బాలికల విద్య నిర్లక్ష్యానికి 65శాతం ఆర్థిక కారణాలు అయితే 25 నుంచి 35 శాతం తల్లిదండ్రుల్లో నిర్లిప్తత. దీన్ని అధిగమించడానికి నిర్బంధ విద్యా చట్టాలను అమలుపరచాలి.
- పంచవర్ష ప్రణాళికల్లో మహిళా విద్యకు కేటాయింపులు
- జాతీయ, రాష్ట్ర స్థాయిలో మహిళా విద్యా మండలిని స్థాపించారు.
హన్స్ మెహతా కమిటీ -1962
- జాతీయ మహిళా విద్యా మండలి స్త్రీ విద్య అభివృద్ధికి సూచనల కోసం ఈ కమిటీని నియమించగా వీరు విద్యలో అంటే సెకండరీ స్థాయి విద్యలో చేతి వృత్తులు, వృత్తి విద్యా కోర్సులు, లైంగిక విద్యను ప్రవేశపెట్టాలి. పాఠ్యపుస్తకాల కమిటీలో మహిళల భాగస్వామ్యం ఉండాలి.
భక్తవత్సల కమిటీ-1963
- జాతీయ మహిళా విద్యా మండలి గ్రామీణ ప్రాంతాల్లో విద్యపట్ల ప్రజల మద్దతు లేకపోవడానికి గల కారణాలపై ఈ కమిటీని నియమించగా గ్రామీణ మహిళలు చదువుకొని స్కూల్ మదర్‌గా పని చేయడానికి ప్రోత్సాహకాలు ఉండాలి.
ప్రాక్టీస్ బిట్స్
1. స్వాతంత్య్రానంతరం విశ్వవిద్యాలయ విద్యను పునర్నిర్మించడానికి ఏర్పాటు చేసిన మొదటి కమిషన్?
1. మొదలియార్ కమిషన్
2. రాధాకృష్ణన్ కమిషన్
3. హంటర్ కమిషన్
4. కొఠారీ కమిషన్
2. మాధ్యమిక విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం?
1. 1953 2. 1986
3. 1921 4. 1931
3. మాధ్యమిక విద్యా కమిషన్ సూచించిన మాధ్యమిక విద్యా లక్ష్యం?
1. వృత్తి సామర్థ్యం మెరుగుపరచుట
2. మూర్తిమత్వ అభివృద్ధి
3. పౌరసత్వ శిక్షణ
4. పైవన్నీ
4. సెకండరీ విద్యా కమిషన్‌గా పిలివబడేది?
1. మొదలియార్ కమిషన్
2. రాధాకృష్ణన్ కమిషన్
3. రామ్మూర్తి కమిషన్
4. మాల్కం ఆది శేషయ్య కమిటీ
5. ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించిన సంవత్సరం?
1. 1918 2. 1818
3. 1928 4. 1978
సమాధానాలు
1. 2 , 2. 1 ,3. 3, 4. 1 ,5. 1
దుర్గాప్రసాద్
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్, వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు