Current Affairs | క్రీడలు
గోవా చాలెంజర్స్
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) నాలుగో సీజన్లో గోవా చాలెంజర్స్ విజేతగా నిలిచింది. పుణెలోని బాలేవాడీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జూలై 30న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్‌పై గెలుపొందింది. ఈ లీగ్‌ను గోవా గెలుచుకోవడం ఇదే మొదటిసారి. విజేతకు రూ.75 లక్షలు, రన్నరప్ జట్టుకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ అందజేశారు. 2017లో నిర్వహించిన మొదటి యూటీటీ టోర్నీని ఫాల్కన్స్ టీటీసీ గెలుచుకోగా, రెండోది దబాంగ్ ఢిల్లీ (2018), మూడోది (2019) చెన్నై లయన్స్ గెలుచుకున్నాయి.
వెర్స్టాపెన్
రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ బెల్జియం గ్రాండ్ ప్రి ని గెలుచుకున్నాడు. జూలై 30న బెల్జియంలోని స్టావెలాట్లో ఉన్న సర్క్యూట్ డి స్పా ఫ్రాంకోర్చాంప్స్లో జరిగిన మ్యాచ్‌లో వెర్స్టాపెన్ గంటా 22 నిమిషాల 30 సెకన్లలో లక్ష్యాన్ని చేరి అగ్రస్థానంలో నిలిచాడు. పెరెజ్ (రెడ్‌బుల్) ద్వితీయ, లెక్లెర్క్ (ఫెరారీ) తృతీయ స్థానాల్లో నిలిచారు. వెర్‌స్టాపెన్‌కు ఇది వరుసగా 8వ విజయం కాగా.. ఈ సీజన్లో పదోది.
మనోజ్ తివారీ
భారత క్రికెట్ సీనియర్ ఆటగాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ ఆగస్టు 3న క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఫామ్ లేమి, గాయాల కారణంగా జాతీయ జట్టుకు దూరమైన తివారీ బెంగాల్ తరఫున దేశవాళీ క్రీడల్లో ఆడాడు. ఈ ఏడాది రంజీల్లోనూ ఆడిన 37 ఏండ్ల తివారీ భారత్ తరఫున 12 వన్డేల్లో 287 పరుగులు చేసి, ఒక సెంచరీ బాదాడు. 3 టీ20ల్లో 15 పరుగులు చేశాడు.
అనంతారపు కృష్ణయ్య
డైరెక్టర్
శ్రీసాయి కోచింగ్ సెంటర్
కోదాడ
9948750605
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు