IDBI JAM Recruitment | డిగ్రీ అర్హతతో.. ఐడీబీఐ బ్యాంకులో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
IDBI JAM Recruitment 2024 | అసిస్టెంట్ మేనేజర్ (Assistant Manager) పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభంకానుండగా.. ఫిబ్రవరి 26వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 500 పోస్టులను భర్తీ చేస్తున్నది. విద్యార్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పాటు పీజీడీబీఎఫ్‌లో శిక్షణ ఇస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి పీజీడీబీఎఫ్ సర్టిఫికేట్‌తోపాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (గ్రేడ్-ఓ) ఉద్యోగం లభిస్తుంది.
మొత్తం ఖాళీలు : 500
పోస్టులు : అసిస్టెంట్ మేనేజర్
అర్హతలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
వయస్సు : 21-25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : విద్యార్హతలు, అనుభవం, గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు : ఆన్లైన్ లో
దరఖాస్తు ప్రారంభ తేదీ : ఫిబ్రవరి 12
దరఖాస్తు చివరితేదీ : ఫిబ్రవరి 26
దరఖాస్తు ఫీజు: రూ.1000
పూర్తి వివరాల కొరకు వెబ్సైట్ చూడండి: https://www.idbibank.in/
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు