పలాసియోస్‌కు కిరీటం.. ‘తొలి తల్లి’ మిచెల్ కోన్
మిస్ యూనివర్స్ -2023
- ఇవి 72వ పోటీలు
- నవంబర్ 18న ఎల్ సాల్వెడార్ దేశంలో నిర్వహించారు.
- 84 మంది పాల్గొన్నారు
- పాకిస్థాన్ ఈ పోటీల్లో తొలిసారి పాల్గొన్నది.
- నికరాగ్వా దేశానికి చెందిన షెన్నిస్ పలాసియోస్ విజేతగా నిలిచింది.
- మొదటి రన్నరప్: ఆంటోనియా పోర్సిల్డ్ (థాయ్‌లాండ్)
- రెండో రన్నరప్: మోరయా విల్సన్ (ఆస్ట్రేలియా)
- విజేతకు 2022లో కిరీటాన్ని దక్కించుకున్న ఆర్.బానీ గాబ్రియేల్ (అమెరికా) కిరీటాన్ని అలంకరించింది.
- ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించినవారు శ్వేతా శారద (చండీగఢ్)
- నికరాగ్వా దేశానికి చెందిన అమ్మాయి మిస్ యూనివర్స్ కిరీటం గెలవడం తొలిసారి.
- ఫైనల్ రౌండ్లో అడిగిన ప్రశ్న ‘మీరు మరొక స్త్రీ బూట్లలో ఒక సంవత్సరం జీవించగలిగితే మీరు ఎవరిని, ఎందుకు ఎన్నుకొంటారు?
- విజేత సమాధానం: మహిళా హక్కుల కార్యకర్త మేరీ వోల్ స్టోన్ క్రాప్ట్ పేరు చెప్పింది
పోటీలో హైలైట్స్
- గ్వాటెమాలకు చెందిన మిచెల్ కోన్ మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి తల్లిగా నిలిచింది.
- కొలంబియాకు చెందిన కామిలా అవేల్లా మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న తొలి వివాహమైన అమ్మాయిగా గుర్తింపు దక్కించుకుంది.
- 2023 మిస్ యూనివర్స్ పోటీల్లో తొలిసారిగా ఇద్దరు ట్రాన్స్జెండర్లు పాల్గొన్నారు.
1. రిక్కీ వాలెరీ కొల్లే (నెదర్లాండ్స్),
2. మెరీనా మాచెట్ (పోర్చుగల్) - నేపాల్‌కు చెందిన జేన్ దీపికా మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్న తొలి పోటీదారుగా నిలిచింది.
- ఈ పోటీల్లో తొలిసారిగా పాకిస్థాన్ నుంచి ఎరికా రాబిన్ పాల్గొన్నది.
- భారత్ నుంచి పాల్గొన్న శ్వేతా శారద 2023, ఆగస్టు 28న భారత్‌లో ‘మిస్ దివా యూనివర్స్-2023’ గెలుచుకొంది.
మిస్ యూనివర్స్ గురించి..
- 1952, జూన్ 28న ఈ పోటీలను ప్రాంభించారు.
- ఇది ప్రతి సంవత్సరం అమెరికా, థాయ్‌లాండ్‌లోని మిస్ యూనివర్స్ సంస్థ ద్వారా నిర్వహించబడుతున్న అందాల పోటీ.
- మొదటి విజేత- అర్మీ కుసెలా (ఫిన్లాండ్)
- అత్యధిక టైటిల్స్ గెలిచిన దేశం- అమెరికా (9), వెనెజులా (7), ప్యూర్టోరికో (5)
- భారత్ ఈ కిరీటం మూడు సార్లు గెలుచుకొంది. సుస్మితాసేన్ (1994), లారా దత్తా (2000), హర్నాజ్ సంధు (2021).
మిస్ వరల్డ్ -2024
- ఇవి 71వ పోటీలు
- ఫైనల్ పోటీలు 2024, మార్చి 9న జరిగాయి
- ముంబయిలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్
- 1996 తర్వాత అంటే 28 సంవత్సరాల తర్వాత భారతదేశంలో ఈ పోటీలు జరిగాయి.
- ఈ కార్యక్రమానికి కరణ్ జోహర్, మేగన్ యంగ్లు హోస్టులుగా వ్యవహరించారు.
- మేగన్ యంగ్ 2013 ప్రపంచ సుందరి విజేత, ఫిలిప్పీన్స్‌కు చెందినవారు.
- పాల్గొన్నవారి సంఖ్య 112
- తొలిసారి పాల్గొన్న దేశం టోగో
- క్రిస్టీనా జికోవా (చెక్ రిపబ్లిక్) విజేతగా నిలిచారు.
- మొదటి రన్నరప్- యాస్మినా జైతూన్ (లెబనాన్)
- భారతదేశం నుంచి పాల్గొన్న సినీశెట్టి టాప్-8లో నిలిచారు
- 2022 ఫెమినా మిస్ ఇండియా విజేత కర్ణాటకకు చెందినవారు.
- టైటిల్ విజేత అయిన క్రిస్టీనా జికోవాకు 2022 మిస్ వరల్డ్ పోలండ్‌కు చెందిన కరోలినా బిలావ్సా కిరీటాన్ని అలంకరించారు 8 చెక్ రిపబ్లిక్ దేశానికి చెందినవారు మిస్ వరల్డ్ టైటిల్ గెలవడం ఇది రెండోసారి. గతంలో 2006లో టాటానా కుచరోవా గెలుచుకుంది.
- 2024 పోటీల్లో మల్టీమీడియా చాలెంజ్ కింద పాల్గొన్న వారందరూ Save the Tiger క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు.
మిస్ వరల్డ్ గురించి…
- ప్రపంచంలో పురాతనమైన అంతర్జాతీయ స్థాయి అందాల పోటీలు ఇవి.
- వీటిని 1951లో యునైటెడ్ కింగ్డమ్కు చెందిన ఎరిక్ మోర్లీ ప్రారంభించారు.
- ఇవి ప్రపంచంలో జరిగే బిగ్ 4 అందాల పోటీల్లో ఒకటి. అవి
1. మిస్ యూనివర్స్, 2. మిస్ ఇంటర్నేషనల్,
3. మిస్ ఎర్త్, 4. మిస్ వరల్డ్. - తొలి మిస్ వరల్డ్- కికి హకన్సన్ (1951) స్వీడన్.
- ఇందులో Miss world beauty with a purpose, Miss worls talent, Miss world top model, Miss world sports challenge, Multim edia award, Miss world beach beauty లాంటి పోటీలు నిర్వహిస్తారు.
మిస్ వరల్డ్ భారత విజేతలు
ఇప్పటివరకు ఆరుగురు భారతీయులు అందాల కిరీటాలను గెలుచుకున్నారు.
1. రీటా ఫారియా (1966)
2. ఐశ్వర్యరాయ్ (1994)
3. డయానా హెడెన్ (1997)
4. యుక్తాముఖి (1999)
5. ప్రియాంక చోప్రా (2000)
6. మానుషి ఛిల్లర్ (2017)
బిపార్జోయ్ తుఫాను.. భారత్, పాక్‌పై ప్రభావం
- 2023లో సంభవించిన తుఫానులు
- జాస్పర్ తుఫాను
- డిసెంబర్ 13న ఈ తుఫాను ఈశాన్య ఆస్ట్రేలియాలో సంభవించింది.
- దీనివల్ల గంటకు 113 కి.మీ వేగంతో (70 మైళ్ల) గాలులు వీచాయి
- ఆకస్మిక వరదలు సంభవించాయి.
మిచాంగ్ తుఫాను
- ఇది డిసెంబర్ 1 నుంచి 6 మధ్య సంభవించింది. బంగాళాఖాతంలో ఏర్పడింది.
- ఇది తమిళనాడు, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లో ప్రభావం చూపింది.
- మరణాలు 17. గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీచాయి.
- డిసెంబర్ 5న బాపట్ల దగ్గర తీరం దాటింది.
- మిచాంగ్ తుఫానుకు పేరు పెట్టిన దేశం మయన్మార్. దీని అర్థం బలం, స్థితి స్థాపకత
మైథిలి తుఫాను
- ఇది నవంబర్ 14-18 మధ్య హిందూ మహాసముద్రంలో సంభవించింది.
- ప్రభావిత ప్రాంతాలు- ఈశాన్య భారతదేశం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్
- మరణాలు 7- గంటకు 75 కి.మీల వేగంతో గాలులు వీచాయి.
- నష్టం 276 మిలియన్ డాలర్లు.
- ఈ తుఫానుకు మాల్దీవులు పేరు పెట్టింది. మైధిలి తుఫానులో మైథిలి అంటే దివేహి భాషలో పెద్ద వృక్షం అని అర్థం.
- ఇది బంగ్లాదేశ్‌లో తీరం దాటింది.
హమూన్ తుఫాను
- ఇది అక్టోబర్ 21-25ల మధ్య హిందూమహాసముద్రంలో సంభవించింది.
- ప్రభావిత ప్రాంతాలు- బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరం
- మరణాలు 17
- నష్టం- 567 మిలియన్ డాలర్లు
- గంటకు 120 కి.మీల వేగంతో గాలులు వీచాయి.
- ఇది ఆగ్నేయ బంగ్లాదేశ్‌లో తీరం దాటింది.
- దీనికి ఇరాన్ పేరు పెట్టింది. పర్షియన్ భాషలో దీని అర్థం ఎడారి సరస్సులు.
తేజ్ తుఫాను
- ఇది అక్టోబర్ 20-24 తేదీల మధ్య సంభవించింది.
- ప్రభావిత ప్రాంతాలు- యెమెన్, ఒమన్
- మరణాలు 2
- గంటకు 175 కి.మీల వేగంతో గాలులు వీచాయి. ముంబయి, పుణెలో వర్షాలు కురిశాయి.
- ఇది అరేబియా సముద్రంలో ఏర్పడి యెమెన్‌లో తీరం దాటింది.
- దీనికి భారతదేశం పేరు పెట్టింది. హిందీలో దీని అర్థం వేగం
బిపార్జోయ్ తుఫాను
- ఇది జూన్ 6-19ల మధ్య అరేబియా సముద్రంలో సంభవించింది.
- ప్రభావిత ప్రాంతాలు- భారతదేశం, పాకిస్థాన్
- మరణాలు 17
- నష్టం 124 మిలియన్ డాలర్లు
- గంటకు 165 కి.మీల వేగంతో గాలులు వీచాయి. గుజరాత్లో వర్షాలు కురిశాయి.
- దీనికి బంగ్లాదేశ్ పేరు పెట్టింది. దీని అర్థం విపత్తు.
మోకా తుఫాను
- ఇది హిందూ మహాసముద్రంలో వచ్చింది.
- ప్రభావిత ప్రాంతాలు- అండమాన్, నికోబార్ దీవులు, శ్రీలంక, మయన్మార్, బంగ్లాదేశ్, చైనా, భారతదేశం
- మరణాలు 463
- నష్టం 1.5 బిలియన్ డాలర్లు
- గంటకు 215 కి.మీల వేగంతో గాలులు వీచాయి.
- దీనికి యెమెన్ పేరు పెట్టింది. దీని అర్థం సిటీ.
తాన్న రవి ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్
91107 62187
Previous article
అయస్కాంత బలరేఖలు ఎక్కడ ప్రారంభమై ఎక్కడ అంతమవుతాయి?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు