Economy | డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం.. పాత కొత్తల మేలు కలయిక
1. భారతీయ రిజర్వు బ్యాంకు ప్రస్తుత గవర్నర్ ఎవరు? (సి)
ఎ) అరుణ్‌జైట్లీ బి) ఉర్జిత్ పటేల్
సి) శక్తికాంతదాస్
డి) వై. వేణుగోపాల్ రెడ్డి
వివరణ : రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రస్తుత 25 గవర్నర్‌గా శక్తి కాంతదాస్ 2018 డిసెంబర్ 12న బాధ్యతలు
స్వీకరించారు.
- ఐఏఎస్ అధికారిగా తన కెరీర్లో శక్తి కాంత దాస్ భారతదేశం, తమిళనాడు ప్రభుత్వాలకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా, ఎరువుల కార్యదర్శిగా వివిధ హోదాల్లో పనిచేశారు.
- శక్తి కాంతదాస్ ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు, జాతీయాభివృద్ధి బ్యాంకు, ఏఐఐబీలో భారతదేశ ప్రత్యామ్నాయ గవర్నర్‌గా పనిచేశారు.
- దాస్‌గారు ఐఎంఎఫ్., జీ 20, బ్రిక్స్, సార్క్ మొదలైన అనేక అంతర్జాతీయ ఫోరమ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం
వహించారు.
2. ఏ రాష్ట్రం శ్రీ దన్వంతరి జనరిక్ మెడికల్ స్కోర్ స్కీమ్‌ని అమలు చేస్తుంది? (డి)
ఎ) గుజరాత్ బి) అసోం
సి) పంజాబ్ డి) ఛత్తీస్‌గఢ్
వివరణ: ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో శ్రీ ధన్వంతరి జనరిక్ మెడికల్ స్టోర్‌ని ప్రారంభించింది. - ఇది దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వ్యక్తులకు తక్కువ ధరలకు మందులను అందిస్తుంది. పట్టాణాభివృద్ధి శాఖ వీటిని నిర్వహిస్తుంది. ఖరీదైన మందులు, వైద్య పరికరాలను 50-70శాతం తగ్గింపుతో అందిస్తారు.
3. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రత్యేక సహాయ పథకం ఉద్దేశం ఏమిటి? (ఎ)
ఎ) రాష్ర్టాల మూలధన వ్యయాన్ని పెంచడం
బి) రాష్ర్టాల మూలధన
ఆదాయాన్ని పెంచడం
సి) దేశ ఆదాయాన్ని పెంచడం
డి) దేశ వ్యయాన్ని పెంచడం
వివరణ: భారతదేశంలో వివిధ రాష్ర్టాలు మూలధన వ్యయాన్ని పెంచే లక్ష్యంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక సహాయ పథకాన్ని ప్రవేశ పెట్టింది. - 2023-24 కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ఈ పథకం మూలధన పెట్టుబడి ప్రతిపాదనపై గణనీయమైన ప్రభావాన్ని చూపడం వల్ల అందరి దృష్టిని ఆకర్షించింది.
4. ఏ సంవత్సరాన్ని ఆసియా – భారత్ స్నేహ సంవత్సరంగా ప్రకటించారు? (సి)
ఎ) 2020 బి) 2021
సి) 2022 డి) 2023
వివరణ: ASEAN భారతదేశం 30 సంవత్సరాల భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకుంటూ 2022 సంవత్సరాన్ని ఏషియన్ భారత్ స్నేహ సంవత్సరంగా ప్రకటించారు.
5. వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ ఏ సంస్థ ప్రధాన ప్రచురణ? (ఎ)
ఎ) అంతర్జాతీయ ద్రవ్యనిధి
బి) ప్రపంచ బ్యాంకు
సి) ఆసియాభివృద్ధి బ్యాంకు
డి) ప్రపంచ ఆర్థిక వేదిక
వివరణ: ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్
ఎకనామిక్ ఔట్లుక్ అప్డేట్ ప్రకారం 2022 కంటే 2023లో దాదాపు 84 శాతం దేశాల హెడ్లైన్ ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటుందని అంచనా. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశంలో ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి తగ్గుతుందని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి 5 శాతం, 2024లో 4 శాతం తగ్గుతుంది.
6. నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) అనేది బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచవలసిన నిధుల మొత్తం అని మనకు తెలుసు.
ఆర్బీఐ తన ద్రవ్య విధానంలో సీఆర్‌ఆర్‌ని గణనీయంగా పెంచాలని నిర్ణయించుకుంటే కింది పరిణామాలను పరిగణించండి? (ఎ)
1) బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఎక్కువ డబ్బును ఉంచవలసి ఉంటుంది. ఇది లిక్విడిటీని తగ్గిస్తుంది.
2. బ్యాంకులు తమ హోమ్‌లోన్ ఉత్పత్తులపై వడ్డీరేట్లను పెంచవలసి ఉంటుంది
3. పెరిగిన వడ్డీరేట్ల వల్ల బ్యాంకులు ఎక్కువ డబ్బులు సంపాదించగలుగుతాయి
ఎ) 1, 2 బి) 2, 3
సి) 1, 3 డి) పైవన్నీ
7. ప్రపంచ బ్యాంక్ ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ ప్రకారం భారతదేశానికి 2022-23 జీడీపీ అంచనా ఎంత? (ఎ)
ఎ) 6.9 శాతం బి) 7.5 శాతం
సి) 8.1 శాతం డి) 8.9 శాతం
వివరణ: ప్రపంచ బ్యాంకు ఆర్థిక సంవత్సరం (F.Y.23) లో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. - ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ ప్రకారం ప్రపంచబ్యాంకు బాహ్య హెడ్ విండ్లకు ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో బలమైన అవుట్ టర్న్‌ను ఉదాహరించింది. ఆర్థిక వ్యవస్థ అంతకుముందు అంచనావేసిన 7 శాతం నుంచి 2024 ఆర్థిక సంవత్సరానికి 6.6 శాతానికి స్వల్పంగా వృద్ధి చెందుతుందని నివేదిక అంచనావేసింది.
8. UPI-LITE వాలెట్‌ని ఉపయోగించి చేసే తక్షణ లావాదేవీల గరిష్ఠ పరిమితి ఎంత? (బి)
ఎ) రూ. 100 బి) రూ. 200
సి) రూ. 500 డి) రూ. 2000
వివరణ : పీపీబీఎల్ (పేటీఎం, పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్). యూపీఐ-లైట్(LITE)ని ప్రారంభించింది. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) రూపొందించిన ఫీచర్ - ఈ లాంచ్‌తో ఫీచర్‌ను ప్రారంభించిన మొదటి పేమెంట్స్ బ్యాంక్‌గా పీపీబీఎల్ అవతరించింది.
- యూపీఐ లైట్ వాలెట్ వినియోగదారుడు రూ.200 వరకు తక్షణ లావాదేవీలను చేయడానికి అనుమతిస్తుంది.
- యూపీఐ లైట్‌కి రోజుకు రెండుసార్లు గరిష్ఠంగా రూ.2000 జోడించవచ్చు. దీని వల్ల రోజువారీ వినియోగం రూ. 4000 వరకు ఉంటుంది.
9. కింది వాటిలో ఏ తేదీన బ్యాంక్ తన బ్యాలెన్స్ షీట్‌ను ప్రచురిస్తుంది?(ఎ)
ఎ) మార్చి 31 బి) ఏప్రిల్ 1
సి) డిసెంబర్ 31 డి) జనవరి 31
వివరణ: భారతదేశంలో ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1న ప్రారంభమై మార్చి 31న ముగుస్తుంది. - భారతదేశంలో బ్రిటిష్ రాజుల కాలం నుంచి ఈ వ్యవస్థ ఉనికిలో ఉంది. అందువల్ల భారతదేశంలోని బ్యాంకులు ప్రతి సంవత్సరం మార్చి 31వ తేదీ నాటికి తమ ఆర్థిక నివేదికలను /బ్యాలెన్స్ షీట్స్‌ను ప్రచురిస్తాయి.
10. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023 నాటకి ఎన్ని దేశాలకు చెందిన బ్యాంకులను రూపాయల్లో వ్యాపారం చేయడానికి అనుమతించింది? (డి)
ఎ) 10 బి) 13
సి) 15 డి) 18
వివరణ: భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) 18 దేశాలకు చెందిన బ్యాంకులను రూపాయల్లో చెల్లింపులను సెటిల్ చేయడానికి ప్రత్యేక Vostro రూపాయి ఖాతాలను
తెరవడానికి అనుమతించింది. - 18 దేశాల్లో శ్రీలంక, మయన్మార్, యూకే, ఉగాండా, టాంజానియా, సింగపూర్, సీషెల్స్, రష్యా, ఒమన్, న్యూజిలాండ్, మారిషస్, మలేషియా, కెన్యా, ఇజ్రాయెల్, గయానా, జర్మనీ, ఫిజీ, బోట్స్వానా ఉన్నాయి.
11. జీవా పేరుతో వ్యవసాయ పర్యావరణ
ఆధారిత కార్యక్రమాన్ని ప్రారంభించిన
సంస్థ ఏది? (డి)
ఎ) సీఎస్ఐఆర్ బి) ఐసీఏఆర్
సి) నీతిఆయోగ్ డి) నాబార్డ్
వివరణ: నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్) ఇటీవల వ్యవసాయ జీవావరణ ఆధారిత ప్రోగామ్ జివాను ప్రారంభించింది. - ఇది ఐదు వ్యవసాయ పర్యావరణ మండలాలను కవర్చేసే 11 రాష్ర్టాల్లో నాబార్డ్ వాటర్‌షెడ్, వాటి కార్యక్రమాల కింద సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. సహజ వ్యవసాయం వైపు రైతు సమాజాన్ని నడిపించడం దీని లక్ష్యం.
12. ఫోన్ పే డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ నుంచి పూర్తి యాజమాన్య విభజనను ప్రకటించిన కంపెనీ ఏది? (బి)
ఎ) అమెజాన్ బి) ఫ్లిప్‌కార్ట్
సి) గూగుల్
డి) జియో ఇన్ఫోకమ్
వివరణ: ఫ్లిప్‌కార్ట్, ఫోన్ పే భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్. ఫోన్ పే పూర్తి యాజమాన్య విభజనను
ప్రకటించాయి. - ఫోన్ పే గ్రూప్‌ను 2016లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఇది భారతదేశపు అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల
ప్లాట్ ఫారమ్‌లలో ఒకటి - ఫోన్ పే 400 మిలియన్లకు పైగా నమోదిత వినియోగదారులను కలిగి ఉంది. ఇది భారతీయ మార్కెట్‌కు అనుగుణంగా
ఉత్పత్తులు, ఆఫర్లను రూపొందిస్తుంది.
13. ప్రపంచంలో పేరు మార్చుకున్న వివిధ
దేశాలు. - మయన్మార్ పాతపేరు బర్మా, 1989లో బర్మా పేరును మయన్మార్‌గా మార్చారు.
- శ్రీలంక పాత పేరు సిలోన్. 1971 తరువాత సిలోన్‌ను శ్రీలంకగా మార్చారు.
- థాయిలాండ్ పాతపేరు సియోమ్, 1939 లో సియోమ్ను థాయిలాండ్‌గా మార్చారు.
- కంబోడియా పాతపేర్లు క్మేర్ రిపబ్లిక్, డెమొక్రటిక్ ఆఫ్ కంపూచియా, స్టేట్ ఆఫ్ కంబోడియా, కింగ్డమ్ ఆఫ్ కంబాడియాగా ఈ దేశం పేర్లు మారాయి.
- ఇరాన్ పాత పేరు పర్షియా, 1935లో పర్షియాను ఇరాన్‌గా మార్చారు.
- డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పాతపేర్లు కాంగోఫ్రీ స్టేట్ , బెల్జియన్ కాంగ్, కాంగో లియో పోల్డివిల్లే, రిపబ్లిక్ ఆఫ్ కాంగో, రిపబ్లిక్ ఆఫ్ జైర్గా ఈ దేశం పేర్లు మారాయి.
- రిపబ్లిక్ ఆఫ్ కెబోవెర్డే పాతపేరు కేప్ వెర్డే. 2013లో కేప్వేర్డేను రిపబ్లిక్ ఆఫ్ కెబ్ వెర్డేగా మార్చారు.
- చెఖియా పాత పేరు చెక్ రిపబ్లిక్. 2016 ఏప్రిల్‌లో చెక్ రిపబ్లిక్‌ను చెఖియాగా మార్చారు.
- నెదర్లాండ్ పాత పేరు హాలెండ్, 2020 జనవరిలో హాలెండ్‌ను నెదర్లాండ్గా మార్చారు.
- రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియా పాతపేరు మెసిడోనియా, 2019 ఫిబ్రవరిలో మెసిడోనియాను రిపబ్లిక్ ఆఫ్ నార్త్ మెసిడోనియాగా మార్చారు.
- ఐర్లాండ్ పాతపేరు ఐరిష్ ఫ్రీ స్టేట్, 1937లో ఐరిష్ ఫ్రీ స్టేట్ కొత్త రాజ్యాంగం అమల్లోకి రావడంతోపాటు ఐర్లాండ్‌గా పేరు మార్చారు.
14. నీతిఆయోగ్ కొత్త వైస్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఎ) రమేష్ చంద్ బి) సుమన్ కెబెరీ
సి) అబిజిత్ బెనర్జీ డి) జయతీ ఘోష్
వివరణ: డాక్టర్ సుమన్ కె.బెరీ నీతిఆయోగ్ కొత్త చైర్మన్‌గా నియమితులయ్యారు. సిబ్బంది, ప్రజా ఫిర్యాధులు , పెన్షన్ మంత్రిత్వ శాఖ ప్రకారం డాక్టర్ రాజీవ్ కుమార్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. - డాక్టర్ సుమన్ కె.బెరీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఐప్లెడ్ ఎకనామిక్ రీసెర్చ్‌కు డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి, జాతీయ గణాంక కమిషన్, ఆర్బీఐ ద్రవ్య విధానానికి సంబంధించిన సాంకేతిక సలహా కమిటీ సభ్యునిగా కూడా పనిచేశారు.
Previous article
RBI Recruitment | ఆర్బీఐలో 450 అసిస్టెంట్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు