Policies-Schemes- Groups Special | తెలంగాణ ప్రభుత్వ విధానాలు-పథకాలు
1. రైతుబంధు పథకానికి సంబంధించి సరైన అంశం?
ఎ. రైతుబంధు పథకాన్ని 2020, మే 10న హుజూరాబాద్‌లో ప్రారంభించారు
బి. రైతుబంధు పథకాన్ని యూరోపియన్ యూనియన్ అభినందించింది
సి. రైతుబంధు పథకానికి 2023-24 బడ్జెట్లో రూ.15,075 కోట్లు కేటాయించారు
డి. రైతుబంధు పథకం మాదిరిగా కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది
ఇ. రైతుబంధు పథకం ద్వారా సంవత్సరానికి ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్నారు
1) ఎ, బి 2) బి, సి, డి
3) సి, డి 4) డి, ఇ
2. చెల్లప్ప కమిషన్ ఏ అంశానికి సంబంధించింది?
1)రాష్ట్రంలో పేదలు, బలహీన వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్
2) రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్
3) రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్
4) రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక బృందాల ప్రగతిని అధ్యయనం చేయడానికి ఏర్పాటు చేసిన కమిషన్
3. కింది వాటిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించండి?
ఎ. మహాత్మా జ్యోతిబాఫులే ఓవర్సీస్ విద్యానిధి ద్వారా వెనుకబడిన తరగతుల విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు
బి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు
సి. ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా మైనారిటీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఆర్థిక సహాయం అందిస్తున్నారు
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) బి
4. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న పెన్షన్ (నెలకు)?
1) రూ.2016 2) రూ.3016
3) రూ.4016 4) రూ.1016
5. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జతపర్చండి.
జనాభా శాతం
ఎ. షెడ్యూల్డ్ కులాలు 1. 14.46
బి. షెడ్యూల్డ్ తెగలు 2. 17.50
సి. వెనుకబడిన తరగతులు 3. 9.91
డి. మైనారిటీలు 4. 51.08
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-4, బి-3, సి-2, డి-1
3) ఎ-3, బి-4, సి-1, డి-2
4) ఎ-2, బి-3, సి-4, డి-1
6. దళితబంధు పథకానికి సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి?
1) 2023-24 ఆర్థిక సంవత్సరంలో దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించారు
2) కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని 50 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు
అందిస్తున్నారు
3) దళితబంధు పథకాన్ని 2020 ఆగస్టు 16న హుజూరాబాద్‌లో ప్రారంభించారు
4) దళితబంధు పథకం ద్వారా దళితులు తమ అప్పులను తీర్చుకొని రుణ విముక్తి పొందడానికి ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది
7. ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి సరైనది?
ఎ. 10 విభాగాలకు చెందిన వారికి ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నారు
బి. ఆసరా పథకంలో భాగంగా పేద వృద్ధ కళాకారులకు నెలకు రూ.3016 ఆర్థిక సహాయం అందిస్తున్నారు
సి. ఆసరా పథకంలో భాగంగా వికలాంగులకు ప్రస్తుతం నెలకు రూ.4016 ఆర్థిక సహాయం అందిస్తున్నారు
డి. 2022 స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం రాష్ట్రంలో ఆసరా పథకం ద్వారా 44.12 లక్షల మంది ఆర్థిక ప్రయోజనం
పొందుతున్నారు
1) ఎ, బి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) ఎ, బి, సి, డి
8. ఆసరా పథకంలో భాగంగా వితంతువుల పెన్షన్ పొందడానికి అర్హత?
ఎ. 18 సంవత్సరాల వయస్సు దాటి ఉండాలి
బి. భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి
సి. 45 సంవత్సరాల వయస్సు వరకు పునర్వివాహం జరగలేదని ప్రతి సంవత్సరం ధ్రువీకరణ పత్రం సమర్పించాలి
డి. ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతి సంవత్సరం సమాచారం ఇవ్వాలి
1) ఎ, బి 2) ఎ, సి
3) బి, సి, డి 4) ఎ, బి, సి
9. రైతు బీమా పథకం ద్వారా కలిగే ప్రయోజనం?
1) పేద, సన్న కారు రైతులు అనారోగ్యంతో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారాన్ని 8 రోజుల్లో ఐడీబీఐ ద్వారా చెల్లిస్తున్నారు
2) రైతు భూమి పరిమాణంతో సంబంధం లేకుండా ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే రైతు కుటుంబానికి 100 రోజుల్లోపు ఎల్ఐసీ ద్వారా రూ.5 లక్షల పరిహారాన్ని అందిస్తున్నారు
3) దళిత, గిరిజన రైతులకు రూ.5 లక్షల పరిహారాన్ని ఎల్ఐసీ ద్వారా రైతు కుటుంబానికి అందిస్తున్నారు
4) రైతు భూమి పరిమాణంతో సంబంధం లేకుండా రైతులందరికీ పంట నష్టపరిహారం అందించడం
10. మిషన్ కాకతీయకు సంబంధించి సరైన స్టేట్మెంట్?
ఎ. మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని 2015, మార్చి 12న ప్రారంభించారు
బి. మిషన్ కాకతీయ లక్ష్యం రాష్ట్రంలోని 46531 చెరువులు, చిన్న నీటి వనరులను పునరుద్ధరించడం
సి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ 2018లో బెస్ట్ ఇరిగేషన్ ప్రాక్టీస్ కేటగిరీలో మిషన్ కాకతీయకు అవార్డ్ లభించింది
డి. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా ఉన్న చెరువులన్నింటినీ ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు 2021లో స్కోచ్ అవార్డు లభించింది
1) ఎ, బి 2) ఎ, సి
3) ఎ, బి, సి
4) ఎ, బి, సి, డి
11. రాష్ట్రంలో నిర్మించిన 2,601 వేదికల్లో ఒక్కో రైతువేదిక పరిధిలో ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉంటుంది?
1) 3 వేలు 2) 4 వేలు
3) 5 వేలు 4) 6 వేలు
12. మిషన్ భగీరథ పనులను పర్యవేక్షిస్తున్న సంస్థ?
1) ఆర్డబ్ల్యూఎస్
2) వ్యాప్కోస్ లిమిటెడ్
3) మైక్రో ఇరిగేషన్ డిపార్ట్మెంట్
4) హెచ్ఎండబ్ల్యూ
13. టీ ప్రైడ్ కార్యక్రమానికి సంబంధించి సరికానిది?
1) షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల శారీరక వికలాంగ వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం
2) స్టాంప్ డ్యూటీపై 75 శాతం రీయింబర్స్మెంట్
3) మహిళా పారిశ్రామికవేత్తలకు నూతన ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో 10 శాతం ప్లాట్లను కేటాయిస్తారు
4) స్కిల్ అప్‌గ్రెడేషన్, శిక్షణ వ్యయంలో 50 శాతం రీయింబర్స్మెంట్
14. భూమి కొనుగోలు పథకం ఎవరికి ఉద్దేశించింది?
1) రాష్ట్రంలోని అత్యంత నిరుపేదలకు కనీసం ఎకరం భూమిని అందించడం
2) రాష్ట్రంలో భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు మహిళ పేరుపై మూడు ఎకరాల వరకు వ్యవసాయ భూమిని అందించడం
3) రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల రైతులకు కనీసం మూడెకరాల భూమిని అందించడం
4) రాష్ట్రంలో గిరిజనులకు మూడెకరాల పోడు భూమిని అందించడం
15. టీఎస్ ఐపాస్ చట్టం- 2014కు సంబంధించి సరైన అంశం?
ఎ. టీఎస్ ఐపాస్ చట్టాన్ని 2014లో రూపొందించారు
బి. టీఐఎస్ ఐపాస్ చట్టం-2014 ప్రకారం మూలధన వ్యయం రూ.200 కోట్లలోపు ఉన్న కంపెనీలకు గరిష్ఠంగా 30 రోజుల్లోపు పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని రకాల అనుమతులను మంజూరు చేస్తారు
సి. టీఎస్ ఐపాస్ చట్టం-2014 ప్రకారం మూలధన వ్యయం రూ.200 కోట్ల కంటే ఎక్కువ ఉన్న పరిశ్రమలకు 45 రోజుల్లోపు అవసరమైన అన్ని రకాల అనుమతులను మంజూరు చేస్తారు
1) ఎ 2) బి 3) సి 4) ఎ, బి
16. దేశంలో సంచార పశువైద్య సేవల వాహనాలను ప్రారంభించిన మొట్టమొదటి రాష్ట్రం?
1) హర్యానా 2) హిమాచల్‌ప్రదేశ్
3) తమిళనాడు 4) తెలంగాణ
17. టీఎస్ కాప్ మొబైల్ యాప్..
1) తెలంగాణ పరిశ్రమల శాఖ రూపొందించింది
2) తెలంగాణ పోలీస్ శాఖ రూపొందించింది
3) తెలంగాణ గృహ నిర్మాణ శాఖ రూపొందించింది
4) తెలంగాణ సెక్రటేరియట్ జీఏడీ విభాగం రూపొందించింది
18. యువతలో నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పన కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమం?
1) టీ-హెచ్ఏఆర్టీ
2) టీ-ఏఎస్ఎస్‌ఐఎస్‌టీ
3) టీ-ఎస్కేఐఎల్ఎల్
4) టీ-ఎంఈఎన్టీవోఆర్
19. కార్యక్రమాలు, లక్ష్యాలను జతపర్చండి?
ఎ. టీవర్క్స్ 1. ప్రపంచంలోని వివిధ దేశాల స్టార్టప్‌లను హైదరాబాద్ స్టార్టప్‌లతో అనుసంధానించడం
బి. టీ బ్రిడ్జ్ 2. సృనాత్మకతతో వస్తు ఉత్పత్తిని సాధించడం
సి. టీ స్కాన్ 3. అన్ని రకాల ప్రభుత్వ సేవలను ఒకే మొబైల్ యాప్ ద్వారా అందించడం
డి. టీ యాప్ ఫోలియో 4. సచివాలయం లో డేటా నెట్వర్క్ వ్యవస్థను బలోపేతం చేయడం
1) ఎ-4, బి-2, సి-1, డి-3
2) ఎ-2, బి-1, సి-4, డి-3
3) ఎ-3, బి-2, సి-4, డి-1
4) ఎ-1, బి-2, సి-3, డి-4
20. కల్యాణి లక్ష్మి పథకం..
ఎ. 2014, అక్టోబర్ 2న ప్రారంభించారు
బి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు, విడాకులు తీసుకొని ద్వితీయ వివాహం చేసుకునే మహిళలకు ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు
సి. 2018, ఏప్రిల్ 1 నుంచి ఈ పథకం ద్వారా అందించే ఆర్థిక సహాయాన్ని రూ.1,00,116 కు పెంచారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఎ, బి, సి
21. సీనియర్ సిటిజన్స్ (వృద్ధుల) సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన హెల్ప్‌లైన్ నంబర్?
1) 14567 2) 12367
3) 14576 4) 12376
22. ధరణి వెబ్ పోర్టల్ లక్ష్యం కానిది?
1) భూ రికార్డుల సమీకృత నిర్వహణ
2) భూమి సారవంతతను ఎలక్ట్రానిక్ పద్ధతిలో అంచనావేయడం
3) రెవెన్యూ రికార్డుల్లో ఎలక్ట్రానిక్ ఇంటర్నెట్ను ప్రవేశపెట్టడం
4) భూ యజమాని ఆధార్ కార్డు ఆధారంగా భూ రికార్డుల్లో అవసరమైన మార్పులు చేయడం
23. 21 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సుగల బ్రాహ్మణులను పారిశ్రామిక రంగంలో ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం?
1) బీఈఎస్‌టీ 2) ఈఆర్ఎస్టీ
3) ఎంవోఎస్టీ 4) ఈవీఈఆర్ఈఎస్టీ
24. గొర్రెల పంపిణీ పథకంలో ప్రభుత్వ సబ్సిడీ వాటా?
1) 25 శాతం 2) 50 శాతం
3) 75 శాతం 4) 100 శాతం
25. జీ సుధీర్ కమిటీ ఏ అంశానికి సంబంధించింది?
1) రాష్ట్రంలో మహిళలపై హింస, నేరాల తీరును అధ్యయనం చేయడం
2) రాష్ట్రంలో వికలాంగుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేయడం
3) రాష్ట్రంలో సంచార జాతుల స్థితిగతులను అధ్యయనం చేయడం
4) రాష్ట్రంలో ముస్లింల స్థితిగతులను అధ్యయనం చేయడం
సమాధానాలు
1-3, 2-2, 3-2, 4-3, 5-4, 6-1, 7-4, 8-4, 9-2, 10-4, 11-3, 12-2, 13-2, 14-2, 15-4, 16-4, 17-2, 18-2, 19-2, 20-4, 21-1, 22-2, 23-1, 24-3, 25-4
నూతనకంటి వెంకట్
పోటీ పరీక్షల నిపుణులు
ఆర్గనైజింగ్ సెక్రటరీ
గ్రూప్-1 అధికారుల సంఘం
9849186827
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?