Groups Special | అత్యల్ప బహుముఖ పేదరికం కలిగిన రాష్ట్రం ఏది?
1. కిందివాటిలో బహుముఖ పేదరిక సూచీలో సమన్వయ కమిటీలో భాగం కాని మంత్రిత్వ శాఖ/ డిపార్ట్మెంట్ను గుర్తించండి?
1) గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
2) అధిక సేవల విభాగం
3) పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
4) మహిళా శిశు సంక్షేమ శాఖ
5) ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ విభాగం
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2,3
సి) 3 డి) ఏదీకాదు
2. జాతీయ బహుముఖ పేదరిక సూచీ 2023కు సంబంధించి కింది వాటిలో ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి?
1) నీతి ఆయోగ్ జాతీయ బహుముఖ పేదరిక సూచీ గణనలో 36 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అంచనా వేశారు
2) దేశ వ్యాప్తంగా 7.8 జిల్లాల్లో బహుముఖ పేదరిక సూచీని అంచనా వేశారు
3) జాతీయ బహుముఖ పేదరిక సూచీని అంచనా వేయడంలో నీతి ఆయోగ్ 12 అంశాలను పరిగణనలోకి తీసుకుంది
4) జాతీయ బహుముఖ పేదరిక సూచీ గణనలో 4 ప్రధాన అంశాల ప్రాతిపదికన అంచనా వేశారు
ఎ) 2 బి) 3 సి) 1 డి) 4
3. కిందివాటిలో సరైన అంశాలను గుర్తించండి.
1) జాతీయ బహుముఖ పేదరిక సూచీ గణనలో పౌష్టికాహారాన్ని 1/6 వెయిటేజీ నిర్దేశించారు
2) జాతీయ బహుముఖ పేదరిక సూచీ గణనలో విద్య, ఆరోగ్యం, జీవన ప్రామాణికతలకు సమానమైన భారాలను (Weightages) ఇచ్చారు.
3) జాతీయ బహుముఖ పేదరిక సూచీ గణనలో ఆరోగ్యం ప్రధానాంశంలో 3 సూచికలను, విద్యలో 2 ఇండికేటర్స్‌ను, ప్రామాణిక జీవనంలో 7 ఇండికేటర్స్‌ను పరిగణనలోకి తీసుకున్నారు
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 2, 3 డి) 1, 3
4. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి?
1) నీతి ఆయోగ్ విడుదల చేసిన జాతీయ బహుముఖ పేదరిక సూచీ 2023లో హెడ్ కౌంట్ రేషియో 14.96 శాతం నమోదైంది.
2) హెడ్ కౌంట్ రేషియో ఎంతమంది బహుముఖ పేదరిక సూచీకి దిగువన ఉన్నారో తెలియ జేస్తుంది.
ఎ) 1, 2 బి) 2
సి) 1 డి) ఏదీకాదు
5. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి?
1) జాతీయ బహుముఖ సూచీ 2023 ప్రకారం 13.5 కోట్ల మంది ఎంపీఐ రేఖకు దిగువనున్నారు.
2) గ్రామీణ బహుముఖ పేదరిక సూచీ 2015-16 అంచనాల్లో 32.59 శాతం నమోదవగా 2019-21 నివేదికలో 19.28 శాతం నమోదైంది
3) పట్టణ బహుముఖ పేదరిక సూచీ 2015 -16 లో 8.65 ఉండగా 2019-21లో 5.27 గా నమోదైనవి
4) జాతీయ బహుముఖ పేదరిక సూచీ 2023 ప్రకారం పేదరిక తీవ్రత 2015-16 అంచనాల్లో 44.39 శాతం నమోదైంది. 2019-21 అంచనాల్లో 47.14 శాతానికి పెరిగింది.
ఎ) 1, 2 బి) 1, 2, 3
సి) 1, 2, 3, 4 డి) 2, 3
6. కింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి?
1) 2015-16 బహుముఖ పేదరిక సూచీలో గ్రామీణ ప్రాంతాల్లో బహుముఖ పేదరికం 0.154 ఉండగా 2019-21 నివేదికలో గ్రామీణ ప్రాంతంలో బహుముఖ పేదరికం 0.086గా నమోదైనది.
2) 2015-16 బహుముఖ పేదరిక సూచీలో పట్టణ ప్రాంత బహుముఖ పేదరికం 0.039 గా నమోదవగా 2019-21 నివేదికలో 0.023 గా నమోదైనది.
3. 2015-16 నుంచి 2019-21 మధ్య కాలంలో గ్రామీణ బహుముఖ పేదరికం తగ్గుదల కంటే పట్టణ ప్రాంత బహుముఖ పేదరికం తగ్గుదల అధికంగా నమోదైనట్లు అంచానాలు తెలుపుతున్నాయి
4) జాతీయ బహుముఖ పేదరిక సూచీ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, బహుముఖ పేదరికం గణనీయంగా తగ్గినట్లు తెలియజేస్తుంది.
ఎ) 1, 2, 3, 4 బి) 1, 2, 4
సి) 1, 3, 4 డి) 2, 4
7. నీతి ఆయోగ్ వారు విడుదల చేసి జాతీయ బహుముఖ పేదరిక సూచీ 2023 ప్రకారం భారతదేశంలో 2015-16 నుంచి 2019-21 మధ్య కాలంలో బహుముఖ పేదరికం గణనీయంగా తగ్గడానికి కీలక పాత్ర పోషించిన 4 ఇండికేటర్స్‌ని గుర్తించండి?
1) హౌసింగ్ 2) మానసిక ఆరోగ్యం
3) పౌష్టికాహారం 4) పాఠశాల
5) పరిశుభ్రత 6) వంట ఇంధనం
7) తాగునీరు 8) బ్యాంక్ అకౌంట్స్
ఎ) 1, 2, 3, 4 బి) 2, 3, 4, 5
సి) 2, 3, 4, 6 డి) 3, 4, 5, 6
8. బహుముఖ పేదరిక సూచీ 2023 ప్రకారం దేశంలో అత్యధిక పేదరికంలో ఉన్న రాష్ర్టాల వరుస క్రమాన్ని గుర్తించండి?
1) బీహార్ 2) మేఘాలయ
3) ఉత్తరప్రదేశ్ 4) జార్ఖండ్
5) తమిళనాడు
ఎ) 1, 2, 3, 4, 5 బి) 1, 2, 4, 3, 5
సి) 1, 4, 2, 3,5 డి) 2, 3, 4, 1, 5
9. నీతి ఆయోగ్ విడుదల చేసిన జాతీయ పేదరిక సూచీ ప్రకారం దేశంలో అత్యల్ప పేదరికంలో ఉన్న రాష్ర్టాలను/ కేంద్ర పాలిత ప్రాంతాలను వరుస క్రమంలో గుర్తించండి?
1) కేరళ 2) ఢిల్లీ
3) పుదుచ్చేరి 4) లక్షద్వీప్
ఎ) 1, 3, 4, 5, 2 బి) 1, 2, 3, 4, 5
సి) 1, 3, 4, 2, 5 డి) 1, 4, 3, 5, 2
10. బహుముఖ పేదరిక సూచీ 2023 ప్రకారం అత్యధిక నమోదైన కేంద్రపాలిత ప్రాంతం ఏది?
ఎ) పుదుచ్చేరి బి) లక్షద్వీప్
సి) ఢిల్లీ
డి) దాద్రానగర్ హవేలి, డయ్యూ డామన్
11. బహుముఖ పేదరిక సూచీ 2023 నివేదిక ప్రకారం దేశంలో అత్యల్ప పేదరికం నమోదైన కేంద్ర పాలిత ప్రాంతం ఏది?
ఎ) ఢిల్లీ బి) పుదుచ్చేరి
సి) లక్షద్వీప్ డి) చండీఘర్
12. నీతి ఆయోగ్ ఎంపీఐ (Multidimensio nal Poverty Index) ప్రకారం అత్యధిక పౌష్టికాహార లేమితో బాధ పడే రాష్ట్రం ఏది?
ఎ) జార్ఖండ్ బి) గుజరాత్
సి) బీహార్ డి) అసోం
13. నీతి ఆయోగ్ ఎంపీఐ – 2023 ప్రకారం అత్యల్పంగా పౌష్టికాహార లేమితో బాధ పడే రాష్ట్రం ఏది?
ఎ) కేరళ బి) మిజోరం
సి) సిక్కిం డి) గోవా
14. బహుముఖ పేదరిక సూచీ 2023 ప్రకారం పాఠశాల హాజరు లేమి అత్యధికంగా ఉన్న రాష్ట్రం?
ఎ) ఉత్తరప్రదేశ్ బి) బీహార్
సి) జార్ఖండ్ డి) కేరళ
15. నీతి ఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచీ 2023 ఆధారంగా సరైన అంశాలను గుర్తించండి?
ఎ) లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతం దేశంలో అత్యల్ప జనాభా పేదరికంలో ఉన్నారు
బి) భారతదేశంలో బహుముఖ పేదరికం 14.96 శాతంగా అంచనా వేసింది.
3) అత్యల్ప పేదరికం జనాభాగా నమోదైన రాష్ట్రం సిక్కిం
4) జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం అత్యధిక ఎంపీఐగా నమోదైనది (జనాభారీత్య)
ఎ) 1, 2, 3 బి) 2, 3, 4
సి) 1, 2, 3, 4 డి) 1, 2, 4
16. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఎంపీఐ నుంచి విముక్తి పొందారు?
ఎ) రాజస్థాన్ బి) మధ్యప్రదేశ్
సి) బీహార్ డి) ఉత్తరప్రదేశ్
17. అత్యధికంగా బహుముఖ పేదరికం కలిగిన రాష్ట్రం
ఎ) హిమాచల్‌ప్రదేశ్ బి) జార్ఖండ్
సి) మధ్య ప్రదేశ్ డి) అసోం
18. నీతి ఆయోగ్ ప్రకారం దేశ బహుముఖ పేదరికం తగ్గించడంలో కీలక పాత్ర పోషించిన సూచికలను గుర్తించండి?
1) న్యూట్రిషన్ 2) పరిశుభ్రత
3) వంట ఇంధనం 4) విద్యుత్
5) తాగునీరు
ఎ) 1, 2, 3, 4, 5 బి) 1, 2, 4, 5
సి) 1, 2, 3 4) 1, 2, 3, 4
19. కింది వాటిలో అత్యల్ప బహుముఖ పేదరికం కలిగిన రాష్ట్రం ఏది?
ఎ) కేరళ బి) గోవా
సి) సిక్కిం డి) గుజరాత్
20. కింది వాటిలో అత్యల్ప బహుముఖ పేదరికం కలిగిన కేంద్ర పాలిత ప్రాంతాన్ని గుర్తించండి?
ఎ) లక్షద్వీప్
బి) పుదుచ్చేరి
సి) లడఖ్ డి) ఢిల్లీ
సమాధానాలు
1-డి 2-ఎ 3-బి 4-ఎ
5-డి 6-బి 7-డి 8-బి
9-ఎ 10-డి 11-బి 12-సి
13-సి 14-ఎ 15-సి 16-డి
17-బి 18-సి 19-ఎ 20-బి
ఎంపీఐ – తెలంగాణ రాష్ట్రం
1) కింద పేర్కొన్న వాటిలో ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి? (హెడ్ కౌంట్ రేషియో ఆధారంగా)
1) 2015-16 ఎంపీఐ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో 13.18 శాతం బహుముఖ పేదరికంలో ఉన్నట్లు గుర్తించింది
2) 2019-21 ఎంపీఐ తెలంగాణ రాష్ట్ర జనాభాలో 5.88 శాతం ప్రజలు బహుముఖ పేదరికంలో ఉన్నట్లు అంచనా వేశారు
3) దేశ బహుముఖ పేదరికంలో తెలంగాణ రాష్ట్రం 2.76 శాతం ఉన్నట్లుగా అంచనా వేశారు.
4) 2019-21 ఎంపీఐ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 27,61,201 ప్రజలు బహుముఖ పేదరికంలో ఉన్నారు
ఎ) 2 బి) 1 సి) 3 డి) 4
2. నీతి ఆయోగ్ విడుదల చేసిన జాతీయ బహుముఖ పేదరిక సూచీ ప్రకారం (2019-21) తెలంగాణ రాష్ట్రంలో ఎంత మంది జనాభా బహుముఖ పేదరికం నుంచి విముక్తి పొందారు?
ఎ) 27,61,201
బి) 21,61,201
సి) 27,16201 డి) 27,61102
3. తెలంగాణ రాష్ట్రంలో అత్యల్ప బహుముఖ పేదరిక శాతాన్ని నమోదు చేసిన జిల్లాలను ఆరోహణ క్రమంలో అమర్చండి?
ఎ) పెద్దపల్లి బి) వరంగల్ అర్బన్
సి) హైదరాబాద్ డి) జనగామ
ఎ) 1, 3, 2, 4 బి) 1, 2, 3, 4
సి) 4, 3, 2, 1 డి) 1, 2, 3, 4
4. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బహుముఖ పేదరిక శాతాన్ని నమోదు చేసిన జిల్లాలను ఆరోహణ క్రమంలో అమర్చండి?
1) కుమ్రం భీం ఆసిఫాబాద్
2) ఆదిలాబాద్
3) జోగులాంబ గద్వాల్
4) వికారాబాద్
ఎ) 4, 3, 2, 1 బి) 1, 2, 3, 4
సి) 2, 1, 3, 4 డి) 2, 1, 4, 3
5. నీతి ఆయోగ్ విడుదల చేసిన బహుముఖ పేదరిక సూచీ 2023 ప్రకారం తెలంగాణలో అత్యధిక పేదరిక శాతాన్ని (హెడ్‌కౌంట్ రేషియో ఆధారంగా) నమోదు చేసిన జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి?
1) కుమ్రం భీం ఆసిఫాబాద్
2) జోగులాంబ గద్వాల్
3) ఆదిలాబాద్ 4) వికారాబాద్
5) కామారెడ్డి
ఎ) 1, 2, 3, 5, 4 బి) 2, 3, 4, 5, 1
సి) 1, 2, 3, 4, 5 డి) 5, 4, 3, 2, 1
6. కింది వాటిలో ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి?
1) తెలంగాణ రాష్ట్రంలో బహుముఖ పేదరికం 2015-16లో 0.057 నమోదై గణనీయమైన తగ్గుదల కనబరించింది
2) తెలంగాణ రాష్ట్రంలో బహుముఖ పేదరికం హెడ్ కౌంట్ రేషియో 2019-21లో 5.88 శాతం నమోదవగా 2015-16లో 13.81 శాతంగా నమోదై గణనీయమైన తగ్గుదల శాతాన్ని నమోదు చేసింది.
3) రాష్ట్రంలో పేదరిక తీవ్రత 2015-16లో 43.29 శాతం నమోదవగా 2019-21లో 40.85 శాతంగా నమోదై తగ్గుదలను
సూచించింది
4) రాష్ట్రంలో 2019-20 గణాంకాల ప్రకారం పేదరిక తీవ్రత కంటే హెడ్ కౌంట్ రేషియోలో గణనీయమైన తగ్గుదల
కనబరిచింది.
ఎ) 4 బి) 2 సి) 3 డి) 1
7. కింది పేర్కొన్న వాటిలో ఎన్ని అంశాలు సరైనవో గుర్తించండి?
1) తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ బహుముఖ పేదరిక సూచీ 2015-16లో 0.085గా నమోదవగా 2019-21లో 0.031గా నమోదైంది
2) రాష్ట్రంలో పేదరిక తీవ్రత తగ్గుదల కంటే హెడ్ కౌంట్ రేషియోలో గణనీయమైన తగ్గుదలను నమోదు చేసింది.
3) తెలంగాణ రాష్ట్రంలో పట్టణ బహుముఖ పేదరికం 2015-16లో 0.021 ఉండగా 2019-21లో 0.011గా నమోదైనది
4) తెలంగాణ రాష్ట్ర పట్టణ పేదరిక తీవ్రత తగ్గుదల కంటే హెడ్‌కౌంట్ రేషియో తగ్గుదలలో గణనీయమైన తగ్గుదలను కనబరిచింది
5) రాష్ట్రంలో పట్టణ పేదరికం 2015-16లో 4.92 శాతం ఉండగా 2019-21లో 2.73శాతంగా నమోదైనది.
ఎ) 2 బి)3 సి) 4 డి) 5
8. కింద వాటిలో బహుముఖ పేదరికం అత్యల్పంగా ఉన్న జిల్లాలను వరుస క్రమంలో అమర్చండి?
ఎ) జనగామ 2) నల్లగొండ
3) నిర్మల్ 4) కరీంనగర్
5) రాజన్న సిరిసిల్ల
ఎ) 1, 2, 3, 4, 5 బి) 4, 1, 3, 2, 5
సి) 4, 1, 5, 2, 3
డి) 4, 1, 5, 3, 2
సమాధానాలు
1-సి 2-ఎ 3-ఎ 4-బి
5-సి 6-ఎ 7-డి 8-సి
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు