మొదట సామంతులు.. తర్వాత స్వతంత్రులు
- కాకతీయులు మొదట రాష్ట్రకూటులకు, తర్వాత కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా పనిచేశారు.
- తొలి కాకతీయులు జైనులు. దీనికి కారణం వారి సార్వభౌములైన రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు జైన మతస్థులు కావడం.
- బయ్యారం చెరువు శాసనం ప్రకారం కాకతీయులు రాష్ట్రకూటుల సామంతులుగా ఉండి గరుడ చిహ్నాన్ని రాజ లాంఛనంగా స్వీకరించారు.
- తొలి కాకతీయుల్లో కాకర్త్యగుండ్యన రాష్ట్రకూట సేనానిగా, సామంతుడిగా ఉండి కొరవి ప్రాంతాన్ని పాలించాడు.
- రాష్ట్రకూటుల తర్వాత కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండి అనుమకొండ విషయాన్ని పాలించారు.
- కళ్యాణి చాళుక్యుల నుంచి కాకతీయులు వరాహం చిహ్నాన్ని తమ రాజలాంఛనంగా స్వీకరించారు.
కాకతీయులు- రాజకీయ చరిత్ర కాకతీయ ముఖ్య పాలకులు
1) కాకర్త్య గుండ్యన
2) మొదటి బేతరాజు
3) మొదటి ప్రోలరాజు
4) 2వ బేతరాజు
5) దుర్గరాజు
6) 2వ ప్రోలరాజు
7) రుద్రదేవుడు
8) మహాదేవుడు
9) గణపతిదేవుడు
10) రుద్రమదేవి
11) ప్రతాపరుద్రుడు
కాకర్త్య గుండ్యన
- కాకతీయ వంశ ప్రథమ చారిత్రక మూలపురుషుడు. మాగల్లు శాసనంలో చెప్పిన రాష్ట్రకూట 3వ కృష్ణుడి సేనాని.
- రాష్ట్రకూటులకు సామంతుడిగా కొరవి ప్రాంతాన్ని పాలించాడు.
- ఇతని కుమారుడు మొదటి బేతరాజు
మొదటి బేతరాజు
- ఇతడు వేయించిన కాజీపేట శాసనం ప్రకారం కాకతీయ రాజుల్లో ప్రథముడు.
- ఇతని బిరుదు కాకతీపురాధినాథ
- కళ్యాణి చాళుక్యులకు సామంతుడు. వీరి శత్రువులైన ముదిగొండ చాళుక్యులు మొదటి బేతరాజుపై దాడి చేయగా, విరియాల కుటుంబానికి చెందిన ఎర్రభూపతి అతని భార్య కామసాని వారిని ఓడించి తరిమివేశారని గూడూరు శాసనం తెలియజేస్తుంది.
మొదటి ప్రోలరాజు
- మొదటి బేతరాజు కుమారుడు
- ఇతని బిరుదులు కాకతి వల్లభ, అరిగజకేసరి
- హనుమకొండలో కేసరి చెరువును తవ్వించాడు.
- కళ్యాణి చాళుక్య మొదటి సోమేశ్వరుడి సామంతుడు.
- కాజీపేట, పిల్లలమర్రి, పాలంపేట శాసనాలు ఇతని ఘన కార్యాలను పేర్కొంటున్నాయి.
- సామంతుడితోపాటు యుద్ధాల్లో పాల్గొన్న ప్రోలరాజు సేవలకు మెచ్చి మొదటి సోమేశ్వరుడు అనుమకొండ విషయాన్ని వంశపారంపర్య హక్కులతో సామంత ప్రభువుగా గుర్తించాడు.
రెండో బేతరాజు
- మొదటి ప్రోలరాజు కుమారుడు.
- ఇతని బిరుదులు విక్రమ చక్ర, చలమర్తి గండ, త్రిభువన మల్ల
- కళ్యాణి చాళుక్య 6వ విక్రమాదిత్యుడికి సామంతుడు
- అనుమకొండలో బేతేశ్వరాలయం అనే శివాలయాన్ని నిర్మించాడు.
- అనుమకొండలో శివపురం నిర్మించి దాన్ని కాలాముఖ శైవముని రామేశ్వర పండితుడికి దానం ఇచ్చాడు
- అతను వేయించిన కాజీపేట శాసనం అతని పరిపాలన గురించి తెలుపుతుంది.
దుర్గరాజు
- ఇతను రెండో బేతరాజు కుమారుడు.
- ఇతను జారీ చేసిన శాసనం కాజీపేట దుర్గ శాసనం.
- ఈ శాసనం మొదటి ప్రోలరాజు జీవితాన్ని, అతని విజయాలను వివరిస్తుంది.
రెండో ప్రోలరాజు
- తొలి కాకతీయుల్లో సుప్రసిద్ధుడు. క్రీ.శ. 1116 నుంచి 1157 వరకు అన్న దుర్గరాజు తర్వాత సింహాసనాన్ని అధిష్టించి పాలించాడు.
- కళ్యాణి చాలుక్య తైలపుడిని ఓడించాడు.
- కళ్యాణి చాళుక్యుల ప్రాచుర్యానికి అడ్డుకట్టవేసి కాకతీయులను ఒక బలోపేతమైన శక్తిగా తీర్చిదిద్దాడు.
- రెండోప్రోలరాజు గురించి తెలిపే శాసనం అనుమకొండ శాసనం.
- ఇతను జారీ చేసిన శాసనాలు శనిగరం శాసనం, పద్మాక్షి ఆలయ శాసనం.
- రెండో ప్రోలరాజు అనుమకొండలో నిర్మించిన ఆలయాలు ప్రసన్న కేశవాలయం, పద్మాక్షి ఆలయం.
రుద్రదేవుడు
- ఇతని పాలనా కాలం 1158 నుంచి 1195 వరకు.
- రెండో ప్రోలరాజు కుమారుడు. స్వతంత్ర కాకతీయరాజుల్లో రుద్రదేవుడు ప్రథముడు.
- 1158 నుంచి 1162 వరకు కళ్యాణి చాళుక్యులకు సామంతుడిగా వ్యవహరించాడు. అతడు 1163లో స్వతంత్రం ప్రకటించుకున్నాడు.
- కాకతీయ సామ్రాజ్య నిజ వ్యవస్థాపకుడు. ఇతడు వేయించిన అనుమకొండ శాసనం రుద్రదేవుడి సైనిక విజయాలను గురించి తెలుపుతుంది.
- ఇతని బిరుదులు విద్యాభూషణ, దాయగజకేసరి.
- దాయగజకేసరి బిరుదు పేరిట నాణేలను ముద్రించాడు.
- ఇతను స్వయంగా కవి. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రంచించాడు.
- 1195లో యాదవరాజు జైతుగితో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించాడు. ఈ విషయాన్ని హేమాద్రి వ్రతఖండ గ్రంథం తెలుపుతుంది.
మహాదేవుడు
- రెండోప్రోలరాజు కుమారుడు. రుద్రదేవుడి పెద్ద తమ్ముడు. ఇతని పరిపాలనా కాలం 1195 – 1198.
- ఇతడు ప్రతీకారం తీర్చుకోవడానికి యాదవ రాజ్యంపై దండెత్తగా యాదవరాజు మహాదేవుడిని సంహరించి అతని కుమారుడైన గణపతి దేవుడిని బంధించాడు.
- మహాదేవుడి సేనాపతి – రేచర్ల రుద్రుడు
గణపతి దేవుడు
- ఇతని పాలనా కాలం 1199-1262
- కాకతీయుల్లో అత్యంత పరాక్రమ శీలి. తల్లిదండ్రులు బయ్యాంబ, మహాదేవుడు.
- గణపతిదేవుడు తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేశాడు. ఇతని హయాంలో తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రాంతం అంతా కాకతీయుల పాలన కిందకు వచ్చింది.
- గణపతి దేవుడు బంధీగా ఉన్న సమయంలో రేచర్ల రుద్రుడు కాకతీయ రాజ్యాన్ని సంరక్షించి, బంధవిముక్తుడయ్యాక గణపతి దేవుడికి అప్పగించాడు.
- రేచర్ల రుద్రుడికి గణపతి దేవుడు కాకతీయ రాజ్య స్థాపనాచార్య అనే బిరుదునిచ్చాడు.
- గణపతి దేవుని కాలంలో సేనాని – రేచర్ల రుద్రుడు
- గజ దళాధిపతి – జాయపసేనాని
- రథ దళాదిపతి – గంగయ్య సాహిణి
సమకాలీన రాజులు
- జైతుగి -సింఘన
- కృష్ణుడు -మహాదేవుడు
- రామచంద్రదేవుడు -శంకరదేవుడు
- హరపాలదేవుడు -రెండో వీరబల్లాలుడు
- రెండో నరసింహుడు
- మూడో నరసింహుడు
మూడో బల్లాలుడు
- ఇతని కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని విస్తరించి 63 సంవత్సరాలు దిగ్విజయంగా పరిపాలించాడు.
దండయాత్రలు
- మల్యాల అనే కాకతీయ సేనాని నాయకత్వంలో దివిసీమపై దండెత్తి చోడరాజైన పిన్నమచోడుడిని జయించాడు.
- పిన్నమచోడుడి కుమారుడైన జాయపసేనానిని తన గజసాహిణిగా నియమించుకున్నాడు.
- చందోలులపై దండెత్తి రాజైన పృథ్వీశ్వరుడిని వధించి పృథ్వీశ్వర శిర కందూక క్రీడా వినోద అనే బిరుదును పొందాడు.
- మనుమసిద్ధిని అక్కన, బయ్యన్నలు ఓడించి అధికారం నుంచి తొలగించగా గణపతిదేవుని సాయం మనుమసిద్ధి కోరాడు.
- సామంత భోజుని నాయకుల్లో కాకతీయ సైన్యం నెల్లూరుపై దాడిచేసి అక్కన్న, బయ్యన్నలను సంహరించి, మనుమసిద్ధిని నెల్లూరు సింహాసనంపై కూర్చోబెట్టారు. దీనికి ప్రతిఫలంగా మనుమసిద్ధి నుంచి మోటుపల్లి ఓడరేవును పొందాడు.
- పాండ్యరాజైన మొదటి జటావర్మ సుందర పాండ్యుడు నెల్లూరుపై దాడి చేయగా మనుమసిద్ధి గణపతిదేవుని సాయం కోరాడు.
- తదుపరి పాండ్యులకు – నెల్లూరు చోడులు, కాకతీయులకు మధ్య జరిగిన ముత్తుకూరు యుద్ధంలో రెండవ మనుమసిద్ధి మరణించగా, గణపతిదేవుడు ఓడిపోయి రాజకీయ రంగం నుంచి నిష్క్రమించాడు.
- 1254లో రాజధానిని అనుమకొండ నుంచి వరంగల్‌కు మార్చాడు.
- జారీ చేసిన శాసనం: మోటుపల్లి అభయ వర్తక శాసనం
రుద్రమదేవి
- 1262 నుంచి 1289వరకు పరిపాలించింది.
- రుద్రమదేవి బిరుదులు రుద్రదేవ మహారాజు, రాయగజకేసరి.
- ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన ఏకైక మహిళకాయస్థ జన్నిగదేవుడు రేచర్ల ప్రసాదిత్యుడు గోనా గన్నారెడ్డి
రుద్రమదేవి సేనానులు
- రుద్రమదేవి సింహాసనం అధిష్టించడానికి సహకరించిన ఆమె సేనాని రేచర్ల ప్రసాదిత్యుడు. ఇతని బిరుదులు కాకతీయ రాజ్య స్థాపనాచార్య-2, రాయపిత మహాంక.
- ప్రతాప చరిత్రను అనుసరించి రుద్రమదేవి సవతి సోదరులైన హరిహర, మురారి దేవుళ్లు రుద్రమదేవిపై తిరుగుబాటు చేయగా జన్నిగదేవుని సహాయంతో తిరుగుబాటును అణచివేసింది.
- రుద్రమదేవి కాలంలో యాదవరాజు మహాదేవుడు ఓరుగల్లుపై దాడి చేయగా రుద్రమదేవి స్వయంగా మహాదేవుడితో పోరాడి విజయం సాధించింది.
- రుద్రమదేవిపై కాయస్థ అంబదేవుడు తిరుగుబాటును లేవదీశాడు.
- కాయస్థ అంబదేవుడు చందుపట్ల శాసనం ప్రకారం తిరుగుబాటును అణచివేయడానికి వెళ్లిన రుద్రమదేవి, ఆమె సేనాని మల్లికార్జున నాయకున్ని అంబదేవుడు సంహరించాడు.
- రుద్రమదేవి పాలనా కాలంలో ఇటలీ యాత్రికుడైన మార్కోపోలో కాకతీయ రాజ్యాన్ని దర్శించాడు.
రెండో ప్రతాపరుద్రుడు
- అంబదేవుని తిరుగుబాటుకు ముందే రుద్రమదేవి తన వారసుడిగా ప్రతాపరుద్రుడిని ప్రకటించింది.
- 1290లో రాజ్యభారాన్ని స్వీకరించిన ప్రతాపరుద్రుడు రెండు ప్రధాన లక్ష్యాలతో పాలన ప్రారంభించాడు.
1) అంబదేవుడి తిరుగుబాటు ఫలితంగా కాకతీయ రాజ్యానికి, తన కుటుంబానికి ఏర్పడిన ప్రమాదాన్ని రూపుమాపడం.
3) పరరాజుల దాడుల నుంచి కాకతీయ రాజ్యాన్ని పరిరక్షించడం. - ఇందుకు సైన్యాన్ని పునర్వ్యవస్థీకరించాడు. నాయంకర విధానాన్ని అమలు చేశాడు.
- 1291లో త్రిపురాంతకంపై దాడిచేసి విజయం సాధించినట్లు ఇందులూరి అన్నయ్య వేయించిన శాసనం తెలియజేస్తుంది.
- ఇతని కాలంలోనే తురుష్కులు 8సార్లు దండయాత్ర చేశారు.
- 1303లో మొదటి దండయాత్ర : అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ ఫకృద్దీన్ జునా నాయకత్వంలో సైన్యాన్ని బెంగాల్ మీదుగా ఓరుగల్లు పైకి పంపాడు. ఈ దండయాత్రను ప్రతాపరుద్రుడు తిప్పి కొట్టాడు.
1309 రెండో దండయాత్ర
- అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కపూర్ వరంగల్‌పై దాడి చేసి ప్రతాపరుద్రుడిని ఓడించాడు. దాంతో ప్రతాపరుద్రుడు మాలిక్కపూర్తో సంధి చేసుకొని కప్పం కట్టడానికి అంగీకరించాడు.
1310లో మూడోదాడి: ముబారక్ ఖిల్జీ ఖుస్రూల్ ఖాన్ నాయకత్వంలో వరంగల్‌పై దాడి చేశారు.
1322లో నాలుగో దండయాత్ర
- ఘియాజుద్దీన్ కాలంలో అతని కుమారుడు జునాఖాన్ మొదటిసారి వరంగల్‌పై దాడి చేశాడు.
1323లో ఐదో దండయాత్ర
- జునాఖాన్ రెండోసారి మళ్లీ వరంగల్‌పై దాడిచేసి ప్రతాపరుద్రుడిని ఓడించాడు.
- వరంగల్‌ను పతనం చేసి వరంగల్ పేరును సుల్తాన్పూర్గా మార్చాడు.
- ఈ దండయాత్రలో ప్రతాపరుద్రుడిని బంధించి ఢిల్లీకి తీసుకువెళుతుండగా నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని విలాస తామ్రశాసనం, కలువచేరు శాసనాలు తెలియజేస్తున్నాయి.
- అంతటితో కాకతీయుల వంశం అంతమైంది.
Previous article
ఉద్వేగాత్మక ప్రజ్ఞా వివరణలో మిశ్రమ నమూనాను వివరించినవారు?
Next article
క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక మూలకం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు