General Studies | లోకాయుక్తను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
జనరల్ స్టడీస్
1. కింది వాటిలో ఎవరు అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్‌ను స్థాపించారు?
1) మహాత్మాగాంధీ
2) ఎం.సి. రాజా
3) డా. బి.ఆర్. అంబేద్కర్
4) బాబు జగ్జీవన్‌రాం
2. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ప్రస్తుత చైర్మన్?
1) విజయ్ సంపాల
2) దిలీప్‌సింగ్ భూరియా
3) భూటాసింగ్
4) డా. సి.ఐ.పునియా
3. కింది వాటిలో ఏ హక్కును రాజ్యాంగం హృదయం, ఆత్మగా డా. బి.ఆర్. అంబేద్కర్ అభివర్ణించారు?
1) సమానత్వం హక్కు
2) రాజ్యాంగ పరిహార హక్కు
3) మత స్వాతంత్య్రపు హక్కు
4) ఆస్తిహక్కు
4. భారత పార్లమెంటులో ఒక బిల్ పాస్ అవ డానికి ముందు ఎన్ని సార్లు చదువుతారు?
1) మూడుసార్లు 2) ఐదు సార్లు
3) ఆరు సార్లు 4) ఏడు సార్లు
5. 2015వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి చేసిన 100వ సవరణ దేనికి సంబంధించినది?
1) జాతీయ న్యాయ నియామకాల కమిషన్
2) సహకార సంఘాలు
3) భారత్ -బంగ్లాదేశ్ మధ్య జరిగిన సరిహద్దు ఒప్పందాలు
4) పార్టీ ఫిరాయింపుల చట్టం
6. 1946లో భారతదేశాన్ని సందర్శించిన క్యాబినేట్ మిషన్‌కు నాయకత్వం వహించింది?
1) ఆర్.జె.మోరే 2) ఎ.వి. కాంప్‌బెల్
3) పెథిక్ లారెన్స్ 4) డేవిడ్ వార్నర్
7. రాజ్యాంగ ప్రవేశికలో ఐక్యత, దేశ సమగ్రత అనే పదాలను ఏ సంవత్సరంలో చేర్చారు?
1) 1952 2) 1976
3) 1999 4) 1996
8. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఎప్పుడు నియమించారు?
1) 1997 2) 1998
3) 1999 4) 1996
9. భారతదేశంలో అంబుడ్స్‌మన్ లాంటి సంస్థల ఏర్పాటును ప్రతిపాదించింది?
1) న్యాయమూర్తి పి.బి. గజేంద్రగడ్కర్
2) న్యాయమూర్తి అల్లాడి కుప్పుస్వామి
3) న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్
4) న్యాయమూర్తి ఫజల్ అలీ
సమాధానాలు
1-3 2-4 3-2 4-4
5-3 6-3 7-2 8-3
9-3
1. భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద’, ‘లౌకిక’ అనే పదాల పొందిక ఏ సవరణ ద్వారా చేశారు?
1) 15వ రాజ్యాంగ సవరణ
2) 39వ రాజ్యాంగ సవరణ
3) 42వ రాజ్యాంగ సవరణ
4) 44వ రాజ్యాంగ సవరణ
2. అరెస్టు తర్వాత కోర్టులో హాజరు పరచాలని నిర్దేశించే హక్కు?
1) ప్రాథమిక హక్కు 2) ఆదేశిక హక్కు
3) ప్రాథమిక హక్కు కాదు
4) చట్టపరమైన హక్కు మాత్రమే
3. కింది వాటిలో ఏది సరైనది కాదు?
1) రాజ్యాంగంలోని 36-51 ఆర్టికల్స్ ప్రాథమిక హక్కులకు సంబంధించినది
2) ఆదేశిక సూత్రాలు శాసన శాఖ, నిర్వాహక శాఖలకు జారీ చేసిన నిర్దేశాలు
3) అంతర్జాతీయ శాంతిభద్రతలను కాపాడటం ఒక ఆదేశిక సూత్రం
4) 42వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విధులను ప్రవేశపెట్టింది
4. కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని ఎవరు నిర్ణయిస్తారు?
1) రాష్ట్రపతి
2) లెఫ్ట్‌నెంట్ గవర్నర్
3) ప్రధాన మంత్రి 4) గవర్నర్
5. 1793 ఛార్టర్ చట్టాన్ని అనుసరించి పురపాలక పాలనే ఉన్న మూడు ప్రెసిడెన్సీ నగరాల పేర్లు ఏమిటి?
1) ఢిల్లీ, ముంబై, కోల్‌కతా
2) చెన్నై, కోల్‌కతా, ముంబై
3) హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా
4) ఢిల్లీ, ముంబై, చెన్నై
6. 5వ షెడ్యూల్లోని అంశాలు దేనికి సంబంధించినవి?
1) రాష్ర్టాల విభజనకు సంబంధించినవి
2) ఎస్సీ, ఎస్టీ ప్రస్తుత జాబితాలో గల కొన్ని కులాలను తొలగించడం లేదా కలపడటానికి సంబంధించినవి
3) షెడ్యూల్డ్ ప్రాంతాల, తెగల పాలనకు సంబంధించినవి
4) రాష్ర్టాల మధ్యగల వనరుల పంపకానికి సంబంధించినవి
7. కింది వాటిలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు?
1) లాలా లజపతిరాయ్
2) జి.ఎం. రనడే
3) బాలగంగాధర్ తిలక్
4) ఆచార్య నరేంద్ర దేవ్
8. 2015 నవంబర్‌లో తన రిపోర్టు సమర్పించిన 7వ కేంద్ర వేతన సవరణ సంఘం అధ్యక్షులు ఎవరు?
1) జస్టిస్ ఎ.కె.గోయల్
2) జస్టిస్ ఎ.కె.మాథుర్
3) అరవింద్ పనగారియా
4) మాంటెక్‌సింగ్ అహ్లువాలియా
9. స్థానిక స్వపరిపాలన సంస్థలను పాలనా సామర్థ్యం రాజకీయ అవగాహన, మానవ అభివృద్ధి సాధనా సంస్థలని ఎవరన్నారు?
1) మహాత్మగాంధీ 2) ఎస్.కె.డే
3) లార్డ్ రిప్పన్ 4) లార్డ్‌మేయో
10. భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాత అని ఎవరిని అంటారు?
1) లార్డ్ రిప్పన్
2) బల్వంత్రాయ్ మెహతా
3) అశోక్ మెహతా
4) మహాత్మాగాంధీ
11. భారతదేశ పౌరులు పాటించాల్సిన విధులు ఎన్ని?
1) 8 2) 9 3) 10 4) 11
12. స్వాతంత్య్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రి ఎవరు?
1) సర్దార్ వల్లభాయ్ పటేల్
2) డా. బి.ఆర్. అంబేద్కర్
3) కె.ఎం. మున్షి
4) డా. జాకీర్ హుస్సేన్
13. రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇచ్చారు?
1) సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ
2) సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ
3) వాక్, భావ ప్రకటన స్వేచ్ఛ
4) వ్యాపార, వృత్తిపరమైన స్వేచ్ఛ
14. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్నది?
1) 8 2) 8 3)10 4) 11
15. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ బాలికలకు వివాహం ఖర్చు విషయంలో సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం పేరు ఏమిటి?
1) వివాహ వైభోగం 2) కల్యాణలక్ష్మీ
3) కన్యాధాన్ 4) బంగారు తల్లి
16. జిల్లా న్యాయాధికారులను ఎవరు నిర్ణయిస్తారు?
1) భారత రాష్ట్రపతి 2) రాష్ట్ర గవర్నర్
3) రాష్ట్ర ముఖ్యమంత్రి
4) రాష్ట్ర న్యాయశాఖమంత్రి
17. కేంద్ర కార్యనిర్వాహణాధికారాలు ఎవరి దగ్గర నిక్షిప్తమై ఉన్నాయి?
1) లోక్‌సభ 2) రాష్ట్రపతి
3) ప్రధానమంత్రి 4) మంత్రి మండలి
సమాధానాలు
1-3 2-1 3-1 4-1
5-2 6-3 7-4 8-2
9-2 10-1 11-4 12-2
13-3 14-3 15-2 16-2
17-2
1. కింది వాటిలో పౌర హక్కు ఏది?
1) ప్రభుత్వ ఉద్యోగ హక్కు
2) ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి గల హక్కు
3) భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ
4) ఆస్తిహక్కు
2. రాజ్యాంగంలోని 40వ ప్రకరణం దేనికి సంబంధించినది?
1) రాజ్యాంగ పరిహార హక్కు
2) గ్రామ పంచాయతీల ఏర్పాటు
3) గ్రామ సభ సమావేశాల ఏర్పాటు
4) సమాచార హక్కు
3. 1946-47 మధ్య భారతదేశ మధ్యంతర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎవరు?
1) రాజేంద్ర ప్రసాద్
2) జవహర్లాల్ నెహ్రూ
3) లాయఖ్-అలీఖాన్ 4) ఎం.ఎ.జిన్నా
4. పంచాయతీరాజ్‌ను గ్రామీణ గణతంత్రంతో ఎవరు పోల్చారు?
1) లార్డ్ రిప్పన్ 2) జవహర్లాల్ నెహ్రూ
3) మహాత్మాగాంధీ
4) బల్వంత్రాయ్ మెహతా
5. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేస్తాడు?
1) 216 2) 213
3) 215 4) 214
6. వినియోగదారులు రక్షణ చట్ట యంత్రాంగం ఏయే స్థాయిల్లో పనికొస్తుంది?
1) రాష్ట్ర, జిల్లా స్థాయి
2) జాతీయ, రాష్ట్ర స్థాయి
3) జాతీయ స్థాయి
4) జాతీయ రాష్ట్ర, జిల్లా స్థాయి
7. ఓటు హక్కు వినియోగించుకునే వయసును పార్లమెంటు 21 నుంచి 18 ఏళ్లకు ఏ సంవత్సరంలో తగ్గించింది?
1) 1991 2) 1978
3) 1976 4) 1989
8. ప్రస్తుతం మన లోక్‌సభ స్పీకర్ ఎవరు?
1) సుష్మాస్వరాజ్ 2) కృష్ణా తీర్థ్
3) నజ్మా హెప్తుల్లా 4) ఓం బిర్లా
9. రాజ్యసభలో తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన భారత కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) నాయకుడు ఎవరు?
1) సీతారాం ఏచూరి 2) గురుదాస్ గుప్తా
3) ప్రకాశ్ కారత్ 4) బృందా కారత్
10. లోకాయుక్తను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
1) భారత రాష్ట్రపతి
2) హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
3) రాష్ట్ర గవర్నర్
4) సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
11. భారత రాజ్యాంగంలో ‘హెబియస్ కార్పస్’ అనే రిట్‌ను జారీచేసే అధికారం ఎవరికి ఇచ్చారు?
1) సబార్డినేట్ కోర్టులకు మాత్రమే
2) సుప్రీంకోర్టుకు మాత్రమే
3) హైకోర్టుకు మాత్రమే
4) సుప్రీంకోర్టు, హైకోర్టు
12. పౌష్టిక స్థాయిని, జీవన స్థాయిని పెంచడం, ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం రాజ్యం బాధ్యత అని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ తెలుపుతుంది?
1) ఆర్టికల్ 46 2) ఆర్టికల్ 47
3) ఆర్టికల్ 48 4) ఆర్టికల్ 45
13. రాజ్యాంగంలోని 11వ అధ్యయనంలో పొందు పరిచిన అంశాలను షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించడానికి ఏర్పాటు చేసిన కమిటీ చైర్మన్ ఎవరు?
1) అశోక్ మెహతా 2) పి.కె. తుంగన్
3) దిలీప్‌సింగ్ భూరియా
4) బల్వంతరాయ్ మెహతా
14. సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక వ్యక్తి ప్రాణం లేదా స్వేచ్ఛకు సంబంధించిన సమాచారాన్ని ఎంత సమయంలో పొందవచ్చు?
1) 24 గంటలు 2) 48 గంటలు
3) 72 గంటలు 4) 12 గంటలు
15. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని సాధారణంగా ఎన్ని రోజుల్లో పొందవచ్చు?
1) 6 రోజులు 2) 15 రోజులు
3) 30 రోజులు 4) 60 రోజులు
16. లోక్‌సభను రద్దుచేసే అధికారం ఎవరికి ఉన్నది?
1) ప్రధానమంత్రి 2) లోక్‌సభ స్పీకర్
3) రాష్ట్రపతి 4) మంత్రి వర్గం
17. విద్యాహక్కు ఏ ఆర్టికల్‌లో పేర్కొనబడినది?
1) ఆర్టికల్ 22 ఎ 2) ఆర్టికల్ 20
3) ఆర్టికల్ 21 ఎ 4) ఆర్టికల్ 19 ఎ
18. న్యాయశాఖ క్రియాశీలత అంటే ఏమిటి?
1) ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయశాఖ నిర్ణయాలను ఇవ్వడం
2) ప్రభుత్వ శాఖల నిర్ణయాన్ని న్యాయశాఖ పునఃసమీక్షించడం
3) రాజకీయంలో న్యాయాధికారులు భాగం పంచుకోవడం
4) వివాదాలను న్యాయశాఖ పరిష్కరించడం
19. కిందివాటిలో 1969 జరిగిన జై తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రభుత్వం ఏ ఉత్తర్వు జారీ చేసింది?
1) జీవో నెం. 65 2) జీవో నెం. 610
3) జీవో నెం. 565 4) జీవో నెం. 36
20. ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు?
1) నరేంద్ర సింగ్ తోమర్
2) అనంతకుమార్
3) నిర్మలా సీతారామన్
4) సి.హెచ్.బీరేందర్ సింగ్
21. 1971 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి ఎన్ని స్థానాల్లో గెలిచింది?
1) 10 2) 14 3) 12 4) 11
22. జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు?
1) 1975 2) 2000
3) 1982 4) 1985
23. మండల పంచాయతీ అనే భావనను సిఫారసు చేసింది ఎవరు?
1) బల్వంత్రాయ్ మోహతా
2) అశోక్ మెహతా
3) ఎల్.ఎం. సింఘ్వి 4) పి.కె.తుంగన్
24. జిల్లా ప్రణాళికా కమిటీలను రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్స్ ప్రకారం నియమిస్తారు?
1) 244 ZD 2) 243 ZD
3) 245 ZD 4) 246 ZD
సమాధానాలు
1-3 2-2 3-2 4-3
5-2 6-4 7-4 7-4
8-4 9-1 10-3 11-4
12-2 13-3 14-2 15-3
16-3 17-3 18-2 19-4
20-1 21-1 22-3 23-2
24-2
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు