Current Affairs | తెలంగాణ
కథల పోటీలు
జాతీయ కథల పోటీలు-2022 అవార్డుల ప్రదానోత్సవం జూలై 9న తెలుగు యూనివర్సిటీలో నిర్వహించారు. ముల్కనూరు ప్రజాగ్రంథాలయ సాహిత్యపీఠం, నమస్తే తెలంగాణ దినపత్రిక ఏటా ఈ జాతీయ కథల పోటీలను నిర్వహిస్తుంది. దీనిలో మొదటి బహుమతి (రూ.50 వేలు) ఇబ్లిస్ కథా రచయిత హుమాయున్ సంఘీర్కు లభించింది. ద్వితీయ బహుమతి (రూ.25 వేలు) కిరణ్ విభావరి (అడవిపువ్వు), మద్దెర్ల రమేష్ (ఇసప్పురుగు), తృతీయ బహుమతి (రూ.10 వేలు) ధర్మశాంతి ప్రభాకర్ రావు (వలస కవులు), స్ఫూర్తి కందివనం (ముసురు), సుగుణ రావు (ఏలి ఏలి లాబా సబక్తాని) అందుకున్నారు. ముల్కనూరు ప్రజా గ్రంథాలయ సాహిత్యపీఠం, డబ్ల్యూఎస్‌వో సంస్థల ఆధ్వర్యంలో దివంగత కవి అలిశెట్టి ప్రభాకర్‌కు ‘నవ కవితాభిమన్యు’ బిరుదును ప్రకటించారు. మెమెంటోను, రూ.లక్ష రివార్డు అలిశెట్టి భార్యకు అందజేశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్‌లో జూన్ నెలకు సంబంధించి ఎంపికయిన గ్రామాలను కేంద్రం జూలై 14న ప్రకటించింది. హై అచీవర్స్ కేటగిరీలో అలీరాజ్‌పూర్ (మధ్యప్రదేశ్) మొదటి స్థానంలో నిలువగా.. తరువాత వరుసగా రాష్ట్రంలోని జనగామ 2, కామారెడ్డి 3, ఖమ్మం 4, మహబూబాబాద్ 5, మంచిర్యాల 6, మేడ్చల్ మల్కాజిగిరి 7, ములుగు 8, నిర్మల్ 9, సంగారెడ్డి 10, వికారాబాద్ 11, యాదాద్రి భువనగిరి 12వ స్థానాల్లో నిలిచాయి. అచీవర్స్ కేటగిరీలో గ్యాల్షింగ్ (సిక్కిం) మొదటి స్థానంలో ఉండగా.. తరువాత వరుసగా రాష్ట్రంలోని హనుమకొండ 2, కుమ్రంభీం ఆసిఫాబాద్ 3, మెదక్ 4, నిజామాబాద్ 5, సూర్యాపేట 6, వరంగల్ 7, నాగర్‌కర్నూల్ 8, ఆదిలాబాద్ 9వ స్థానాల్లో ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు