General Studies – Groups Special | ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
అక్టోబర్ 17వ తేదీ తరువాయి
44. గురుత్వాకర్షణ సిద్ధాంతం?
1) విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది
2) సూర్యుడు, నక్షత్రాలకు మాత్రమే వర్తిస్తుంది
3) తెలిసిన అన్ని బలాలకు వర్తిస్తుంది
4) సౌర వ్యవస్థకు మాత్రం వర్తించదు
45. ఎక్స్ కిరణాలు (ఎక్స్-రే)లను కనుగొన్నది ఎవరు?
1) రాంటోజన్ 2) స్టీవెన్సన్
3) అండర్సన్ 4) రూథర్‌ఫర్డ్
46. జీర్ణక్రియానంతరం మాంసకృత్తులు ఏ విధంగా జల విశ్లేషణ చెందుతాయి?
1) గ్లూకోజ్ 2) అమైనోఆమ్లాలు
3) కొవ్వు ఆమ్లాలు 4) గ్లిజరాల్
47. లెవోయిజర్ ప్రతిపాదించిన వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి?
1) బొగ్గుపొడిని మండించినపుడు గంట జాడీలో వెలువడిన వాయువును స్థిరమైన వాయువు అని గుర్తించాడు
2) మనం పీల్చే వాయు పదార్థాలను మండించడానికి కూడా తోడ్పడుతుంది
3) గాలిలో స్థిరమైన వాయువు 1/6వ వంతు పరిమాణంలో ఉంటుంది
4) మనం విడిచేగాలి సున్నపునీరుపై ఎటువంటి ప్రభావాన్ని చూపించదు
48. అమినో ఆమ్లాల పాలిమర్లు?
1) పిండి పదార్థాలు 2) మాంసకృత్తులు
3) కొవ్వులు 4) లిపిడ్లు
49. కింది అంశాలు అధ్యయనం చేసి సరికాని వాటిని గుర్తించండి?
ఎ) మానవుడిలో మూత్ర పిండాలు యూరియాను సంశ్లేషించి విసర్జిస్తాయి
బి) కీటకాలు వృక్కాల ద్వారా విసర్జిస్తాయి
సి) వానపాము, జలగలో మాల్ఫీజియన్ నాళికలు ముఖ్య విసర్జకావయవాలు
డి) బల్లపరుపు పురుగులు జ్వాలా కణాలతో విసర్జిస్తాయి
1) బి, సి 2) బి, సి, డి
3) డి, సి, ఎ 4) ఎ, బి
50. మనిషి గుండెలో రక్త ప్రవాహం?
1) శరీరభాగాలు – కుడి కర్ణిక – కుడి జఠరిక – ఎడమ కర్ణిక- ఎడమ జఠరిక
2) ఎడమ జఠరిక – శరీర భాగాలు – కుడి కర్ణిక- కుడి జఠరిక -ఊపిరి తిత్తులు- ఎడమ కర్ణిక
3) ఊపిరితిత్తులు- కుడి కర్ణిక- కుడి జఠరిక- శరీర భాగాలు
4) ఊపిరితిత్తులు- ఎడమ కర్ణిక – ఎడమ జఠరిక- కుడి కర్ణిక- కుడి జఠరిక
51. మానవ శరీరంలో ఉండే అతిపొడవైన కణం?
1) రాడ్స్, కోన్స్ 2) ఎర్రరక్తకణం
3) నాడీకణం 4) తెల్లరక్తకణం
52. మిడ్ గెట్స్ అంటే?
1) శిశుదశలో సోమాటోట్రోపిన్ అధికోత్పత్తి వల్ల కలిగే మరుగుజ్జుతనం
2) శిశుదశలో సోమాటోట్రోపిన్ అల్పోత్పత్తి వల్ల కలిగే మరుగుజ్జుతనం
3) థైరాక్సిన్ అధికోత్పత్తి వల్ల కలిగే అపస్థితి
4) 2, 3
53. మానవ శరీరంలో వెన్నెముక నరాలు ఎన్ని?
1) 31 జతలు 2) 32 జతలు
3) 33 జతలు 4) 30 జతలు
54. దేహ ఉష్ణోగ్రతను నియంత్రించేది?
1) గుండె
2) చర్మస్రావ గ్రంథులు
3) హర్డీనియన్ గ్రంథులు
4) స్వేద గ్రంథులు
55. సుఖ ప్రసవానికి, పొదుగు నుంచి పాల విడుదలకు తోడ్పడే హార్మోన్ ఏది?
1) ఈస్ట్రోజన్ 2) ప్రొజెస్టిరాన్
3) ఆక్సిటోసిన్ 4) టెస్టోస్టిరాన్
56. కింది వాటిని జతపరచండి? వ్యాధిపేరు వ్యాధికారక బ్యాక్టీరియా
1) ధనుర్వాతం ఎ) క్లాస్ట్రీడియం టెటాని
2) కోరింతదగ్గు బి) హిమోఫిల్లస్ పెర్టుసిస్
3) గొంతువాపు సి) స్ట్రెప్టోకోకస్
4) సిఫిలిస్ డి) ట్రిఫోనిమా పల్లడమ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
3) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
57. కింది వాటిలో పత్రాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే మొక్క ఏది?
1) బ్రయోఫిల్లమ్ 2) బెగోనియా
3) సిల్లా 4) పైవన్నీ
58. ఫలాల అధ్యయన శాస్త్రం?
ఎ) పామోలజీ 2) ఫిలాలజీ
3) పిస్సికల్చర్ 4) కాలోలజీ
59. బఠానీ మొక్కలో పొడవు కోసం రెండు వేర్వేరు భిన్న జన్యువులు ఉంటే?
1) వ్యందత్వం 2) ఆధిపత్యం
3) హోమోజైగస్ 4) హెటిరోజైగస్
60. కిందివాటిలో సరైన వాక్యాలేవి?
ఎ) పుట్టగొడుగుల విత్తనాలను స్పాన్ అంటారు
బి) పుట్టగొడుగుల్లో ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ రోగులు తినవచ్చు
సి) ‘అమనీటా’ అనేది విషపూరిత
పుట్టగొడుగు ప్రజాతి పేరు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
61. అత్యంత తేలికైన మూలకం?
1) హైడ్రోజన్ 2) ఆస్మియం
3) లిథియం 4) పాదరసం
62. నీటిని క్రిమిరహితంగా చేసే ప్రక్రియలు ఏవి?
ఎ) బ్లీచింగ్ పౌడర్ కలపడం
బి) క్లోరినీకరణం చేయడం
సి) అతినీలలోహిత కిరణాలకు గురిచేయడం
డి) ఓజోనీకరణం చేయడం
ఇ) ఫ్లోరినీకరణం
1) ఎ, ఇ 2) బి, సి, ఇ
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, సి
63. పరమాణవును పుచ్చపండుతో పోల్చినవారు?
1) డాల్టన్ 2) రూథర్‌ఫర్డ్
3) జె.జె.థామ్సన్ 4) చాడ్విక్
64. ఎలక్ట్రాన్‌కు సంబంధించి కింది వాటిలో సరికానిది?
1) రుణావేశ ఎలక్ట్రాన్లు ఎల్లప్పుడూ ధనావేశ కేంద్రకం చేత స్థిర విద్యుదాకర్షక బలాల ద్వారా ఆకర్షితమవుతాయి
2) కేంద్రకానికి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్ కేంద్రకంతో బలంగా ఆకర్షణ పొందడం వల్ల దానికి అతి తక్కువ స్థితి శక్తి ఉంటుంది
3) కేంద్రకానికి దూరంగా ఉన్న ఎలక్ట్రాన్‌కు అధిక స్థితి శక్తి ఉంటుంది.
4) ఒక పరమాణువును వేడి చేసినపుడు అందులో ఉన్న ఎలక్ట్రానులన్నీ బయటకు విడుదలవుతాయి
65. పరమాణు సంఖ్య 7 గా గల మూలకం దేనిలో దొరుకుతుంది?
1) 1వ పీరియడ్ IA గ్రూప్
2) 2వ పీరియడ్ VA గ్రూప్
3) 2వ పీరియడ్ IIIA గ్రూప్
4) 2వ పీరియడ్ IVA గ్రూప్
66. ఆధునిక ఆవర్తన పట్టికలోని మొదటి మూలకం?
1) ఆక్సిజన్ 2) హైడ్రోజన్
3) నైట్రోజన్ 4) కార్బన్
67. సంకరీకరణం అనే భావన ఏ అణువులను తెలుసుకోవడానికి ఒక సులువైన మార్గం
1) చర్యాశీలత 2) ఆకారం
3) సాదృశ్యాలు 4) బంధదూరాలు
68. సోడానీటిలో ఉండే ఆమ్లం?
1) కార్బోనికామ్లం 2) ఫాస్ఫారికామ్లం
3) సల్యూరికామ్లం 4) వెనిగర్
69. ఆమ్లవర్షానికి కారణమైన ఆక్సైడ్లు
ఎ) నైట్రోజన్ ఉన్నత ఆక్సైడ్లు
బి) సల్ఫర్ ఆక్సైడ్లు
సి) కార్బన్ ఆక్సైడ్లు
డి) క్లోరిన్ ఆక్సైడ్లు
1) ఎ 2) ఎ, బి
3) ఎ, బి, సి డి) పైవన్నీ
70. ఓజోన్‌పొర తగ్గుదలకు కారణమైన వాయువు?
1) క్లోరోఫ్లోరో కార్బన్
2) కార్బన్ మోనాక్సైడ్
3) కార్బన్ డై ఆక్సైడ్ 4) నైట్రస్ ఆక్సైడ్
71. ఇనుము తుప్పు పట్టినప్పుడు బరువు పెరగడానికి కారణం?
1) ఐరన్ సల్ఫైడ్‌గా మారడం
2) ఐరన్ ఆక్సైడ్‌గా మారడం
3) ఐరన్ బై కార్బోనేట్‌గా మారడం.
72. పిల్లలకు ఉపయోగించే లంగోటి, బ్యాండేజీలు, గాయానికి కట్టుకట్టేందుకు ఉపయోగించే దారం?
1) నైలాన్ 2) రేయాన్
3) అక్రలిక్ 4) పాలిస్టర్
73. కృత్రిమ బట్టల సబ్బులు ఒక ….
1) ఫ్యాటీ ఆమ్లాల లవణాలు
2) సోడియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్ మిశ్రమం
3) హైడ్రోక్లోరిక్ ఆమ్లానికి సంబంధించిన కాల్షియం లవణాలు
4) అరోమాటిక్, అలిఫాటిక్ సల్ఫోనిక్ ఆమ్లానికి సంబంధించిన సోడియం లవణాలు
75. ఫ్లై యాష్ గురించి సరికాని వాక్యం ఏది?
1) థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఉప ఉత్పన్నంపై యాష్
2) ఫ్లైయాష్కు ధర్మం ఉంటుంది
3) నీటిని పీల్చుకునే ధర్మం ఉంటుంది
4) విషపూరిత మూలకాలు ఉండవు
75. పొడిమంచును రసాయనికంగా?
1) శుద్ధజలంతో తయారైన మంచు
2) ఘన కార్బన్ డై ఆక్సైడ్
3) ఘన సల్ఫర్ డై ఆక్సైడ్
4) ఉపశూన్య ఉష్ణోగ్రత వద్ద గల మంచు
76. కింది వాటిలో సరికానిది ఏది?
1) భారతదేశ ప్రత్యేక ఆర్థిక మండలి పరిధి 200 నాటికల్ మైళ్లు
2) లక్షదీవుల్లో చివరగా ఉన్న దీవి మినికాయ్ దీవి
3) పాకిస్థాన్ మన దేశంలోని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ర్టాలతో సరిహద్దును కలిగి ఉంది
4) అండమాన్ నికోబార్ దీవులు అగ్నిపర్వత టెర్షియరీ మహాయుగానికి చెందినవి
77. భారతదేశ దక్షిణ చివరి ప్రాంతమైన ‘ఇందిరాపాయింట్’ ఎక్కడ ఉంది?
1) కేరళ 2) లక్షదీవులు
3) గ్రేట్ నికోబార్ 4) లిటిల్ నికోబార్
78. ప్రతిపాదన(ఎ): ట్రాన్స్ హిమాలయ మండలం అనేక ప్రముఖ నదులకు జన్మస్థానం.
కారణం(ఆర్): ‘మానససరోవరం’ హిమాద్రి శ్రేణుల్లో ఉంది. సరైనదాన్ని గుర్తించండి.
1) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ కాదు
3) ‘ఎ’ నిజం కానీ ‘ఆర్’ తప్పు
4) ‘ఎ’ తప్పు కానీ ‘ఆర్’ నిజం
79. నైరుతి రుతుపవనాల సమయంలో వర్షం పొందని ప్రాంతం ఏది?
1) జైపూర్ 2) తంజావూర్
3) జబల్పూర్ 4) కొచ్చిన్
80. కింది వాటిని జతపరచండి?
1) చెర్రీ బ్లాసమ్స్ ఎ) అసోం
2) కాలబైసాఖీలు బి) కర్ణాటక
3) అంథీలు సి) పశ్చిమబెంగాల్
4) టీషవర్స్ డి) ఉత్తరప్రదేశ్
1) 1-సి. 2-డి, 3-బి, 4-ఎ
2) 1-డి. 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి. 2-ఎ, 3-సి, 4-బి
4) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
81. కింది వాటిలో తప్పు జత ఏది?
1) గోదావరి -శబరి
2) పెన్నా – ఇంద్రావతి
3) కృష్ణా-కోయన
4) కావేరి – హేమావతి
82. కిందివాటిని జతపరచండి?
1) సింధూనది ఎ) రోహతంగ్ కనుమ
2) బ్రహ్మపుత్ర నది బి) ఖోఖారచూ
3) తీస్తానది సి) షమయంగ్ డమ్
4) బియాస్ నది డి) చిత్రం సరస్సు
1) 1-సి. 2-డి, 3-బి, 4-ఎ
2) 1-బి. 2-డి, 3-ఎ, 4-సి
3) 1-బి. 2-సి, 3-డి, 4-ఎ
4) 1-సి, 2-ఎ, 3-డి, 4-బి
83. ప్రతిపాదన(ఎ): భారతదేశంలో నీటి పారుదల సౌకర్యాల అభివృద్ధికి తగినన్ని భౌగోళిక అవకాశాలున్నాయి.
కారణం(ఆర్): దేశంలో జీవనదులు, ఆనకట్టలు నిర్మించడానికి అనువైన స్థలాలు ఉన్నాయి. సరైనదాన్ని గుర్తించండి.
1) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ
2) ‘ఎ’, ‘ఆర్’ సరైనవే, ‘ఆర్’ ‘ఎ’కు సరైన వివరణ కాదు
3) ‘ఎ’ నిజం కానీ ‘ఆర్’ తప్పు
4) ‘ఎ’ తప్పు కానీ ‘ఆర్’ నిజం
84. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఖరీఫ్ కాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది
2) బార్లీ ఖరీఫ్ కాలానికి చెందిన పంట
3) మనదేశంలో ప్రధాన వ్యవసాయ పంటకాలం ఖరీఫ్
4) రబీ కాలం ముఖ్యమైన పంట గోధుమ
85. కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి?
ఎ) నల్లరేగడి నేలలు భూసారానికి పెట్టింది పేరు
బి) ఇవి తక్కువ ఎరువుల వాడకంలో ఎక్కువ దిగుబడినిస్తాయి
సి) ఇవి వేసవిలో చాలా గట్టిగా వర్షాకాలంలో జిగటగా ఉండటం వల్ల వీటిని దున్నటం కష్టం
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
86. కింది వాటిని జతపరచండి?
ఖనిజాలు రాష్ర్టాలు
1) వజ్రాలు ఎ) తమిళనాడు
2) రాగి బి) కర్ణాటక
3) బంగారం సి) మధ్యప్రదేశ్
4) లిగ్నైట్ డి) రాజస్థాన్
1) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి
2) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
3) 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
87. కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) రాయల్ బెంగాల్ పేపర్ మిల్లు కోల్‌కతా సమీపంలోని బాలిగంజ్ వద్ద ఏర్పాటు చేశారు
2) భారత్‌లో మొదట తోలు పరిశ్రమను 1960లో బాటానగర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు
3) నేషనల్ న్యూస్‌ప్రింట్ మిల్‌ను మధ్యప్రదేశ్‌లోని నేపానగర్‌లో ఏర్పాటు చేశారు
4) కాగితం ఉత్పత్తిలో మొదట స్థానం పశ్చిమబెంగాల్ రాష్ర్టానిది
88. మణుగూరు భారజల కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ 4) ఛత్తీస్‌గఢ్
సమాధానాలు
44-1 45-1 46-2 47-4
48-2 49-1 50-2 51-3
52-2 53-1 54-4 55-3
56-1 57-4 58-1 59-4
60-4 61-3 62-3 63-3
64-4 65-2 66-2 67-2
68-1 69-2 70-3 71-2
72-2 73-4 74-4 75-2
76-3 77-3 78-3 79-2
80-4 81-2 82-3 83-1
84-2 85-4 86-3 87-2
88-3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్ 9652578639
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు