Economy | ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు
ఎకానమీ
1. భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త రాజ్‌చెట్టికి జార్జ్ లెడ్లీ అవార్డుకు దేనిలో పరిశోధనకుగాను ఎంపికయ్యారు? (సి)
ఎ) యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాల ప్రయోజనాలను పురోగమింపజేయడం
బి) ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య అపోహలను ఛేదించడం
సి) ఎ, బి డి) ఏదీకాదు
వివరణ: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆర్థికవేత్త రాజ్‌చెట్టి హార్వర్డ్ యూనివర్సిటీ ఇచ్చే ప్రతిష్ఠాత్మక జార్జిలెడ్లి అవార్డ్‌కు ఎంపికైనారు. అమెరికన్ డ్రీమ్ సాకారంలో అపోహలను ఛేదించడానికి బిగ్డాటీ వినియోగంపై కృషికి/యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాల ప్రయోజనాలను పురోగమింపజేయడానికి అవిశ్రాంత కృషికిగాను ఆయన ఈ బహుమతికి ఎంపికైయ్యారు.
- ప్రస్తుతం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తూ ఆర్థిక అసమానతలపై అధ్యయనం చేస్తున్న బృందానికి డైరెక్టర్‌గా కూడా పనిచేస్తున్నారు.
- మానవాళికి, విజ్ఞాన శాస్ర్తానికి గొప్ప సేవలు అందించే హార్వర్డ్ కమ్యూనిటీ సభ్యులకు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ అవార్డును అందిస్తారు.
2. వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థ భావన ఏ మతం నుంచి ఉద్భవించింది? (బి)
ఎ) హిందూ మతం బి) ముస్లిం మతం
సి) సిక్కుమతం డి) బౌద్ధమతం
వివరణ: వడ్డీరహిత బ్యాంకింగ్ వ్యవస్థ భావన ఇస్లామిక్ బ్యాంకింగ్ రూపం నుంచి ఉద్భవించింది. ఇది నైతిక ప్రమాణాల ఆధారంగా పనిచేస్తుంది. ముస్లింలు ఎలాంటి వడ్డీని చెల్లించకుండా లేదా స్వీకరించకుండా నిరోధిస్తుంది. - ఇస్లాం ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఇది సమర్థవంతమైన సాధనంగా పరిగణించబడుతుంది.
- పాకిస్థాన్ ప్రభుత్వం ఇస్లామిక్ చట్టం ప్రకారం 2027 నుంచి దేశంలో వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయాలని యోచిస్తుంది. అంటే వడ్డీ రహిత బ్యాంకింగ్ వ్యవస్థను అమలు చేయనున్న దేశం పాకిస్థాన్.
- పాకిస్థాన్‌లో ప్రస్తుతం ఉన్న వడ్డీ ఆధారిత బ్యాంకింగ్ వ్యవస్థను రద్దు చేయాలనే మొదటి పిటీషన్ 1990లో ఎఫ్ఎస్సీ (ఫెడరల్ షరియా కోర్ట్)లో దాఖలు చేయబడింది.
- పాకిస్థానీ చట్టాలు షరియా చట్టానికి లోబడి ఉన్నాయో లేదో పరిశీలించి నిర్ధారించే అధికారం గల రాజ్యాంగ న్యాయస్థానంలో వివిధ కాలాల్లో, వివిధ దశల్లో వాదనలు, ప్రతివాదనలు తప్పులు రివ్యూ అప్పీల్ దాఖలు జరిగి అంతిమంగా 2022 ఏప్రిల్‌లో ఎఫ్ఎస్సీ షరియా చట్టానికి విరుద్ధంగా ఉన్నందున ఐదేళ్లలో వడ్డీ ఆధారిత వ్యవస్థను రద్దు చేయాలని అంతిమంగా తీర్పు/ పిలుపునిచ్చింది.
- దీని ఫలితంగా 2027 డిసెంబర్ 31 నాటికీ దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి రిబాను -వడ్డీకి ఇస్లామిక్ పదం తొలగించాలని ప్రభుత్వానికి పిలుపునిచ్చింది.
3. భారతదేశంలో జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు? (బి)
ఎ) ఆగస్టు 15 బి) ఆగస్టు 30
సి) సెప్టెంబర్ 1 డి) సెప్టెంబర్ 15
వివరణ: భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 30న దేశంలోని చిన్న తరహా సంస్థల ఔచిత్యాన్ని, సహకారాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం జాతీయ చిన్న పరిశ్రమల
దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. - జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం మూలాలు 2000 ఆగస్టు 30 నాటివి. చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వశాఖ ఒక సమగ్ర విధాన ప్యాకేజీని ఆవిష్కరించింది.
- చిన్న తరహా పరిశ్రమలు ప్రాథమిక అవస్థాపన సౌకర్యాలు, సాంకేతిక, చెల్లింపు ప్రక్రియలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పనిచేస్తుంది.
- భారతదేశ ఆర్థిక రంగానికి చిన్నతరహా పరిశ్రమలు అపారమైన సహకారాన్ని అందిస్తున్నాయి.
- జాతీయ చిన్న పరిశ్రమల దినోత్సవం అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా చిన్న చిన్న వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, ప్రోత్సహించడానికి ఇదొక వేదికగా పనిచేస్తుంది.
- జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా ఐక్యరాజ్యసమితి కూడా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు) ప్రాముఖ్యతను గుర్తించి జూన్ 27న ఎంఎస్ఎంఈ రోజు(day)గా అమలు చేస్తుంది.
- ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చిన్న తరహా పరిశ్రమల పాత్ర 90శాతం కంటే ఎక్కువ సంస్థలను కలిగి ఉండటమే కాకుండా ఉపాధిని కల్పిస్తూ జీడీపీని కూడా ప్రభావితం చేస్తుంది.
4. భారత దేశంలో మొట్టమొదట స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డ్ FIRSTAP ను ఏ బ్యాంకు ప్రారంభించింది? (డి)
ఎ) హెచ్డీఎఫ్సీ బ్యాంక్
2) యాక్సిస్ బ్యాంక్
3) బంధన్ బ్యాంక్
4) ఐడీఎఫ్సీ బ్యాంక్
వివరణ: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ దేశంలో మొట్టమొదటి స్టిక్కర్ ఆధారిత డెబిట్ కార్డ్ Firstap ను ప్రారంభించింది. - ఇది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సహకారంతో ప్రారంభించబడింది.
- ఇది నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్ఎఫ్సీ) ప్రారంభించిన పాయింట్ ఆఫ్ సేల్ టెర్మినల్‌లో స్టిక్కర్‌ను నొక్కడం ద్వారా లావాదేవీలను సులభతరం చేస్తుంది.
- ఇది సాధారణ డెబిట్‌కార్డ్ పరిమాణంలో మూడింట ఒక వంతు ఉంటుంది.
5. ఆర్థిక సర్వేను ప్రతి సంవత్సరం ఎవరు నివేదిస్తారు?(బి)
ఎ) ఆర్థికశాఖ
బి) ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సి) ఆర్థిక వ్యవహారాల శాఖ
డి) రెవెన్యూ శాఖ
వివరణ : ఆర్థిక మంత్రిత్వ శాఖలో భాగమైన ఆర్థిక వ్యవహారాల విభాగం దేశ ఆర్థిక సర్వేను తయారు చేస్తారు. - ప్రధాన ఆర్థిక సలహాదారు పర్యవేక్షణ, మార్గదర్శకత్వంతో సర్వే డాక్యుమెంట్ రూపొందించి, ఆర్థిక మంత్రి ఆమోదం తర్వాత మాత్రమే విడుదల చేస్తారు.
- ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ
విడుదల చేసే వార్షిక పత్రం - ఇది అన్ని రంగాల వివరణాత్మక గణాంక డేటాను అందించడం ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆర్థిక అభివృద్ధిని సమీక్షిస్తుంది.
6. ప్రపంచంలో అత్యంత ధనిక మహిళ -2023 ఎవరు? (ఎ)
ఎ) ప్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్
బి) ఆలిస్ వాల్టన్
సి) జూలియా కోచ్
డి) జాక్వేలియన్ మార్స్
వివరణ: 2023 ఆగస్టు నాటికి ప్రపంచంలో అత్యంత సంపన్న మహిళగా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రాంకోయిస్ బెటెన్ కోర్ట్ మేయర్స్ $ 90.4 బిలియన్ల నికర విలువతో మొదటి స్థానంలో ఉన్నారు.
- తర్వాత రెండోస్థానంలో యూఎస్ఏకు చెందిన ఆలిస్వాల్టన్ 61.5 బిలియన్ డాలర్లు, మూడో స్థానంలో యూఎస్ఏకు చెందిన జూలియా కోచ్ 59 బిలియన్ డాలర్లు, నాలుగో స్థానంలో యూఎస్ఏకు చెందిన జాక్వేలియన్ మార్స్ 38.3 బిలియన్ డాలర్లు, 5వ స్థానంలో యూఎస్ఏకు చెందిన విలియం అడెల్సన్ 36.7 బిలియన్ డాలర్లు నికర విలువతో ఉన్నారు.
- ప్రపంచంలోని బిలియనీర్ల జాబితా లేదా రియల్ టైం బిలియనీర్ల జాబితా అనేది ప్రపంచంలోని అత్యంత సంపన్న బిలియనీర్ల వార్షిక ర్యాంకింగ్ వారీగా నమోదు చేసిన నికర విలువ ఆధారంగా నిర్ణయించ బడుతుంది. ర్యాంకింగ్ ప్రతి వ్యక్తి నికర మొత్తం విలువను యూఎస్ డాలర్లో ప్రచురిస్తుంది.
- ఇది ప్రతి మార్చిలో ఫోర్బ్స్ మ్యాగజైన్ ద్వారా తయారు చేసి ప్రచురిస్తున్నారు. దీని మొదటి ఎడిషన్ 1987లో
ప్రచురించారు.
7. 2023 సెప్టెంబర్ 9, 10 న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం ఎన్నోది? (ఎ)
ఎ) 18 బి) 19 సి) 20 డి) 25
వివరణ: జీ-20 (గ్రూప్ ఆఫ్ ట్వంటీ) 18వ సమావేశం 2023 సెప్టెంబర్ 9, 10 రెండు రోజుల పాటు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని భారత మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది.
- ఇది భారతదేశంలో జరిగిన మొదటి జీ-20 (సమ్మిట్) శిఖరాగ్ర సమావేశం.
- జి-20 న్యూఢిల్లీ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షత వహించారు.
- గ్రూప్ ఆఫ్ ట్వంటీ (G-20) 1999లో ఏర్పడింది. ప్రపంచంలోని ఇరవై అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల సమాహారం. అంతర్జాతీయ ఆర్థిక, ఆర్థిక స్థిరత్వం గురించి చర్చించడానికి అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలను ఒక చోట చేర్చే కూటమిగా రూపొందింది.
- జి-20 తొలి శిఖరాగ్ర సమావేశం 2008లో వాషింగ్టన్ డీసీలో జరిగింది. ప్రధాన ప్రపంచ సమస్యలను, సవాళ్లను పరిష్కరించడమే కాకుండా పబ్లిక్ విధానాలను కూడా రూపొందిస్తారు.
- జీ-20 అనేది 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో రూపొందింది.
- జీ-20లో గల 19 దేశాలు అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యన్ ఫెడరేషన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యూకే, యూఎస్.
- జి-20 18వ సమావేశంలో ఆఫ్రికన్ యూనియన్ను సభ్యదేశంగా చేరడంతో 21వ సభ్యదేశంగా మారింది.
- జీ-20 శిఖరాగ్ర సమావేశంలో ‘ఒకే భూమి ఒకే కుటుంబం ఒక భవిష్యత్’ (One Earth, One Family, One Future) అనే థీమ్‌తో వాతావరణం, ఇంధనం అభివృద్ధి, ఆహారభద్రత, ఆరోగ్యం, డిజిటలైజేషన్ వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించారు.
- జీ-20 దేశాలు ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట రెండు వంతులు, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జీడీపీలో 25 శాతం వాటా కలిగి ఉన్నాయి.
- జీ-20 అధ్యక్ష పదవి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీకి 2022 డిసెంబర్ 1న బదిలీ చేయబడింది. ఈ పదవి 2023 నవంబర్ 30 వరకు కొనసాగుతుంది.
- తర్వాత జీ-20 అధ్యక్ష పదవిని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2023 డిసెంబర్ 1న బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు అధికారికంగా అందజేస్తారు. ఇతను సంవత్సరం పాటు ఈ పదవిలో కొనసాగుతారు. జీ-20 19వ సమావేశం 2024 నంవంబర్ 18, 19న బ్రెజిల్ లోని రియో డిజనిరోలో జరుగుతుంది.
9. ‘వసంత 2023 ఆర్థిక సూచన’ని ఏ సంస్థ విడుదల చేస్తుంది? (బి)
ఎ) ప్రపంచ బ్యాంకు
బి) యూరోపియన్ కమిషన్
సి) వరల్డ్ ఎకనామిక్ ఫోరం
డి) ఐఎంఎఫ్
వివరణ: వసంత 2023 ఆర్థిక సూచనను ఇటీవల యూరోపియన్ కమిషన్ ద్వారా విడుదల చేసింది. ఇది యూరో కరెన్సీగా ఉన్న 20 దేశాల 2023-24 వృద్ధి అంచనాలను గత అంచనా 0.9 శాతం నుంచి 1.1 శాతానికి సవరించింది. - ఈ నివేదిక ప్రకారం 2023 మొదటి త్రైమాసికంలో తక్కువ శక్తి ధరలు సరఫరా పరిమితులు, బలమైన లేబర్ మార్కెట్ మితమైన వృద్ధికి మద్ధతు ఇచ్చాయి.
10. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2023 సమావేశం థీమ్ ఏమిటి? (ఎ)
ఎ) విచ్ఛిన్నమైన ప్రపంచంలో సహకారం
బి) ప్లానెట్ పీపుల్ భాగస్వామ్యం
సి) సమ్మిళితం, స్థిరమైన వృద్ధి
డి) ప్రాంతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం
వివరణ : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 సమావేశం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగింది. ఇది ఆర్థికవేత్త క్లాస్ స్కాబ్ స్థాపించిన
ప్రభుత్వేతర సంస్థ. - 2023లో డబ్ల్యూఈఎఫ్ థీమ్ ‘విచ్ఛిన్నమైన ప్రపంచంలో సహకారం’ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) మూడు లాంజ్‌ల ద్వారా పెట్టుబడికి అవకాశం సుస్థిరత& సమ్మిళిత విధానంపై దృష్టి సారించి డబ్ల్యూఎఫ్లో భారతదేశం ఉనికిని సూచించింది.
11. ఇండియా రియల్ ఎస్టేట్ విజన్ 2047 పేరుతో ఏ సంస్థ నివేదికను విడుదల చేసింది? (సి)
ఎ) నేషనల్ హౌసింగ్ ఇండియా
బి) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
సి) నైట్ ఫ్రాంక్ ఇండియా
డి) రియల్ ఎస్టేట్ అసోసియేషన్
ఆఫ్ ఇండియా
వివరణ: భారతదేశ రియల్ ఎస్టేట్ రంగం 2047 నాటికి 5.8 ట్రిలియన్ డాలర్లకు విస్తరిస్తుందని అంచనా వేస్తున్నట్లు గ్లోబల్ పావర్టీ బ్రోకరేజ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా కౌన్సిల్ సంయుక్త నివేదిక పేర్కొంది. - ఇండియా రియల్ ఎస్టేట్ విజన్ 2047 అనే నివేదిక నైట్ ఫ్రాంక్ ఇండియా ఈ అంచనా వేసిన రియల్ ఎస్టేట్ అవుట్‌ఫుట్ విలువ ప్రస్తుతమున్న 7.3 వాటా నుంచి 2047లో మొత్తం ఆర్థిక ఉత్పత్తికి 15.5 దోహదం చేస్తుందని పేర్కొంది.
- 2047లో భారతదేశం స్వాతంత్య్రం పొంది 100 సం.లు పూర్తి చేసుకున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 33 ట్రిలియన్ డాలర్ల నుంచి 40 ట్రిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేసింది.
8. లేబర్ బీమా పథకాన్ని ఏ రాష్ట్రం అమలు చేయాలని యోచిస్తుంది? (బి)
ఎ) ఆంధ్రప్రదేశ్ బి) తెలంగాణ సి) పంజాబ్ డి) ఉత్తరప్రదేశ్
వివరణ: తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న రైతుబీమా పథకం తరహాలో లేబర్ బీమా పేరుతో పథకాన్ని ప్రారంభించాలని యోచిస్తుంది. లేబర్ బీమా పథకం లబ్ధిదారులకు బీమా కవరేజ్ రూ.1.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతుంది. అదేవిధంగా రెన్యూవల్ కాలాన్ని 5 సం.ల నుంచి 10 సం.లకు పొడిగించాలని కూడా ప్రతిపాదించారు.
పానుగంటి కేశవ రెడ్డి
రచయిత
వైష్ణవి పబ్లికేషన్స్
గోదావరిఖని
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు