Biology | కాఫీ గింజల్లో తినేభాగాన్ని ఏమంటారు?
బయాలజీ
1. నీటి ప్రసరణకు ఉపయోగపడే దారుకణజాలంలో దారునాళాలు ఏ మొక్కల్లో ఉంటాయి?
1) బ్రయోఫైటా 2) టెరిడోఫైటా
3) ఆవృతబీజాలు 4) వివృత బీజాలు
2. ‘ఎ’ మొక్కలోని బలహీన కాండాలు నేలను తాకినప్పుడు పీచువేర్లను ఉత్పత్తి చేస్తాయి.
‘బి’ దారపు తంతువుల వంటి నిర్మాణాలను, వాటి చివరన బుడిపెల్లాంటి సిద్ధబీజాశయాలను కలిగి ఉంటాయి.
‘సి’ మొక్క పత్రపు దిగువ భాగాన మచ్చల వంటి నిర్మాణాలను కలిగి ఉంటుంది
ఎ, బి, సి లను వరుసగా గుర్తించండి.
1) మల్లె, ఫెర్న్, రైజోపస్
2) రైజోపస్, మల్లె, ఫెర్న్
3) మల్లె, రైజోపస్, ఫెర్న్
4) ఫెర్న్, మల్లె, రైజోపస్
3. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ వంటి వాటికి ఉపయోగపడే కణజాలం?
1) దృఢ కణజాలం
2) దారు కణజాలం
3) పోషక కణజాలం
4) మృదు కణజాలం
4. వివిధ రకాల కణాలతో ఏర్పడి, అన్ని ఒకే క్రియాత్మక ప్రమాణంగా వ్యవహరించే కణజాలాన్ని ఏమంటారు?
1) సరళ కణజాలం 2) సంక్లిష్ట కణజాలం
3) ప్రత్యేక కణజాలం 4) విభాజ్య కణజాలం
5. మొక్కకు భూమి కింద ఉండే పండ్లు/కాయలు?
1) క్యారెట్స్ 2) ఉల్లిపాయలు
3) వేరుశనగ 4) బంగాళదుంప
6. లవంగం మొక్కలోని ఏ రూపాంతరం?
1) పండు 2) పెరిగిన మొగ్గ
3) ఎండిన పూమొగ్గ 4) విత్తనం
7. మొక్కల్లో దారుకణజాలం దేనికి ఉపయోగపడుతుంది?
1) దృఢత్వాన్ని ఇవ్వడానికి
2) కిరణజన్య సంయోగక్రియ
3) మొక్క వ్యాసార్థంగా పెరగడానికి
4) నీటి ప్రసరణ
8. మామిడి వృక్ష శాస్త్రీయ నామం?
1) డాకస్ కరోటా
2) మ్యూసా సపియన్టమ్
3) డాకస్ పేరట్
4) మాంజిఫెరా ఇండికా
9. అతిపెద్ద పుష్పం?
1) రఫ్లీసియా ఆర్నోల్డీ
2) గ్రమ్మటోఫైలమ్
3) ఆల్డ్రోవాన్డా
4) అడన్సోనియా డిజిటాటా
10. జీవించి ఉన్న అత్యంత పొడవైన చెట్టు?
1) సాల్ (ఏగిస) 2) టేకు
3) యూకలిప్టస్ 4) పైవేవీ కావు
11. మొక్కలోని ఏభాగం నుంచి నల్లమందును తయారుచేస్తారు?
1) పుష్పం 2) పత్రం
3) కాండం 4) వేరు
12. గడ్డిని అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
1) పోమోలజీ 2) ఇథాలజీ
3) కొంహాలజీ 4) ఆగ్రోస్టాలజీ
13. మొక్కలోని పోషక పదార్థాల రవాణాకు ఉపయోగపడే కణజాలం?
1) పోషక కణజాలం
2) రవాణా కణజాలం
3) దృఢ కణజాలం
4) మృదు కణజాలం
14. కింది వాటిని జతపరచండి.
ఎ. క్యారెట్, ముల్లంగి 1. కాండం
బి. అల్లం, పసుపు 2. పత్రం, పొలుసాకులు
సి. ఉల్లి, వెల్లుల్లి 3. వేర్లు
డి. లవంగాలు 4. విప్పారని పూమొగ్గలు
1) ఎ-1, బి-2, సి-3, డి-4 2) ఎ-3, బి-1, సి-4, డి-2
3) ఎ-2, బి-1, సి-3, డి-4 4) ఎ-3, బి-1, సి-2, డి-4
15. ఏ మొక్క నుంచి స్రవించే లేటెక్స్ అనే ద్రవం పసుపు రంగులో ఉంటుంది?
1) ఆర్జిమోన్ 2) అరటి
3) సపోటా 4) గన్నేరు
16. అతి చిన్న పుష్పం ఏది?
1) సైకస్ 2) డాసోనియా
3) రైజోఫొరా 4) ఉల్ఫియా
17. రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, కేసరావళి, అండకోశం, కలిగిన పుష్పాన్ని సంపూర్ణ పుష్పం అంటారు. ఏదైనా పై వలయం ఉండకపోతే అటువంటి పుష్పాన్ని అసంపూర్ణ పుష్పం అంటారు. కింది వాటిలో అసంపూర్ణ పుష్పాన్ని గుర్తించండి.
1) మందార 2) ఉమ్మెత్త
3) బొప్పాయి 4) పత్తి
18. కింది ఏ కణాలు మొక్క భాగాలు వ్యాకోచం చెందడానికి ఉపయోగపడతాయి?
1) దృఢ కణజాలం
2) స్థూల కోణ కణజాలం
3) స్థిర కణజాలం
4) సంక్లిష్ట కణజాలం
19. కింది ప్రవచనాలను అధ్యయనం చేయండి.
ఎ. మొక్కల్లో లేదా జంతువుల్లో ఆకస్మికంగా, అనువర్తనం చెందగలిగే మార్పులను ఉత్పరివర్తనాలు అంటారు
బి. ఉసిరి ఫలాలు అధిక పరిమాణంలో విటమిన్-సి ని కలిగి ఉంటాయి
సి. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ (యాంటీబయాటిక్)ను కనుగొన్నారు
1) ఎ, సి సరైనవి. కాని బి సరైనది కాదు
2) బి, సి సరైనవి. కాని ఎ సరైనది కాదు
3) ఎ, బి, సి అన్నీ సరైనవి
4) ఎ సరైనది కాని బి, సి సరైనవి కావు
20. ఏ మొక్కను హెర్బల్ ఇండియన్ డాక్టర్ అంటారు?
1) ఉసిరికాయ 2) మామిడికాయ
3) తులసి 4) వేప
21. ఎ. హరితరేణువులోని థైలకాయిడ్ దొంతరలను స్ట్రోమా అంటారు
బి. దొంతరల మధ్య ఉన్న ద్రవ భాగాన్ని గ్రానా అంటారు పైవాటిలో సరైది ఏది?
1) ఎ 2) బి
3) ఎ, బి 4) పైవేవీ కావు
22. మొక్కల్లో విభాజ్య కణజాలం ఉపయోగం?
1) కాండం, వేరు పొడవు పెరగటానికి
2) దృఢత్వాన్ని ఇవ్వడానికి
3) ప్రసరణకు 4) పదార్థాల రవాణాకు
23. కణవిభజన చురుకుగా జరగడానికి తోడ్పడే మొక్కలోని భాగం?
1) కాండం 2) ఆకులు
3) వేళ్లు 4) పళ్లు
24. గోల్ఫ్ బంతుల తయారీలో ఉపయోగపడే లేటెక్స్ ఏ మొక్క నుంచి లభిస్తుంది?
1) పార్థీనియం 2) ఫైకస్
3) పలాక్వియం గుట్టా 4) మానిహట్
25. మొక్కలోని పోషక కణజాలంలో చక్కెర రవాణాకు వివరించే ప్రయోగం?
1) కోబాల్ట్ క్లోరైడ్ కాగితం
2) బెరడు వలయాన్ని తొలగించడం
3) థిసెల్ గరాటు ప్రయోగం
4) స్పిగ్మోమానోమీటర్
26. టమాటాల రంగు దేని వల్ల వస్తుంది?
1) కెరోటినాయిడ్స్ 2) ఫ్లవనాయిడ్స్
3) విటమిన్లు 4) ఖనిజ లవణాలు
27. దనియాలకు వృక్షశాస్త్ర పేరు?
1) కొరియాండ్రం సటైవం
2) మైరిస్టికా ఫ్రాగ్రెన్స్
3) మెంథా పైపెరిటా
4) కుమినమ్ సైమినమ్
28. అల్లం శాస్త్రీయ నామం?
1) క్యాప్సికం అన్నుమ్
2) జింజిబర్ అఫిసినాలిస్
3) మెంథా పైపెరిటా
4) పైపర్ నీగ్రమ్
29. పుష్పాలను అధ్యయనం చేసే శాస్ర్తాన్ని ఏమంటారు?
1) ఇథాలజీ 2) ఆగ్రోనమీ
3) ఆగ్రోస్టాలజీ 4) ఆంథాలజీ
30. ఫైకస్ ఎలాస్టికా అనే మొక్క నుంచి లభించే రబ్బరును ఏమని పిలుస్తారు?
1) పనామ రబ్బరు
2) ఇండియా రబ్బరు
3) సియోర రబ్బరు
4) గ్యుయల్ రబ్బరు
31. బఠానీ మొక్కల్లో గింజ రంగు, కాయపై తొక్క రంగుకు సంబంధించి బహిర్గత, అంతర్గత లక్షణాలు వరుసగా..
1) పసుపు, ఆకుపచ్చ, ఆకుపచ్చ, పసుపు
2) ఆకుపచ్చ, పసుపు, పసుపు, ఆకుపచ్చ
3) ఆకుపచ్చ, పసుపు, ఆకుపచ్చ, పసుసు
4) పసుపు, ఆకుపచ్చ, పసుపు, ఆకుపచ్చ
32. మొక్కల్లో వేళ్లు నేలోకి లోతుగా చొచ్చుకుపోయి, పోషక పదార్థాలను త్వరితంగా శోషించుకోవడానికి తోడ్పడే పోషకం?
1) కర్బనం 2) భాస్వరం
3) నత్రజని 4) పొటాషియం
33. వేటి అధ్యయనాన్ని డెండ్రాలజీ అంటారు?
1) చిన్న చెట్టు, చెట్ల అధ్యయనం
2) జంతువుల ప్రవర్తన అధ్యయనం
3) ఎంజైమ్‌ల అధ్యయనం
4) రక్తం, దాని వల్ల వచ్చే వ్యాధులు
34. అతిపెద్ద ఆకు?
1) రఫ్లీసియా అర్నోల్డీ
2) విక్టోరియా అమెజోనికా
3) వుల్ఫియా 4) సఫైరా
35. స్త్రీ, పురుష పుష్పాలున్న మొక్కను ఏమని పిలుస్తారు?
1) బైసెక్సువల్ 2) ద్విలింగాశ్రయి
3) ఏకలింగాశ్రయి 4) మోనోగామస్
36. కుంకుమ పువ్వును (శాఫ్రాన్) చెట్టు ఏ భాగం నుంచి సేకరిస్తారు?
1) ఎండిన రక్షక పత్రాలు
2) ఎండిన పూమొగ్గలు
3) కీలాగ్రం
4) ఎండిన ఆకర్షణ పత్రాలు
37. నత్రజనిని అమ్మోనియాగా మార్చే మొక్క ఏది?
1) వరి 2) గోధుమ
3) మొక్కజొన్న 4) వేరుశనగ
38. కింది వాటిలో వరి పంటకు బయోఫెర్టిలైజర్లుగా ఉపయోగపడే జీవులేవి?
1) నీటి ఆకుపచ్చ శైవలాలు
2) రైజోబియం
3) మైకోరైజా 4) అజటోబాక్టర్
39. కాయగూరగా అల్లం అనేది ఒక?
1) కండ కలిగిన వేరు
2) కండ కలిగిన కాండం
3) నిల్వచేసే వేరు
4) ఉపవాయుగత కాండం
40. కింది వాటిలో మెత్తని పండు (బెర్రీ) ఏది?
1) అరటి 2) మామిడి
3) అనాస 4) కొబ్బరి
41. యాపిల్‌లో తినడానికి ఉపయోగపడే భాగం?
1) థలామస్ 2) కార్పెల్
3) ఎండోకార్ప్ 4) మోనోకార్ప్
42. టమాటా, వంకాయ, మిర్చి అనేవి ఏ కుటుంబానికి చెందినవి?
1) గ్రామినే 2) సోలనేసి
3) మాల్వేసి 4) ఆస్టరేసి
43. కాఫీ గింజల్ల్లో తినే భాగాన్ని ఏమంటారు?
1) టపెటమ్ 2) కారంకుల్
3) ఎరిల్ 4) పరిచ్ఛదం
44. కింది వాటిలో మాంసాహార (కీటకాహార) మొక్క ఏది?
1) నెపంథిస్ 2) డ్రాసిరా, డయోనియా
3) యుట్రిక్యులేరియా 4) పైవన్నీ
45. ఆలుగడ్డ (బంగాళదుంప)లోని కన్నుల ప్రయోజనం ఏమిటి?
1) ఆహారం నిల్వ చేయడం
2) శాఖీయ ప్రత్యుత్పత్తి
3) లైంగిక ప్రత్యుత్పత్తి
4) ఏదీకాదు
46. కింది వాటిలో పత్రాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేసే మొక్క ఏది?
1) బ్రయోఫిల్లమ్ (రణపాల)
2) బిగోనియా
3) సిల్లా 4) పైవన్నీ
47. కొత్తిమీర (దనియాలు) శాస్త్రీయనామం?
1) కొరియాండర్ సటైవం
2) డాకస్ కరోటా
3) ట్రైడాక్స్ ప్రొకంబెన్స్
4) క్యుమినమ్ సిమినమ్
48. ఆహారంగా ఉపయోగపడే కాలీఫ్లవర్ అనేది ఒక?
1) పత్రాల సముదాయం
2) రసయుత పుష్పవిన్యాసం
3) ఫలవంతమైన పుష్పాలు ఉండే శాఖ
4) భూగర్భ కాండ రూపాంతరం
49. కింది వాటిలో వాస్తవంగా పండు (ఫలం) కానిది ఏది?
1) యాపిల్ 2) జీడిపిక్క/జీడి మామిడి
3) కొబ్బరి 4) 1, 2
50. కింది వాటిలో ఏ వృక్షం ఫలాలను కాకుండా గింజలను ఉత్పత్తి చేస్తుంది?
1) ఆల్మండ్ (బాదం) 2) ఆవాలు
3) సైకస్ 4) వేరుశనగ
సమాధానాలు
1.3 2. 3 3. 4 4.2
5.3 6. 3 7.4 8.4
9.1 10.1 11.1 12.4
13.1 14.4 15.1 16.4
17.3 18.2 19.3 20.1
21.4 22.1 23.3 24.3
25.2 26.1 27.1 28.2
29.4 30.2 31.1 32.2
33.1 34.2 35.2 36.3
37.4 38.1 39.2 40.1
41.1 42.2 43.4 44.4
45.2 46.4 47.1 48.2
49.4 50.3
టాపర్స్ ఇన్స్టిట్యూట్,
దిల్సుఖ్నగర్, హైదరాబాద్
బాలల హక్కులు- చట్టాలు
1. బాలల చట్టం-1933
2. బాలల ఉద్యోగ కల్పనా చట్టం-1938
3. కర్మాగారాల చట్టం- 1948
4. కనీస వేతన చట్టం (1948): బాలలను ఏ రకమైన పనిలోకి తీసకున్నా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
5. ప్లాంటేషన్ కార్మిక చట్టం (1951): 12 సంవత్సరాలు నిండని బాలలను ప్లాంటేషన్ పనుల్లోకి తీసుకోకూడదు.
6. గనుల చట్టం (1952): 16 సంవత్సరాల లోపు బాల శ్రామికులను గనుల్లో నియమించడం నిషేధం.
7. మోటారు రవాణా కార్మిక చట్టం (1961): 15 సంవత్సరాల లోపు బాలలను మోటారు రవాణా రంగంలో నియమించకూడదు.
8. ఎపి సివిల్ సర్వీసెస్ (కాండాక్ట్) రూల్స్ (1961): ప్రభుత్వ ఉద్యోగులైతే పిల్లలను ఏ రకమైన పనిలో పెట్టుకున్నా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
9. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం (1976): బాలలను జీతగాళ్లుగా తీసుకుంటే నేరం.
10. ఫ్యాక్టరీ చట్టం (1982): 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ఫ్యాక్టరీ పనుల్లో నియమించుకోవడం నిషేధం.
11. బాల కార్మిక నిషేధ చట్టం (1986): 14 సంవత్సరాల లోప వారిని పనుల్లో నియమించుకోవడం నిషేధం.
12. బాల కార్మిక చట్టం 1986, ఎపి షాప్స్/ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988: 14 సంవత్సరాల లోపు బాలలతో పనిచేయించే సంస్థల యజమానులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
13. జువైనల్ జస్టిస్ యాక్ట్ (2000): నేరారోపణ నుంచి విముక్తి పొందే హక్కు.
14. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం-2005
15. బాలలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం- 2009
16. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం- 2012
15. బాలలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం- 2009
16. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం- 2012
17. బాలల న్యాయం (బాలల పట్ల శ్రద్ధ, సంరక్షణ) సవరణ చట్టం-2013: శ్రద్ధ, రక్షణ అవసరమైన బాలలు ముఖ్యంగా సంఘర్షణలో ఉన్న బాలల సంక్షేమం కోసం ఈ చట్టం చేశారు. ఈ చట్టం 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా పేర్కొంటుంది. కుష్ఠు, క్షయ, హెపటైటిస్-బి వంటి వ్యాధులకు గురైన బాలలకు ఎలాంటి వివక్ష లేకుండా సంరక్షణను అందిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు