Telangana History | హైదరాబాద్‌లో నిర్మితమైన మొదటి సినిమా స్టూడియో ఏది?
649. విష్ణుకుండిన సైనిక వ్యవస్థకు సంబంధించి గజ దళం, పదాతి దళాలను సూచించే పదాలు ఏవి?
a) హస్తిమల్ల, వీరమల్ల
b) హస్తిబల, వీరబల
c) హస్త్యాధ్యక్ష, సేనాధ్యక్ష
d) హస్తికోశ, వీరకోశ జవాబు: (d)
650. విష్ణుకుండిన రాజుల కులదైవం ఎవరు?
a) శ్రీపర్వతస్వామి b) కుమారస్వామి
c) శ్రీకృష్ణుడు d) శ్రీవేంకటేశ్వరుడు
జవాబు: (a)
651. కాళిదాసు ‘మేఘదూతం’ కావ్యంలో ప్రస్తావన వచ్చే బౌద్ధ మతాచార్యుడు ఎవరు?
a) ఆచార్య నాగార్జునుడు
b) ఆచార్య ధర్మకీర్తి
c) ఆచార్య దిగ్నాగుడు
d) ఆచార్య పద్మపాణి జవాబు: (c)
వివరణ: దిగ్నాగుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగిరి ప్రాంతంలో నివసించినట్లు కాళిదాసు ‘మేఘదూతం’ కావ్యం ద్వారా తెలుస్తున్నది.
652. బౌద్ధమతంలో ‘యోగాచార’ మార్గాన్ని ఎవరు ప్రతిపాదించారు?
a) ఆచార్య నాగార్జునుడు
b) ఆచార్య దిగ్నాగుడు
c) ఆచార్య నాగసేనుడు
d) అశ్వఘోషుడు జవాబు: (b)
వివరణ: ఆచార్య దిగ్నాగుడి ప్రసిద్ధ రచన ‘ప్రమాణ సముచ్ఛయం’.
653. తెలంగాణలో ‘ఘటికలు’ అనే హిందూవిద్యా కేంద్రాలను నెలకొల్పిన రాజులు ఎవరు?
a) శాతవాహనులు b) ఇక్ష్వాకులు
c) ఆనందగోత్రికులు d) విష్ణుకుండినులు
జవాబు: (d)
654. విష్ణుకుండిన శాసనాల్లో కనిపించిన తెలుగు పదాల్లో ఒకటైన ‘విజయరాజ్య సంవత్సరంబుల్’ ప్రస్తావన ఏ శాసనంలో కనిపిస్తుంది?
a) కీసరగుట్ట గుండు శాసనం
b) రెండో విక్రమేంద్రవర్మ చిక్కుళ్ల శాసనం
c) ఇంద్రవర్మ రామతీర్థ శాసనం
d) హైదరాబాద్ చైతన్యపురి శాసనం
జవాబు: (b)
655. విష్ణుకుండిన పదం గుంటూరు జిల్లా విను bకొండకు సంస్కృతీకరణం అని పేర్కొన్న
చరిత్రకారుడు ఎవరు?
a) నేలటూరి వెంకటరమణయ్య
b) పీవీ పరబ్రహ్మ శాస్త్రి
c) కీల్ హారన్ d) రాబర్ట్ స్యూయెల్
జవాబు: (c)
656. విష్ణుకుండినులు చేయించిన నగారా భేరి కిందివాటిలో ఏ దేవాలయంలో ఉంది?
a) శ్రీశైలం మల్లికార్జున ఆలయం
b) ఉమామహేశ్వరం శివాలయం
c) అలంపురం బాలబ్రహ్మేశ్వర ఆలయం
d) త్రిపురాంతకం శివాలయం
జవాబు: (b)
657. బౌద్ధ నిర్మాణాల్లో ఒకటైన ‘ముడుపు స్తూపాలు’ నిర్మాణం ఎవరి కాలంలో మొదలైంది?
a) శాతవాహనులు b) విష్ణుకుండినులు
c) మౌర్యులు d) ఇక్ష్వాకులు
జవాబు: (d)
వివరణ: ముడుపు స్తూపాలు అంటే కోరికలు తీరినందుకు కట్టించినవి.
658. బుద్ధుడి జీవితానికి సంబంధించిన శిల్ప ప్రతీకలను జతపరచండి.
A. జననం 1. ధర్మచక్రం
B. మహాభినిష్క్రమణం 2. స్తూపం
C. జ్ఞానోదయం 3. పద్మం
D. ధర్మచక్రప్రవర్తనం 4. బోధివృక్షం
E. మహాపరినిర్వాణం 5. గుర్రం
a) A-1, B-2, C-3, D-4, E-5
b) A-3, B-5, C-4, D-1, E-2
c) A-3, B-5, C-1, D-5, E-4
d) A-2, B-3, C-4, D-1, E-5
జవాబు: (b)
659. కిందివాటిలో ఇనుప లేదా మెగాలిథిక్ (బృహత్ శిలా) యుగం నాటి సమాధి చిహ్నం కానిది ఏది?
a) డాల్మెన్ b) మెన్హిర్
c) నాడుకల్లు d) షిస్ట్
జవాబు: (c)
వివరణ: నాడుకల్లు.. యుద్ధంలో మరణించిన వీరుల స్మృతిగా నాటిన చిహ్నం. డాల్మెన్ (రాతి శవపేటికను భూ ఉపరితలం మీదే ఉంచి చుట్టూ రాళ్లను పేర్చడం), మెన్హిర్ (మరణించిన వారి స్మృతిలో పెద్ద, ఎత్తయిన రాయిని నిలపడం), షిస్ట్ (రాతి శవపేటికను భూమిలో పెట్టి, పైన వృత్తాకారంలో రాళ్లను పేర్చడం) ఇనుప యుగం ప్రజల సమాధులకు సంబంధించిన పదజాలం.
660. కింది వాటిలో ఏది ‘సార్కోఫేగస్’ అనే పదానికి వివరణగా సరిపోతుంది?
a) మట్టి శవపేటిక
b) మరణించిన వారి స్మృతిలో రాయిని నిలపడం
c) శవపేటిక చుట్టూ రాళ్లను పేర్చడం
d) చనిపోయిన వారిని దహనం చేయడం
జవాబు: (a)
661. కింది ప్రదేశాల్లో ఎక్కడ ఏనుగు ఆకారం కలిగిన శవపేటిక బయల్పడింది?
a) ధూళికట్ట b) కోటిలింగాల
c) ధరణికోట d) ఏలేశ్వరం
జవాబు: (d)
662. శాతవాహనుల శాసనాలకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి.
1. చిన్న గంజాం శాసనం మూడో పులోమావి వేయించాడు
2. మ్యాకదోని శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించాడు
పై వాటిలో సరైనవి ఏవి?
a) 1 b) 2
c) 1, 2 d) ఏదీకాదు
జవాబు: (d)
వివరణ: చిన్న గంజాం శాసనం యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించగా, మ్యాకదోని శాసనం మూడో పులోమావి వేయించాడు.
663. కింది రచనలు, రచయితలను సరిగ్గా జతపరచండి.
A. నేచురల్ హిస్టరీ 1. మెగస్తనీస్
B. ఎ గైడ్ టు జాగ్రఫీ 2. అజ్ఞాత నావికుడు
C. ఇండికా 3. ప్లీనీ
D. పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ 4. టాలమి
a) A-1, B-2, C-3, D-4
b) A-3, B-4, C-1, D-2
c) A-3, B-2, C-1, D-4
d) A-3, B-1, C-4, D-2
జవాబు: (b)
664. శాతవాహనుల పాలనకు సంబంధించి అనేక గ్రామాల సముదాయాన్ని ఏమని పిలిచేవాళ్లు?
a) గుల్మి b) గ్రామణి
c) విషయం d) ఆహారం
జవాబు: (a)
665. శాతవాహనుల కాలంలో ద్రవ్య రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే కోశాధికారి ఎవరు?
a) భాండాగారికుడు b) హేరణికుడు
c) అక్షపాటలికుడు d) నిబంధకారుడు
జవాబు: (b)
666. శాతవాహనుల కాలంలో వస్తు రూపంలో వచ్చిన ఆదాయాన్ని భద్రపరిచే అధికారి ఎవరు?
a) భాండాగారికుడు b) హేరణికుడు
c) నిబంధకారుడు d) రజ్జుగాహకుడు
జవాబు: (a)
667. శాతవాహనుల కాలానికి సంబంధించి ‘ప్రతీహారుడు’ అనే పదం దేన్ని సూచిస్తుంది?
a) దూత b) సైనికుడు
c) ద్వారపాలకుడు d) గూఢచారి
జవాబు: (c)
668. శాతవాహనుల కాలంలో ‘రజ్జుగాహకుడు’ నిర్వర్తించిన బాధ్యతలు ఏమిటి?
a) గూఢచర్యం
b) అంతఃపుర పర్యవేక్షణ
c) నగరాల్లో పన్నుల వసూలు
d) భూమిని సర్వే చేసి, శిస్తు వసూలు చేయడం జవాబు: (d)
669. శాతవాహనుల రాజ్య విభజనకు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ఆరోహణ క్రమం?
a) రాజ్యం, ఆహారం, విషయం, గ్రామం
b) గ్రామం, విషయం, ఆహారం, రాజ్యం
c) గ్రామం, ఆహారం, విషయం, రాజ్యం
d) రాజ్యం, విషయం, ఆహారం, గ్రామం
జవాబు: (b)
670. తెలంగాణలో మూకీ చిత్రాలకు మార్గదర్శి ఎవరు?
a) పైడి జయరాజ్ నాయుడు
b) జేఎఫ్ మదన్ c) ధీరేన్ గంగూలీ
d) హీరాలాల్ సేన్ జవాబు: (c)
వివరణ: ధీరేన్ గంగూలీ హైదరాబాద్‌లో 8 మూకీ చిత్రాలు తీశాడు.
671. బంజారాహిల్స్ ప్రాంతంలో ‘భాగ్యనగర్ స్టూడియో’ను ఎవరు నిర్మించారు?
a) బాదం రామస్వామి
b) ధీరేన్ గంగూలీ
c) వై. రామకృష్ణప్రసాద్
d) సీతారాం రెడ్డి జవాబు: (a)
672. హైదరాబాద్‌లో నిర్మితమైన మొదటి సినిమా స్టూడియో ఏది?
a) భాగ్యనగర్ స్టూడియో
b) మహావీర్‌సింగ్ స్టూడియో
c) అజంతా స్టూడియో
d) సారథి స్టూడియో జవాబు: (b)
673. హైదరాబాద్‌లో తొలి సినిమా థియేటర్ ఏది?
a) రాజేశ్వర్ థియేటర్
b) సెలెక్ట్ థియేటర్
c) జమ్రుద్ మహల్
d) రాజమహల్ జవాబు: (b)
674. తెలంగాణ భూస్వామ్య వ్యవస్థ పరిణామాలను చిత్రించిన ‘ఒక ఊరి కథ’ సినిమా దర్శకుడు ఎవరు?
a) బి.నర్సింగరావు b) శ్యాం బెనగల్
c) మృణాల్ సేన్ d) ధీరేన్ గంగూలీ
జవాబు: (c)
675. తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం కలిగిన ‘మా భూమి’ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు?
a) బి.నర్సింగరావు b) గౌతమ్ ఘోష్
c) మృణాల్ సేన్ d) అల్లాణి శ్రీధర్
జవాబు: (b)
వివరణ: ఈ సినిమా కథకు మూలం కిషన్ చందర్ ఉర్దూలో రాసిన ‘జబ్ ఖేత్ జాగే’. జబ్ ఖేత్ జాగే అంటే పొలాలు మేల్కొన్నప్పుడు అని అర్థం. ఈ సినిమా 1979లో నిర్మాణమై, 1980లో విడుదలైంది.
676. నిజాం ప్రభుత్వంపై గోండుల తిరుగుబాటు నేపథ్యంతో వచ్చిన ‘కొమురం భీం’ సినిమాకు దర్శకుడు ఎవరు?
a) గౌతమ్ ఘోష్ b) భూపాల్ రెడ్డి
c) బి.నర్సింగరావు d) అల్లాణి శ్రీధర్
జవాబు: (d)
677. పద్మభూషణ్ పురస్కారం అందుకున్న తొలి తెలుగు ప్రముఖుడు ఎవరు?
a) కాళోజీ నారాయణరావు
b) మాడపాటి హనుమంతరావు
c) సి.నారాయణరెడ్డి
d) బూరుగుల రామకృష్ణారావు
జవాబు: (b)
వివరణ: మాడపాటి హనుమంతరావు 1956లో పద్మభూషణ్ అందుకున్నారు.
678. తెలుగు సాహిత్యంలో తొలి దళిత కథగా పరిగణించే ‘వెట్టి మాదిగ దినచర్య’ను ఎవరు రచించారు?
a) బోయ జంగయ్య
b) బి.ఎస్. వెంకట్రావు
c) మాదిరి భాగ్యరెడ్డివర్మ
d) అరిగె రామస్వామి జవాబు: (c)
679. హైదరాబాద్ రాజ్యంలో హిందువుల్లో తొలుత డిగ్రీ (గ్రాడ్యుయేషన్) పట్టా పొందిన వ్యక్తి ఎవరు?
a) సురవరం ప్రతాపరెడ్డి
b) మాడపాటి హనుమంతరావు
c) కేశవరావు కోరాట్కర్
d) రాయ్ బాలముకుంద్ జవాబు: (d)
680. తెలంగాణ ఆర్థర్ కాటన్‌గా ప్రసిద్ధిచెందిన ఇంజినీర్ ఎవరు?
a) మెహిదీ నవాజ్ జంగ్
b) నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్
c) బహదూర్ యార్ జంగ్
d) మోక్షగుండం విశ్వేశ్వరయ్య
జవాబు: (b)
681. తెలంగాణకు చెందిన హిందీ సినిమా నటుడు పైడి జయరాజ్‌కు ఏ సంవత్సరంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది?
a) 1980 b) 1981
c) 1982 d) 1983
జవాబు: (a)
682. శతకానికి ఉండాల్సిన పూర్తి లక్షణాలతో ఉన్న తొలి తెలుగు శతకంగా దేన్ని పరిగణిస్తారు?
a) సర్వేశ్వర శతకం b) వృషాధిప శతకం
c) శివతత్వసారం d) సుమతీ శతకం
జవాబు: (b)
వివరణ: వృషాధిప శతకాన్ని పాల్కురికి సోమనాథుడు రచించాడు.
683. తెలుగులో తొలి త్య్రర్థి కావ్యం (మూడు అర్థాలను ఇచ్చేది) ‘యాదవ రాఘవ పాండవీయము’ను ఎవరు రచించారు?
a) వేములవాడ భీమకవి
b) పట్టమట్ట సోమనాథ సోమయాజి
c) ఎలకూచి బాలసరస్వతి
d) కాకుత్సం శేషప్ప కవి జవాబు: (c)
684. గులాం మహమ్మద్ కలకత్తా వాలా ఇంగ్లిష్, ఉర్దూ, తెలుగు మూడు భాషల్లో స్థాపించిన పత్రిక ‘మీజాన్’కు తెలుగులో అర్థం ఏంటి?
a) దినపత్రిక b) వార్త
c) విలేకరి d) త్రాసు
జవాబు: (d)
685. 1915లో స్వస్తిక్ దళ్ అనే సేవా సంస్థను ఏర్పాటు చేసినవారు?
a) మాదిరి భాగ్యరెడ్డివర్మ
b) మాడపాటి హనుమంతరావు
c) బి.ఎస్.వెంకటరావు
d) అరిగె రామస్వామి
జవాబు: (a)
686. దళితుల జీవితాలను చిత్రిస్తూ లోక మల్హరి రాసిన నవల ఏది?
a) జాతర b) జగ్గని యిద్దె
c) మృత్యుంజయులు d) జగడం
జవాబు: (b)
687. 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో నానా సాహెబ్ ప్రోత్సాహంతో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన జమీందారు ఎవరు?
a) రంగారావు
b) కులకర్ణి నర్సింగరావు
c) భీంరావు దేశాయి
d) వెంకటప్ప నాయక్ జవాబు: (b)
వివరణ: కులకర్ణి నర్సింగరావు బ్రిటిష్ వారితో పోరాడుతూ మరణించాడు.
688. చరాసియా అనే నూతన ధర్మాన్ని ప్రవేశపెట్టిన కుతుబ్‌షాహీ పాలకుడు ఎవరు?
a) కులీ కుతుబ్‌షా
b) మహమ్మద్ కులీకుతుబ్‌షా
c) ఇబ్రహీం కుతుబ్‌షా
d) అబ్దుల్లా కుతుబ్‌షా జవాబు: (c)
689. రజాకార్ల దౌర్జన్యాన్ని నిరసిస్తూ 1945లో పరిషత్ మహాసభలు నిర్వహించి, వరంగల్లు కాకతీయుల కోటలో ఎవరు జాతీయ జెండా ఎగురవేశారు?
a) పి.వి.నరసింహారావు
b) కాళోజీ నారాయణరావు
c) దాశరథి కృష్ణమాచార్యులు
d) దాశరథి రంగాచార్యులు
జవాబు: (b)
హర్షవర్ధన్ చింతలపల్లి
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు