Telangana Socio Economic Survey | ఆయిల్‌పామ్ పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
1. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
ఎ. తెలంగాణ రాష్ట్రం జనాభా పరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది
బి. తెలంగాణ రాష్ట్రం వైశాల్యం పరంగా దేశంలో 12వ స్థానంలో ఉంది
సి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా 69 శాతం, గోదావరి పరీవాహక ప్రాంతం 79 శాతం ఉంది
1) A, B, C సరికాదు
2) A, B సరికాదు
3) B సరికాదు 4) C సరికాదు
2. 2014-15, 2022-23 మధ్య భారత దేశ జి.డి.పి ప్రస్తుత ధరల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత శాతం నుంచి ఎంత శాతానికి పెరిగింది?
1) 4.9 శాతం, 4.1 శాతం
2) 5.1 శాతం, 5.9 శాతం
3) 4.1 శాతం, 4.9 శాతం
4) 14.1 శాతం, 14.9 శాతం
3. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జి.ఎస్.డి.పి) ఎన్ని లక్షల కోట్లు?
1) 13.27 2) 11.27
3) 12.27 4) 14.27
4. ప్రస్తుత ధరల ప్రకారం భారతదేశ తలసరి ఆదాయం కన్నా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత ఎక్కువ?
1) రూ. 3.17 లక్షలు
2) రూ. 1.46 లక్షలు
3) రూ. 1.56 లక్షలు
4) రూ. 1.71 లక్షలు
5. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (N F H S) 2019-21 నివేదిక ప్రకారం గిని గుణకం 0.10 సమానమైన ఆదాయం పంపిణీ పరంగా దేశంలో 1వ స్థానంలో ఉన్న రాష్ర్టాలు?
1) తమిళనాడు, కేరళ, తెలంగాణ
2) కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ
3) మహారాష్ట్ర , తమిళనాడు, కేరళ
4) కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర
6. ప్రస్తుత ధరల్లో స్థూల రాష్ట్ర అదనపు విలువ (జీఎస్వీఏ) మొత్తం వ్యవసాయం, అనుబంధ రంగాల వాటా 2014-15లో ఎంత శాతం నుంచి 2022-23 నాటికి ఎంత శాతానికి పెరిగింది?
1) 16.3 శాతం, 17.3 శాతం
2) 16.3 శాతం, 19.3 శాతం
3) 18.2 శాతం, 19.1 శాతం
4) 16.3 శాతం, 18.2 శాతం
7. 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు వెచ్చించింది?
1) 1.61 2) 1.71
3) 1.81 4) 1.51
8. 2015-16 సంవత్సరంలో వరి ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 2021-22 మధ్య వరి ఉత్పత్తి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులకు నమోదైంది?
1) 45.71, 202 2) 46.71, 207
3) 44.71, 202 4) 45.71, 207
9. భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ) వరిని సరఫరా చేసే ఎన్నో అతిపెద్ద రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది?
1) 3 2) 4 3) 1 4) 2
10. ఆయిల్‌పామ్ పంట పండించే రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం?
1) 4 2) 5 3) 6 4) 7
11. 2021-22 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ర్టాల స్థూల దేశీయోత్పత్తి (జి.ఎస్.డి.పి) వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న తొలి 3 రాష్ర్టాలు ఏవి?
1) ఒడిశా, మధ్యప్రదేశ్, తెలంగాణ
2) తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా
3) తెలంగాణ, కేరళ, తమిళనాడు
4) తెలంగాణ, తమిళనాడు, ఒడిశా
12 . 2022-23లో స్థిర ధరల వద్ద (2011-12) తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జి.ఎస్.డి.పి) 2021-22 కంటే ఎంత శాతం పెరిగింది?
1) 7.0 2) 7.2 3) 7.4 4) 7.6
13. 2021-22 సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం (2011-22) రాష్ర్టాల స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి) వృద్ధిరేటు ఎక్కువగా ఉన్న తొలి 3 రాష్ర్టాలు ఏవి?
1) ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, బిహార్
2) ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ
3) తెలంగాణ, రాజస్థాన్, బిహార్
4) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్
14. 2022-23 సంవత్సరంలో తెలంగాణ భారతదేశంలో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం వృద్ధిరేటు ఎంత శాతం నమోదైంది ?
1) 19.2, 18.3 2) 10.3, 4.9
3) 9.3, 17.0 4) 15.1, 13.7
15. తెలంగాణ ప్రస్తుత ధరల ప్రకారం జి.ఎస్.వి.ఎ లో 2022-23లో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగం వాటాలు ఎంత?
1) 18.2 శాతం, 19 శాతం, 62.8 శాతం
2) 18 శాతం, 17 శాతం, 65 శాతం
3) 16.2 శాతం, 21 శాతం, 62.8 శాతం
4) 21 శాతం, 19 శాతం, 62.8 శాతం
16. 2022-23 సంవత్సరంలో తెలంగాణ ప్రస్తుత ధరల ప్రకారం (జి.ఎస్.వి.ఎ) వ్యవసాయరంగం, పారిశ్రామిక, సేవారంగ వృద్ధిరేటు ఎంతగా నమోదైంది ?
1) 17.5 శాతం, 11.9 శాతం, 10.5 శాతం
2) 10.5 శాతం, 11.9 శాతం, 17.5 శాతం
3) 9.7 శాతం, 17.9 శాతం, 20.5 శాతం
4) 10.5 శాతం , 17.5 శాతం, 11.9 శాతం
17. 2020-21 సంవత్సరంలో తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుత ధరల వద్ద స్థూల జిల్లా స్థాయి ఉత్పత్తి (జి.డి.డి.పి) ఆధారంగా కింది జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి ?
ఎ. హైదరాబాద్ బి. రంగారెడ్డి
సి. మేడ్చల్-మల్కాజిగిరి డి. సంగారెడ్డి
1) ఎ, బి, సి, డి 2) ఎ, సి, బి, డి
3) ఎ, బి, డి, సి 4) బి, ఎ, సి, డి
18. 2020-21 సంవత్సరంలో తెలంగాణ జిల్లాల్లో ప్రస్తుత ధరల వద్ద తలసరి ఆదాయం ఆధారంగా కింది జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. రంగారెడ్డి బి. హైదరాబాద్
సి. సంగారెడ్డి
డి. జయశంకర్ భూపాలపల్లి
1. ఎ, బి, సి, డి 2. బి, ఎ, సి, డి
3. ఎ, బి, డి, సి 4. బి, సి, ఎ, డి
19. పిరమిడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం 2020-21లో తెలంగాణ రాష్ట్రం.. దేశంలో శ్రామిక శక్తి పాల్గొనే రేటు ఎంత కలిగి ఉంది?
1) 58.4 శాతం, 65.4 శాతం
2) 65.4 శాతం, 58.4 శాతం
3) 52 శాతం, 48 శాతం
4) 48 శాతం, 52 శాతం
20. 2020-21లో తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల వారీగా శ్రామిక శక్తి పాల్గొనే రేటు?
1) 55.7 శాతం, 53.7 శాతం
2) 72.2 శాతం, 55.7 శాతం
3) 72.2 శాతం, 60.4 శాతం
4) 65.4 శాతం, 58.4 శాతం
21. 2020-21 సంవత్సరంలో తెలంగాణలో స్త్రీ-పురుషుల వారీగా శ్రామిక శక్తి పాల్గొనే రేటు ఎంత?
1) 81.2 శాతం, 35.2 శాతం
2) 80.4 శాతం, 81.2 శాతం
3) 50 శాతం, 80.4 శాతం
4) 35.2 శాతం, 81.2 శాతం
22. 2020-21లో తెలంగాణలో నిరుద్యోగిత రేటు ఎంత?
1) 7.5 శాతం 2) 8 శాతం
3)10.7 శాతం 4) 5.1 శాతం
23. 2020-21లో ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రంలోని ఏ మూడు జిల్లాలు అట్టడుగు స్థానాల్లో ఉన్నాయి?
1) ములుగు, కుమ్రం భీం, జయశంకర్ భూపాలపల్లి
2) జోగులాంబ గద్వాల, ములుగు, కుమ్రం భీం
3) హనుమకొండ, కుమ్రం భీం, వికారాబాద్
4) హనుమకొండ, ములుగు, కుమ్రం భీం
24. 2020-21లో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగాల్లో ఉపాధి ఎంత శాతం కలదు?
1) 45.8 శాతం, 21.0 శాతం, 33.2 శాతం
2) 46.5 శాతం, 23.9 శాతం, 29.6 శాతం
3) 40 శాతం, 30 శాతం, 30శాతం
4) 45.8 శాతం, 33.2 శాతం, 21 శాతం
25. తెలంగాణ రాష్ట్ర సొంత పన్ను రాబడి (State Own Tax Revenues- SOTR) స్థూల రాష్ట్రీయ ఉత్పత్తిలో (జి.ఎస్.డి.పి) ఎంత శాతం కలదు?
1) 6.21 శాతం 2) 7.21 శాతం
3) 8.21 శాతం 4) 9.12 శాతం
26. తెలంగాణ జి.ఎస్.డి.పి కి మొత్తం అప్పుల శాతం ఎంత?
1) 29.7 శాతం 2) 25.7 శాతం
3) 26.7 శాతం 4) 24.7 శాతం
27. 15 వ ఆర్థిక సంఘం 2020-21 నివేదికలో ఏ రాష్ర్టాలకు ప్రత్యేక గ్రాంట్లను సిఫార్సు చేసింది?
ఎ. తెలంగాణ బి. కర్నాటక
సి. మిజోరం డి. బిహార్
1) A, B, C, D 2) A, C, D
3) B, C, D 4) A, B, C
28. 2018-21 సంవత్సరంలో భారత దేశంలో అత్యధిక సగటు తలసరి రెవెన్యూ రాబడి గల మొదటి మూడు రాష్ర్టాలు ఏవి?
1) గోవా, కేరళ, తెలంగాణ
2) గోవా, తెలంగాణ, కేరళ
3) గోవా, మహరాష్ట్ర, తెలంగాణ
4) మహరాష్ట్ర, తెలంగాణ, కేరళ
29. తెలంగాణ రాష్ట్ర సొంత పన్ను రాబడి (State Own Tax Revenues )లో ఎక్కువ వాటా కలిగిన పన్ను?
1) SGST 2) VAT
3) Stamps and Registration Fees
4) Moter Vehicles Tax
30. బడ్జెట్లో అభివృద్ధేతర అంశాలు కానివి ఏవి?
ఎ. సామాజిక సేవలు బి. ఆర్థిక సేవలు
సి. సాధారణ సేవలు డి. పరిపాలన సేవలు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి
3) సి, డి 4) ఎ, డి
31. 2018-21 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి, అభివృద్ధేతర వ్యయం ఎంత?
1) 78.1 శాతం, 21.9 శాతం
2) 68.4 శాతం, 31.6 శాతం
3) 21.9 శాతం, 78.1 శాతం
4) 62 శాతం, 38 శాతం
32). 2018-21 సంవత్సరంలో మొత్తం వ్యయంలో అభివృద్ధి వ్యయం శాతం ఆధారంగా కింది రాష్ర్టాలను అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. తెలంగాణ బి. ఒడిశా
సి. ఛత్తీస్‌గఢ్ డి. కర్ణాటక
1) సి, బి, ఎ, డి 2) ఎ, బి, సి, డి
3) డి, సి, బి, ఎ 4) ఎ, బి, డి, సి
33) 2018-21 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం వాటా ఎంత?
1) 87 శాతం, 13 శాతం
2) 80 శాతం, 20 శాతం
3) 81.8 శాతం, 19.2 శాతం
4) 85.4 శాతం, 14.6 శాతం
34.తెలంగాణ ప్రభుత్వం 2022-23 FRBM (Fiscal Responsibility and Budget Management) ఆర్థిక విధానం ప్రకారం 2022-23లో ఆర్థిక లోటు (మొత్తం వసూళ్ల కంటే ఎక్కువ ఖర్చు) జి.ఎస్.డి.పిలో ఎంత లక్ష్యం పెట్టుకుంది?
1) 6 శాతం 2) 5 శాతం
3) 4 శాతం 4) 3 శాతం
36. ప్రస్తుత ధరల వద్ద 2022-23 సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి) వ్యవసాయం, అనుబంధం రంగాల వాటాను అవరోహణ క్రమంలో అమర్చండి.
ఎ. పంటలు బి. పశుపోషణ
సి. అటవీ ఉత్పత్తులు డి. మత్స్య సంపద
1) ఎ, బి, సి, డి 2) బి, సి, డి, ఎ
3) ఎ, బి, డి, సి 4) బి, ఎ, సి, డి
37. 2022-23 సంవత్సరంలో భారతదేశంలోని వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి రేటులో తెలంగాణ శాతం ఎంత?
1) 11.9 శాతం, 12.5 శాతం
2) 10.3 శాతం, 9.7 శాతం
3) 12.5 శాతం, 11.9 శాతం
4) 7.5 శాతం, 11.9 శాతం
38. కింది వాటిలో సరైన వాక్యాలు గుర్తించండి.
ఎ. తెలంగాణ రాష్ట్రంలో నికర సేద్యం విస్తీర్ణం 52.88శాతం
బి. తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24.70 శాతం
సి. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర భూమి విస్తీర్ణం 7.46 శాతం
డి. తెలంగాణ రాష్ట్రంలో బీడు భూమి విస్తీర్ణం 5.26 శాతం
1)ఎ, బి 2) బి, డి
3) సి, డి 4) ఎ, బి, సి, డి
39. 2015-16 వ్యవసాయ గణన ప్రకారం భారతదేశ సగటు కమతాల పరిమాణంలో తెలంగాణ వాటా ఎంత?
1) 1.08 హెక్టార్లు, 1 హెక్టర్
2) 1 హెక్టర్, 1.08 హెక్టార్లు
3) 1.08 హెక్టార్లు, 1.16 హెక్టార్లు
4) 1.16 హెక్టార్లు, 1.08 హెక్టార్లు
40. 2015-16 వ్యవసాయ గణన ప్రకారం సన్నకారు, చిన్నకారు కమతాల పరిమాణం ఎంత ?
1) 64.60 శాతం, 20.70 శాతం
2) 64.60 శాతం, 23.70 శాతం
3) 62.60 శాతం, 23.70 శాతం
4) 65.60 శాతం, 22.70 శాతం
41) తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గం ఎంత శాతం భూ కమతాలను కలిగి ఉన్నారు?
1) 12.4 శాతం 2) 8.9 శాతం
3) 11.8 శాతం 4) 12 శాతం
42 . 2020-22లో తెలంగాణ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం కన్నా ఎంత శాతం అధికంగా నమోదైంది?
1) 30 శాతం 2) 40 శాతం
3) 35 శాతం 4) 45 శాతం
జవాబులు
1. 3 2. 3 3. 1 4. 2
5. 1 6. 4 7. 1 8. 1
9. 4 10. 3 11. 1 12 .3
13. 1 14. 4 15. 1 16. 2
17. 4 18. 1 19. 2 20. 2
21. 3 22. 4 23. 3 24. 1
25. 2 26. 4 27. 4 28. 2
29. 1 30. 2 31. 1 32. 2
33. 4 34. 3 35. 1 36. 4
37. 3 38. 4 39 . 1 40 . 2
41. 3 42. 1
పన్నాల శ్రవణ్ కుమార్
ఎకనామిక్స్ ఫ్యాకల్టీ,
9866709280
హైదరాబాద్
Te
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు