Telugu TET Special | నానార్థాలు కలిగి ఉండే అలంకారాన్ని ఏమంటారు?
నిన్నటి తరువాయి
50. సీసపద్య లక్షణానికి చెంది సరికాని అంశాన్ని గుర్తించండి?
1) నాలుగు పాదాలుంటాయి
2) పద్యం రెండు సమభాగాలుగా విభజించబడింది
3) ప్రతిపాదంలో ఆరు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా వస్తాయి.
4) ప్రాస నియమం లేదు
51. కమఠం అనే పర్యాయపదం గల పదం ఏది?
1) తాబేలు 2) తృణం
3) చీకటి 4) నిజం
52. కింది వాటిలో సరికాని జతను గుర్తించండి?
1) సాధనం = ఉపకరణం, ఉపాయం
2) సృష్టి = స్వభావం, ప్రకృతి
3) సంతానం ఒక కల్పవృక్షం, కులం
4) వంకలు = సాకులు సెలయేరు
53. కిందివాటిలో అవ్యయం కానిది?
1) అయ్యో 2) ఆహా
3) ఓహో 4) ఆమె
54. వనం అనేపదానికి నానార్థాలు గుర్తించండి?
1) అడవి, నీరు 2) న్యాయం, ధర్మం
3) సంవత్సరం, వాన 4) అడవి, సంపద
55. వటువు అనే పదానికి సరికాని పర్యాయ పదాన్ని ఎంపిక చేయండి?
1) వడుగు 2) వర్ణి
3) ఉపనీతుడు 4) చెలికాడు
56. కింది పర్యాయ పదాలను జతపరచండి?
1) ఊపిరి, పానం ఎ) పువ్వు
2) అసి బి) దిక్కము
3) గున్న సి) ఖడ్గం
4) ప్రసూనం డి) ఉసురు
1) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
2) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
3) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
57. చేప అనే పదానికి సరికాని పర్యాయపదాన్ని గుర్తించండి?
1) మీనం 2) మత్స్యం
3) ఝషం 4) వనకరి
58. హంస అనే పదానికి సరికాని పర్యాయపదాలు గుర్తించండి?
1) మరాళము 2) చక్రంగము
3) మానసౌకము 4) కూతలిము
59. కింద ఇచ్చిన జన వ్యవహారంలో పేరు-వాస్తవ పేరుకు సంబంధించి సరిగ్గా జతపరచండి?
1) నారద సింహాచలం ఎ) శర్కరకేళి
2) బోరన్ మిఠాయి బి) చంద్రమాస్
3) మొక్కజొన్న సి) మక్కజొన్న
4) చక్రకేళి డి) బోర్న్ వరూ
5) చక్రకేళి ఇ) నార్త్ సింహాచలం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-ఇ, 5-డి
2) 1-ఇ, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
3) 1-డి, 2-సి, 3-ఎ, 4-బి, 5-ఇ
4) 1-బి, 2-డి, 3-సి, 4-ఎ, 5-బి
60. కింద ఇచ్చిన వాటిలో అర్థ విపరిణామ రకాన్ని గుర్తించండి?
1) అర్థాపకర్ష 2) సభ్యోక్తి
3) మృదూక్తి 4) పైవన్నీ
61 ఆకాశంలో నక్షత్రాలు కొలనులోని పువ్వులా! అన్నట్టు ఉన్నాయి. ఈ వాక్యంలోని అలంకారాన్ని గుర్తించండి?
1) ఉపమా 2) ఉత్ప్రేక్ష
3) రూపక 4) అతిశయోక్తి
62. ఉపమేయ, ఉపమానానికి భేదం ఉన్నా లేదని వర్ణించడం అనేది ఏ అలంకారానికి చెందుతుంది?
1) రూపక – అర్థాలంకారం
2) ఛేకానుప్రాస – శబ్దాలంకారం
3) రూపక శబ్దాలంకారం
4) ఛేకానుప్రాస – అర్థాలంకారం
63. నీటిలో పడిన తేలు తేలుతదా! ఈ వాక్యంలోని అలంకారాన్ని గురించి లక్షణ సమన్వయం చేయండి?
1) ఛేకానుప్రాస =తేలు అనే పదం అర్థభేదంతో వెంటవెంటనే ఏర్పడింది
2) లాటానుప్రాస తేలు అనే పదం తాత్పర్య భేదంతో వెంటవెంటనే ఏర్పడింది
3) వృత్యానుప్రాస=తేలు తేలు అనే అక్షరాలు మళ్లీ మళ్లీ వచ్చాయి
4) యమకము= తేలు తేలు వెంటవెంటనే రావడం
64. ‘అభిరాం తాటి చెట్టంత పొడవు ఉన్నాడు’ అనే వాక్యంలో అలంకారాన్ని లక్షణ సమన్వయం చేయండి?
1) అభిరాం స్వభావాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పారు కాబట్టి స్వభావోక్తి అలంకారం
2) అభిరాం చాలా ఎత్తుగా ఉన్న విషయాన్ని చెప్పడం కోసం అతిశయంగా చెప్పారు కాబట్టి ఆతిశయోక్తి అలంకారం
3) అభిరాం ఎత్తును చెట్టుతో పోల్చి చెప్పారు కాబట్టి ఉపమాలంకారం
4) అభిరాం ఎత్తును తాటిచెట్టుతో ఊహించి చెప్పారు. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం
65. నానార్థాలు కలిగి ఉండే అలంకారాన్ని ఏమంటారు?
1) యమకము 2) శ్లేష అలంకారం
3) వృత్యానుప్రాస అలంకారం
4) ఛేకానుప్రాస అలంకారం
66. పదాల విరుపు వల్ల అర్థభేదం సృష్టించడం ఏ అలంకారం ప్రత్యేకత?
1) ఛేకానుప్రాస 2) లాటాను ప్రాస
3) యమకము 4) ముక్తపదగ్రస్తము
67. పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే అది ఏ అలంకారం?
1) యమకము 2) ముక్త పదగ్రస్తము
3) ఛేకానుప్రాస 4) లాటానుప్రాస
68. పాఱజూచిన పరసేన పాఱంజూచు అనే పద్యపాదం ఏ అలంకారం.
1) శబ్ద యమకము 2) అర్థ ఉపమా
3) శబ్ద ఛేకానుప్రాస 4) అర్థ ఉత్ప్రేక్ష
69. ఇచ్చిన వాక్యంలో ఒకే హల్లు అనేక సార్లు రావడాన్ని ఏమంటారు?
1) వృత్త్యాను ప్రాస అలంకారం
2) ఛేకానుప్రాస అలంకారం
3) అంత్యాను ప్రాస అలంకారం
4) లాటానుప్రాస అలంకారం
70. ఉపమాన ఉపమేయాలను చక్కని పోలిక చెప్పడమే?
1) ఉపమాలంకారం 2) ఉత్ప్రేక్ష
3) రూపక 4) స్వభావోక్తి
71. ‘ఏకలవ్యుడు అర్జునుడివలె గురి తప్పని విలుకాడు’ ఈవాక్యంలో ఉపమానం ఏది?
1) ఏకలవ్యుడు 2) అర్జునుడు
3) వలె 4) విలుకాడు
72. తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా అటు, ఇటు తిరుగుతున్నారు. ఈ వాక్యంలో ఉపమావాచకం ఏది?
1) తోటల్లో పిల్లలు 2) సీతాకోక చిలుక
3) లాగా 4) తిరగడం
73. కిందివాటిలో సరికాని దాన్ని గుర్తించండి?
1) పోలిక- ఉపమాలంకారం
2) ఎక్కువ చేసి చెప్పడం -అతిశయోక్తి
3) ఊహ- ఉత్ప్రేక్ష
4) ఉన్నది ఉన్నట్లే చెప్పడం- అర్థ్ధాంతరన్యాస
74. గడగడ వడకుచు తడబడి జారిపడెను. ఈ వాక్యంలో గల అలంకారం ఏది?
1) వృత్త్యాను ప్రాస 2) ఛేకానుప్రాస
3) లాటానుప్రాస 4) యమకం
75. పట్టణాలకు మంజీర నది తోబుట్టువుల వలె ప్రేమిస్తుంది. ఈ వాక్యంలోని ఉపమావాచకాన్ని గుర్తించండి?
1) ప్రేమించడం 2) పట్టణాలు
3) మంజీరనది 4) వలె
76. ఛేకానుప్రాస అలంకారం అనేది ఏ రకమైన అలంకారం?
1) అర్థాలంకారం 2) శబ్దాలంకారం
3) ప్రాసాలంకారం
4) అనుప్రాసాలంకారం
77. ‘అరటితొక్క తొక్కరాదు’ ఈ పద్యపాదం ఏ అలంకారం గుర్తించండి?
1) ఛేకానుప్రాస 2) లాటానుప్రాస
3) యమకము 4) అంత్యానుప్రాస
78. ఉపాధ్యాయుడు జ్ఞానజ్యోతులను ప్రకాశింపజేస్తాడు. ఈ వాక్యంలో గల అలంకారాన్ని గుర్తించండి?
1) ఉపమాలంకారం
2) ఉత్ప్రేక్ష అలంకారం
3) రూపక అలంకారం
4) స్వభావోక్తి అలంకారం
79. అడిగెదనని కదువడింజను అనే పద్యపాదంలో ఉన్న అలంకారం ఏది?
1) వృత్యానుప్రాస 2) అంత్యానుప్రాస
3) ఛేకానుప్రాస 4) లాటానుప్రాస
80. ‘తనకు ఫలంబు లేదని యొదంద లపోయడు కీర్తి గోరునా’ పై పద్యపాదంలో ర గణానికి గుర్తించే పదాలు ఏవి?
1) కీర్తిగో 2) దుకీర్తి
3) గోరునా 4) ఫలంబు
81. ‘యుక్కిరి బిక్కిరై తిరుగుచుందును గానివి శిష్టమార్గముల్’
పై పద్యపాదం ఏ జాతి పద్యానికి చెందినది?
1) ఉత్పలమాల 2) చంపకమాల
3) శార్దూలం 4) మత్తేభం
82. కింది పద్యపాదాలను లక్షణాలను జతపరచండి?
1) ఉత్పలమాల ఎ) మూడోగణం మొదటి అక్షరం యతి
2) చంపకమాల బి) 11వ అక్షరం యతి స్థానం
3) సీసం సి) మసజసతతగ అనే గణాలు వరుసగా ఉంటాయి
4) శార్దూలం డి) ప్రతిపాదంలో 20 అక్షరాలుంటాయి
1) 1-డి, 2-బి, 3-ఎ, 4-సి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
4) 1-సి, 2-డి, 3-ఎ, 4-బి
83. ‘అనననుగ్రహించితి మహావి హగోత్త మయంచు సంతసం’ అనే పద్యపాదంలో యతి మైత్రి పాటించే అక్షరాలు ఏవి?
1) అ-మ 2) అ-వి
3) అ-హా 4) అ-హ
84. మత్తేభ పద్యపాదంలో యతిమైత్రి చెల్లే అక్షరాలను గుర్తించండి?
1) 1-14 2) 1-13
3) 1-10 4) 1-11
85. కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి?
1) పద్యపాదాల్లో రెండో అక్షరాన్ని ప్రాస అంటారు
2) పద్యపాదాల్లో మొదటి అక్షరాన్ని యతి అంటారు
3) పద్యపాదాల్లో రెండో అక్షరంగా ఒకే అచ్చు రావడాన్ని ప్రాసనియమం అంటారు
4) యతి అక్షరానికి అదే అక్షరంగా, వర్ణమైత్రి కలిగిన మరో అక్షరంగా అదే పాదంలో రావడాన్ని యతినియమం అంటారు
86. ఉత్పలమాల, మత్తేభం పద్యాలకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి?
1) ఈ రెండు పద్యపాదాల్లో 20 అక్షరాల చొప్పున ఉంటాయి.
2) ఈ రెండు పద్యపాదాల్లో 21 అక్షరాల చొప్పున ఉంటాయి
3) ఈ రెండు పద్యపాదాల్లో 22 అక్షరాలు ఉంటాయి
4) ఈ రెండు పద్యపాదాల్లో 19 అక్షరాలు ఉంటాయి
87. తేటగీతి పద్య లక్షణం కానిది గుర్తించండి?
1) ప్రాస నియమం లేదు
2) మూడోగణం మొదటి అక్షరం యతి మైత్రి స్థానం
3) ప్రాస యతి చెల్లుతుంది
4) ప్రతి పాదంలో ఒక సూర్య, రెండు ఇంద్ర రెండు సూర్యగణాలుంటాయి
88. ఆటవెలది అనే పద్యానికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి?
1) ప్రాస నియమం లేదు
2) 2, 4 పాదాల్లో అన్ని ఇంద్రగణాలే ఉంటాయి
3) ప్రతి పాదానికి 4 గణాలుంటాయి
4) ఆటవెలది 2వ పాదంలో
5 గణాలుంటాయి
89. తేటగీతి గాని, ఆటవెలది గాని ఏ పద్యం తర్వాత వస్తుంది?
1) సీసం 2) కందం
3) మత్తేభం 4) శార్దూలం
90. కింది కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి మార్చండి? ఉత్తముడు పరుల హితమునే కోరతాడు.
1) ఉత్తముడు పరుల హితముచే కోరబడతాడు
2) ఉత్తములచే పరుల హితం కోరబడు తుంది
3) ఉత్తముడిచే పరుల హితం కోరతాడు
4) ఉత్తముడు పరుల హితం కోరబడుతుంది
91. కర్మణి వాక్యంలోని ధాతువు చేర్చిన క్రియ ఏ అంశాన్ని సూచిస్తుంది?
1) కర్త 2) కర్మ
3) క్రియ 4) క్రియా విశేషణం
92. ఆళ్వారుస్వామి చిన్నప్పుడే అనే కథ రాశాడు. ఈ వాక్యాన్ని కర్మణి వాక్యంలోకి మార్చండి?
1) ఆళ్వారుస్వామి చిన్నప్పుడే అనే కథ రాయబడింది
2) ఆళ్వారుస్వామితో చిన్నప్పుడే అనే కథ రాయబడింది
3) ఆళ్వారుస్వామిచే చిన్నప్పుడే అనే కథ రాయబడింది
4) ఆళ్వారుస్వామి చేత చిన్నప్పుడే అనే కథ రాయబడింది
93. వాళ్ల నాన్న ఆవేశపరుడని రచయిత చెప్పాడు ఇది ఏరకమైన వాక్యం?
1) ప్రత్యక్ష వాక్యం
2) పరోక్ష వాక్యం
3) సకర్మక వాక్యం 4) అకర్మక వాక్యం
94. ‘సుందరకాండ చదువు’ అని నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు ఈ ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్షవాక్యంగా మార్చండి?
1) సుందరకాండ చదవమని తనకు ఉపాధ్యాయుడు చెప్పాడు
2) ‘సుందరకాండ చదవమని’ నాకు ఉపాధ్యాయుడు చెప్పాడు
3) ‘సుందరకాండ చదువు’ అని తనకు ఉపాధ్యాయుడు చెప్పాడు
4) సుందరకాండ చదివితే మంచిదని మనందరికీ ఉపాధ్యాయుడు చెప్పాడు
95. తన దినం తీరుస్తారని నాతో తాత చెప్పాడు. ఈ వాక్యం ఏ రకమైన వాక్యం గుర్తించండి?
1) ప్రత్యక్ష వాక్యం 2) పరోక్ష వాక్యం
3) కర్తరి వాక్యం 4) కర్మణి వాక్యం
96. ‘మేము’ అనేది ఏ పురుష కథనంలో ఉంటుంది?
1. ప్రత్యక్ష కథనం 2) మధ్యమ పురుష
3) ఉత్తమ పురుష 4) తన్యపురుష
keY
50-2 51-3 52-4 53-4
54-1 55-4 56-1 57-4
58-4 59-2 60-4 61-2
62-1 63-1 64-2 65-2
66-4 67-3 68-1 69-1
70-1 71-2 72-3 73-4
74-1 75-4 76-2 77-1
78-3 79-1 80-3 81-1
82-1 83-3 84-1 85-3
86-1 87-2 88-2 89-1
90-2 91-2 92-3 93-2
94-1 95-2 96-3
శివశంకర్
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీసర్కిల్, వికారాబాద్, 9441022571
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు