TET Environmental Studies | సమష్టి కుటుంబంలో కనీసం ఎన్ని తరాలు ఉంటాయి?
1. కింది వాటిలో కుటుంబాల్లో మార్పులు తీసుకువచ్చేది?
1) నూతన సభ్యుల చేరిక
2) కుటుంబ సభ్యులు తగ్గుట
3) భూకంపాలు
ఎ) 1, 2, 3 బి) 1, 2
సి) 1 డి) 2
2. గృహోపకరణాలు అధికంగా ఉపయోగించడం వల్ల కలిగే పరిణామం?
ఎ) విద్యుత్తు వాడకం పెరుగుతుంది
బి) పని విలువ తెలుస్తుంది
సి) శారీరక ఆరోగ్యం కలుగుతుంది
4) పైవన్నీ
3. కింది వాటిలో ఉమ్మడి కుటుంబానికి సంబంధం లేనిది?
ఎ) పిల్లలకు తెలియని విషయాలు పెద్దలు తెలుపుతారు
బి) ఇంటి పనులు అందరూ కలిసి
చేసుకుంటారు
సి) వృద్ధులను వృద్ధాశ్రమంలోచేరుస్తారు డి) పిల్లలకు తోడుగా వృద్ధులుంటారు
4. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం జరుపుకునే రోజు?
ఎ) సెప్టెంబర్ 3 బి) అక్టోబర్ 3
సి) నవంబర్ 3 డి) డిసెంబర్ 3
5. మహారాష్ట్రలో చెరకు సాగు పెరుగడానికి దోహదం చేసిన ఆనకట్ట?
ఎ) జయక్వాడి ఆనకట్ట
బి) గంగాపూర్ డ్యామ్
సి) కొయనా డ్యామ్ డి) బాబ్లీ ఆనకట్ట
6. 2007-2008లో భారతదేశంలో వలస వెళ్లిన వారిలో అత్యధికులు?
ఎ) షెడ్యూల్డ్ కులాలు
బి) షెడ్యూల్డ్ తెగలు
సి) వెనుకబడిన వర్గాలవారు
డి) ఇతరులు
7. భారతదేశం నుంచి కొంత నైపుణ్యం ఉన్న వారు, నైపుణ్యం లేనివారు ఏ దేశాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు?
ఎ) అమెరికా బి) కెనడా
సి) ఆస్ట్రేలియా
డి) పశ్చిమాసియా దేశాలు
8. మహ్మద్ ప్రవక్త మనవడు త్యాగానికి గుర్తుగా నివాళులు అర్పించే పండుగ?
ఎ) రంజాన్ బి) మొహర్రం
సి) ఈద్ ఉల్ ఫితర్ డి) బక్రీద్
9. ఇరాక్‌లో జరిగిన ఏ యద్ధంలో మహ్మద్ ప్రవక్త మనవడు మరణించాడు?
ఎ) బాబిలోనియా యుద్ధం
బి) మెసపటోమియా యుద్ధం
సి) కర్బలా యుద్ధం డి) మక్కా యుద్ధం
10. కింది వాటిలో మెక్సికో సరిహద్దుగా ఉన్న దేశం?
ఎ) కెనడా బి) అమెరికా
సి) బ్రెజిల్ డి) అర్జెంటీనా
11. కింది వాటిలో భారతదేశం సరిహద్దుగా ఉన్న దేశం?
ఎ) బంగ్లాదేశ్ బి) ఇరాక్
సి) దక్షిణ కొరియా డి) మాల్దీవులు
12. కుటుంబ సభ్యులు, వారి పూర్వీకుల గురించి తెలిపేది?
ఎ) వంశ చరిత్ర బి) వంశ వృక్షం
సి) వంశ సంస్కృతి డి) వంశ గణన
13. అమ్మ, నాన్న, పిల్లలు మాత్రమే ఉండే కుటుంబం?
ఎ) ఉమ్మడి కుటుంబం
బి) సమష్టి కుటుంబం
సి) వ్యష్టి కుటుంబం
డి) విశిష్ట కుటుంబం
14. సమష్టి కుటుంబంలోని సభ్యులను గుర్తించండి?
ఎ) చిన్నాన్న, చిన్నమ్మ
బి) తాతయ్య, నానమ్మ
సి) తల్లి, తండ్రి
డి) ఎ, బి, సి, పిల్లలు
15. కుటుంబంలోని సభ్యులు వలస పోవడానికి కారణం?
1) వివాహం 2) ఉపాధి
3) విద్య
ఎ) 1 బి) 1, 2, 3
సి) 1, 2 డి) 2, 3
16. మహిళల్లో వలసలకు ప్రధాన కారణం?
ఎ) విద్య బి) ఉపాధి
సి) వివాహం డి) వైద్య అవసరాలు
17. కింది వాటిలో కుటుంబంలో మార్పునకు కారణం కానిది?
ఎ) పిల్లలు పుట్టడం
బి) వివాహం
సి) సభ్యుల మరణం డి) ఎన్నికలు
18. కింది వాటిలో సమష్టి కుటుంబానికి వర్తించని అంశం?
ఎ) కష్టాలు, సుఖాలు సభ్యులందరూ కలిసి పంచుకుంటారు.
బి) పిల్లలకు వృద్ధులు సహాయంగా ఉంటారు
సి) సమష్టి కుటుంబాలు పెద్దవిగా ఉంటాయి
డి) సమష్టి కుటుంబంలో పెళ్లి కాగానే వారితో వేరే కాపురం పెట్టిస్తారు
19. ఏ కుటుంబాల్లో పిల్లలను వసతి గృహాల్లో ఉంచుతారు?
ఎ) సమష్టి కుటుంబం
బి) పెద్ద కుటుంబం
సి) వ్యష్టి కుటుంబం
డి) వలస వెళ్లే కుటుంబం
20. బ్రెయిలీ లిపి ఎవరి కోసం రూపొందించారు?
ఎ) మానసిక వికలాంగులు
బి) చేతులు, కాళ్లులేని వికలాంగులు
సి) చూపులేని వారు
డి) మూగ, చెవిటివారు
21. ప్రపంచ వ్యాప్తంగా వృద్ధుల దినోత్సవం జరుపుకొనే రోజు?
ఎ) అక్టోబర్ 1 బి) అక్టోబర్ 10
సి) అక్టోబర్ 11 డి) అక్టోబర్ 21
22. నా పేరు శివ మా ఇంట్లో అమ్మ, నాన్న, తాతయ్య, నాయనమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నమ్మ, చిన్నాన్న, అక్కలు, అన్నయ్య ఉన్నారు. అయితే మా కుటుంబం ఏ రకానికి చెందినది.
ఎ) సమష్టి కుటుంబం
బి) వ్యష్టికుటుంబం
సి) అవశిష్ట కుటుంబం
డి) సంప్రదాయ కుటుంబం
23. ప్రత్యేక అవసరాలు కలిగిన వారు అంటే?
ఎ) వినోదయాత్రల్లో పాల్గొనేవారు
బి) ఎ.సి, ఆటస్థలం, కారు వంటివి కోరుకునేవారు
సి) అవయవలోపం కలవారు
డి) రిజర్వేషన్ కలవారు
24. తల్లి, తండ్రి, వారి పిల్లలతో కలిసి ఉండే విధానమే?
ఎ) వ్యష్టి కుటుంబం బి) షష్ఠి కుటుంబం
సి) పెద్ద కుటుంబం డి) ఏదీకాదు
25. మెరుగైన జీవనం, విద్య, ఉపాధి కోసం ఉన్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లడాన్ని ఏ విధంగా పిలుస్తారు?
ఎ) మార్పిడి బి) వలస
సి) బదలాయింపు డి) ఏదీకాదు
26. సమష్టి కుటుంబంలో కనీసం ఎన్ని తరాల వారు ఉంటారు?
ఎ) 2 బి) 3 సి) 7 డి) 8
27. ప్రజలు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లడానికి కారణం?
ఎ) విద్య బి) ఉపాధి
సి) మెరుగైన అవకాశాలు డి) పైవన్నీ
28. మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంవత్సరం?
ఎ) 1971 బి) 1975
సి) 1977 డి) 1980
29. భారతదేశంలో విదేశాలకు వెళ్లే వలసలను పర్యవేక్షించడానికి వలస చట్టాన్ని రూపొందించిన సంవత్సరం?
ఎ) 1983 బి) 1955
సి) 1956 డి) 1988
30. కింది వాటిలో పంచదార ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన రాష్ట్రం?
ఎ) తెలంగాణ బి) తమిళనాడు
సి) మహారాష్ట్ర డి) మధ్యప్రదేశ్
31. కింది వాటిలో సరికానిది ఏది?
1) పితృస్వామిక కుటుంబంలో కుటుంబ పాలనాధిపతిగా తండ్రి వ్యవహరిస్తారు
2) స్వాతంత్య్ర దినోత్సవం హిందువుల పండుగ
3) దీపావళి అనేది హిందువుల పండుగ
4) గాంధీ జయంతిని అక్టోబర్ 2న జరుపుకొంటారు
32. 2007-2008లో భారతదేశంలో స్వల్పకాల వలసదారుల సామాజిక నేపథ్యం ప్రకారం వెనుకబడిన తరగతుల శాతం?
ఎ) 40 శాతం బి) 23 శాతం
సి) 19 శాతం డి) 18 శాతం
33. కింది వాటిలో రుతువులకు సంబంధించిన పండుగలు?
1) సంక్రాంతి 2) దసరా
3) ఓనం 4) వసంత పంచమి
ఎ) 1, 4 బి) 1, 2
సి) 1, 3, 4 డి) 1, 2, 3
34. కింది వాటిలో పరమత సహనానికి ప్రతీకగా నిలుస్తున్న పండుగలు?
1) సంక్రాంతి 2) మొహర్రం
3) వినాయక చవితి 4) రంజాన్
ఎ) 2, 3 2) 1, 2
3) 3 4) 2
35. కంచెల ద్వారా వలసలను అడ్డుకొవడానికి ప్రయత్నిస్తున్న సరిహద్దు దేశాలు?
1) భారతదేశం బంగ్లాదేశ్
2) దక్షిణ కొరియా ఉత్తర కొరియా
3) అమెరికా మెక్సికో
4) పైవన్నీ
36. అవ్వ, తాత, అమ్మ, నాన్న, మొదలైన వాళ్ల పూర్వీకుల వివరాలను తెలిపేది?
1) కుటుంబ చరిత్ర 2) వంశవృక్షం
3) సమష్టి కుటుంబ వృక్షం 4) పైవన్నీ
సమాధానాలు
1-ఎ 2-ఎ 3-సి 4-డి
5-సి 6-సి 7-డి 8-బి
9-సి 10-బి 11-ఎ 12-బి
13-సి 14-డి 15-బి 16-సి
17-డి 18-డి 19-సి 20-సి
21-ఎ 22-ఎ 23-సి 24-ఎ
25-బి 26-బి 27-డి 28-సి
29-ఎ 30-సి 31-బి 32-ఎ
33-సి 34-డి 35-డి 36-బి
పని ఆటలు
1. ట్రాఫిక్ రూల్స్‌లో వెళ్లడానికి సిద్ధంగా ఉండటానికి వాడే గుర్తు?
ఎ) ఎరుపు బి) ఆకుపచ్చ
సి) ఆరంజ్ డి) తెలుపు
2. మేరీకోమ్‌కు ఏ క్రీడతో సంబంధం ఉంది?
ఎ) టెన్నిస్ బి) బాక్సింగ్
సి) షూటింగ్ డి) రెజ్లింగ్
3. కరణం మల్లీశ్వరి ఏ క్రీడలో గుర్తింపు పొందారు?
ఎ) క్రికెట్ బి) చదరంగం
సి) వెయిట్ లిఫ్టింగ్ డి) అథ్లెటిక్స్
4. కింది వాటిలో బ్యాడ్మింటన్‌లో రాణించినవారు?
ఎ) సానియామీర్జా బి) సైనా నెహ్వాల్
సి) మిథాలీరాజ్ డి) కోనేరు హంపి
5. కింది వాటిలో మనదేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్పు గెలుచుకున్న సంవత్సరం?
ఎ) 2012 బి) 2011
సి) 2008 డి) 2003
6. కింది వారిలో ఒలింపిక్ పతకం గెలుచుకున్న భారతీయుడు?
ఎ) మేరీకోమ్ బి) గగన్ నారంగ్
సి) విజేందర్ సింగ్ డి) పైవారందరూ
7. ఒలింపిక్ పోటీలు దేనికి సంబంధించినవి?
ఎ) సాహిత్యం బి) క్రీడలు
సి) విద్య డి) సినిమా
8. బాలకార్మికులు అంటే ఏ వయస్సువారు?
ఎ) 12 సంవత్సరాలలోపు పనిచేసే బాలబాలికలు
బి) 14 సంవత్సరాలలోపు పనిచేసే బాలబాలికలు
సి) 16 సంవత్సరాలలోపు పనిచేసే బాలబాలికలు
డి) 18 సంవత్సరాలలోపు పనిచేసే బాలబాలికలు
9. ప్రాథమిక విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేది?
ఎ) 2009 ఏప్రిల్ 1 బి) 2010 ఏప్రిల్ 1
సి) 2011 ఏప్రిల్ 1 డి) 2012 ఏప్రిల్ 1
10. బాలల దినోత్సవం జరుపుకొనే రోజు?
ఎ) సెప్టెంబర్ 5 బి) అక్టోబర్ 7
సి) నవంబర్ 14 డి) డిసెంబర్ 1
11. కిందివాటిలో జంతువులను ఉపయోగించి ఆడే ఆట?
ఎ) రగ్బీ బి) రెజ్లింగ్
సి) ఫార్ములావన్ రేసింగ్ డి) పోలో
12. ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకొకసారి జరుగుతాయి?
ఎ) 2 సంవత్సరాలు
బి) 3 సంవత్సరాలు
సి) 4 సంవత్సరాలు
డి) 5 సంవత్సరాలు
13. కింది వాటిలో క్రీడా స్ఫూర్తి కానిది?
ఎ) క్రీడా నియమాలు పాటించడం
బి) పోటీల అనంతరం ఒకరినొకరు అభినందించుకోవటం
సి) ఓడినవారిని తక్కువగా చూడటం
డి) గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరించడం
14. మనం నిమిషానికి ఎన్నిసార్లు గాలి పీలుస్తాం?
ఎ) 10 బి) 11 సి) 18 డి) 12
15. మహంకాళి బోనాలు ఎక్కడ నిర్వహిస్తారు?
ఎ) వరంగల్ బి) సికింద్రాబాద్
సి) కరీంనగర్ డి) మెదక్
16. సమ్మక్క, సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకొకసారి జరుగుతుంది?
ఎ) ప్రతి సంవత్సరం
బి) రెండు సంవత్సరాలకోసారి
సి) మూడు సంవత్సరాలకోసారి
డి) నాలుగు సంవత్సరాలకోసారి
17. జహంగీర్ పీర్ దర్గా ఎక్కడ ఉంది?
ఎ) మేడారం, ములుగు
బి) కొత్తూరు, రంగారెడ్డి
సి) సికింద్రాబాద్
డి) చేవెళ్ల, రంగారెడ్డి
18. జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన మొగల్ చక్రవర్తి?
ఎ) ఔరంగజేబు బి) బాబర్
సి) షాజహాన్ డి) అక్బర్
19. సమ్మక్క, సారక్కల పోరాటం ఎవరి కాలంలో జరిగింది?
ఎ) కాకతీయులు బి) మొగలులు
సి) విజయనగర రాజులు
డి) ముదిగొండ చాళుక్యులు
20. మేడరాజు రాజ్యం గుర్తించండి?
ఎ) ముదిగొండ బి) పోలవాస
సి) పల్నాడు డి) బోధన్
21. పోచంపల్లి చీరల తయారీకి ఏ కాలం అనుకూలించదు?
ఎ) శీతాకాలం బి) వేసవి కాలం
సి) వర్షాకాలం డి) వసంతకాలం
22. భారతదేశానికి టెస్ట్ మ్యాచ్‌ల్లో అవకాశమిచ్చిన సంవత్సరం?
ఎ) 1922 బి) 1932
సి) 1942 డి) 1952
సమాధానాలు
1-సి 2-బి 3-సి 4-బి
5-బి 6-డి 7-బి 8-బి
9-బి 10-సి 11-డి 12-సి
13-సి 14-సి 15-బి 16-బి
17-బి 18-ఎ 19-ఎ 20-బి
21-బి 22-బి
ఎస్అండ్ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో….
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు