Biology JL-DL Special | కనిపించని జీవులు.. వ్యాధుల కేంద్రాలు
వైరస్ వ్యాధులు
వైరస్లు కంటికి కనిపించని హానికర సూక్ష్మజీవులు. వీటి వల్ల అనేక ప్రమాదకర సంక్రమిక, అసంక్రమిక వ్యాధులు
సంభవిస్తాయి. ఇవి ఎక్కువగా పరాన్నజీవనం, సహజీవనం గడిపే సూక్ష్మజీవులు. ఈ నేపథ్యంలో వైరస్ల వల్ల కలిగే వ్యాధులు, సంక్రమణ, లక్షణాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం..
- వైరస్ల అధ్యయనం- వైరాలజీ
- వీటిని కనుగొన్నది- ఇవనోవ్స్కీ
- వైరస్ అనే పదానికి లాటిన్ భాషలో అర్థం- విషం
- ఇవి అతిసూక్ష్మ జీవులు. కాబట్టి వీటిని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లో మాత్రమే చూడగలుగుతాం.
- ఇవి జీవి దొరికినప్పుడు సజీవంగా ఉండి, అందుబాటులో లేనప్పుడు వాతావరణంలో స్ఫటికాల రూపంలో ఉంటాయి. వీటినే అవికల్ప పరాన్నజీవులు లేదా విరియాన్ అంటారు.
- వీటికి కణ నిర్మాణం లేదు. కేవలం కేంద్రకామ్లం (DNA, RNA), దాని చుట్టూ ప్రొటీన్ తొడుగు ఉంటుంది.
- ఇవి రసాయనికంగా న్యూక్లియో ప్రొటీన్స్.
- జంతు వైరస్లలో DNA ఉండగా వృక్ష వైరస్లలో RNA ఉంటుంది.
నోట్: హెచ్ఐవీ అనే జంతు వైరస్‌లో మాత్రం RNA ఉం టుం ది. - కేవ లం ప్రొటీన్ తొడు గు మాత్రమే కలిగి ఉండి కేంద్ర నాడీ వ్యవస్థను బలహీనపరిచే వైరస్‌ను ప్రయాన్ అంటారు.
వైరస్ వల్ల వచ్చే వ్యాధులు
జలుబు- రైనో వైరస్
ఆటలమ్మ- వారిసెల్లా
మశూచి- వారియోలా
తట్టు- పారామిక్సో వైరస్
పోలియో (పక్షవాతం)- పోలియో వైరస్
- ఆటలమ్మ, మశూచి, తట్టు వ్యాధుల వల్ల చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి.
గవద బిళ్లలు- మిక్సో వైరస్: ఈ వైరస్ పెరోటిడ్ అనే లాలాజల గ్రంథులకు ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది.
చికున్ గున్యా- ఆల్ఫా వైరస్: ఆఫ్రికా ఖండంలోని కెన్యా దేశంలో స్వాహిని భాషలో దీనికి అర్థం వంగి నడవటం. - దీని వల్ల తవ్ర జ్వరం కండర నొప్పులు కలుగుతాయి.
డెంగీ- ఫ్లావి వైరస్: ఇది రక్త ఫలకికలను విచ్ఛిత్తి చేస్తుంది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, చర్మంపై దద్దుర్లు, ముక్కు, చిగుళ్ల నుంచి నీరు కారుతుంది.
హెపటైటిస్ (పచ్చ కామెర్లు)- హెపటైటిస్-బి వైరస్: ఇది తల్లి నుంచి శిశువుకు, రక్తమార్పిడి ద్వారా, కలుషిత నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని వల్ల కాలేయం తన విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తించదు.
రేబిస్- రాబ్డో వైరస్: పిచ్చి కుక్క, పిల్లి కాటు వల్ల ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల కొందరు నీటిని చూస్తే భయపడిపోతుంటారు. ఈ స్థితిని హైడ్రోఫోబియా అంటారు.
సార్స్- కరోనా వైరస్: ఇది శ్వాస వ్యవస్థకు సంబంధించిన తీవ్ర వ్యాధి. దీని వల్ల జ్వరం, తలనొప్పి, పొడిదగ్గు వస్తుంది.
క్యాన్సర్- ఆంకోవైరస్: దీని అధ్యయనాన్ని ఆంకాలజీ అంటారు. జన్యువులు నియంత్రించే కణవిభజన అదుపుతప్పడం వల్ల క్యాన్సర్ అనే గడ్డలు ఏర్పడతాయి. దీనికి కారణం జన్యువుల్లో మార్పులు (ఉత్పరివర్తనాలు).
ఫ్లూ- ఫ్లూ వైరస్: ఇది ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి. ఇది రెండు రకాలు. అవి..
బర్డ్ ఫ్లూ- H5N1 వైరస్: దీన్నే SVM ఇన్‌ఫ్లూయెంజా అంటారు.
స్వైన్‌ఫ్లూ-H1N1 వైరస్: ఈ ఫ్లూకి ఇచ్చే మందులు టామి ఫ్లూ, నాట్ ఫ్లూ, రెలింగా.
ఎయిడ్స్- హెచ్ఐవీ/రిట్రో వైరస్
- ఇది లైంగికంగా, రక్తమార్పిడి ద్వారా, తల్లి నుంచి శిశువుకు సంక్రమిస్తుంది.
- దీని వల్ల శోషరస గ్రంథుల వాపు. ఎక్కువగా చెమటలు పట్టడం. బరువు, జ్ఞాపకశక్తి తగ్గడం. వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వంటివి సంభవిస్తాయి.
- దీనికి పూర్తి చికిత్స లేదు. కానీ జిడోమ్రడిన్, అజోడైథైమిడిన్ అనే మందులను ఉపయోగించి చేసే చికిత్సను యాంటీ రిట్రోవైరస్ థెరపీ అంటారు.
- దీనికి వ్యాక్సిన్ కనుక్కోలేకపోవడానికి కారణం వైరస్‌లోని పాలిమార్ఫిజం (బహురూపకత) అంటే రూపాన్ని మార్చుకోవడం.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు: ఎలీసా, వెస్ట్రన్బ్లాట్, పీసీఆర్ - ప్రపంచ హెచ్ఐవీ వ్యాధిగ్రస్థుల్లో అత్యధికులు గల దేశాలు- సౌతాఫ్రికా, నైజీరియా, ఇండియా
మెదడువాపు (జపనీస్ ఎన్సెఫలైటీస్)- ఆర్బో వైరస్: ఇది 12 సంవత్సరాల్లోపు పిల్లల్లో పందుల వల్ల వ్యాప్తి చెందే వ్యాధి. దీనికి ఇచ్చే మందులు బెల్లడోనా.
బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు
- వీటిని మొదటగా మైక్రోస్కోప్‌ను ఉపయోగించి కనుగొన్నది లీవెన్‌హుక్ (1674).
- కాబట్టి ఆయనను ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోపి అంటారు.
- ఇవి అన్ని ప్రదేశాల్లో నివసిస్తాయి.
- వీటిని కేంద్రకపూర్వ జీవులు అంటారు. అంటే వీటి లోపల ఉండే క్రోమోజోమ్‌లను ఆవరించి కేంద్రక త్వచాలు ఉండవు.
- వీటి కణ కవచం మ్యూకోపప్టైడ్తో ఏర్పడుతుంది.
- వీటిలో చలనానికి సహాయపడేవి కశాభాలు.
- వీటి లోపల ఉండే ఉంగరాకారపు డీఎన్ఏ ముక్కలను ప్లాస్మిడ్స్ అంటారు. వీటిని బయోటెక్నాలజీ లేదా జెనెటిక్ ఇంజినీరింగ్ శాస్త్ర పరిశోధనలో ఉపయోగిస్తారు.
- దీని బహిర్గత క్రోమోజోమ్‌ను న్యూక్లియాయిడ్ అంటారు.
కలరా : విబ్రియో కలరా (బ్యాక్టీరియా) - దీనివల్ల శరీరంలోని నీరు, లవణాలు కోల్పోతారు (డీ హైడ్రేషన్). కాబట్టి తీవ్రదాహం కలుగుతుంది.
- దీన్ని పూరించడానికి ORS (Oral Rehydration Solution) ఇవ్వాలి.
- ORSలో చక్కెర, సోడియం, క్లోరైడ్ లవణాలు లభిస్తాయి.
టైఫాయిడ్ : సాల్మోనెల్లా టైఫి. - ఇది చిన్నపేగుకు సంబంధించిన వ్యాధి.
- దీని వల్ల తీవ్ర జ్వరం, తలనొప్పి, నాలుకపై పూత ఏర్పడుతుంది.
- దీన్ని నిర్ధారించే పరీక్ష- వైడల్ పరీక్ష
న్యుమోనియా : డిప్లోకోకస్ న్యుమోనియే - ఇది ఊపిరితిత్తుల్లో శ్లేష్మం లేదా జిగట పదార్థం పేరుకుపోయి శ్వాసకు ఇబ్బంది కలిగించే వ్యాధి.
డిఫ్తీరియా : కొరినీ బ్యాక్టీరియం డిఫ్తీరియే - ఇది గొంతుకు సంబంధించిన తీవ్ర నొప్పి.
పెర్టుసిస్ : బోర్డుటెల్లా పెర్టుసిస్ - దీన్ని కొరింత దగ్గు లేదా Whooping Cough అని పిలుస్తారు.
- ఇది దగ్గుతో కూడిన వ్యాధి.
టెటానస్ : దీన్ని ధనుర్వాతం అని కూడా పిలుస్తారు. - క్లాస్ట్రీడియం టెటాని అనే బ్యాక్టీరియా వల్ల సంభవిస్తుంది.
- ఈ జీవి తుప్పు పట్టిన ఇనుము, దుమ్ము ద్వారా, గాయాల ద్వారా శరీరంలోపలికి ప్రవేశించి జ్వరం, దవడ కండరాలను పట్టి వేస్తుంది. కాబట్టి Locked Jaw అంటారు.
- దీనికి ఇచ్చే మందు- టీటీ (టెటానస్ టాక్జోలిన్)
క్షయ : మైకో బ్యాక్టీరియం ట్యుబర్క్యులోసిస్. - టీబీ నిశ్శబ్ద హంతకి.
- దీని వల్ల జ్వరం, దగ్గు, అలసట, నీరసం కలుగుతుంది.
కుష్టు : మైకో బ్యాక్టీరియం లెప్రే. - దీని వల్ల శరీరం స్పర్శాగుణం కోల్పోతుంది.
- దీనికి చేసే చికిత్స MFT (Multi Drug Therapy)
ఆంథ్రాక్స్ : బాసిల్లస్ ఆంథ్రాసిస్. - ఇది పశువులు, మేకలు, గొర్రెల మాంసం, పాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది.
- దీని వల్ల రక్తం, కండరాలు ఇబ్బందులకు గురవుతాయి.
ప్లేగు : పాశ్చరెల్లా పెస్టిస్ - ఇది ఎముకల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధి.
- దీనికి ప్రపంచంలో మొదటిసారిగా టెట్రాసైక్లిన్ అనే అద్భుత ఔషధాన్ని తయారు చేసినందుకు ఎల్లాప్రగడ సుబ్బారావును అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అంటారు.
బొట్యులిజం : క్లాస్ట్రీడియం బొట్యులిజం
గనేరియా : నిస్సెరా గనెరా
సిఫిలిస్: ట్రిపనోమా పల్లిడం
నోట్: ఎయిడ్స్, గనేరియా, సిఫిలిస్లు లైంగికంగా సంక్రమిస్తాయి. కాబట్టి వీటిని Sexual Transmitted Diseases అంటారు.
మెనింజైటిస్ : నిస్సెరా మెనింజైటిస్ - ఇది మెదడు సంబంధిత వ్యాధి.
- దీనికి ప్రపంచంలో మొదటిసారి తయారు చేసిన కృత్రిమ డ్రగ్- ప్రాంటోజిల్
ప్రొటోజోవాల వల్ల కలిగే వ్యాధులు
మలేరియా: ప్లాస్మోడియం
- ఈ జ్వరం ప్లాస్మోడియం ద్వారా వస్తుందని ప్రయోగ పూర్వకంగా వివరించిన శాస్త్రవేత్త- రోనాల్డ్ రాస్
- ఈయనకు 1901లో వైద్యశాస్త్రం విభాగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది.
- ఈ జీవి ప్రతి రెండు రోజులకోసారి రక్తంలోకి హిమోజాయిన్ అనే విష పదార్థాలను విడుదల చేయడం వల్ల చలితో కూడిన జ్వరం, మెదడులోని రక్తనాళాల విచ్ఛిత్తి, కోమా కలుగుతుంది.
- దీనికి ఇచ్చే మందులు- క్వినైన్, క్లోరోక్విన్
అతినిద్ర వ్యాధి: ట్రిపనోసోమా - ఇది మెదడును నిస్తేజం చేయడం వల్ల గరిష్ఠంగా 20 సంవత్సరాల వరకు నిద్రలోనే ఉండే అవకాశం ఉంటుంది.
కాలా అజార్: లీష్మానియా - దీని వల్ల జ్వరంతో కూడిన నలుపు రంగు మచ్చలు చర్మంపై ఏర్పడతాయి.
అమీబియాసిస్ (జిగట విరేచనాలు): ఎంటామీబా హిస్టోలిటికా: - ఇది పేగులో నివసించి కణజాలాలను విచ్ఛిత్తి చేయడం వల్ల కడుపునొప్పి, రక్తంతో కూడిన విరేచనాలు కలుగుతాయి.
హెల్మింథిస్ జీవుల వల్ల కలిగే వ్యాధులు
ఫైలేరియాసిస్ (బోదకాలు): ఉకరేరియా
- ఇది కాళ్లు, చేతుల్లోని శోషరస గ్రంథులను వాపునకు గురి చేస్తుంది.
- దీనికి మందు డై ఇథైన్ కార్బోమజైన్.
ఆస్కారియాసిస్: ఆస్కారిస్ (ఏలిక పాము) - ఇది పేగులో నివసిస్తుంది.
- పేగులో రోజుకు రెండు లక్షల వరకు గుడ్లను పెడుతుంది. దీని వల్ల ఆహార సరఫరాకు అడ్డుపడి పోషకాహార లోపం కలుగుతుంది.
- ఈ అపస్థితి చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
టీనియాసిస్: టీనియా సోలియం - ఇది పంది మాంసం ద్వారా మానవుల శరీరంలోకి ప్రవేశిస్తుంది.
- దీన్ని నివారించడానికి పంది మాంసాన్ని బాగా ఉడికించి తినాలి.
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు