TET – Social | పరిశోధకుని స్థానంలో విద్యార్థిని ఉంచే పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం?
1. పాఠ్య ప్రణాళిక వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు ఇతర క్షేత్ర అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలియజేసే సూత్రం?
1) కృత్య కేంద్రీకృత సూత్రం
2) సృజనాత్మక సూత్రం
3) ఉపయోగితా సూత్రం
4) పరిపక్వత సూత్రం
2. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెందించే పాఠ్యప్రణాళికా నిర్మాణ ఉపగమం?
1) శీర్షికా ఉపగమం
2) ఏకకేంద్రక ఉపగమం
3) ప్రక్రియా ఉపగమం
4) భావన ఉపగమం
3. ఈ విద్యా ప్రణాళికా నిర్మాణ సూత్రం ఎక్కువగా వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలకు, క్షేత్ర అనుభవాలపై దృష్టి పెడుతుంది?
1) పరిరక్షణా సూత్రం
2) కలిపి ఉండే సూత్రం
3) జీవిత కేంద్రీకృత సూత్రం
4) కృత్య కేంద్రీకృత సూత్రం
4. వోగ్ స్పాట్చెక్ లిస్ట్‌కు సంబంధించని దాన్ని గుర్తించండి?
1) విషయం 2) విషయ కూర్పు
3) కచ్చితత్వం 4) భాషాశైలి
5. విద్యార్థులు పై తరగతులకు వెళ్తారనే ఉద్దేశంతో ప్రత్యుత్పత్తి వ్యవస్థ పాఠంలో క్లిష్టమైన భావనలను వివరణాత్మకంగా వివరించడం ఏ పాఠ్య ప్రణాళికా వ్యవస్థీకరణ విధానం?
1) ఏక కేంద్రక విధానం
2) శీర్షికా విధానం
3) యూనిట్ విధానం
4) తార్కిక విధానం
6. కరికులం ఏ లక్షణం కలిగి ఉండాలి?
1) అనమ్యత 2) స్థితి స్థాపకత
3) పరిమితత్వం 4) అపరిమితత్వం
8. విద్యాలక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలే కరికులం అని నిర్వచించినవారు?
1) స్పియర్స్ 2) మన్రో
3) కన్నింగ్‌హామ్ 4) శామ్యూల్
9. పరిశోధనల ఆధారంగా విద్యా ప్రణాళికకు కాలానుగుణంగా సమీక్షించాలి. ఈ సూచన చేసింది ఎవరు?
1) కొఠారి కమిషన్ 2) ఎన్పీఈ-1986
3) ఈశ్వరీబాయి పటేల్ కమిటి
4) యునెస్కో ప్లానింగ్ మిషన్ ఆఫ్ ఎక్స్పర్ట్స్
10. ఒకే తరగతిలో కఠినతా సూత్రం, పునశ్చరణ సూత్రం రెండింటికి అవకాశం కల్పించిన పాఠ్యప్రణాళిక వ్యవస్థీకరణ విధానం?
1) శీర్షిక పద్ధతి 2) సర్పిల పద్ధతి
3) తార్కిక పద్ధతి 4) ఏక కేంద్రక పద్ధతి
11. వ్యక్తి తనను తాను పక్కకు పెట్టి ఇతర అంశాల మధ్య సంబంధాలను దృగ్విషయాలను చూడ గలుగుతున్న అది ఏ శాస్త్ర విలువ?
1) నైతిక విలువ 2) సౌందర్య విలువ
3) సాంఘిక విలువ
4) ఉపయోగితా విలవ
12. అన్ని పాఠ్యాంశాలు, అన్ని తరగతుల్లో నేర్చుకోవడానికి వీలుకల్పించే పాఠ్యప్రణాళికా వ్యవస్థీకరణ విధానం?
1) శీర్షిక పద్ధతి 2) తార్కిక పద్ధతి
3) ఏక కేంద్రక పద్ధతి
4) మనో వైజ్ఞానిక పద్ధతి
13. నీవు విద్యార్థులను ‘స్థానికుల లబ్ధి కోసం వారి ఇరుగు పొరుగు వారితో ఆరోగ్య శిబిరం నిర్వహించి దానికి సంబంధించిన ఒక రిపోర్టు తయారు చేయమని అడిగితే అది ఏ విద్యా ప్రణాళికా నిర్మాణ సూత్రానికి సంబంధించినది?
1) సన్నద్ధతా సూత్రం
2) సనాతన సూత్రం
3) సమాజ కేంద్రీకృత సూత్రం
4) సమైక్యతా సూత్రం
14. వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతోపాటు చేనేత కార్మికుల గృహ సందర్శనల వంటి క్షేత్ర అనుభవాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విద్యా ప్రణాళికా నిర్మాణ సూత్రం?
1) సమైక్యతా సూత్రం
2) పరిరక్షణా సూత్రం
3) పరిపక్వతా సూత్రం
4) కృత్యకేంద్రీకృత సూత్రం
15. పరిశోధకుని స్థానంలో విద్యార్థిని ఉంచే పాఠ్య ప్రణాళిక నిర్మాణ సూత్రం?
1) సమాజ కేంద్రీకృత సూత్రం
2) దూరదృష్టి సూత్రం
3) సృజనాత్మక సూత్రం
4) సనాతన సూత్రం
16. విద్యా ప్రణాళిక అనే సాధనం కళాకారుడి లాంటి ఉపాధ్యాయుడి చేతిలోని పదార్థాలకు (విద్యార్థులు) రూపమివ్వటానికి అతని ఆదర్శాల(ఉద్దేశాల) ప్రకారం అతని స్టూడియో (పాఠశాల)లో రూపుదిద్దుకుంటుంది. అని నిర్వచించినవారు?
1) సియద్దీన్ 2) స్పియర్స్
3) కన్నింగ్‌హామ్ 4) ఫ్రోబెట్
17. పరిసరాల విజ్ఞానం 1, 2 లను వేర్వేరుగా బోధించాలని ఏ కమిటీ నిర్ధారించింది?
1) ఈశ్వరీబాయి పటేల్ కమిటీ
2) ఇండియన్ ఎడ్యుకేషన్ కమిషన్
1964-66
3) మొదలియార్ కమిటీ
4) జాతీయ విద్యా విధానం 1986
18. విద్యా ప్రణాళిక వ్యవస్థీకరణలో శీర్షికా పద్ధతిలోని లోపాలన్నీ ఏ పద్ధతిలో నివారించబడ్డాయి?
1) తార్కిక పద్ధతి 2) సమైక్య పద్ధతి
3) సర్పిల పద్ధతి 4) యూనిట్ పద్ధతి
సమాధానాలు
1-1 2-2 3-4 4-4
5-1 6-1 7-2 8-2
9-1 10-2 11-1 12-3
13-3 14-4 15-3 16-3
17-1 18-3
1. సాంఘిక శాస్త్రంలో, మన సమాజంలో వైవిధ్యం, స్త్రీ పురుష సమానత్వం దిశ పయనం అనే పాఠ్యాంశాలు ఏ ఇతి వృత్తం కింద రూపొందినవి?
1) మతం-సమాజం
2) సామాజిక వ్యవస్థీకరణ – అసమానతలు
3) రాజకీయ వ్యవస్థలు – పరిపాలన
4) సంస్కృతి -సమాచారం
2. మనదేశంలోని విద్యా ప్రణాళికలో పది (10) ఉమ్మడి మౌలికాంశాలను పొందుపరచాలని మొట్టమొదటిసారిగా సూచించినది?
1) ఎన్పీఈ -1968
2) ఎన్పీఈ-1986
3) ఎన్సీఎఫ్- 2000
4) 10 సంవత్సరాల పాఠశాల
విద్యా ప్రణాళిక -1975
3. మన రాష్ట్రంలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల రూపకల్పనలో ఏ ఉపగమం పరిగణనలోకి తీసుకొన లేదు?
1) ప్రత్యేక విషయ ఉపగమం
2) సమైక్యతా ఉపగమం
3) ఇతి వృత్త ఉపగమం
4) సహసంబంధ ఉపగమం
4. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలో సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు ఏ ఉపగమం ఆధారంగా రూపొందించినది?
1) అంశరీతి ఉపగమం
2) ఇతివృత్త ఉపగమం
3) వర్తుల ఉపగమం
4) కాలానుగుణ ఉపగమం
5. సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక రూపకల్పనలో కిందివాటిపై జాతీయ విద్యా విధానం -1986 దృష్టి పెట్టలేదు?
1) భారతదేశ స్వాతంత్రోద్యమం, స్త్రీ, పురుష సమానత్వం పరిసరాల పరిరక్షణ
2) చిన్న కుటుంబ భావన, శాస్త్రీయ దృక్పథాభివృద్ధి సమానత్వం
3) రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, బాధ్యతలు , భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద
4) పౌరుల్లో అసమానతలు, భిన్నత్వం, సాంఘిక సాంస్కృతిక అంతరాల పెంపుదల
6. మన రాష్ట్రంలో ఎలిమెంటరీ స్థాయిలోని ప్రస్తుత సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాలు కింది ఇతివృత్తాన్ని పరిగణనలోనికి తీసుకోకుండా రూపొందించినవి?
1) ఉత్పత్తి, వినిమయం, జీవనాధారం
2) మతం – సమాజం
3) సామాజిక వ్యవస్థీకరణ – అనుమానతలు
4) ప్రత్యేక విషయాల వారి పాఠ్యాంశాలు
7. ఎన్పీఈ -1986 సాంఘిక శాస్త్రంలో దేశ మంతటికీ ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఆధారంగా ఏ ప్రాధాన్యం ఉండాలని సూచించింది?
1) 75 శాతం విద్యా ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా, 25 శాతం స్థానిక అవసరాలకు అనుగుణంగా
2) 80 శాతం విద్యా ప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా, 20 శాతం దేశమంతటికీ ఒకే విధంగా
3) 70 శాతం విద్యాప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా, 30 శాతం దేశమంతటికీ ఒకే విధంగా
4) 80 శాతం విద్యాప్రణాళిక దేశమంతా ఒకే విధంగా, 20 శాతం స్థానిక అవసరాలకు అనుగుణంగా
8. సాంఘిక శాస్త్రంలోని ‘హక్కులు-అభివృద్ధి, జమీందారీ వ్యవస్థ రద్దు’ అనే పాఠ్యాంశాలు ఏ ఇతివృత్తం ఆధారంగా రూపొందించబడింది?
1) ఉత్పత్తి, వినిమయం, జీవనాధారం
2) సామాజిక వ్యవస్థీకరణ – అసమానతలు
3) రాజకీయ వ్యవస్థలు -పరిపాలన
4) సంస్కృతి – సమాచారం
సమాధానాలు
1-2 2-2 3-1 4-2
5-4 6-4 7-4 8-2
1. కరికులం పదం ఏ భాషా పదం నుంచి వచ్చింది?
1) గ్రీకు 2) లాటిన్
3) రోమన్ 4) ఆంగ్ల
2. విద్యార్థులు అభ్యసన అనుభవాలను పొందడానికి ఏర్పరిచే మార్గాలను కరికులం అంటారు అని అన్నది?
1) సాయిదిన్ 2) కిమ్బెల్
3) క్రెగ్ 4) అండర్సన్
3. జాతీయ విద్యా విధానం ఎన్ని అంశాలను మౌలిక అంశాలుగా సూచించింది?
1) 13 2) 5 3) 10 4) 15
4. 10 మౌలిక అంశాల్లో లేనిది?
1) స్త్రీ, పురుష సమానత్వం
2) రవాణా విద్య
3) పర్యావరణ పరిరక్షణ
4) శాస్త్రీయ దృక్పథం పెంచడం
5. హంటర్ స్కోర్ కార్డ్‌లో భౌతిక రూపానికి ఎన్ని పాయింట్లు కేటాయించారు?
1) 100 2) 200
3) 300 4) 50
6. జాతీయ సలహా సంఘం నియమించిన సంవత్సరం?
1) 1990 2) 1993
3) 1995 4) 1992
7. ఒక విషయానికి చెందిన అన్ని ప్రాథమిక విషయాల్ని సూక్ష్మంగా చెప్పడం ఏ పద్ధతి?
1) సహసంబంధ 2) ఏకకేంద్ర
3) శీర్షిక పద్ధతి 4) ఉదావర్త రీతి
8. సాంఖ్యక శాస్త్ర, జామెట్రీ అనే పాఠ్యాంశాల బోధనకు అనువైన బోధనా పద్ధతి ఏది?
1) ఏక కేంద్ర పద్ధతి 2) సర్పిలాకార
3) శీర్షిక 4) సమైక్య పద్ధతి
9, నిచ్చెనను పోలిన పద్ధతి అని ఏ పద్ధతికి పేరు?
1) ఏక కేంద్ర 2) శీర్షిక
3) సర్పిల 4) కాలక్రమ
10. ప్రతి విషయాన్ని భాగాలుగా విభజించడం సాధ్యం కాదు అని యశ్పాల్ కమిటీ ఏ పద్ధతికి దృష్టిలో ఉంచుకొని తెలిపారు?
1) ఏక కేంద్ర 2) శీర్షిక
3) సర్పిల పద్ధతి 4) సమైక్య పద్ధతి
11. అంశరీతిలోని లోపాలను తొలగించేది?
1) ఉదావర్తరీతి 2) ఏకకేంద్ర
3) శీర్షిక పద్ధతి 4) కాలక్రమం
12. నిరంతర పునరుక్తి చెందే పద్ధతి?
1) ఏక కేంద్ర 2) శీర్షిక పద్ధతి
3) కాలక్రమ 4) ఉదావర్తరీతి
13. నా ఉద్దేశంలో విద్యార్థికి ఉత్తమ ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకమే అని తెలిపినది?
1) హెచ్.జి. వెల్స్ 2) సోక్రటీస్
3) రాధాకృష్ణ 4) గాంధీ
14. హంటర్ స్కోర్ కార్డ్‌లో అభ్యాసాల స్థాయికి కేటాయించిన పాయింట్స్ ఎన్ని ?
1) 140 2) 100
3) 110 4) 50
15. అభ్యాసకుడు సమీక్షకు పూర్వ పరిచయం కింద ఊహించే విషయ సమాచార సమూహమే యూనిట్ అన్నది?
1) వెస్లీ 2) మోరిసన్
3) ట్రస్టన్ 4) రిచర్డ్
16. గెస్టాల్ట్వాద పునాదులపై నిర్మించిన ఉపగమం?
1) యూనిట్ ఉపగమం
2) ఏకకేంద్ర
3) వర్తులాకార 4) కాలక్రమ
17. ఉద్దేశాలకు అనువుగా ఉండే యూనిట్
1) నిర్మాణాత్మక యూనిట్
2) విషయ జ్ఞాన యూనిట్
3) బోధన యూనిట్
4) వనరుల యూనిట్
18. విద్యార్థులకు అవసరమైన విస్తృత సమాచారాన్ని అందించే యూనిట్?
1) నిర్మాణాత్మక యూనిట్
2) బోధనా యూనిట్
3) విషయజ్ఞాన యూనిట్
4) అనుభవ ప్రాముఖ్యత యూనిట్
19. వైయక్తిక భేదాలను గుర్తించడానికి సవరణాత్మక బోధనకు ఉపయోగపడేది?
1) అన్వేషణ 2) ప్రదర్శన
3) సాంశీకరణ 4) వ్యవస్థీకరణ
20. విద్యార్థికి ఒక అంశానికి సంబంధించిన నూతన విషయాల బోధన దేని ద్వారా జరుగుతుంది?
1) అన్వేషణ 2) ప్రదర్శన
3) సాంశీకరణ 4) వల్లెవేయడం
21. విషయ ప్రణాళికను ఏ విధంగా నిర్మిస్తారు?
1) సాధారణం నుంచి సంక్లిష్టం
2) తెలిసిన వాటి నుంచి తెలియనివి
3) తేలిక నుంచి కష్టం 4) పైవన్నీ
22. ఒక పాఠశాలలో వార్షికోత్సవం సందర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగితే అది?
1) పాఠ్యప్రణాళిక
2) విషయ ప్రణాళిక
3) సహ పాఠ్య ప్రణాళిక
4) పాఠ్యేతర కార్యక్రమం
23. పాఠశాలలో, పాఠశాల వెలుపల విద్యార్థులు పొందే అనుభవాల సమగ్రరూపం?
1) పాఠ్యప్రణాళిక 2) విషయ ప్రణాళిక
3) సహపాఠ్య ప్రణాళిక
4) పాఠ్యేతర ప్రణాళిక
సమాధానాలు
1-2 2-3 3-3 4-2
5-1 6-4 7-2 8-1
9-2 10-3 11-1 12-4
13-4 14-1 15-3 16-1
17-3 18-2 19-3 20-2
21-4 22-3 23-1
రవి కుమార్
ఏకేఆర్ స్టడీ సర్కిల్
వికారాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?