Current Affairs – Groups Special | అంతర్జాతీయం
స్టార్ ల్యాబ్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్-ఇంటర్నేషన్ స్పెస్ స్టేషన్)నకు ప్రత్యామ్నాయంగా స్టార్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీన్ని అమెరికాకు చెందిన వాయేజర్ స్పేస్ కంపెనీతో కలిసి ఏర్పాటు చేయనున్నట్లు జర్మనీకి చెందిన ఎయిర్‌బస్ స్పేస్ కంపెనీ ఆగస్టు 6న వెల్లడించింది. ఐఎస్ఎస్ను భూ వాతావరణం, విపత్తులు, సౌర వ్యవస్థ, ఆహార ఉత్పత్తుల పెంపు తదితర అంశాలపై పరిశోధనలు చేసేందుకు నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) వినియోగిస్తున్నాయి. 2030లో ఐఎస్ఎస్ కాలం చెల్లనుంది.
అమెజాన్ కోఆపరేటివ్
అమెజాన్ కోఆపరేటివ్ ట్రీటీ ఆర్గనైజేషన్ (ఏసీటీవో) సమ్మిట్‌ను ఆగస్టు 8న బ్రెజిల్లో, ఆ దేశాధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో దక్షిణ అమెరికాలోని దేశాల నాయకులు పాల్గొన్నారు. అమెజాన్ రెయిన్ ఫారెస్టు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చేపట్టారు. అమెజాన్ బేసిన్లో స్థిరమైన వృద్ధిని పెంపొందించడానికి ఏసీటీవోను 1978, జూలై 3న ఏర్పాటు చేశారు. దీనిలో బ్రెజిల్, బొలీవియా, కొలంబియా, ఈక్వెడార్, గయానా, పెరూ, సురీనామ్, వెనెజులా దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
లూనా-25
రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్‌కాస్మోస్ లూనా-25 అనే ల్యాండర్‌ను ఆగస్టు 11న ప్రయోగించింది. రష్యాలోని వోస్తోక్నీ కాస్మోడ్రమ్ నుంచి సోయుజ్ 2.1బి రాకెట్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు. సుమారు 47 ఏండ్ల కిందట రష్యా లూనాన్ ల్యాండర్‌ను ప్రయోగించింది. ఇది 5 రోజుల్లోనే 4 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. ఈ ల్యాండర్ మిషన్ 30 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్తుంది. ఆగస్టు 16 నాటికి చంద్రుడి కక్ష్యకు చేరుకుంటుందని, 21, 22 తేదీల్లో చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితంలపై ల్యాండింగ్ అవుతుందని రాస్‌కాస్మోస్ సీనియర్ ఆఫీసర్ అలెగ్జాండర్ బ్లాఖిన్ వెల్లడించారు. భారత్ పంపిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న ల్యాండ్ కానుంది. అంటే చంద్రయాన్ కంటే ముందే లూనా-25 చంద్రుడిపై అడుగు పెట్టనుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు