Economy | రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
1. కింది వాటిలో శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు సంబంధించినవి ఏవి?
ఎ) దీన్ని పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు
బి) 1963 జూలై 26న నిర్మాణం
సి) 20 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించడం దీని లక్ష్యం
డి) పైవన్నీ
2. జైభారత్ రెడ్డి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ఎ) 1982 బి) 1983
సి) 1984 డి) 1985
3. కింది వాటిని జతపరచండి?
ఎ) 1951లో భారతదేశ లింగ నిష్పత్తి 1) 943
బి) 1951లో తెలంగాణ లింగ నిష్పత్తి 2) 988
సి) 2011లో భారతదేశ లింగ నిష్పత్తి 3) 946
డి) 2011లో తెలంగాణ లింగ నిష్పత్తి 4) 980
4. అధిక అక్షరాస్యత గల జిల్లాలు ఏవి?
ఎ) హైదరాబాద్, రంగారెడ్డి
బి) రంగారెడ్డి, హైదరాబాద్
సి) మేడ్చల్ మల్కాజిగిరి , హైదరాబాద్
డి) ఏదీకాదు
5. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 3 దశలు ఏవి?
ఎ) 1956-65, 1965-90, 1991-2014
బి) 1956-70, 1971-90, 1991-2014
సి) 1956-80, 1981-90, 1991-2014
డి) ఏదీకాదు
6. ఆవిర్భవించే ఆదాయానికి, సిద్ధించే ఆదాయానికి తేడా ఏమిటి?
ఎ) తరుగుదల
బి) ఉత్పాదక విలువ
సి) వినియోగించే మూలధనం
డి) అంతర్రాష్ట్ర ఆదాయం
7. కింది వాటిలో రైత్వారీ పద్ధతికి సంబంధించినవి ఏది?
ఎ) రైత్వారీ విధానంలో రైతు నేరుగా ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తాడు
బి) దీన్ని మొదట 1792లో మద్రాస్‌లో ప్రారంభించారు
సి) దీన్ని థామస్‌మన్రో ప్రవేశ పెట్టారు
డి) పైవన్నీ
8. కింది వాటిని జతపరచండి?
ఎ) జమీందారీ విధానం 1) 1949
బి) రైత్వారీ విధానం 2) 1948
సి) ఆంధ్రాలో జమిందారీ రద్దు చట్టం 3) 1793
డి) తెలంగాణలో 4) 1792 జాగీర్ధారీ రద్దు చట్టం
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-4, బి-3, సి-2, డి-1
సి) ఎ-3, బి-4, సి-1, డి-2
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
9. కిందివాటిలో భూ సంస్కరణల ప్రధాన లక్ష్యాలు ఏవి?
ఎ) భూ యజమాన్యంలో అసమానతల తొలగింపు
బి) సామాజిక న్యాయం
సి) వ్యవసాయ సాధికారత సాధించడం
డి) పైవన్నీ
10. జతపరచండి?
ఎ) బేతాయి 1) భూమిపై హక్కులు లేనివారు
బి) గుల్లామక్తా 2) భూమిపై హక్కులు కలవారు
సి) అసామీ షక్మీదారులు 3) స్థిరకౌలు పద్ధతి
డి) షక్మీదారులు 4) పంటలో కొంత భాగం కౌలుగా చెల్లించడం
ఎ) ఎ-4, బి-3, సి-1, డి-2
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-4, సి-3, డి-1
డి) ఎ-3, బి-2, సి-4, డి-1
11. మొట్టమొదట భూ పంపిణి పథకం ఎక్కడి నుంచి ప్రారంభమైంది?
ఎ) జనగాం బి) కొడంగల్
సి) హైదరాబాద్ డి) షాద్‌నగర్
12. ఏ సంవత్సరంలో భూమి హక్కుల రికార్డు చట్టం రూపొందించారు?
ఎ) 1972 బి 1973
సి) 1971 డి) 1974
13. కింది వాటిలో టీ రేషన్‌కు సంబంధించినవి?
ఎ) రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పోర్టబులిటీ విధానం 2018 ఏప్రిల్ 1 నుంచి అమలు
బి) ఈ శాఖ ప్రచురించే పత్రిక పేరు వినియోగ తరంగిణి
సి) చౌకధరల దుకాణాల్లో ఈ పాస్ యంత్రాల ద్వారా లావాదేవీలు జరుగుతాయి
డి) పైవన్నీ
14. కిందివాటిలో సంస్థాగత పరపతి మూలాధారం ఏది?
ఎ) వడ్డీవ్యాపారులు
బి) బంధువులు, స్నేహితులు
సి) ప్రభుత్వం డి) వ్యాపారస్థులు
15. కింది వాటిలో నాబార్డుకు సంబంధించినది?
ఎ) ఇది రైతులకు ప్రత్యక్షంగా రుణం ఇవ్వదు
బి) గ్రామీణాభివృద్ధిలో ఇది శిఖరాగ్ర బ్యాంకు
సి) గ్రామీణ అవస్థాపన అభివృద్ధి నిధి 1995 ఏప్రిల్ 1న ఏర్పాటు
డి) పైవన్నీ
16. సంస్థాగతం కాని పరపతి లక్షణాలు ఏవి?
ఎ) ఈ రుణాలు సులభంగా లభిస్తాయి
బి) ఈ రుణాలపై వడ్డీరేటు ఎక్కువగా ఉంటుంది
సి) ఈ రుణాల వసూళ్లలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది డి) పైవన్నీ
17. కింది ప్రత్యేక దినోత్సవాలను జతపరచండి?
ఎ) అంతర్జాతీయ 1) అక్టోబర్ 2వ పాల దినోత్సవం శుక్రవారం
బి) ప్రపంచ మత్స్య 2) జూలై 10 రైతుల దినోత్సవం
సి) జాతీయ మత్స్య 3) జూన్ 1 రైతుల దినోత్సవం
ఎ) 3, 1, 2 బి) 3, 2, 1
సి) 1, 2, 3 డి) పైవన్నీ సరైనవి
18. జంగల్ బచావో – జంగల్ బడావో (అడవిని కాపాడుదాం- అడవిని విస్తరిద్దాం) అనేది ఎన్నో విడత హరితహారం నినాదం?
ఎ) రెండో బి) మూడో
సి) నాల్గో డి) ఐదో
19. తెలంగాణలో భూసార పరీక్ష కేంద్రాలు ఎన్ని కలవు?
ఎ) 60 బి) 65 సి) 20 డి) 64
20. టాస్క్ (TASK) అంటే?
ఎ) తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్
బి) తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్
సి) తెలుగు అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్
డి) తెలుగు అకాడమీ ఫర్ సేవ్ అండ్ నాలెడ్జ్
21. కింది వాటిలో డిజిటల్ తెలంగాణ పథకం గురించి సరైంది?
ఎ) దీన్ని 2015 జూలై 1న ప్రారంభం
బి) ఇది డిమాండ్, సప్లయ్ వైపు లక్ష్యాలు కలవు
సి) అందరికి డిజిటల్ సౌకర్యాలు కల్పించడం సప్లయ్వైపు లక్ష్యం కల్పించిన సౌకర్యాలు అందరూ ఉపయోగించడం డిమాండ్ వైపు లక్ష్యం
డి) పైవన్నీ
22. కింది వాటిలో జతపరచండి.
ఎ) టి-ఫైబర్ 1) 2017 జూలై 1
బి) టి-హబ్ 2) 2015 జూలై 1
సి) టి-వాలెట్ 3) 2015
డి) డిజిటల్ 4) 2015 నవంబర్ 5 తెలంగాణ కేంద్రం
ఎ) ఎ-3, బి-4, సి-2, డి-1
బి) ఎ-3, బి-4, సి-1, డి-2
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-1, బి-2, సి-3, డి-4
23. ఎంఎంటీఎస్ అంటే?
ఎ) మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్
బి) మోడల్ మోరల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం
సి) మల్టీ మోడల్ ట్రేడ్ సిస్టం
డి) మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ స్టేట్
24. కింది వాటిలో తప్పును గుర్తించండి?
ఎ) బ్యాంకింగ్ అనేది సేవా రంగంలో ముఖ్యమైనది
బి) అదృశ్య వ్యాపారం అనేది పర్యాటక రంగానికి మరోపేరు
సి) చిన్న తరహా పరిశ్రమల పరిశీలనకు 1955లో కార్వే కమిటీ నియామకం
డి) అబిద్ హుస్సేన్ కమిటీ -1999
25. పోచంపల్లి చీరలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాముఖ్యం పొందాయి?
ఎ) 1900 బి) 1800
సి) 1700 డి) 1600
26. కింది వాటిలో కాగితం మిల్లులను వాటిని ఉత్పత్తి చేసే ప్రాంతాన్ని జతపరచండి?
ఎ) చార్మినార్ పేపర్ మిల్లు 1) కమలాపురం (వరంగల్)
బి) నాగార్జున పేపర్ మిల్లు 2) నాచం గూడెం,(ఖమ్మం)
సి) తెలంగాణ పేపర్ మిల్లు 3) పటాన్ చెరువు (రంగారెడ్డి)
డి) ఏపీ రేయాన్స్ లిమిటెడ్ 4) మాతంగి (మెదక్)
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-2, బి-1, సి-2, డి-4
డి) ఎ-4, బి-1, సి-3, డి-2
27. కింది సిమెంట్ పరిశ్రమలను జతపరచండి?
ఎ) నాగార్జున సిమెంట్ 1) కేతనపల్లి (నల్లగొండ)
బి) మహా సిమెంట్ 2) మేళ్ళ చెరువు (సూర్యపేట)
సి) దక్కన్ సిమెంట్ 3) వాడపల్లి (నల్లగొండ)
డి) రాశి సిమెంట్ 4) హుజూర్ నగర్ (సూర్యపేట)
ఎ) ఎ-1, బి-2, సి-4, డి-3
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-4, బి-3, సి-2, డి-1
డి) ఎ-2, బి-1, సి-3, డి-4
28. భువనగిరి కోటను ఎన్ని అడుగుల ఎత్తులో నిర్మించారు?
ఎ) 400 బి) 500
సి) 800 డి) 1000
29. టి-హబ్ అంటే?
ఎ) తెలంగాణ ప్రభుత్వం కొత్త కంపెనీల స్థాపనకు సహాయం చేసే ఒక టెక్ ఇంక్యుబేటర్
బి) భారత ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో గుర్తించిన పర్యాటక కేంద్రాల సమూహం
సి) హైదరాబాద్ ఇరానీ టీ హోటళ్లలో గొలుసుకట్టు
డి) తెలంగాణ ఒక ప్రఖ్యాతి కేబుల్ టీవీ నెట్వర్క్
30. కేబీఆర్ నేషనల్ పార్క్‌ను ఎప్పుడు స్థాపించారు?
ఎ) 1992 బి) 1993
సి) 1994 డి) 1995
31. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పూర్వం ఏమని పిలిచేవారు?
ఎ) ఏక చక్రపురం బి) ద్విచక్రా పురం
సి) నిజాం ఫ్యాక్టరీ డి) తెలంగాణ ఫ్యాక్టరీ
32. రామగిరి ఖిల్లాను ఏ శతాబ్దంలో నిర్మించారు?
ఎ) 10 బి) 11 సి) 12 డి) 13
33. కింది వాటిలో చిలుకూరు బాలాజీ దేవాలయానికి సంబంధించినవి ఏవి?
ఎ) ఇది రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ప్రాంతంలో ఉంది
బి) దీన్ని అక్కన్న, మాదన్న కాలంలో నిర్మించారు
సి) దీనికి వీసాగుడి అని పేరు ఉంది
డి) పైవన్నీ
34. దక్షిణకాశీ అని దేన్ని పిలుస్తారు?
ఎ) కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం
బి) రాజరాజేశ్వరాలయం
సి) శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
డి) పైవన్నీ
35. నిర్మల్ కోటకు మరొకపేరు?
ఎ) షామ్గర్ల్కోట
బి) ఫామ్గర్ల్ కోట
సి) ఆగ్రాకోట డి) నందికోట
36. వేయిస్తంభాల గుడి గురించి సరైనవి?
ఎ) కాకతీయరాజు రుద్రదేవుడు 1163లో నిర్మించాడు
బి) ఈ దేవాలయం మహాశివుడు, విష్ణువు, సూర్యుడికి అంకితం చేశారు
సి) దీన్ని త్రికూటాలయంగా కూడా పిలుస్తారు డి) పైవన్నీ
37. చిన్న పరిశ్రమల వల్ల లాభాలేవి?
ఎ) తక్కువ పెట్టుబడి
బి) ఎక్కువ మందికి ఉపాధి
సి) తక్కువ ఫలాన కాలం డి) పైవన్నీ
38. హరిత హారం ద్వారా అటవీ ప్రాంతం ఎంత శాతం విస్తరించాలని అంచనా ?
ఎ) 30 శాతం డి) 37 శాతం
సి) 40 శాతం డి) 44 శాతం
39. 2014లో ప్రభుత్వం జరిపిన సర్వేలో ఎన్ని చెరువులు గుర్తించబడ్డాయి?
ఎ) 45,400 బి) 46,000
సి) 46,531 డి) 48,000
40. మాగాణి భూములు అంటే?
ఎ) వర్షాధార మెట్టభూములు
బి) పొడి భూములు
సి) తడి భూములు డి) ఎ, బి
41. జలాశయం కొత్తపేర్లను జతపరచండి?
ఎ) మేడిగడ్డ 1) లక్ష్మి
బి) అన్నారం 2) సరస్వతి
సి) సుందిళ్ల 3) పార్వతి
డి) లక్ష్మీపూర్ పంప్‌హౌస్ 4) గాయత్రి
ఎ) ఎ-4, బి-3, సి-2, డి-1
బి) ఎ-1, బి-2, సి-3, డి-4
సి) ఎ-1, బి-2, సి-4, డి-3
డి) ఎ-3, బి-4, సి-1, డి-2
42. నీటిపారుదల వనరులు ఎన్ని విధాలుగా ఉంటాయి?
ఎ) 2 బి) 3 సి) 4 డి) 5
43. కోతులు వాపస్ పోవాలె, వానలు వాపస్ రావాలే అనేది ఎన్నోవిడత హరితహారం నినాదం?
ఎ) మొదటిది బి) రెండోది
సి) మూడోది డి) నాల్గోది
44. కిందివాటిని జతపరచండి?
ఎ) ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారత్ స్థానం 1) 3
బి) ప్రపంచంలో పాల ఉత్పత్తిలో భారత్ స్థానం 2) 1
సి) ప్రపంచంలో మాంసం ఉత్పత్తిలో భారత్ స్థానం 3) 5
ఎ) ఎ-2, బి-3, సి-1
బి) ఎ-3, బి-2, సి-1
సి) ఎ-1, బి-2, సి-3 డి) ఎ, సి
45. రైతుబంధు నుంచి లబ్ధిపొందే వారు అధికంగల జిల్లాలు ఏవి?
ఎ) నల్లగొండ, సంగారెడ్డి
బి) ములుగు, రంగారెడ్డి
సి) ఆదిలాబాద్, నిజామాబాద్
డి) కరీంనగర్, వరంగల్
జవాబులు
1-డి 2-సి 3-ఎ 4-ఎ 5-బి 6-బి 7-డి 8-ఎ
9-డి 10-ఎ 11-బి 12-సి 13-డి 14-సి 15-డి 16-డి 17-ఎ 18-డి 19-డి 20-ఎ 21-డి 22-బి 23-ఎ 24-డి 25-బి 26-ఎ 27-ఎ 28-బి 29-ఎ 30-సి 31-ఎ 32-సి 33-డి 34-బి 35-ఎ 36-డి 37-డి 38-బి 39-సి 40-సి 41-బి 42-బి 43-బి 44-సి
45-ఎ
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
Telangana Economy, TSPSC, Competitive exams, Groups Special
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు