Group 2,3 Special | వెట్టి చాకిరీ నిర్మూలనకు తీర్మానం చేసిన ఆంధ్ర మహాసభ?
1 వెట్టి చాకిరీకి సంబంధించిన కింది నిర్వచనాలను, సంబంధిత వాటితో జతపర్చండి.
ఎ. తాను తీసుకున్న రుణానికి రుణదాత దగ్గర 1. నేషనల్ కమిషన్ ఆన్ అగ్రికల్చర్ వేతనం లేకుండా లేదా నామమాత్రపు
వేతనంపై రుణగ్రహీత పనిచేయాల్సి రావడం
బి. రుణగ్రహీత తాను చేసిన/తీసుకున్న 2. ఎస్సీ, ఎస్టీ కమిషన్ 24వ నివేదిక రుణానికి పరిమిత కాలాన్ని (Specific Period) బానిసత్వంలో ఉండటం
సి. రుణగ్రహీత లేదా అతడి కుటుంబ సభ్యులు 3. నేషనల్ కమిషన్ ఆన్ లేబర్ లేదా అతడిపై ఆధారపడినవారు ఒక నిర్దిష్ట కాలానికి లేదా నిర్దిష్ట కాలపరిమితి లేకుండా, వేతనం లేకుండా లేదా నామమాత్రపు వేతనంతో రుణదాత వద్ద బలవంతపు
శ్రమదోపిడీ కోసం చేసుకున్న ఒప్పందం
డి. రుణదాతకు, రుణగ్రహీతకు మధ్యగల 4. ఇండియన్ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ క్రూరమైన సంబంధం
ఇ. రుణగ్రస్తత అనే తల్లికి జన్మించిన శిశువే వెట్టిచాకిరీ 5. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం-1976
1) ఎ-3, బి-2, సి-5, డి-4, ఇ-1 2) ఎ-2, బి-3, సి-5, డి-4, ఇ-1
3) ఎ-3, బి-2, సి-1, డి-5, ఇ-4 4) ఎ-3, బి-2, సి-1, డి-4, ఇ-5
2. వెట్టిచాకిరీకి గల వివిధ పేర్లను సంబంధిత రాష్ర్టాలతో జపర్చండి.
ఎ. Kamiya (కమియా) 1. బీహార్
బి. Padiyal (పడియాల్) 2. తమిళనాడు
సి. Bhagela (భగేలా) 3. తెలంగాణ
డి. Hali (హాలి) 4. మధ్యప్రదేశ్
ఇ. Jeetha (జీత) 5. కర్ణాటక
1) ఎ-2, బి-1, సి-3, డి-4, ఇ-5
2) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
3) ఎ-4, బి-1, సి-3, డి-2, ఇ-5
4) ఎ-1, బి-2, సి-3, డి-5, ఇ-4
3. రాజ్యాంగంలో వెట్టిచాకిరీ కింద ఏ పదాన్ని పొందుపరిచారు?
1) భగేలా 2) బేగార్
3) బంధువా మజ్దూరీ 4) ఏదీకాదు
5. వెట్టిచాకిరీ, అప్పటి దుర్బర పరిస్థితుల గురించి వివిధ రచనలకు సంబంధించి సరైనవి గుర్తించండి.
ఎ. ఎంఎస్ రాజలింగం ఆత్మకథ
బి. వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’, ‘గంగు’
సి. దాశరథి రంగాచార్య ‘చిల్లరదేవుళ్లు’
డి. బొల్లిముంత గుణశేఖర శర్మ ‘మృత్యునీడలు’
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) బి, సి 4) ఎ, బి, డి
6. వెట్టి చాకిరీ నిర్మూలనకు జరిపిన అంశాల్లో కింది వాటిలో సరైనవి గుర్తించండి.
ఎ. బేగార్ వారం (వెట్టిచాకిరీ వారం)- 1941, డిసెంబర్ 25 నుంచి 1942, జనవరి 1 వరకు వెట్టిచాకిరీని నిషేధించాలని ఆంధ్రమహాసభ ప్రచార కార్యక్రమం చేపట్టింది
బి. ఆంధ్రజన కేంద్ర సంఘం ‘వెట్టిచాకిరీ’ కరపత్రం ద్వారా నిజాం ర్యాంలోని వెట్టిచాకిరీని నిర్మూలించాలని పోరాడారు
సి. నిజాం రాజ్యంలో వెట్టిచాకిరీని వ్యతిరేకిస్తూ మొట్టమొదటి బహిరంగ సభను సూర్యాపేటలో 1922, డిసెంబర్ 2న వర్తక సంఘం వారు నిర్వహించారు
డి. 1929, ఫిబ్రవరి 24న నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ప్రజలు స్వచ్ఛందంగా రెండు రోజుల పాటు వెట్టిచాకిరీ వ్యతిరేక సభ నిర్వహించారు
1) ఎ, బి, సి 2) బి, సి
3) ఎ, బి, సి, డి 4) బి, సి, డి
7. వెట్టిచాకిరీ పేరుతో రచనలు చేసిన కవులను గుర్తించండి.
1) ఆవుల పిచ్చయ్య
2) దేవులపల్లి వేంకటేశ్వర రావు
3) 1, 2 4) ఏదీకాదు
8. కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి.
ఎ. నిజాం రాజ్యంలో వెట్టిచాకిరీ నిషేధం- 1923
బి. హైదరాబాద్ భగేలా అగ్రిమెంట్ రెగ్యులేషన్- 1943
సి. 7వ నిజాం పట్టణాల్లో, గ్రామాల్లో బేగార్ నిర్మూలన ఫర్మానా- 1911
డి. 7వ నిజాం బేగారీలకు కచ్చితమైన జీతం ఇవ్వాలని, 10 సంవత్సరాల కంటే తక్కువ పిల్లలకు బేగారీలుగా ఉంచరాదని ఫర్మానా- 1925
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి 4) ఎ, సి
9. కింది ఏ ఆంధ్రమహాసభలు వెట్టిచాకిరీ నిర్మూలనకు అనుకూలంగా తీర్మానం చేశారు?
ఎ. 1వ ఆంధ్రమహాసభ
బి. 5వ ఆంధ్రమహాసభ
సి. 6వ ఆంధ్రమహాసభ
డి. 9వ ఆంధ్రమహాసభ
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, డి
3) ఎ, సి 4) బి, సి
10. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టానికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి గుర్తించండి?
ఎ. వెట్టిచాకిరీ నిర్మూలన ఆర్డినెన్స్‌కు ఆమోదం- 1975, అక్టోబర్ 24
బి. వెట్టిచాకిరీ నిర్మూలన దేశమంతటా అమలు- 1975, అక్టోబర్ 25
సి. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం చేసిన సంవత్సరం- 1976
1) ఎ, బి, సి 2) ఎ, బి
3) బి, సి 4) ఎ, సి
11. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976కు సంబంధించిన సెక్షన్లు, అవి తెలియజేసే అంశాలకు సంబంధించి సరైనవి జతపర్చండి.
ఎ. సెక్షన్ 2 1. వెట్టిచాకిరీ నిర్వచనం
బి. సెక్షన్ 12 2. జిల్లా పరిధిలో చట్టం అమలు తీరు బాధ్యత జిల్లా మేజిస్ట్రేట్ది
సి. సెక్షన్ 10 3. ఈ చట్టంలోని నిబంధనలను అమలు చేసే అధికారుల గురించి తెలుపుతుంది
డి. సెక్షన్ 13 4. విజిలెన్స్ కమిటీలు
ఇ. సెక్షన్ 16 5. వెట్టిచాకిరీ అమలు పరిస్తే విధించే శిక్ష
1) ఎ-1, బి-2, సి-3, డి-4, ఇ-5
2) ఎ-1, బి-3, సి-2, డి-4, ఇ-5
3) ఎ-1, బి-4, సి-3, డి-2, ఇ-5
4) ఎ-1, బి-3, సి-2, డి-5, ఇ-4
12. ‘సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబరర్స్-2016’ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
1) 2016, జూన్ 17 2) 2016, మే 17
3) 2016, ఏప్రిల్ 17
4) 2016, జూలై 17
13. ‘సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబరర్స్-2021’ కింద అందించే ఆర్థిక సహాయానికి సంబంధించి సరైన వ్యాఖ్యలను గుర్తించండి?
ఎ. ట్రాన్స్‌జెండర్, మహిళలు, బాలలు, లైంగికపరమైన వెట్టిచాకిరీ నుంచి కాపాడినప్పుడు రూ.3 లక్షలు అందిస్తారు
బి. అనాథ పిల్లలకు, బాలకార్మికులకు, బిక్షాటనకు గురైన (బలవంతంగా) బాలలకు రూ.2 లక్షలు అందిస్తారు
సి. 18 సంవత్సరాలు నిండిన పురుషుడు వెట్టిచారీకి లోనైతే రూ.లక్ష అందిస్తారు
డి. వికలాంగులకు (వెట్టిచాకిరీకి లోనైన) రూ.2 లక్షలు అందిస్తారు
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి
3) బి, సి 4) ఎ, బి, సి
14. వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం-1976 సెక్షన్ 16 ప్రకారం వెట్టిచాకిరీకి పాల్పడితే విధించే శిక్షకు సంబంధించి సరైనవి?
1) ఏడాది జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా
2) రెండేండ్ల జైలుశిక్ష, రూ.2 వేల జరిమానా
3) మూడేండ్ల జైలుశిక్ష, రూ.3 వేల జరిమానా
4) మూడేండ్ల జైలుశిక్ష, రూ.200 జరిమానా
15. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ ఫర్ రిహాబిలిటేషన్ ఆఫ్ బాండెడ్ లేబరర్స్-2021కు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ. ఇది 2022, జనవరి 27 నుంచి అమల్లోకి వచ్చింది
బి. దీని కింద వెట్టిచాకిరీ బాధితులకు ఆర్థిక సహాయం అందించడానికి (పునరావాసం కింద) రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా నిధులను సమకూర్చాల్సిన అవసరం లేదు
సి. దీని కింద ప్రతి జిల్లాకు, జిల్లా మేజిస్ట్రేట్ వద్ద బాండెడ్ లేబర్ రిహాబిలిటేషన్ ఫండ్ పేరు రూ.10 లక్షల నిధిని అందుబాటులో ఉంటుంది
డి. బాండెడ్ లేబరర్ రిహాబిలిటేషన్ ఫండ్ ద్వారా బాండెడ్ లేబరర్ నుంచి రక్షించిన వ్యక్తికి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.30,000 వరకు ఆర్థిక సాయం అందించవచ్చు
1) ఎ, బి, సి 2) ఎ, బి, సి, డి
3) బి, సి, డి 4) ఎ, సి, డి
16. కింది వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి?
ఎ. పర్వర్థ వ్యవస్థపై (వెట్టిచాకిరీ రూపం) నియమించిన కమిషన్- ఎస్ఆర్ శంకరన్
బి. ఎన్హెచ్ఆర్సీ వెట్టిచాకిరీకి సంబంధించిన అంశాలపై అధ్యయనానికి నియమించిన కమిషన్- భాటియా కమిషన్
1) ఎ 2) బి 3 ఎ, బి 4) ఏదీకాదు
17. ప్రపంచ బానిసత్వ సూచీ-2023కు సంబంధించి సరైనవి గుర్తించండి?
ఎ. అంతర్జాతీయ కార్మిక సంస్థ, వాక్ ప్రీ ఫౌండేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ కలిసి రూపొందించాయి
బి. బానిసత్వ ప్రాబల్యం అధికంగా ఉన్న మొదటి 3 దేశాలు- ఉత్తర కొరియా, ఎరిత్రియా, మౌరిటానియా
సి. అత్యల్ప బానిసత్వ ప్రాబల్యం గల 3 దేశాలు- స్విట్జర్లాండ్, నార్వే, జర్మనీ
డి. జీ-20 దేశాల్లో అధిక సంఖ్యలో బలవంతపు కార్మికులు గల దేశం భారత్ (11 మిలియన్ల మంది)
ఇ. నివేదికలో మొత్తం 49.6 మిలియన్ల (దాదాపు 50 మిలియన్లు) ప్రజలు ఆధునిక బానిసత్వంలో ఉన్నట్లు తెలిపింది (160 దేశాల్లో)
ఎఫ్. భారత్‌లో 8 శాతం (ప్రతి వెయ్యి మందికి) ఆధునిక బానిసత్వంలో ఉన్నారు
1) ఎ, బి, సి, డి, ఇ
2) ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్
3) బి, సి, డి, ఇ
4) బి, సి, డి, ఇ, ఎఫ్
4. కింది వాటిని జతపర్చండి (వివరణ-పదం)
ఎ. రైతులపై విధించిన పన్నులను చెల్లించలేక 1. భగేలా భూస్వామికి దాసుడుగా మారిపోవడం, వ్యవసాయ బానిసలు (పాలెగాళ్లు లేదా జీతగాళ్లు)గా మారడం
బి. పేదరికం అనుభవిస్తున్న తల్లిదండ్రులు తమ 2. బేగార్ పిల్లలను నామమాత్రపు వేతనం కోసం భూస్వాముల వద్ద శ్రమదోపిడీకి గురి చేయడం
సి. ప్రభుత్వం నిర్దేశించిన జీతాలు చెల్లించకుండా, 3. పర్వర్ద వ్యవస్థ కనీస విశ్రాంతి లేకుండా శ్రమ దోపిడీకి గురవడం
డి. జమీందారుల కుటుంబాల్లో స్త్రీలకు వివాహం అయినప్పుడు జీతగాని కుమార్తెను పెళ్లయిన అమ్మాయితో అత్తవారింటికి పంపి బానిసగా ఉంచుకోవడం 4. ఆడపాప
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-2, బి-1, సి-3, డి-4
3) ఎ-1, బి-3, సి-2, డి-4 4) ఎ-1, బి-2, సి-3, డి-4
సమాధానాలు
1-2 2-2 3-2 4-2 5-2
6-3 7-3 8-1 9-2 10-1
11-1 12-2 13-4 14-3 15-2
16-4 17-2
1. కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. బాలిక సంరక్షణ పథకం (జీసీపీఎస్)-1996లో ప్రారంభించారు
బి. నూతన బాలిక సంరక్షణ పథకాన్ని (జీసీపీఎస్ ఫేజ్-3) 2005లో ప్రారంభించారు
సి. బాలిక సంరక్షణ పథకాన్ని (2005) బంగారు తల్లి పథకం తీసుకురావడం వల్ల రద్దు చేశారు
డి. బంగారు తల్లి పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2016లో రద్దు చేసింది
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
గమనిక: పై ప్రశ్నను తెలంగాణ మహిళా శిశు సంక్షేమ, వికలాంగ, వృద్ధాప్య శాఖ వారి 2018-19 వార్షిక నివేదిక నుంచి తీసుకోబడింది.
2. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారు 5 సంవత్సరాల్లోపు పిల్లలకు పోషణ పద్ధతులు, బాల్య ఆరంభ దశ అభివృద్ధికి సంబంధించి నిర్వహించే ఆన్లైన్ పోర్టల్‌ను గుర్తించండి?
1) లాలన 2) ఆలనా పాలనా
3) ఊయల 4) బుజ్జాయి
3. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి రోజుల్లో అంటే 2015-ఏప్రిల్ 1 నాటికి రాష్ట్రంలో ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలు లేదా ఆవాసాల సంఖ్య (డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్, కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం)?
1) 967 2) 976 3) 769 4) 796
4. డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటైజేషన్, కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం కింది ఏ తేదీ నాటికి తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత ఆవాసా ప్రాంతాల సంఖ్య సున్నా అని తెలిపింది?
1) 2020, సెప్టెంబర్ 1
2) 2020, ఆగస్టు 1
3) 2020, జూలై 1
4) 2020, అక్టోబర్ 1
5. రాష్ట్రంలో అత్యధిక ఫ్లోరైడ్ ప్రభావిత సమస్యలు గల జిల్లా నల్లగొండ కాగా, ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ కోసం నల్లగొండ జిల్లా యంత్రాంగం డిస్ట్రిక్ట్ ఫ్లోరైడ్ మానిటరింగ్ సెంటర్ (డీఎఫ్‌ఎంసీ)ను ఎప్పుడు ఏర్పాటు చేసింది? (ఈ డీఎఫ్ఎంసీకి యునిసెఫ్ తన వంతు మద్దతిచ్చింది)
1) 2013, ఆగస్టు 14
2) 2013, సెప్టెంబర్ 14
3) 2013, అక్టోబర్ 14
4) 2013, నవంబర్ 14
6. రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ గురించి అవిశ్రాంతంగా పోరాడి, ఇటీవల మరణించిన నల్లగొండ జిల్లా శివన్నగూడెం గ్రామానికి చెందిన కింది వ్యక్తిని గుర్తించండి?
1) అంశాల శివయ్య 2) అంశాల స్వామి
3) అంశాల హరీశ్
4) అంశాల మహేందర్
సమాధానాలు
1-4 2-2 3-1 4-2 5-4 6-2
గందె శ్రీనివాస్
2016 గ్రూప్-2 విజేత
సిద్దిపేట
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు