Current Affairs | జాబిల్లి రహస్యం.. దక్షిణ ధ్రువమే లక్ష్యం
చంద్రయాన్-3
- ప్రయోగించిన తేదీ- 2023, జూలై 14
- దీన్ని తీసుకెళ్లిన రాకెట్- ఎల్వీఎమ్3-ఎం4 (LVM3-M4)
- దీన్ని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు.
- ఉద్దేశం: చంద్రుని దక్షిణ ధ్రువంపై సున్నితమైన ల్యాండింగ్ (Soft landing)
- ప్రయోగించిన 16.15 నిమిషాలకు చంద్రయాన్ వ్యోమనౌకను నిర్ణీత కక్ష్యకు చేర్చింది.
- చంద్రయాన్-3 41 రోజుల ప్రయాణం తర్వాత 2023, ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుని ఉపరితలంపై దిగనుంది.
చంద్రయాన్-3 వ్యోమనౌకలో భాగాలు
1. ప్రొపల్షన్ మాడ్యూల్
2. ల్యాండర్ 3. రోవర్
- ల్యాండర్ పేరు- విక్రమ్, రోవర్ పేరు- ప్రగ్యాన్. 2019, జూలై 22న ప్రయోగించిన చంద్రయాన్-2లో ఉపయోగించిన
ల్యాండర్, రోవర్ పేర్లు కూడా ఇవే. - ల్యాండర్ పేరును భారత అంతరిక్ష రంగ పితామహుడిగా గుర్తింపు పొందిన డా.విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా పేరు పెట్టారు.
- ప్రగ్యాన్ అనేది సంస్కృత భాషా పదం. దీని అర్థం విజ్ఞానం.
- వ్యయం – రూ.613 కోట్లు
- చంద్రయాన్-3 బరువు-3,920.87 కిలోలు
- మిషన్ డైరెక్టర్- ఎస్.మోహన్‌కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్- వీర ముత్తువేల్
- ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నుంచి విడిపోయిన తర్వాత చంద్రయాన్-3 వ్యోమనౌకను భూ కక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకు తీసుకెళ్లేది ప్రొపల్షన్ మాడ్యూల్
- చంద్రునిపై దిగి పరిశోధనలు సాగించేది ల్యాండర్. చంద్రునిపై అటూ ఇటూ తిరుగుతూ పరిశీలనలు చేసేది రోవర్.
- ఈ ప్రయోగంతో చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ అవతరించనుంది.
- ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ప్రపంచంలో నాలుగో దేశంగా భారతదేశం అవతరించనుంది.
- గతంలో చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను అమెరికా, సోవియట్ యూనియన్, చైనా దేశాలు విజయవంతంగా నిర్వహించాయి.
చంద్రుని దక్షిణ ధ్రువం ఎంచుకోవడానికి కారణం?
- చంద్రయాన్-3 కోసం భారతదేశం చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గరలోని 700 అక్షాంశం వద్ద ప్రాంతాన్ని ఎంచుకుంది.
- అక్కడ ల్యాండింగ్ ద్వారా విశ్వం ఆవిర్భావం గురించిన కొత్త విషయాలు తెలుసుకోవడం, చంద్రునిపై భవిష్యత్‌లో మానవ ఆవాసాల ఏర్పాటుకు అవకాశాల పరిశీలన అనేది ప్రధాన కారణం.
- చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో భౌతిక పరిస్థితులు ఎంతో ప్రత్యేకం. ఇక్కడ కొన్ని భాగాలకు వందల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యకాంతి తగలలేదు. అందువల్ల అక్కడి మూలకాలు సౌర రేడియో ధార్మికత కారణంగా తలెత్తే మార్పులకు లోను కాకుండా ఉంటాయి. వాటిని శోధిస్తే విశ్వాన్ని గురించిన అనేక నిగూఢ రహస్యాలు తెలుస్తాయి.
- దక్షిణ ధ్రువం వద్ద ఉన్న చీకటి బిలాల్లో ఉష్ణోగ్రత -2480C ఉంటుంది. ఆ స్థాయి శీతల ఉష్ణోగ్రతలతో అవి కోల్డ్ ట్రాప్స్‌గా పని చేస్తాయి. అంటే వాటిలో నీరు హిమ రూపం లో స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.
చంద్రునిపై ప్రయోగాలు ఎందుకు? - వచ్చే కొన్నేళ్లలో చంద్రునిపై ఆవాసాలు ఏర్పాటు చేయడం కోసం. చంద్రునిపై నుంచి ఇతర గ్రహాల అన్వేషణకు దీన్ని స్థావరంగా ఉపయోగించడం.
- భూమితో పోలిస్తే చంద్రునిపై గురుత్వాకర్షణ శక్తి ఆరో వంతు ఉంటుంది. గాలి కూడా ఉండదు. అందువల్ల చంద్రునిపై నుంచి రాకెట్ ప్రయోగాలు చేయడం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
- చంద్రునిపై హీలియం-3 వంటి వనరులు ఉన్నాయి.
ప్రయోగం చేసే విధానం
- దీన్ని భూమి చుట్టూ ఉన్న 170X36,500 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో మొదట ప్రవేశపెడతారు. అది 17 రోజులు భూమి చుట్టూ తిరుగుతూ ఉండగా క్రమంగా దాని కక్ష్యను పెంచుతారు. వీటినే ‘ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్స్’ (TLI) అని అంటారు.
- 2023, ఆగస్టు 1న ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్స్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుంది. దీంతో భూ కక్ష్యను వదిలి చంద్రుని కక్ష్య వైపు పయనిస్తుంది.
- ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు చంద్రయాన్-3 భూమికి చేరువగా ఉన్న బిందువు (పెరీజీ)లో ఉన్న సమయంలో చేపట్టారు.
- చంద్రయాన్-3 వ్యోమనౌకలోని ఇంజిన్‌ను 20 నిమిషాలకుపైగా మండించి ట్రాన్స్ లూనార్ ఇంజక్షన్ చేపట్టారు. ఆ తర్వాత ఇది చంద్రుడి దిశగా లూనార్ ట్రాన్స్ఫర్
ట్రాజెక్టరీలోకి పంపిస్తారు. - లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో ప్రయాణం చేస్తూ 2023, ఆగస్టు 5న చంద్రుని కక్ష్యలోకి చేరింది. ఈ దశలో వ్యోమనౌకలోని ద్రవ ఇంజిన్‌ను నిర్దిష్ట సమయంలో మండించి దాని వేగాన్ని తగ్గించి చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెడతారు. దీన్ని లూనార్ ఆర్బిట్ ఇన్సెర్షన్ (LOI) అంటారు.
- ఈ ప్రక్రియ తర్వాత చంద్రయాన్-3 ‘మూన్ సెంట్రిక్ దశ’ మొదలై చంద్రుని చుట్టూ వ్యోమనౌక తిరుగుతుంది. చివరగా దీన్ని చంద్రుడి చుట్టూ 100 కి.మీ ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెడతారు.
- ఆగస్టు 17న చంద్రయాన్-3లోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్, రోవర్ విడిపోతాయి. ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్-రోవర్ చంద్రుడిపై ల్యాండింగ్‌కు సిద్ధమవుతుంది. (చంద్రునిపై పగలు ఆగస్టు 23న ప్రారంభం అవుతుంది)
- ల్యాండర్, రోవర్లు 14 రోజుల పాటు చంద్రునిపై పరిశోధనలు చేస్తాయి. భూమిపై 14 రోజులు అంటే చంద్రునిపై ఒకరోజు అని అర్థం. (లూనార్ డే)
- జూలై నెలలో భూమి, చంద్ర గ్రహాలు కొంచెం దగ్గరగా ఉంటాయి.
- చంద్రయాన్-3లోని ల్యాండర్ కాలపరిమితి 14 రోజులు, బరువు 1749.86 కిలోలు. రోవర్ కాలపరిమితి 14 రోజులు, బరువు 26 కిలోలు.
- ప్రొపల్షన్ మాడ్యూల్ బరువు- 2145.01 కిలోలు, కాలపరిమితి 3 నుంచి 6 నెలలు.
- ల్యాండర్ తీసుకెళ్లిన పేలోడ్స్- 3 (RAMBHA-LP, CHASTE, ILSA)
- రోవర్ తీసుకెళ్లిన పేలోడ్స్ – 2 (APXS, LIBS)
- ప్రొపల్షన్ మాడ్యూల్ తీసుకెళ్లిన పేలోడ్స్- 1 (SHAPE)
పేలోడ్స్- అబ్రివేషన్స్
1. RAMBHA-LP : Langmuir Probe
2. CHASTE : Chandras Surface Thermophysical Experiment
3. ILSA : Instrument for Lunar Seismic Activity
4. APXS : Alpha Particle X-ray Spectromerer
5. LIBS : Laser Induced Breakdown Spectromerer
6. SHAPE : Spectro-Polarimetry of Habitable Planet Earth
ఎల్వీఎం 3- ఎం4 గురించి - ఎల్వీఎం 3 అంటే లాంచ్ వెహికల్ మార్క్ 3.
- పొడవు- 43.5మీ, బరువు- 642 టన్నులు, దశలు-మూడు
- ఈ రాకెట్ నాలుగోతరం రాకెట్. దీనికి ఇది ఏడో ప్రయోగం.
- 8000 కిలోల బరువున్న పేలోడ్లను దిగువ భూ కక్ష్యలోకి, 4000 కిలోల బరువున్న పేలోడ్లను భూ స్థిర బదిలీ కక్ష్యలోకి మోసుకెళ్లగలదు.
- దీన్ని గతంలో జీఎస్ఎల్వీ-మార్క్ 3 రాకెట్ అని పిలిచేవారు. దీన్ని బాహుబలి, ఫ్యాట్‌బాయ్ అని పిలుస్తారు. మూడో దశలో వాడే క్రయోజెనిక్ ఇంజిన్‌ను నాటీబాయ్ అంటారు.
PSLV-C56/DS-SAR ప్రయోగం విజయవంతం - ప్రయోగించిన తేదీ- 2023, జూలై 30. దీన్ని తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 6 గంటల 30 నిమిషాలకు విజయవంతంగా ప్రయోగించారు.
- ఈ రాకెట్ ద్వారా మొత్తం 7 ఉపగ్రహాలు నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఈ 7 ఉపగ్రహాలు సింగపూర్ దేశానికి చెందినవి. వీటి మొత్తం బరువు 422.5 కిలోలు
తీసుకెళ్లిన ఉపగ్రహాలు
1.DS-SAR, 2.VELOX-AM,
3.ARCADE, 4.SCOOB-2,
5.NULION, 6.GALASSIA-2,
7.ORB-12 STRIDER.
మిషన్ డైరెక్టర్- ఎస్ఆర్ బిజు.
1. DS-SAR - ఇది రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. దీని బరువు 353 కిలోలు.
- దీన్ని సింగపూర్‌కు చెందిన డీఎస్టీఏ, ఎస్టీ ఇంజినీరింగ్‌ల భాగస్వామ్యంలో భాగంగా అభివృద్ధి చేశారు.
- డీఎస్టీఏ అంటే డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏజెన్సీ. ఇది సింగపూర్ ప్రభుత్వ సంస్థ.
- ఇది అంతరిక్షంలోకి వెళ్లి పనిని ప్రారంభిస్తే సింగపూర్‌లోని వివిధ ఏజెన్సీల ఉపగ్రహ చిత్రాలకు ఉపయోగపడుతుంది. ఇది సింథటిక్ అపెర్చర్ రాడార్ అనే పేలోడ్‌ను మోసుకెళ్లింది. దీన్ని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తయారు చేసింది.
2. VELOX-AM - ఇది ఒక మైక్రో ఉపగ్రహం. దీని బరువు 23 కిలోలు. దీన్ని సింగపూర్‌లోని నాన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఇది సంకలిత తయారీ పేలోడ్ల సాంకేతిక ప్రదర్శన ఉపగ్రహం.
3. ARCADE - ఇది ఒక 27యూ మైక్రో ఉపగ్రహం. దీని బరువు 24 కిలోలు. దీన్ని సింగపూర్‌లోని నాన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం, ఇన్స్పైర్లు సంయుక్త కన్సార్షియంగా అభివృద్ధి చేశాయి. ఇది అయోడిన్ ఆధారిత సాలిడ్ ప్రొపల్లెంట్ ప్రొపల్షన్ మాడ్యుల్‌ను తీసుకెళ్లింది.
4. SCOOB-2 - ఇది ఒక 3యూ క్యూబ్‌శాట్. దీని బరువు 4 కిలోలు. దీన్ని సింగపూర్‌లోని నాన్యాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని శాటిలైట్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన విద్యార్థుల బృందం తయారు చేశారు. కాలపరిమితి 6 నెలలు.
5. NULION - ఇది ఒక 3యూ నానో ఉపగ్రహం. దీని బరువు 3 కిలోలు.
- దీన్ని NUSPACE అనే సంస్థ తయారు చేసింది. ఇది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IOT) సేవలను అందిస్తుంది.
6. GALASSIA-2 - ఇది ఒక 3యూ నానో ఉపగ్రహం. ఇది ఎడ్యుకేషనల్ ఉపగ్రహం. దీని బరువు 3.5 కిలోలు.
- ఇది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (NUS)కు చెందినది.
- ఇది టెలియోస్-1 ఉపగ్రహంతో లింకేజ్ కోసం పంపించారు.
- టెలియోస్-1 ఉపగ్రహం సింగపూర్‌కు చెందిన మొదటి భూ పరిశీలనా ఉపగ్రహం. దీన్ని PSLV_C29 రాకెట్ ద్వారా 2015, డిసెంబర్ 16న పంపించారు.
7. డీఆర్బీ-12 స్ట్రైడర్ - ఇది అంతర్జాతీయ సహకారంతో అభివృద్ధి చేయబడింది. దీని బరువు 13 కిలోలు.
- ఇది తర్వాత తరం ప్రొపల్షన్ సిస్టంలను ప్రదర్శిస్తుంది. ప్రపంచంలోనే మొదటి మల్టీ-మోడల్ ఆల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన ఇంజిన్‌ను తీసుకెళ్లింది.
- PSLV-C56 రాకెట్ ప్రయోగం
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL) ద్వారా చేయబడిన పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగం. - NSIL అనేది 2019, మార్చి 6న ఏర్పాటు చేయబడిన ఇస్రో వాణిజ్య సంస్థ.
- అన్ని ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత రాకెట్ ఎగువ దశ, దిగువ కక్ష్యలో ఉంచబడుతుంది. దాని కక్ష్య జీవితకాలం దీని వల్ల తగ్గుతుంది.
- ఇది PSLV రాకెట్ 58 ప్రయోగం కాగా 56వ విజయం. విజయాల ఆధారంగా దాన్ని ఇస్రో WORK HORSE
(పని గుర్రం) అంటారు.
ఇప్పటివరకు SDSC-SHAR నుంచి చేసిన ప్రయోగాలు - మొత్తం ప్రయోగాలు-90
1. PSLV రాకెట్ ప్రయోగాలు- 58
2. GSLV రాకెట్ ప్రయోగాలు- 15
3. LVM3 రాకెట్ ప్రయోగాలు- 7
4. SSLV రాకెట్ ప్రయోగాలు- 2
5. ASLV రాకెట్ ప్రయోగాలు- 4
6. SLV రాకెట్ ప్రయోగాలు- 4
గమనిక: పై వివరాలన్నీ 2023,
జూలై 31 నాటికి
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
91107 62187
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు