Current Affairs – Groups Special | జాతీయం
ఆదిచనల్లూర్
తమిళనాడు, తూత్తుకుడి జిల్లాలోని ఆదిచనల్లూర్లో నిర్మించనున్న పురావస్తు మ్యూజియానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆగస్టు 5న శంకుస్థాపన చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ఆధ్వర్యంలో తామిరబణి నదికి సమీపంలో ఉన్న 114 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండపై దీన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం అక్కడ ఏఎస్ఐ ఆధ్వర్యంలో ఆన్సైట్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. తవ్వకాల్లో బయల్పడిన సుమారు 3,800 సంవత్సరాల నాటి కుండలు, కళాఖండాలు, అస్థిపంజరం వంటి వాటి పైన అద్దాలు అమర్చారు. ఈ అద్దాలపై నడుస్తూ వాటిని చూడవచ్చు.
ప్రైవేట్ సంస్థతో ఇస్రో
సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు ఇస్రో ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏడీటీఎల్)తో ఆగస్టు 5న ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రో వాణిజ్య విభాగం ఎన్ఎస్ఐఎల్ చైర్మన్, ఎండీ డీ రాధాకృష్ణ, ఆల్ఫా చైర్మన్ హెచ్ఎస్ శంకర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. శాటిలైట్ బస్ బెక్నాలజీ (వ్యోమనౌకలో ప్రధాన భాగాల తయారీ)ని వాణిజ్యపరంగా విస్తరించి దేశ అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. వాణిజ్య పరంగా శాటిలైట్లను ఉత్పత్తి చేయడంలో ఇది ముందడుగని ఇస్రో వెల్లడించింది.
డిజిటల్ సింపోజియం
‘డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ-వీ’ సింపోజియాన్ని ఆగస్టు 6న చెన్నైలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర స్కిల్ డెవలప్మెంట్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రారంభించారు. దీన్ని ఐఐఐటీ మద్రాస్, ఐఐటీ-ఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సింపోజియం ప్రాథమిక లక్ష్యం ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశ సామర్థ్యాన్ని పెంపొందించడం. ఆర్ఐఎస్సీ-వీలో ఆర్ఐఎస్సీ అంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్, వీ అంటే 5వ జనరేషన్. ఈ ప్రాజెక్టును 2010లో ప్రారంభించారు.
అతిథి పోర్టల్
వలస కార్మికుల గుర్తింపు కోసం కేరళ ప్రభుత్వం అతిథి పోర్టల్‌ను ఆగస్టు 7న ప్రారంభించింది. వలస కార్మికుల పిల్లలపై జరిగిన లైంగిక నేరాలను అరికట్టేందుకు కూడా ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. కేరళకు బతుకుదెరువు కోసం వచ్చిన కార్మికుల నమోదును క్రమబద్ధీకరించడం, వారి సామాజిక భద్రతే లక్ష్యంగా ఈ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో నమోదైన కార్మికులకు ప్రత్యేక ఐడీని జారీ చేస్తారు. ఈ ఐడీ ద్వారా వారికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తారు.
పుస్తకావిష్కరణ
సీనియర్ జర్నలిస్ట్ నిధిశర్మ రాసిన ‘షీ ద లీడర్.. ఉమెన్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్’ పుస్తకాన్ని ఆగస్టు 11న ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న 17 మంది మహిళా నేతల వివరాలతో ఈ పుస్తకాన్ని రాశారు. వీరిలో కల్వకుంట్ల కవిత, సోనియాగాంధీ, ప్రతిభా పాటిల్, సుచేత కృపలాని, వసుంధర రాజే, సుష్మాస్వరాజ్, షీలాదీక్షిత్, జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ, బృందాకారత్, అంబికాసోని, స్మృతి ఇరానీ, సుప్రియా సూలే, కనిమొళి, అంబికా సోని, అంపరీన్ లింగ్డోల రాజకీయ విశేషాల గురించి ఈ పుస్తకంలో వెల్లడించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు