TET Social Studies Special | ఉత్తరార్ధ గోళంలో సూర్యకిరణాల పతనకోణం ఏ నెలలో ఎక్కువ?
1. భూమి విశ్వానికి కేంద్రంగా లేదని మొదట ప్రాతిపాదించింది?
1) టాలమీ 2) గెలీలియో
3) కోపర్నికస్ 4) వెసూలియస్
2. భూమి సూర్యుని చుట్టూ తిరిగే వేగం గంటకు?
1) 1,610 కి.మీ.
2) 1,27,200 కి.మీ.
3) 1,07,200 కి.మీ.
4) 87,200 కి.మీ.
3. భూమిపైన ఉన్న పొర?
1) భూప్రావారం 2) భూపటలం
3) భూకేంద్ర మండలం
4) పైవేవీకాదు
4. భూమి ఏ పొరల్లో ఇనుము, నికెల్లు ఉన్నాయి?
1) భూపటలం
2) భూకేంద్ర మండలం
3) భూప్రావారం 4) పైవన్నీ
5. ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?
1) ఆల్ఫ్రెడ్ వెజ్నర్ 2) కార్ల్సగాన్
3) చాంబర్లీన్ 4) ఐన్స్టీన్
6. కింది వాటిలో లారెన్షియాలో భాగం కానిది?
1) గ్రీన్లాండ్
2) ఉత్తరఅమెరికా 3) ఆఫ్రికా
4) భారతదేశానికి ఉత్తరాన గల యురేసియా
7. గోండ్వానా, లారెన్షియాలను వేరు చేస్తున్న సముద్రం?
1) పాంథాల్సా 2) టెథిస్
3) పసిఫిక్ 4) అట్లాంటిక్
8. సూర్యుని చుట్టూ భూమి తిరిగే మార్గానికి గల పేరు?
1) అక్షం 2) కక్ష్య
3) ప్రామాణిక రేఖ
4) అయన రేఖా మార్గం
9. కింది వాటిలో గోండ్వానాలో అంతర్భాగం కానిది?
1) దక్షిణ అమెరికా 2) ఆఫ్రికా
3) మడగాస్కర్ 4) గ్రీన్లాండ్
10. సూర్యుడికి, భూమికి మధ్యగల అత్యంత సమీప దూరం?
1) 140 మి.కి.మీ 2) 147 మి.కి.మీ
3) 150 మి.కి.మీ 4) 152 మి.కి.మీ
11. గ్రీకు పదమైన ‘eorthe’అర్థం?
1) నేల 2) మట్టి
3) పొడినేల 4) పైవన్నీ
12. పాంజియా అంటే గ్రీకులో అర్థం?
1) మొత్తం భూమి 2) కొంచెం భూమి
3) మొత్తం జలం 4) కొంచెం జలం
13. 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏ విధంగా పిలుస్తారు?
1) గ్రీనిచ్ మెరీడియన్
2) యాంటీమెరీడియన్
3) ఎన్నో డొమిని 4) ఏదీకాదు
14. ఎన్ని సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది?
1) 1370 కోట్ల సంవత్సరాలు
2) 1470 కోట్ల సంవత్సరాలు
3) 1570 కోట్ల సంవత్సరాలు
4) 1650 కోట్ల సంవత్సరాలు
15. భూమి లోపల గల పొరలు పై నుంచి లోపలకు సరైన వరుస క్రమంలో గుర్తించండి?
1) భూ ప్రావారం-భూపటలం-భూకేంద్ర మండలం
2) భూపటలం-భూకేంద్ర మండలం- భూప్రావారం
3) భూకేంద్ర మండలం- భూప్రావారం-భూపటలం
4) భూపటలం-భూప్రావారం-భూకేంద్రమండలం
16. భూమి అంతర్నిర్మాణంలో ఏ పొరలో సిలికేట్లు పుష్కలంగా ఉన్నాయి?
1) భూప్రావారం 2) భూపటలం
3) బయట కేంద్ర మండలం
4) లోపల కేంద్ర మండలం
17. భూ కేంద్ర మండలంలో కింది ఏ లోహాలుంటాయి?
1) సిలికాన్, అల్యూమినియం
2) సిలికాన్, మెగ్నీషియం
3) ఇనుము, నికెల్
4) ఇనుము, సిలికాన్
18. ఖండాలు, మహాసముద్రాలు ప్రస్తుత స్థితిని వివరిండానికి ఖండచలన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
1) సుయెన్ 2) ఆల్ఫ్రెడ్ వెజ్నర్
3) జార్జ్లామిటైర్ 4) హైమన్డార్ఫ్
19. మొత్తం జలభాగంలో మహాసముద్రాల వాటా శాతం?
1) 90.25 శాతం 2) 97.25 శాతం
3) 98.00 శాతం 4) 96.05 శాతం
20. అమెరికా నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరు చేస్తున్న సముద్రం?
1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
21. అమెరికా నుంచి ఆసియా, ఓషియానాలను వేరుచేస్తున్న మహాసముద్రం?
1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
22. ప్రతి 1000 గ్రాముల నీటిలో ఎన్ని గ్రాముల ఉప్పు ఉంటుంది?
1) 30 2) 35 3) 40 4) 45
23. అత్యధిక లవణీయతను కలిగిఉన్న సరస్సు?
1) వాన్ 2) మృత
3) మహాలవణ 4) చిల్కా
24. ఖండతీరం వాలు ఎన్ని మీటర్ల నుంచి ఎన్ని మీటర్ల వరకు ఉంటుంది?
1) 200 నుంచి 3000
2) 300 నుంచి 4000
3) 400 నుంచి 5000
4) 500 నుంచి 6000
25. సముద్రంలో ఒకే లవణీయత ఉన్న ప్రాంతాలను కలిపే రేఖలు?
1) ఐసోహలైన్స్ 2) ఐసోబార్స్
3) ఐసోహైట్స్ 4) ఏదీకాదు
26. సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత?
1) 3OC నుంచి 30OC
2)-2OC నుంచి 29OC
3) 4OC నుంచి 40OC
4) 4OC నుంచి 25OC
27. మహాసముద్రాల్లో అతిపెద్దది?
1) పసిఫిక్ మహాసముద్రం
2) అట్లాంటిక్ మహాసముద్రం
3) హిందూ మహాసముద్రం
4) ఆర్కిటిక్ మహాసముద్రం
28. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై గల ఏకైక మహా సముద్రం?
1) పాంజియా 2) టెథిస్
3) పాంథాల్సా 4) లారెన్షియా
29. సముద్ర తీరం నుంచి లోపలకు సముద్ర భూ ఉపరితలం భాగాలను సరైన వరస క్రమంలో గుర్తించండి?
1) ఖండతీరపు వాలు, ఖండతీరపు అంచు, సముద్ర అగాధ దరులు, మహాసముద్ర మైదానాలు
2) ఖండతీరపు అంచు, ఖండతీరపు వాలు, సముద్ర అగాధ దరులు, మహాసముద్ర మైదానాలు
3) ఖండ తీరపు అంచులు, సముద్ర అగాధ దరులు, ఖండ తీరపువాలు, మహాసముద్ర మైదానాలు
4) ఖండతీరపు వాలు, మహాసముద్ర మైదానం, ఖండతీరపు అంచు, సముద్ర అగాధదరులు
30. మహాసముద్ర అఖాతంలో అత్యంత లోతైనది?
1) జావా 2) వేవ్స్
3) ప్యూర్టరికో 4) చాలెంజర్
31. బెంగ్యూలా శీతల ప్రవాహం ఏ మహాసముద్రంలో ఉంది?
1) ఉత్తర పసిఫిక్ 2) దక్షిన పసిఫిక్
3) ఉత్తర అట్లాంటిక్ 4) దక్షిణ అట్లాంటిక్
32. కింది వాటిలో ద్వీపం కానిది?
1) గ్రీన్లాండ్ 2) గ్రేట్ బ్రిటన్
3) మడగాస్కర్ 4) ఇటలీ
33. భూమిని చేరిన ఎంత సౌరశక్తి తిరిగి వాతావరణంలోకి పరావర్తనం చెందుతుంది?
1) 1/2 వంతు 2) 1/3 వంతు
3) 1/4 వంతు 4) 1/5వంతు
34. కింది వాటిలో భూ వికిరణాన్ని అడ్డుకునేది?
1) కార్బన్ డైఆక్సైడ్
2) ఆక్సిజన్
3) నైట్రోజన్ 4) ఆర్గాన్
35. కింది వాటిలో ఏది వేడెక్కడానికి, చల్లబడటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది?
1) భూమి 2) సముద్రం
3) కొండ 4) లోయ
36. ఉత్తరార్ధ గోళంలో సూర్యకిరణాల పతనకోణం ఏ నెలలో ఎక్కువగా ఉంటుంది?
1) మే, జూన్
2) జనవరి, ఫిబ్రవరి
3) నవంబర్, డిసెంబర్
4) మార్చి, ఏప్రిల్
37. భూ వికిరణాలను నిరోధించే వాయువులు?
1) ఆక్సిజన్ 2) కార్బన్ డై ఆక్సైడ్
3) నైట్రోజన్ 4) హీలియం
38. ఇప్పటివరకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన ప్రదేశం ఏది?
1) వ్లాడివోస్టి 2) వెర్కోయాన్స్కీ
3) సైబీరియా 4) అలస్కా
39. 1983 జూలైలో అంటార్కిటికాలోని వ్లాడివోస్టి కేంద్రంలో సమోదైనా అత్యల్ప ఉష్ణోగ్రత ఎంత?
1) -82.2 0C 2) -90.6 0C
3) -91 0 C 4) -92.7 0C
40. సూర్యుడి కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం?
1) 10 నిమిషాలు 2) 8 నిమిషాలు
3) 4 నిమిషాలు 4) 2 నిమిషాలు
41. భూమి సగటున ఒక నిమిషానికి ఒక చదరపు సెం.మీ.కు పొందే ఉష్ణోగ్రతకు గల పేరు?
1) సూర్యపుటం 2) సౌర వికిరణం
3) సౌరస్థిరాంకం 4) భూ వికిరణం
42. ఒక రోజులో గరిష్ఠ కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొలవడానికి ఉపయోగించే థర్మామీటర్?
1) క్లినికల్ థర్మామీటర్
2) సిక్స్ థర్మామీటర్
3) గెలీలియో థర్మామీటర్
4) విద్యుత్ థర్మామీటర్
43. హైదరాబాద్ నగరం ఏ అక్షాంశంపై ఉంది?
1) 15O ఉత్తర అక్షాంశం
2) 17O ఉత్తర అక్షాంశం
3) 15O దక్షిణ అక్షాంశం
4) 17O దక్షిణ అక్షాంశం
44. కింది వాటిలో భూమధ్య రేఖకు సమీపంలో గల ప్రదేశం?
1) సింగపూర్ 2) ఢిల్లీ
3) షాంఘై 4) వ్లాడివోస్టాక్
45. సముద్ర మట్టం నుంచి 1000 మీ. పైకి వెళ్లిన తగ్గే ఉష్ణోగ్రతలు?
1) 4 OC 2) 6OC
3) 8OC 4) 10 OC
46. ఉష్ణోగ్రతల పరంగా కర్కటరేఖ, మకరరేఖల మధ్య ప్రాంతాన్ని ఎలా వ్యవహరిస్తారు?
1) ఉష్ణమండలం
2) సమశీతోష్ణ మండలం
3) ధృవ మండలం
4) అధిక పీడన మండలం
47. కింది భారతదేశ నగరాల్లో మొదటగా సూర్యోదయం అయ్యే ప్రాంతం?
1) విశాఖపట్నం 2) నాగ్పూర్
3) హైదరాబాద్ 4) ఆగ్రా
48. షమాన్లు అంటే?
1) వేటగాళ్లు
2) సముద్ర యాత్రికులు
3) అన్వేషకులు
4) ఆచారాలు నిర్వహించేవారు
49. ఉమియాక్స్ అంటే?
1) పడవలు 2) బండ్లు
3) ఇళ్లు 4) ఒక ఆయుధం
50 ఎస్కిమోలు ఉపయోగించే బండ్లను ఏ జంతువులు లాగుతాయి?
1) కారిబోలు 2) కుక్కలు
3) నక్కలు 4) తిమింగలాలు
51. ఇగ్లూ అంటే?
1) పడవ 2) బండి
3) ఆశ్రయం(ఇల్లు) 4) జంతువు
52. టండ్రాప్రాంతంలో సూర్యుడు అసలు అస్తమించని నెలలు?
1) ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్
2) నవంబర్, డిసెంబర్, జనవరి
3) ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్
4) మే, జూన్, జూలై
53. టండ్రా ప్రాంతాలు ప్రపంచ పటంలో ఎక్కడ విస్తరించి ఉన్నాయి?
1) ఉత్తర ధృవం వైపు ఉన్న ఖండభాగాలు
2) దక్షిణ ధృవం వైపు ఉన్న ఖండభాగాలు
3) భూమధ్యరేఖ అయనరేఖా ప్రాంతాలు
4) గ్రీనిచ్రేఖ ప్రాంతాలు
54. ఎస్కిమో అనే పదానికి సరైన అర్థం?
1) మంచును తినే వ్యక్తి
2) మంచులో నివసించే వ్యక్తి
3) మంచు బూట్ల వ్యక్తి
4) మంచుతో ఇల్లుకట్టే వ్యక్తి
55. సైబీరియా ఉత్తర అమెరికాల మధ్య ఉన్న జలభాగం?
1) హడ్సన్ అఖాతం
2) డోవర్ జలసంధి
3) లాబ్రడార్ జలసంధి
4) బేరింగ్ జలసంధి
56. ఎస్కిమోలను మొదటగా చూసిన బయటి ప్రజలు?
1) బడోయిన్లు 2) వైకింగ్లు
3) గోండులు 4) ఎవరూలేరు
57. 1976-78 మధ్యకాలంలో బాఫిన్ దీవులను సందర్శించిన బ్రిటిష్ యాత్రికుడు?
1) డేవిడ్ లివింగ్స్టన్
2) మార్టిన్ ప్రాష్బిషర్
3) జాన్ కాబెట్ 4) కార్టియర్
58. నాసా అనే అంతరిక్ష పరిశోధన సంస్థ ఏ దేశానికి చెందింది?
1) చైనా 2) ఫ్రాన్స్
3) అమెరికా 4) రష్యా
59. గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ శాతం?
1) 0.3 శాతం 2) 0.03 శాతం
3) 0.003 శాతం 4) 0.0003 శాతం
60. మౌసమ్ అంటే?
1) గ్రీకు పదం 2) అరబిక్ పదం
3) పార్శీపదం 4) చైనీస్పదం
61. వాతావరణంలోని నత్రజని శాతం?
1) 21 శాతం 2) 78 శాతం
3) 70 శాతం 4) 60 శాతం
62. జెట్ విమానాలు ఎగరటానికి అనువైన వాతావరణం?
1) ట్రోపో ఆవరణం 2) స్ట్రాటో ఆవరణం
3) మీసో ఆవరణం 4) థర్మో ఆవరణం
63. అమెరికా, కెనడా సరిహద్దుల్లో వీచే చినుక్ అనే పవనానికి అర్థం?
1) మంచులు ఇచ్చేది
2) మంచును తినేది
3) నీటిని ఇచ్చేది
4) నీటిని తాగేది
సమాధానాలు
1-3 2-3 3-2 4-2
5-1 6-3 7-2 8-2
9-4 10-2 11-4 12-1
13-2 14-1 15-4 16-1
17-3 18-2 19-2 20-2
21-1 22-2 23-1 24-1
25-1 26-2 27-1 28-3
29-2 30-4 31-4 32-4
33-2 34-1 35-2 36-3
37-2 38-1 39-1 40-2
41-3 42-2 43-2 44-1
45-2 46-1 47-1 48-4
49-1 50-2 51-3 52-4
53-1 54-3 55-4 56-2
57-2 58-3 59-2 60-2
61-2 62-2 63-2
ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్స్ సౌజన్యంతో…
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు