Home
Nipuna Education
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
- 37. సెలాపాస్ సొరంగం వేటిని కలుపుతుంది?
a. ఉదంపూర్, రాంబన్
b. బనీహాల్, ఖాజీగండ్
c. శ్రీనగర్, జమ్మూ
d. బైశాఖి, నురానం జవాబు : d
వివరణ : సరిహద్దు రోడ్ల సంస్థ (బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్) అరుణాచల్ ప్రదేశ్లో 13వేల అడుగుల ఎత్తున సెలా పాస్ సొరంగాన్ని (టెన్నెల్) నిర్మిస్తోంది. ఇది బైశాఖి,
నురానంగ్లను కలుపుతుంది.
38. కింది అంశాలను పరిశీలించండి.
1. టీఎస్-ఐపాస్ 2. టీ-ప్రైడ్
3. టీఎస్ – గ్లోబల్ లింకర్
4. రైతుబంధు 5. దళిత బంధు
పైన పేర్కొన్న వాటిలో ఏవి తెలంగాణ రాష్ట్ర సప్లయ్ సైడ్ పాలసీలు కావు?
a. 1, 2 b. 2, 3, 4
c. 4, 5 d. 1, 4, 5
జవాబు : c
వివరణ : సప్లయి సైడ్, డిమాండ్ సైడ్ విధానాలను అమలు చేయడం ద్వారా ప్రభుత్వం అభివృద్ధికి సమతుల్య విధానాన్ని కొనసాగించింది. సైప్లె సైడ్లో టీఎస్ – ఐపాస్,
టీ – ప్రైడ్, టీఎస్ ఇండియా, టీఎస్ గ్లోబల్ లింకర్ వంటి మొదలైనవి ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచడం ద్వారా అభివృద్ధి గుణకాలుగా పనిచేశాయి. డిమాండ్ సైడ్లో దళితబంధు, రైతుబంధు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ఆసరా పింఛన్ల వంటి విస్తృత స్థాయి సంక్షేమ పథకాలున్నాయి.
39. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. నీతి ఆయోగ్ విడుదల చేసిన భారత ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ -2021)లో తెలంగాణ ప్రధాన రాష్ర్టాల్లో రెండో స్థానంలో ఉంది.
2. స్టార్టప్ ఇండియా, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ – 2022 సానుకూల వ్యవస్థ రూపకల్పనలో (ఎకోసిస్టమ్ ఎనేబ్లర్స్) విభాగంలో టీ – హబ్ ఫౌండేషన్ ఉత్తమ ఇంక్యుబేటర్గా అవార్డు పొందింది.
పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి కావు.
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు : d
వివరణ : నీతి ఆయోగ్ విడుదల చేసిన భారత ఆవిష్కరణల సూచీ (ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ -2021)లో తెలంగాణ రెండోస్థానంలో నిలిచింది. దీంతోపాటు స్టార్టప్ ఇండియా, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం ప్రకటించిన నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ – 2022లో సానుకూల వ్యవస్థ రూపకల్పనలో (ఎకోసిస్టమ్ ఎనేబ్లర్స్) విభాగంలో టి-హబ్ పౌండేషన్ ఉత్తమ ఇంక్యుబేటర్గా అవార్డు పొందింది.
40. కింది వాటిని పరిశీలించండి ?
1. 2020-2021లో అనియత/పీరియాడిక్ శ్రామికశక్తి సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం తెలంగాణలో 65.4% (శ్రామిక శక్తి శాతం స్థాయి /లేబర్ ఫోర్స్ పర్సంటేజ్ రేట్ (-LEPR) ఉంది. కాగా, జాతీయ స్థాయిలో అది 58.4%గా ఉంది.
2. తెలంగాణలో గ్రామీణ, పట్టణ ఎల్ఎఫ్పిఆర్ లు రెండూ తమ ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువ.
3. తెలంగాణ కార్మిక జనాభా నిష్పత్తి కూడా 2020-2021 జాతీయ కార్మిక జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉంది.
పై వ్యాఖ్యల్లో సరైనవి ఏవి?
a. 1, 2 b. 2,3
c. 3 d. 1, 2, 3
జవాబు : d
వివరణ : ఎల్ఎఫ్ఐఆర్ – ఉపాధి లేదా ఉపాధి కోసం వెతుకుతున్న వయోజన, పని చేసే వయస్సున్న జనాభా (15 నుంచి 59 సంవత్సరాల మధ్య) శాతాన్ని కొలుస్తుంది. అధిక ఎల్ఎఫ్ఎల్ఆర్ అనేది ఆర్థిక వ్యవస్థపై విశ్వాసానికి సూచిక. 2020-2021లో పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం తెలంగాణకు ఎల్ఎఫ్పిర్ 65. 4 శాతం ఉంది.కాగా, జాతీయ స్థాయిలో అది 58.4%. తెలంగాణకు సంబంధించి గ్రామీణ, పట్టణ ఎల్ఎఫ్పీఆర్ రెండూ జాతీయ స్థాయిలో ఇతర రాష్ర్టాల కంటే ఎక్కువగా ఉన్నాయి.
l డబ్లూపీఆర్ (వర్కింగ్ పాపులేషన్ రేషియో)-జనాభా ఉపాధి పొందిన వ్యక్తుల శాతాన్ని కొలుస్తుంది. ఎల్ఎఫ్పీఆర్ విషయంలో మాదిరిగానే, తెలంగాణ డబ్ల్యూపీఆర్ కూడా 2020-21లో జాతీయ స్థాయి కంటే ఎక్కువగానే ఉంది.
41. అధీకృత సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా)లకు సంబంధించి కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. ఆశా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం – ఆరోగ్య సేవల్లో భాగస్వాములు కావడం ద్వారా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా సామాజిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం.
2. డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును అందుకున్న వారిలో భారతదేశ ఆశాలు నాలుగోవారు.
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి కావు?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు : b
వివరణ : డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డును అందుకున్న వారిలో భారతదేశ ఆశాలు ఆరోవారు.
అధీకృత సామాజిక ఆరోగ్య కార్యకర్త (ఆశా)ల గురించి :
ఆశావర్కర్లు మహిళా సామాజిక కార్యకర్తలు. 2005లో ప్రారంభించిన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద సామాజిక ఆధారిత ఆరోగ్య కార్యకర్తలుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. - ఆశా కార్యక్రమ ప్రధాన ఉద్దేశం – ఆరోగ్య సేవల్లో భాగస్వాములు కావడం ద్వారా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా సామాజిక సామర్థ్యాన్ని మెరుగుపరచడం.
- చాలా సందర్భాల్లో గ్రామంలోని మహిళలనే కార్యకర్తలుగా ఎంపిక చేస్తారు.
42. కింది వ్యాఖ్యలను పరిశీలించండి?
1. దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.
2. పశు సంపదలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో ఉంది.
పై అంశాల్లో ఏవి సరైనవి కావు?
a. 1 b. 2 c. 1, 2 d. ఏదీ కాదు
జవాబు : b
వివరణ : 2012 నుంచి 2019 మధ్య భారతదేశంలోని ప్రధాన రాష్ర్టాల్లో పశుసంపద జనాభా వృద్ధిలో తెలంగాణ పశ్చిమ బెంగాల్ తర్వాత రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో మూడు ప్రధాన పంటలు పండిస్తున్నారు. అవి – వరి, పత్తి, మొక్కజొన్న. మొత్తం ఉత్పత్తిలో అవి దాదాపు 80% (2021). కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2021 వ్యవసాయ గణాంకాల ప్రకారం – దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. (5.80 మిలియన్ల టన్నుల బేళ్ల ఉత్పత్తిలో).
43. తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
a. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక సంస్థాగత కార్పొరేషన్
b. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్
c. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక
అభివృద్ధి సంస్థ
d. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కమిషన్ జవాబు : b
వివరణ : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీగా ఉంది.
45. మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న పురుషుల సంఖ్య ఆ విభాగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఎంత శాతం? (సమీప పూర్ణాంకానికి సరిచేయబడింది).
a. 70% b. 78%
c. 63% d. 86% జవాబు : d
వివరణ : మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య
= 800 24/100=192
అవసరమైన శాతం = 164 192/ 100 =85.94% = 86.
46. హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న మహిళల సంఖ్య, ఆ విభాగంలోని మొత్తం ఉద్యోగుల సంఖ్య మధ్య సంబంధిత నిష్పత్తి ఎంత?
a. 7:10 b. 5 : 7
c. 8 : 17 d. 12:19
జవాబు : a
వివరణ : హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య
= 800 5 /100 = 40
హెచ్ఆర్ విభాగంలో పనిచేస్తున్న మొత్తం మహిళా ఉద్యోగుల సంఖ్య
= 40 – 22 = 28
అవసరమైన శాతం 28:40 = 7:10
47. సంస్థ ఉత్పత్తి విభాగంలో పనిచేస్తున్న పురుషుల సంఖ్య ఆ విభాగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఎంత శాతం ఉంటుంది?
a. 76.5% b. 72.5%
c. 61.5% d. 87.5%
జవాబు : d
వివరణ : ఉత్పత్తి విభాగంలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 800 X 35/100 = 280
అవసరమైన శాతం = 245/280 X 100 = 87.5%
48. కింది అంశాలను పరిశీలించండి?
1. నేతన్నకు చేయూత 2. నేతన్న బీమా
3. చేనేత మిత్ర
4. పావలా వడ్డీ పథకం
పైన పేర్కొన్న వాటిలో తెలంగాణలో వస్త్ర
(టెక్స్టైల్) పరిశ్రమ అభివృద్ధికి
సంబంధించిన పథకాలు ఏవి?
a. 1, 2, 3 b. 2, 3, 4
c. 1, 3, 4 d. పైవన్నీ
జవాబు : d
వివరణ: నేతన్నకు చేయూత – ప్రభుత్వం 2017లో ‘నేతన్నకు చేయూత’ అని పిలిచే ‘తెలంగాణ చేనేత కార్మికుల అభ్యున్నతి నిధి పొదుపు, భద్రత’ (THWTFSSS) పథకాన్ని ప్రారంభించింది. - నేతన్న బీమా-తెలంగణ ప్రభుత్వం 2022 ఆగస్టు ఏడో తేదీన రైతు బీమాతో పాటు నేతన్న బీమా (సామూహిక జీవిత బీమా) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం 2022 ఆగస్టు 14 నుంచి అమల్లోకి వచ్చింది. ఎల్ఐసీ ఆఫ్ ఇండియా బీమా పథకం కింద చేనేత, పవర్లూమ్ నేత కార్మికులు; అనుబంధ కార్మికులు దీని పరిధిలోకి వస్తారు.
- చేనేత మిత్ర (పెట్టుబడి సబ్సిడీతో అనుసంధానించిన వేతన పరిహార పథకం)- నూలు, రంగులు, రసాయనాలకు 40% సబ్సిడీని అందించే ఇన్పుట్ సబ్సిడీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
- పావలా వడ్డీ పథకం – చేనేత నేత సహకార సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.
49. కిందివాటిలో ఏది సేవా రంగం కిందకు వస్తుంది?
1. వాణిజ్య & మరమ్మతు సేవలు
2. సమాచారం ప్రసారానికి సంబంధించిన సేవలు
3. యజమానులుగా గృహాల కార్యక్లాపాలు
4. సొంత ఉపయోగం కోసం గృహ కార్యకలాపాలను ఉత్పత్తి చేసే విభిన్న వస్తువులు, సేవలు
5. అదనపు ప్రాదేశిక సంస్థల
కార్యకలాపాలు
a. 1, 2, 3, 4 b. 1, 2, 3, 5
c. 1, 2, 3 d.1, 2, 3, 4, 5
జవాబు : d
వివరణ : పైన పేర్కొన్న అన్ని అంశాలూ సేవల రంగం పరిధిలోకి వస్తాయి.
50. కింది వ్యాఖ్యలను పరిశీలించండి.
1. సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనాలను మెరుగుపరచడంపై కీలక దృష్టితో పౌరులకు ప్రభుత్వ సేవలను అందించే వ్యవహారాలను నడిపేందుకు ఈ-సేవ, మీ-సేవ మొదలైన వాటితో కూడిన వేదిక ఎలక్ట్రానిక్ సేవల నిర్వహణ కిందికి వస్తుంది.
2. ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2015 డిసెంబరులో ఈ-ఆఫీసు ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రభుత్వ సంస్థల పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనాలను మరింత మెరుగుపరిచేలా కాగితాల వినిగియోం లేని కార్యాలయాల నిర్వహణ దీని లక్ష్యం.
3. ఇ-గవర్నెన్స్ దిశగా డిజిటల్ సాంకేతికతలను అవలంబిస్తున్న భారతదేశంలోని తొలి రాష్ర్టాల్లో తెలంగాణ ప్రభుత్వం ఒకటి.
4. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ లావాదేవీల సమీకరణ, విశ్లేషణ విభాగ (eTaal) ప్రకారం ఇ – లావాదేవీల సంఖ్య పరంగా తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ప్రతి 1000 మంది జనాభాకు ఇ-లావాదేవీల పరంగా రెండో స్థానంలో ఉంది.
పై వ్యాఖ్యల్లో ఏవి సరైనవి కావు?
a. 1, 2, 3 b. పైవేవీ కావు
c. 2, 3, 4 d.1, 2, 3, 4
జవాబు : b
వివరణ : సామర్థ్యం, పారదర్శకత, జవాబుదారీతనాలను మెరుగుపరచడంపై కీలక దృష్టితో పౌరులకు ప్రభుత్వ సేవలను అందించే వ్యవహారాలను నడిపేందుకు ఈ-సేవ, మీ-సేవ మొదలైన వాటితో కూడిన వేదిక ఎలక్ట్రానిక్ సేవల నిర్వహణ కిందికి వస్తుంది. ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2015 డిసెంబర్లో ఈ-ఆఫీసు ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రభుత్వ సంస్థల పారదర్శకత, సామర్థ్యం, జవాబుదారీతనాలను మరింత మెరుగుపరిచేలా కాగితాల వినియోగం లేని కార్యాలయాలు నిర్వహణ దీని లక్ష్యం. ఇ-గవర్నెన్స్ దిశగా డిజిటల్ సాంకేతికతలను అవలంబిస్తున్న భారతదేశంలోని తొలి రాష్ర్టాల్లో తెలంగాణ ప్రభుత్వం ఒకటి. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ఎలక్ట్రానిక్ లావాదేవీల సమీకరణ విశ్లేషణ విభాగం (eTaal) ప్రకారం ఇ-లావాదేవీల సంఖ్య పరంగా తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. ప్రతి 1000 మంది జనాభాకు ఇ-లావాదేవీల పరంగా రెండో స్థానంలో ఉంది. 2014 జూన్ 2 నుంచి 2022 మే 26 వరకు నమోదైన ఇ-లావాదేవీల ఆధారంగా ఈ ర్యాంకులు ఉన్నాయి.
51. ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నైపుణ్య సమన్వయాన్ని మెరుగుపరచడంపై ఇది ప్రధానంగా దృష్టిపెడుతుంది. 2014లో దీనిని ఏర్పాటు చేశారు. ఇది మూడు ప్రధాన సేవలను అందిందిస్తుంది. – నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత, ప్రభుత్వ యంత్రాంగ సామర్థ్య నిర్మాణం.
పై పేరా దేని గురించి వివరిస్తుంది.
a. ధరణి
b. టెక్నాలజీ హబ్ (టి-హబ్)
c. తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణల విభాగం
(తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ కౌన్సిల్)
d. టాస్క్ (TASK)
జవాబు : d
వివరణ: 2014లో ఏర్పాటైన టాస్క్ (TASK) ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య నైపుణ్య సమన్వయాన్ని మెరుగుపరచంపై ప్రధానంగా దృష్టిపెడుతుంది. టాస్క్ అందించే సేవలు మూడు ప్రధాన రకాలకు చెందినవి. నైపుణ్యాభి వృద్ధి, వ్యవస్థాపకత, ప్రభుత్వ యంత్రాంగ సామర్థ్య నిర్మాణం.
ఎం. క్రాంతి కుమార్ రెడ్డి
ఫ్యాకల్టీ
విష్ణు ఐఏఎస్ అకాడమీ
హైదరాబాద్
Previous article
Physics – IIT/NEET Foundation | Vector Subtraction is Useful to?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు