Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
నిన్నటి తరువాయి
491. ‘కోసెన్స్’ శీతోష్ణస్థితి విభజన ప్రకారం A గుర్తు దేన్ని సూచిస్తుంది?
1. సమశీతోష్ణస్థితి మండలం
2. శీతోష్ణస్థితి మండలం
3. ఉష్ణమండల వర్ష శీతోష్ణస్థితి
4. సమ ఉష్ణమండల శీతోష్ణస్థితి
492. “గల్ఫ్” ప్రవాహం ఎటువంటి ప్రవాహం?
1. ద్రవోష్ణ ప్రవాహం 2. శీతల ప్రవాహం
3. ఉష్ణ ప్రవాహం
4. సమశీతల ప్రవాహం
493. ‘ఆస్టరాయిడ్’లు ఏగ్రహాల మధ్య ఉన్నాయి?
1. కుజుడు – బృహస్పతి
2. అంగారకుడు – శని
3. అంగారకుడు – బృహస్పతి
4. భూమి – కుజుడు
494. విరూపాకార పర్వతాలను ఏమంటారు?
1. ఖండ పర్వతాలు 2. వేలా పర్వతాలు
3. సమవేలా పర్వతాలు
4. భ్రంశ పర్వతాలు
495. ‘క్యురోషివో’ ప్రవాహం ఎటువంటి ప్రవాహం?
1. ఉష్ణ ప్రవాహం 2. శీతల ప్రవాహం
3. సమశీతల ప్రవాహం
4. కవోష్ణ ప్రవాహం
496. ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఏ నేలలో ఉంటుంది?
1. ఎర్ర నేలలు 2. రేగడి నేలలు
3. లేటరైట్ నేలలు 4. ఇసుక నేలలు
497. ఎడారి నేలలు ఏ రంగులో ఉంటాయి?
1. ఎర్రరంగు 2. బూడిద రంగు
3. నల్లరంగు 4. పసుపు రంగు
498. సెల్వాలు అంటే ఏమిటి?
1. సతత హరితారణ్యాలు
2. సవన్నా గడ్డి భూములు
3. ఉష్ణమండల అడవులు
4. సమశీతోష్ణ మండల అడవులు
499. ఖర్జూర చెట్టు ఏ ప్రాంతంలో పెరుగుతుంది?
1. శీతల ఎడారిలో
2. సమశీతోష్ణ ప్రాంతంలో
3. ఉష్ణ ఎడారిలో 4. ధ్రువ ప్రాంతంలో
500. ఏ ప్రాంతంలో ఉష్ణ జల ఊటలు ఉన్నాయి?
1. ఐస్లాండ్ 2. గ్రీన్లాండ్
3. అంటార్కిటిక్ 4. స్కాట్లాండ్
501. ఉష్ణోగ్రతలో ఎక్కువ తేడా ఏర్పడే మండలం?
1. ట్రోపోస్ఫియర్ 2. ఐనోస్ఫియర్
3. బయోస్ఫియర్ 4. స్ట్రాటోస్ఫియర్
502. భూమి బయటి పొర ఏ ఖనిజాలతో ఏర్పడింది?
1. మెగ్నీషియం – సిలికా
2. మెగ్నీషియం – ఫాస్ఫరస్
3. సిలికా – ఫాస్ఫరస్
4. ఫెల్సుర్ – సిలికా
503. ఏ వాతారణ పొర రేడియో తరంగాలను భూమిపైకి పరావర్తనం చేస్తుంది?
1. ట్రోపోస్ఫియర్ 2. ఐనోస్ఫియర్
3. స్ట్రాటోస్ఫియర్ 4. ఓజోన్ స్ఫియర్
504. గరిష్ఠ పీడనం నమోదయ్యే స్థాయి?
1. ట్రోపో ఆవరణం 2. సముద్ర మట్టం
3. ఐనో ఆవరణం 4. స్ట్రాటో ఆవరణం
505. సూర్యుడు ఒక్కో రేఖాంశాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది?
1. 4 నిమిషాలు 2. 15 నిమిషాలు
3. 10 నిమిషాలు 4. 1 నిమిషం
506. భూమి చుట్టూ అక్షం ఎన్ని డిగ్రీలు వాలి ఉంది?
1. 180 డిగ్రీలు 2. 23 1/2 డిగ్రీలు
3. 66 1/2 డిగ్రీలు 4. 23 డిగ్రీలు
507. కర్కట, మకర రేఖల మధ్య ఉన్న ప్రాంతం?
1. సమశీతోష్ణ మండలం
2. శీతల మండలం
3. అతి శీతల మండలం
4. ఉష్ణమండలం
508. రుతుపవన మండలంలోని ప్రజల ముఖ్య వృత్తి?
1. వ్యవసాయం 2. పశుపోషణ
3. వేట 4. అటవీ సంపద
509. సూర్యుడిలోని వాయువుల సమ్మేళనంలో అత్యధికంగా ఉండే వాయువు?
1. హీలియం 2. హైడ్రోజన్
3. నైట్రోజన్ 4. థోరియం
510. పరిమాణం దృష్ట్యా సౌర కుటుంబంలో భూమి ఏ స్థానంలో ఉంది?
1. 2వ స్థానం 2. 3వ స్థానం
3. 4వ స్థానం 4. 5వ స్థానం
511. భూ పృష్టంలో అత్యధికంగా గల మూలకం?
1. ఆక్సిజన్ 2. సిలికాన్
3. నైట్రోజన్ 4. హైడ్రోజన్
512. భూకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు?
1. కోపర్నికస్ 2. గెలీలియో
3. కెప్లర్ 4. టాలమీ
513. కింది వాటిలో బెలిస్ట్రియల్ గ్రహం ఏది?
1. భూమి 2. శుక్రుడు
3. బృహస్పతి 4. అంగారకుడు
514. సూర్యుడిలో శక్తి ఏ ప్రక్రియ ద్వారా వెలువడుతుంది?
1. విచ్ఛిత్తి 2. సమ్మేళనం
3. విమోగం 4. యంత్రీకరణ
515. సూర్యుడి కేంద్రంలో అంచనా వేయబడిన ఉష్ణోగ్రత సుమారుగా?
1. 15 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్
2. 25 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్
3. 50 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్
4. 75 మిలియన్ డిగ్రీల సెంటీగ్రేడ్
516. సౌరకుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
1. బృహస్పతి 2. శని
3. ఫ్లూటో 4. భూమి
517. ఉత్తరార్ధ గోళంలో ఏ రెండు రోజుల్లో విషవత్తులు ఏర్పడతాయి?
1. 21 మార్చి, 23 సెప్టెంబర్
2. 21 మార్చి, 20 సెప్టెంబర్
3. 21 మార్చి, 21 సెప్టెంబర్
4. 20 మార్చి, 20 సెప్టెంబర్
518. కిందివాటిలో ఏ రెండు రోజుల్లో ఉత్తరాయణం, దక్షిణాయనం ఏర్పడతాయి?
1. 21 జూన్, 20 డిసెంబర్
2. 21 జూన్, 21 డిసెంబర్
3. 21 జూన్, 22 డిసెంబర్
4. 21 జూన్, 23 డిసెంబర్
519. కింది రేఖాంశం నుంచి రేఖాంశాలు తూర్పు పడమరలుగా వ్యాపించి 180o చేరుకుంటాయి?
1. అధిక రేఖాంశం 2. ప్రధాన రేఖాంశం
3. అల్ప రేఖాంశం 4. సహజ రేఖాంశం
520. భూమి పశ్చిమ నుంచి తూర్పునకు తిరుగుతుండటం వల్ల 15o రేఖాంశం తూర్పువైపునకు ప్రయాణించినప్పుడు స్థానిక కాలం 15o పశ్చిమ దిశలో ప్రయాణిస్తే స్థానిక కాలం ఎంత?
1. ఒక గంట తిరుగుతుంది,
ఒక గంట పెరుగుతుంది.
2. ఒక పెరుగుతుంది, ఒక గంట తిరుగుతుంది
3. ఒక గంట పెరుగుతుంది.. మార్పు ఉండదు. 4. ఏవీ కావు
521. సూర్యకాంతి కిరణాల వేగం (కాంతి వేగం)
1. 1,86,000 మైళ్లు/సెకండ్
2. 1,28,000 మైళ్లు/ సెకండ్
3. 2,83,607 మైళ్లు/సెకండ్
4. 3,15,081 మైళ్లు/సెకండ్
522. దాదాపుగా సూర్యుని ఉపరితల ఉష్ణోగ్రత ఎంత?
1. 1687oC 2. 6000oC
3. 1,00,000oC 4. 14, 800oC
523. సముద్ర ఉపరితల ప్రసరణకు గల ముఖ్యకారణం?
1. నీటి సాంద్రతలో తారతమ్యం
2. పవనాల చర్య 3. కొరియాలిస్
4. సముద్రపు నీరు
524. వాంతూనస్ ప్రతిపాదించిన సిద్ధాంతం దీనికి సంబంధించింది?
1. వ్వయసాయం 2. పర్రిశమలు
3. రవాణా 4. వ్యాపారం
525. నమోచ్ఛ రేఖలు వేటిని సూచిస్తాయి?
1. భూమి మీద సమాన వర్షపాతం
2. భూమి మీద సమాన ఉష్ణోగ్రత
3. భూమి మీద సమాన వాతావరణం
4. సముద్రమట్టం నుంచి సమాన ఎత్తు
526. కింది వాటిలో ఏది రూపాంతర శిల కాదు?
1. చలువరాయి 2. ప్లేట్
3. గ్రానైట్ 4. క్వార్ట్జైట్
527. మాగ్మా అంటే ఏమిటి?
1 శిలాద్రవం 2. శైథిల్యమైన ద్రవం
3. జ్వాలాముఖి కేంద్రం
4. సముద్రవాహకం
528. భూపటలంలో అధికంగా లభ్యమయ్యే శిలలు?
1. అవక్షేప శిలలు 2. అగ్నిశిలలు
3. రూపాంతర శిలలు 4. గ్రానైట్ శిలలు
529. ఏ శిలల్లో ఇనుము, వెండి, బంగారం, రాగి, ఖనిజాలు లభ్యమవుతాయి?
1. అవక్షేప శిలలు 2. రూపాంతర శిలలు
3. అగ్నిశిలలు 4. జ్వాలాముఖీయ
530. కింది వాటిలో భూకంపాలకు సంబంధించి ఏది సరైనది?
1. భూకంపమేర్పడే ఈ ప్రాంతానికి లంబం గా ఉన్న కేంద్రాన్ని ఎపిసెంటర్ అని అంటారు.
2. భూకంప తరంగాలు ఉద్భవించే ప్రాంతాన్ని సేస్మిన్ ఫోకస్ అని అంటారు.
3. భూకంపాలు భూ అంతర్భాగంలో కలిగే ఆకస్మిక అలజడి వల్ల ఏర్పడతాయి
4. పైవన్నీ
531. శిలలు ఎరుపు, పసుపుపచ్చగా మారడానికి కారణం?
1. ఆక్సీకరణం 2. క్షయకరణం
3. కార్బోనేషన్ 4. హైడ్రేషన్
532. ఏ అక్షాంశాల వద్ద కాలాల వ్యత్యాసం కనిష్ఠంగా ఉంటుంది?
1. మధ్య అక్షాంశ ప్రాంతాలు
2. తక్కువ అక్షాంశ ప్రాంతాలు
3. ఉన్నత అక్షాంశాల వద్ద
4. ధ్రువీయ అక్షాంశాలు
533. వేలా భిత్తిక అంటే?
1. నదీముఖ ద్వారంలో అడ్డుగోడవలె కనిపించే వేలా తరంగాలు
2. సముద్రంలో ఏర్పడే కుహరం
3. ఉష్ణశీతల ప్రవాహాలు కలిసే ప్రదేశం
4. వేలా పరిమితి తక్కువగా ఉండే వేలా తరంగాలు
534. ఒక డిగ్రీ రేఖాంశంపై పూర్తి చేయడానికి భూభ్రమణం ఎంతకాలం తీసుకుంటుంది?
1. 21 నిమిషాలు 2. 40 నిమిషాలు
3. 4 నిమిషాలు 4. 51 సెకన్లు
535. గ్రీన్విచ్ కాలం ఏ రేఖాంశంపై ఆధాపడుతుంది?
1. 12o తూర్పు రేఖాంశం
2. ప్రథమ మెరిడియన్ (0o రేఖాంశం)
3. 180o మెరిడియన్
4. 82 1/2o రేఖాంశం
536. భూమి తిరిగే దిశ
1. తూర్పు నుంచి పశ్చిమం
2. పశ్చిమం నుంచి తూర్పుకు
3. ఉత్తరం నుంచి దక్షిణానికి
4. దక్షిణం నుంచి ఉత్తరానికి
537. కింది వాటిలో ఏ ఆవరణంలో వాతావరణం మార్పు చెందుతుంది?
1. స్ట్రాటో ఆవరణం 2. ఓజోన్ ఆవరణం
3. ట్రోపో ఆవరణం 4. ఐనో ఆవరణం
538. జెట్ విమానాలు ప్రయాణించటానికి అనువైన వాతావరణ పొర?
1. ట్రోపో ఆవరణం 2. ఐనో ఆవరణం
3. స్ట్రాటో ఆవరణం 4. ఓజోన్ ఆవరణం
539. అర్ధశుష్క ప్రాంతంలో రాతిమీద ఏర్పడ్డ వాలు?
1. బజాడా 2. పెడిమెంట్
3. పెడి – ప్లేన్ 4. ప్లయీ
540. “ఆంథ్రపోజాగ్రఫీ” పుస్తక రచయిత?
1. రాట్జెల్ 2. హంబెల్ట్
3. రిట్టర్ 4. లాబ్లాష్
541. సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం?
1. శుక్రుడు 2. అంగారకుడు
3. భూమి 4. బుధుడు
542. కింది వాటిలో ఏది ఎరుపు గ్రహం?
1. అంగారకుడు 2. శుక్రుడు
3. ఫ్లూటో 4. బృహస్పతి
543. సౌర కుటుంబంలో అతి దూరంలో ఉన్న గ్రహం?
1. భూమి 2. అంగారకుడు
3. ఫ్లూటో 4. బృహస్పతి
544. ఇటీవల కాలంలో కనుగొన్న నూతన గ్రహం?
1. కుజుడు 2. అంగారకుడు
3. ఫ్లూటో 4. నెఫ్ట్యూన్
545. భూమి మీద గల నేల, నీటి శాతం?
1. 60, 40 2. 70, 30
3. 29, 71 4. 50, 50
546. కాలాలు ఏ కారణాల వల్ల ఏర్పడతాయి?
1. భూభ్రమణం
2. భూపరిభ్రమణం వల్ల
3. సూర్యగ్రహణం 4. చంద్రగ్రహణం
547. సూర్యగ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది?
1. సూర్యుడు భూమికి, చంద్రుడికి మధ్య వచ్చినప్పుడు
2. భూమి సూర్యుడు చంద్రుడికి మధ్య వచ్చినప్పుడు
3. చంద్రుడు భూమికి సూర్యడికి మధ్య వచ్చినప్పుడు 4. పైవన్నీ
548. ఐసోహెల్ అంటే?
1. సమపీడనం 2. సమాన వర్షపాతం
3. సమాన సూర్యకాంతి
4. సమాన ఎత్తు
549. సూర్యుని నుంచి వెలువడే ఉష్ణోగ్రతను వికిరణం ద్వారా భూమి గ్రహించే ప్రక్రియ?
1. భూ ఉష్ణోగ్రత తగ్గుదల
2. భూ ఉష్ణోగ్రత పెరుగుదల
3. అతినీల లోహిత కిరణాల
రేడియేషన్ పెరగడం
4. వర్షపాతం పెరుగుదల
550. వాతావరణ కాలుష్యం వల్ల ఏర్పడిన కార్బన్‌డై ఆక్సైడ్ ప్రభావం?
1. భూ ఉష్ణోగ్రత తగ్గుదల
2. భూ ఉష్ణోగ్రత పెరుగుదల
3. అతినీలలోహిత కిరణాల రేడియేషన్ పెరగడం
4. వర్షపాతం పెరుగుదల
551. వాతావరణంలో వేడిని గ్రహించే ప్రక్రియ?
1. ఉష్ణ ప్రవాహం 2. ఉష్ణ సంవహనం
3. ఉష్ణ వికిరణం 4. ఉష్ణ వహనం
552. కింది వాటిలో పోటులు గురించి సరిరైనది కానిది?
1. సూర్యనికంటే చంద్రుడు తక్కువ ప్రభావాన్ని పోటులపై కలిగి ఉండటం.
2. సూర్యుని – చంద్రుని గురుత్వాకర్షణ వల్ల పోటులు సంభవించటం.
3. పోటులు ఏర్పడటంలో సూర్యుని కంటే చంద్రుని ప్రభావం ఎక్కువ ఉండటం
4. చంద్రుని గురుత్వాకర్షణ శక్తివల్ల ఏర్పడే పోటు హెచ్చుగా ఉండటం
553. కింది వాటిలో దేన్ని సాయంత్ర నక్షత్రం అంటారు?
1. అంగారకుడు 2. శుక్రుడు
3. బుధుడు 4. శని
సమాధానాలు
491-3 492-3 493-1 494-1
495-1 496-3 497-2 498-1
499-3 500-1 501-1 502-3
503-2 504-2 505-1 506-2
507-4 508-1 509-2 510-3
511-1 512-3 513-3 514-2
515-1 516-1 517-1 518-4
519-2 520-2 521-1 522-2
523-1 524-1 525-4 526-3
527-1 528-2 529-3 530-4
531-1 532-1 533-1 534-3
535-2 536-2 537-3 538-3
539-2 540-1 541-4 542-1
543-3 544-4 545-3 546-2
547-3 548-3 549-1 550-2
551-2 552-1 553-2
తెలుగు అకాడమీ సౌజన్యంతో
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు