TS EAMCET 2023 | ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ ప్రవేశాలు
TS EAMCET BiPC Stream Admissions 2023 | రాష్ట్రంలో ఎంసెట్ ర్యాంకుల ద్వారా ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ (ఇంజినీరింగ్) కౌన్సెలింగ్, వెరిఫికేషన్ కొనసాగుతుంది. ఇదే సమయంలో ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఏయే యూనివర్సిటీల్లో ప్రవేశాలు కల్పిస్తాయి, ఏయే కోర్సులు ఉన్నాయి, సీట్ల సంఖ్య తదితరాలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..
ఉమ్మడి ప్రవేశాలు
ఎంసెట్ (ఏఎం) రాసి ర్యాంక్ సాధించిన వారు బైపీసీ స్ట్రీమ్ కిందికి వస్తారు.
ప్రవేశాలు కల్పించే సంస్థలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీతో పాటు అనుబంధ కళాశాలలు.
సీట్ల వివరాలు
- బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ (నాలుగేళ్లు): 720 సీట్లు
- బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ (నాలుగేళ్లు): 43 సీట్లు
- బీఎఫ్ఎస్సీ (నాలుగేళ్లు): 39 సీట్లు
- బీఎస్సీ (ఆనర్స్) హార్టి కల్చర్ (నాలుగేళ్లు): 204 సీట్లు
- బీవీఎస్సీ అండ్ ఏహెచ్ (ఐదున్నరేళ్లు): 174 సీట్లు
ముఖ్య తేదీలు
- అర్హత: ఇంటర్మీడియట్ (బైపీసీ) ఉత్తీర్ణత, టీఎస్ ఎంసెట్-2023 క్వాలిఫై అయి ఉండాలి.
- వయోపరిమితి: బీవీఎస్సీ ఏహెచ్ కోర్సుకు 17 నుంచి 25 ఏళ్లు, ఇతర కోర్సులకు 17 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక ప్రక్రియ: టీఎస్ ఎంసెట్-2023లో అభ్యర్థులు సాధించిన ర్యాంకు ఆధారంగా సీటు కేటాయిస్తారు.
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 14.06.2023
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 17.07.2023
- రిజిస్ట్రేషన్ చెల్లింపు చివరి తేదీ: 15.07.2023
- దరఖాస్తు సవరణ తేదీలు: 18.07.2023 నుంచి 19.07.2023 వరకు
- వెబ్సైట్: www.pjtsau.edu.in
గమనిక : పై కళాశాలలతో పాటు మహాత్మా జ్యోతిబాఫులె బీసీ వెల్ఫేర్ రెసిడెన్సియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆధ్వర్యంలోని అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది.
కాసాని కుమారస్వామి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు