TET Environmental Studies | ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1. ఒక కుటుంబంలో మార్పులకు కారణం ?
1) పెళ్లిళ్లు కావడం, పిల్లలు పుట్టడం
2) ఎవరికైనా ఉద్యోగం రావడం
3) ఎవరైనా కుటుంబం వదిలి వెళ్లడం,
చనిపోవడం 4) 1, 2, 3, 4
2. నానమ్మ, తాత, చిన్ననానమ్మ, చిన్నతాత, చిన్నాన్న, చిన్నమ్మ, పెద్దనాన్న, అత్తమ్మ, పిల్లలు అంతా కలిసి ఉండే కుటుంబం?
1) ఉమ్మడి కుటుంబం
2) సమష్టి కుటుంబం
3) పెద్ద కుటుంబం 4) పైవన్నీ సరైనవే
3. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే కలిసి ఉండే కుటుంబం?
1) సమిష్టి కుటుంబం
2) ఉమ్మడి కుటుంబం
3) వ్యష్టి కుటుంబం 4) 1, 2
4. మహిళలు వలస వెళ్లడానికి ప్రధాన కారణం?
1) ఉపాధి 2) మత మార్పిడి
3) వివాహం
4) ఉపాధి కోసం అన్వేషణ
5. పురుషులు వలస వెళ్లడానికి ప్రధాన కారణం?
1) వివాహం 2) ఉపాధి
3) ఉపాధి కోసం అన్వేషణ
4) 2, 3
6. ప్రపంచ వృద్ధుల దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు?
1) ఆగస్టు-1 2) సెప్టెంబర్-11
3) అక్టోబర్ -1 4) నవంబర్-21
7. కుటుంబంలో కొత్త సభ్యుల చేరికకు కారణం ?
1) పెళ్లిళ్లు జరగడం వల్ల
2) పిల్లలు పుట్టినప్పుడు
3) ఎవరికైనాఉద్యోగం రావడం వల్ల
4) 1, 2
8. కుటుంబంలో సభ్యులు తగ్గిపోవడానికి కారణం
1) పెళ్లిళ్లు జరగడం వల్ల
2) ఎవరికైనా ఉద్యోగం రావడం వల్ల
3) కుటుంబం వదిలి వెళ్లడం, చనిపోవడం
4) 2, 3
9. సరైన జతను ఎన్నుకోండి?
విభాగం-1 విభాగం-2
ఎ) ఉగాది 1) చైత్రశుద్ధపాఢ్యమి
బి) మహాశివరాత్రి 2) మాఘ మాసంలో బహుళ పక్ష చతుర్దశి
సి) శ్రీరామనవమి 3) చైత్రశుద్ద నవమి
డి) దీపావళి 4) ఆశ్వయుజ బహుళ చతుర్దశి
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-2, బి-3, సి-4, డి-1
3) ఎ-4, బి-3, సి-2, డి-1
4) ఎ-3, బి-2, సి-1, డి-4
10. దేశంలోని ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జరుపుకొనే పండుగలు?
1) రుతు సంబంధమైన పండుగలు
2) జాతీయ పండుగలు
3) మత సంబంధమైన పండుగలు
4) పైవన్నీ
11. దేశంలోని ప్రజలు వారివారి సంప్రదాయాలకు ఆచారాలకు కట్టుబాట్లకు అనుగుణంగా జరుపుకొనే వివిధ రకాలైన పండుగలు?
1) జాతీయ పండుగలు
2) మతసంబంధమైన పండుగలు
3) రుతు సంబంధమైన పండుగలు
4) పైవన్నీ
12. భారతదేశంలో 2007-08లో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యాన్ని జతపరచండి?
విభాగం-1 విభాగం-2
ఎ) షెడ్యూల్డ్ కులాలు 1) 18 శాతం
బి) షెడ్యూల్డ్ తెగలు 2) 40 శాతం
సి) వెనుకబడిన తరగతులకు 3) 23 శాతం
డి) ఇతరులు 4) 19 శాతం
1) ఎ-1 , బి-2 , సి-3, డి-4
2) ఎ-2, బి-3 , సి-4 , డి- 1
3) ఎ-4 , బి-3 , సి-2 , డి-1
4) ఎ-3 , బి-2 , సి-1 , డి-4
13. ప్రజల్లో ముఖ్యంగా రైతులు నిర్వహించుకునే పండుగలు ఏవి?
1) మత సంబంధమైన పండుగలు
2) జాతీయ పండుగలు
3) రుతు సంబంధమైన పండుగలు
4) పైవన్నీ
14. కుటుంబ జీవనంలో గృహోపకరణాల వినియోగానికి కారణాలు?
1) కొన్ని కుటుంబాల్లో పని మనుషులను ఏర్పాటు చేసుకోవడం
2) ఇంట్లో రోజూ చేసుకునే పనులకు కూడా విద్యుత్ ఉపకరణాలను వాడటం
3) విద్యుత్ ఉపకరణాలు తక్కువ ధరకు లభిస్తాయి
4) ప్రస్తుతం విద్యుత్ ఉపకరణాల తక్కువ విద్యుత్‌ను వాడుతున్నారు.
1) 1, 3, 4 2) 1, 2
3) 3, 4 4) 1, 2, 3, 4
15. కిందివాటిలో సరైన దాన్ని గుర్తించండి?
1) మాఘమాసంలో బహుళపక్ష చతుర్ధశినాడు మహాశివరాత్రి జరుపుకొంటారు
2) ఈదుల్ఫితర్ అంటే రంజాన్
3) దైవ కుమారుడు భువికి వచ్చిన రోజుగా క్రిస్టమస్ జరుపుతారు
4) శిలువ చేసిన మూడోరోజు ఆదివారం క్రీస్తు తిరిగి వచ్చాడని ఈస్టర్ని నిర్వహిస్తారు
1) 1, 2, 3 2) 1, 3, 4
3) 1, 2, 3, 4 4) 2, 4
16. లక్ష్మీదేవిని పూజించే పండుగ?
1) వసంత పంచమి 2) ఓనం
3) దీపావళి 4) సంక్రాంతి
17. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్ ప్రాంతంలో బాగా నిర్వహించే పండుగ?
1) దీపావళి 2) సంక్రాంతి
3) రక్షాబంధన్ 4) హోళీ పండుగ
18. ఉమ్మడి కుటుంబాలు, వ్యష్టి కుటుంబాలుగా మారడానికి గల కారణాలు?
1) ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడం
2) ఆస్తులను పంచుకోవడం
3) నివసించడానికి ఇల్లు సరిపోక పోవడం
4) పైవన్నీ సరైనవే
19. ప్రజలు, విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లడం?
1) ఉపాధి వసతి 2) రాజకీయ వలస
3) సామాజిక వలస 4) వలస
20. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం వలస వెళ్లిన వారి సంఖ్య?
1) 3.07 కోట్లు 2) 30.7 కోట్లు
3) 3.70 కోట్లు 4) 37.0 కోట్లు
21. చైత్ర శుద్ధపాడ్యమినాడు జరుపుకొనే పండుగ?
1) ఉగాది 2) మహాశివరాత్రి
3) శ్రీరామ నవమి 4) దీపావళి
22. శ్రావణ పౌర్ణమి రోజున చేసుకొనే పండుగ?
1) ఉగాది 2) శ్రీరామ నవమి
3) దీపావళి 4) రక్షాబంధన్
23. పెళ్లి వల్ల కుటుంబంలో వచ్చే మార్పులను గుర్తించండి?
1) పెళ్లి కూతురు, పుట్టింటి నుంచి అత్తారింటికి వెళుతుంది
2) పుట్టింటిలో కుటుంబ సభ్యులు తగ్గుతారు
3) అత్తారింటిలో కుటుంబ సభ్యులు పెరుగుతారు
4) అత్తారింటిలో కుటుంబ సభ్యులు పెరగరు
1) 1, 2, 3, 4 2) 1, 2
3) 1, 2, 3 4) 2, 4
24. కుటుంబ వ్యవస్థలో మార్పులకు కారణం?
1) కుటుంబంలో పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం
2) కొత్త ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడం బదిలీ కావడం
3) వ్యాపారం, చదువుల కోసం వలస పోవడం
4) భూకంపాలు, వరదలు రావడం
1) 1, 3, 4 2) 1, 2, 4
3) 1, 2, 3 4) 1, 2, 3, 4
25. సరైన సమాధానాన్ని గుర్తించండి?
విభాగం -1 విభాగం -2
ఎ) అంధుల లిపి 1) మే -15
బి) వృద్ధుల దినోత్సవం 2) డిసెంబర్ -3
సి) ప్రపంచ దివ్యాంగుల
దినోత్సవం 3) లూయిస్ బ్రెయిలీ
డి) కుటుంబ దినోత్సవం 4) అక్టోబర్ -1
1) ఎ-1, బి-2, సి-3, డి-4
2) ఎ-3, బి-4, సి-2, డి- 1
3) ఎ-2, బి-4, సి-1, డి-3
4) ఎ-4, బి-3, సి-2, డి-1
26. తమిళనాడులో పొంగల్ పేరుతో చేసే పండుగ?
1) దీపావళి 2) దసరా
3) ఓనం 4) సంక్రాంతి
27. సరైన జతని ఎంపిక చేయండి?
విభాగం-1 విభాగం-2
ఎ) దసరా 1) అశ్వయుజ మాసంలో శుద్ధ పాఢ్యమి
బి) హోళీ పండుగ 2) వసంత రుతువు
సి) రక్షాబంధన్ 3) శ్రావణ పూర్ణిమ
డి) ఈద్ 4) రెండు పర్వదినాలు
1) ఎ-4, బి-3, సి-2, డి-1
2) ఎ-1, బి-2, సి-3, డి-4
3) ఎ-2, బి-4, సి-3, డి-1
4) ఎ-3, బి-1, సి-2, డి-4
28. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్, హర్యానా రాష్ర్టాల్లో జరుపుకొనే పండుగ?
1) రక్షాబంధన్ 2) హోళీ పండుగ
3) వసంత పంచమి 4) వైశాఖి
29. కుటుంబంలో చిన్న పిల్లలు పుట్టడం వల్ల వచ్చే మార్పులు?
1) చిన్న పాపకు స్నానం చేయించడం
2) ఆహారం తయారు చేయడం
3) చిన్నపాపను జాగ్రత్తగా చూసుకోవడం
4) ఎందుకు ఏడుస్తుందో తెలుసుకొని, ఏడవకుండా చేయడం
1) 1, 2, 3 2) 1, 2, 3, 4
3) 1, 3, 4 4) 2, 4
30. సాధారణంగా ఒక కుటుంబంలో ఉండే సభ్యులు?
1) అమ్మ, నాన్న
2) తాతయ్య నాయనమ్మ
3) అమ్మమ్మ, పిల్లలు
4) పైవారందరూ సభ్యులే
31. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి?
1) సాధారణంగా కుటుంబంతో అమ్మ,
నాన్న, తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, పిల్లలు ఉంటారు.
2) అన్నీ కుటుంబాలు ఒకేలా ఉంటాయి
3) కొన్ని కుటుంబాల్లో అమ్మ, నాన్న,
పిల్లలు మాత్రమే ఉంటారు
4) మరికొన్ని కుటుంబాల్లో అమ్మ, నాన్న, పిల్లలతోపాటు, తాత, నాయనమ్మ లాంటి వృద్ధులు కూడా ఉంటారు
1) 1, 3 2 1, 2, 3
3) 1, 3, 4 4) 1, 2, 3, 4
32. కుటుంబ సభ్యులు, వారి పూర్వీకుల వివరాలతో రాసిన పట్టికను ఎలా పిలుస్తారు?
1) వంశవృక్షం 2) వంశ చార్ట్
3) వంశజాబితా 4) వంశ క్రమం
33. కళ్లు లేని వాళ్లు చదవడం కోసం లిపిని కనిపెట్టినది?
1) థామస్ అల్వా ఎడిసన్
2) మైఖేల్ ఫారడే
3) బెంజిమన్ ఫ్రాంక్లిన్
4) లూయిస్ బ్రెయిలీ
34. వ్యష్టి కుటుంబాలు ఏర్పడడానికి కారణాలు, పర్యవసనాలు?
1) పెళ్లి కాగానే వేరు కాపురం పెట్టడం
2) తల్లిదండ్రులు, నానమ్మ, తాతలను సరిగ్గా చూసుకోకపోవడం
3) తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో ఉంచుతున్నారు
4) తమ పిల్లలను కూడా చదువుల పేరుతో వసతి గృహాల్లో ఉంచుతున్నారు
1) 1, 2, 4 2) 2, 3, 4
3) 1, 2, 3, 4 4) 1, 2
35. ఉమ్మడి కుటుంబాల వల్ల కలిగే ప్రయోజనాలు?
1) పిల్లలకు వృద్ధులు తోడుగా ఉంటారు
2) అందరూ కలిసి ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటారు
3) ఇంటి పనులను కలిసిమెలిసి చేసుకుంటారు
4) పెద్దలు పిల్లలకు తెలియని విషయాలు చెప్పడం
1) 1, 3, 4 2) 2, 3, 4
3) 1, 2, 4 4) 1, 2, 3, 4
36. ప్రజల వలసలకు గల కారణాలు?
1) కుటుంబంలో పెళ్లిళ్లు, పిల్లలు పుట్టడం
2) కొత్త ప్రదేశాల్లో ఉద్యోగాలు రావడం, బదిలీ కావడం
3) వ్యాపారం, చదువుల కోసం వలస పోవడం
4) భూకంపాలు, వరదలు రావడం
1) 1, 3 2) 3, 4
3) 1, 2, 3 4) 1, 2, 3, 4
37. ‘పడవల పందేలు’ ఏ పండుగ ప్రత్యేకత?
1) ఓనం 2) వైశాఖి
3) వసంత పంచమి 4) సంక్రాంతి
38. సరస్వతి దేవి జన్మదినంగా జరుపుకొనే పండుగ?
1) వైశాఖి 2) వసంత పంచమి
3) ఓనం 4) సంక్రాంతి
సమాధానాలు
1-4 2-4 3-3 4-3 5-4 6-3 7-4 8-4
9-1 10-2 11-2 12-3
13-3 14-2 15-3 16-3
17-4 18-4 19-4 20-2
21-1 22-4 23-3 24-4 25-2 26-4 27-2 28-4 29-2 30-4 31-3 32-1 33-4 34-3 35-4 36-4
37-1 38-2
ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
భారత రాజ్యాంగంలోని షెడ్యూళ్లు
1వ షెడ్యూల్: రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల జాబితా
2వ షెడ్యూల్: రాష్ట్రపతి, గవర్నర్లు, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కంప్ట్రోలర్ అండ్
ఆడిటర్ జనరల్ జీతభత్యాలు
3వ షెడ్యూల్: ప్రమాణాలు, హామీలు
4వ షెడ్యూల్: భారతదేశ రాష్ర్టాలకు రాజ్యసభ సీట్ల కేటాయింపు
5వ షెడ్యూల్: షెడ్యూల్డ్ ప్రాంతాల, జాతుల పరిపాలన, నియంత్రణ
6వ షెడ్యూల్: అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతాల పరిపాలనకు ఏర్పాట్లు
7వ షెడ్యూల్: కేంద్రం, రాష్ర్టాల మధ్య అధికారాలు, పనుల కేటాయింపు. దీనిలో మూడు జాబితాలున్నాయి.
1) కేంద్ర జాబితా (97 అంశాలు)
2) రాష్ట్ర జాబితా (66 అంశాలు)
3) ఉమ్మడి జాబితా (47 అంశాలు)
8వ షెడ్యూల్: భారత రాజ్యాగం గుర్తించిన 22 భారతీయ భాషలు
9వ షెడ్యూల్: 1951లో 1వ సవరణ ద్వారా చేర్చిన భూ ఒప్పందాలు, భూమిశిస్తు, రైల్వేలు పరిశ్రమలకు సంబంధించిన చట్టాలు, ఉత్తర్వులను కలిగి ఉంటుంది. (ఆస్తిహక్కు ప్రస్తుతం ప్రాథమిక హక్కు కాదు)
10వ షెడ్యూల్: 1985లో 52వ సవరణ ద్వారా చేర్చిన ధర్మాన్ని తప్పిన సమయాల్లో అనర్హత వేటుకు అవకాశాలను కల్పిస్తుంది.
11వ షెడ్యూల్: 1992లో 73వ సవరణ ద్వారా చేర్చిన పంచాయతీరాజ్ వ్యవస్థల ఏర్పాటు
12వ షెడ్యూల్: 1992లో 74వ సవరణ ద్వారా చేర్చిన మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు