CAT Notification 2023 | మేనేజ్మెంట్ కోర్సులకు గేట్‌వే.. క్యాట్
క్యాట్- 2023
దేశంలో ఇంజినీరింగ్‌కు ఐఐటీలు, మెడికల్ విద్యకు ఎయిమ్స్, న్యాయవిద్యకు ఎన్ఎల్యూలు, ఫ్యాషన్ టెక్నాలజీకి నిఫ్ట్, మేనేజ్మెంట్ కోర్సులకు ఐఐఎంలు ప్రఖ్యాతిగాంచాయి. జాతీయస్థాయిలోని ఐఐఎంల్లో పీజీ, ఫెలో ప్రోగ్రామ్స్ కోసం ఏటా నిర్వహించే క్యాట్-2023 ప్రకటన విడుదలైన నేపథ్యంలో ఆ వివరాలు సంక్షిప్తంగా….
ఐఐఎం
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం). స్వాతంత్య్రానంతరం ప్లానింగ్ కమిషన్ సూచనల మేరకు 1961లో ఐఐఎంలను ప్రారంభించారు. 2017 పార్లమెంట్ చట్టం ప్రకారం వీటిని జాతీయ ప్రాముఖ్యం కలిగిన సంస్థలుగా కేంద్రం ప్రకటించింది. మొదటి ఐఐఎంను 1961లో కలకత్తా, అహ్మదాబాద్‌లో ప్రారంభించారు. తర్వాత బెంగళూరు, ముంబై, లక్నో ఇలా పలు క్యాంపస్‌లను ప్రారంభించారు. దేశంలో ప్రస్తుతం 21 ఐఐఎంలు ఉన్నాయి.
ఆఫర్ చేస్తున్న కోర్సులు
- ఐఐఎంలో ప్లాగ్ షిప్ ప్రోగ్రామ్- ఎంబీఏ (పీజీపీ)
- పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ (పీజీపీ), ఫెలో ప్రోగ్రామ్స్ ఇన్ మేనేజ్మెంట్ (ఎఫ్‌పీఎం) (పీహెచ్డీ)
- పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్: పీజీపీ, పీజీపీ-ఎఫ్ఏబీఎం, ఈపీజీడీ-ఏబీఏ, ఎంబీఏ, ఎంబీఏ-బిజినెస్ అనలిటిక్స్, ఎంబీఏ-హెచ్ఆర్ఎం, ఈఎంబీఏ, ఎమ్మెస్సీ ఇన్ డేటా సైన్స్, పీపీజీబీఏ, పీపీపీఈఎం, ఎంబీఏ (ఎగ్జిక్యూటివ్), పీజీపీఎక్స్, ఎంబీఏ (టూరిజం మేనేజ్మెంట్), పీజీపీడీజీఎం, ఎంబీఏ-ఎస్ఎం, ఎంబీఏ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఎక్స్ఎంబీఏ (డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్) తదితరాలు
అర్హతలు
- కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అయితే కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ డిగ్రీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
- ఎంపిక: క్యాట్-2023 స్కోర్‌తోపాటు ఆయా ఐఐఎంలు వాటి ప్రత్యేక విధానంలో అభ్యర్థులను ఎం పిక చేస్తాయి. అంటే క్యాట్ స్కోర్‌తోపాటు రిటన్ ఎబిలిటీ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితర పద్ధతుల్లో తుది ఎంపిక జరుగుతుంది. ఒక్కో ఐఐఎం ఒక్కో విధానాన్ని పాటిస్తుంది. పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు.
క్యాట్ పరీక్ష విధానం
- పరీక్షలో మూడు సెక్షన్లు ఉంటాయి
- సెక్షన్-1లో వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్
- సెక్షన్-2లో డేటా ఇంట్రపిటేషన్, లాజికల్ రీజనింగ్
- సెక్షన్-3లో క్వాంటిటేటివ్ ఎబిలిటీ
పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు - ప్రతి సెక్షన్‌కు 40 నిమిషాల సమయం
- పరీక్ష తేదీ: నవంబర్ 26
ముఖ్యతేదీలు
- దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: సెప్టెంబర్ 13 (సాయంత్రం 5)
- పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 155 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు
- పరీక్ష నిర్వహణ: ఐఐఎం లక్నో
- క్యాట్-2023 కన్వీనర్: ప్రొఫెసర్ సంజీత్ సింగ్ (ఐఐఎం లక్నో)
- వెబ్సైట్: https://iimcat.ac.in
- నోట్: క్యాట్-2023 స్కోర్‌ను ఐఐఎంలతోపాటు దేశంలోని వివిధ ప్రఖ్యాత బీస్కూల్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. వాటిలో కొన్ని సంస్థలు… ఐఎస్ఎం ధన్‌బాద్, ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఐఐఎఫ్‌టీ, ఐఎంఎస్, ఐఎంటీ, ఐఆర్ఎంఏ, ఎండీఐ, నిర్మ, హెచ్ఎస్బీ, ఐఆర్ఎంఏ, ఆర్బీఎస్ తదితరాలు
ఐఐఎం క్యాంపస్‌లు
అహ్మదాబాద్ అమృతసర్
బెంగళూరు బోధ్‌గయ
కలకత్తా ఇండోర్
జమ్మూ కాశీపూర్
కోజికోడ్ లక్నో
నాగ్‌పూర్ రాయ్‌పూర్
రాంచీ రోహతక్
సంబల్పూర్ షిల్లాంగ్
సిర్మర్ (Sirmaur) తిరుచిరాపల్లి
ఉదయ్‌పూర్ విశాఖపట్నం
కేశవపంతుల వేంకటేశ్వర శర్మ
Previous article
Telangana Gurukula Exam 2023 | Gurukula Librarian Model Paper
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు